7, సెప్టెంబర్ 2021, మంగళవారం

సమస్య - 3835

8-9-2021 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“చలిలోఁ జెలి గౌగిలింత సంతాపమిడెన్”
(లేదా...)
“చలి వేళన్ జెలి గౌగిలింత మిగులన్ సంతాపముం గూర్చెరా”

31 కామెంట్‌లు:

  1. రాష్ట్ర ఉద్యోగుల స్థితి:

    నెలలో తొలి రోజు మగని
    నెల జీతము రాకయున్న నెలతుక వెతలన్
    దలచుక మొగనాలి యలుగ
    చలిలోఁ జెలి గౌగిలింత సంతాపమిడెన్.

    రిప్లయితొలగించండి
  2. క్రొవ్విడి వెంకట రాజారావు:

    పెలుచగ హిమమును నిలిపెడి
    స్థలమున తారాడు చుండ స్కంధంబంతన్
    నలకువతో వణకెడి నా
    చలిలో జెలి గౌగిలింత సంతాపమిడెన్.

    రిప్లయితొలగించండి
  3. వెలుగులులేనిదిజీవిక
    కలుగునుబాధలుతమకనికాంచగనిజమున్
    విలువలుసిద్ధార్ధుడుగనె
    చలిలోఁజెలిగౌగిలింతసంతాపమిడెన్

    రిప్లయితొలగించండి
  4. కందం
    తొలగన్ కాళ్ళకు పసురు ది
    గులుతో చింతించు ప్రవరుఁ గూడఁగనెంచన్
    వలచి వరూధిని, గుణికిన్
    జలిలోఁ జెలి గౌగిలింత సంతాపమిడెన్!

    మత్తేభవిక్రీడితము
    తొలగన్ కాళ్లకు మౌని వర్యు పసరే దోషమ్మనన్ జిక్కగన్
    శిలలన్, గాంచి వరూధినీ లలనకున్ శృంగార మేపారఁ దా
    వలపున్ జూపుచు వెంటనంట ప్రవరున్ వారించె సచ్ఛీలతన్
    జలి వేళన్ జెలి గౌగిలింత మిగులన్ సంతాపముం గూర్చెరా!

    రిప్లయితొలగించండి

  5. పులకింపజేయు మనసును
    చలిలోౕఁ జెలి గౌగిలింత, సంతాపమిడెన్
    చలికాలము పుట్టింటికి
    చెలియయె జనినంత నిచట సేక్తకు సుమ్మా!

    రిప్లయితొలగించండి
  6. కె.వి.యస్. లక్ష్మి:

    నిలువంతయు పులకింతలు
    చలిలో చెలి కౌగిలింత; సంతాపమిడున్
    కలతలు రేగిన వేళల
    కలకంఠి కినుక మనసును కలవర పరచున్.

    రిప్లయితొలగించండి
  7. కలిగించె ను సమ్మోదము
    చలిలో చెలి గౌగిలింత : సంతాప మిడెన్
    నిలువగ నాషాఢ మొకటి
    వలపుల కడ్డంబు గాగ వసు ధా స్థలి లో

    రిప్లయితొలగించండి
  8. విలువలు వీడుచు క్లబ్బున
    కులుకగ వేశ్యలనుగూడి కూపీలాగన్
    తెలివిగ పోలీసులచట
    చలిలో చెలికౌగిలింత సంతాపమిడెన్

    రిప్లయితొలగించండి
  9. విలవిల లాడుచు తాలిబ
    నుల చెరలోజిక్కి శమము నోర్పుయు లయమై
    కలవరమొందువిరాగికి
    చలిలోఁ జెలి గౌగిలింత సంతాపమిడెన్

    రిప్లయితొలగించండి
  10. తలిగారింటికి బోయె నా యువిద
    శీతాకాల మందున్, వెసన్
    చెలి యే తెంచద నంచు జెప్పి
    నేటికిని రాలేదాయె, లేకుండ నీ
    చలి వేళన్ జెలి కౌగిలింత మిగు
    లన్ సంతాపమున్ గూర్చెరా
    పొలతుల్ సేరువనున్నగల్గు గద
    సంపూర్ణంబుగా హాయియున్



    రిప్లయితొలగించండి
  11. అల సంయుక్తపు రాష్ట్రమందున మరీ యారోజులే గొప్పనౌ
    తొలితారీఖున జీతభత్యముల సంతోషంబు లేపారెనే
    తెలగాణంబున నేటి దుస్థితికి సందేహంబె యెవ్వారికిన్
    చలి వేళన్ జెలి గౌగిలింత మిగులన్ సంతాపముం గూర్చెరా.

    రిప్లయితొలగించండి

  12. అలపూదోటను కాంచివత్తునని నేనచ్చోట కేతెంచగా
    కలిమిన్ గల్గిన వానికూతురటకున్ గామంబుతోజేరి కౌ
    గిలిఁ బంధింపగ తండ్రి గాంచి రుష నాక్షేపించె నన్నున్ గదా
    చలివేళన్ జెలిగౌగిలింత మిగులన్ సంతాపమున్ గూర్చెరా!

    రిప్లయితొలగించండి
  13. క్రొవ్విడి వెంకట రాజారావు:

    పెలుచౌ రీతి హిమమ్మొసంగు దరికిన్ వేంచేయ మేనంతయున్
    వలికిన్ తీవ్రమునైన కంపనముతో బండాలమే తగ్గగా
    వెలుగున్ నింపి శరీరమున్ తిరిగి దీపించంగగా వానికిన్
    చలివేళన్ జెలి గౌగిలింత మిగులన్ సంతాపముం గూర్చెరా!

    రిప్లయితొలగించండి
  14. చెలికౌగిలి గిలిగింతలు
    వలపులవలవేసి మదిని బందీ చేసెన్
    కల కరిగిపోగ చెదరిన
    చలిలోఁ జెలి గౌగిలింత సంతాపమిడెన్

    రిప్లయితొలగించండి
  15. తొలిరేయి బడుదల పయిన
    కలువల రాయడిడుచుండు కౌముది కురియన్
    మలుకారు దినములందున
    చలిలోఁ జెలి గౌగిలింత సంతాపమిడెన్

    సంతాపము = వేడిమి

    రిప్లయితొలగించండి
  16. అలవలె కరోన కదలగ
    మెలిపడె పరిణయపు పయన మింక వరునికిన్
    కలగా మిగిలిన యవతలి
    చలిలోఁ జెలి గౌగిలింత సంతాపమిడెన్

    రిప్లయితొలగించండి
  17. వలపేపుట్టగప్రేమజంటకలసీ
    వారాంతసంతృప్తితో
    స్థలమేనెంచిరికామమోహతపనే
    సౌఖ్యంబునిండారనే
    చలివేళన్ చెలిగౌగిలింత; మిగులన్
    సంతాపముంగూర్చెరా
    నిలిచేగర్బము, తప్పుజర్గనుగదా
    నిక్కంబుబాదించనే
    ...తోకల...

    రిప్లయితొలగించండి
  18. మ:

    కలలో నూహల దేలుచున్ దయితతో కారెక్కి యూరేగుచున్
    గిలిగింతల్ పొడగాన్పగన్ త్వరితమై కీల్కొల్ప నాచ్ఛాదమున్
    తెలవారంగను గట్టి కేక వినగన్ దెర్లొంద నిద్రంతయున్
    చలి వేళన్ జెలి గౌగిలింత మిగులన్ సంతాపమున్ గూర్చెగా

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  19. కలిసెన్ మామనసుల్, కరగ్రహముతో కంజాక్షి ప్రాప్తించె గా
    దిలి ఇల్లాలిగ, జీవితమ్ములల వర్ధిల్లంగ ప్రేమమ్ముతో
    కలిగన్ గర్భము, పుట్టినిల్లుచని తాకన్పింప స్వప్నమ్ములో
    చలి వేళన్ జెలి గౌగిలింత మిగులన్ సంతాపముం గూర్చెరా

    రిప్లయితొలగించండి
  20. వలపుల రేకెత్తుంచును
    చలిలో చెలిగౌగిలింత,సంతాపమిడున్
    చెలి ప్రక్కనలే కనయీ
    చలికాలము రవికి మిగుల సైపగ లేమిన్

    రిప్లయితొలగించండి
  21. కలుగునె భాషానందము
    విలువలు వర్ధిల్లునే వివేక మడరునే
    యిలఁ గన విన్నను వ్రాసినఁ
    జలిలోఁ జెలి గౌఁగిలింత సంతాపమిడెన్


    తెలవాఱెం గడు వ్యర్థ పూరణము లేతేరంగ దిగ్భ్రాంతినిం
    గలుగం నేర్చునె సత్కవిప్రవర సంఘాతాత్మ సంతృప్తి వి
    హ్వల చిత్తస్థిత తప్త మర్త్యునకు దుర్వారవ్యథా భూతమే
    చలి వేళన్ జెలి గౌఁగిలింత మిగులన్ సంతాపముం గూర్చెరా

    రిప్లయితొలగించండి
  22. వలపున్ గూర్చును నేరికైననిల నాఫాలాక్షు సాక్ష్యంబుగా
    జలివేళన్ జెలి గౌగిలింత ,మిగులన్ సంతాపముంగూర్చెరా
    చెలియున్ బ్రక్కన లేనిచోరవికి దాజేయండుసుమ్మేదియున్
    జెలితో నాతని జీవితంబుముడి యోశ్రీరామ!నీవేగతౌ

    రిప్లయితొలగించండి
  23. కలిగింపన్ హరుసమ్మెదన్ దనదు వాక్చాతుర్యమున్ జూపుచున్
    చెలియై చేరగ తీక్ష్ణ వీక్షణములన్ జిందించ నా యీశుడే
    కలతన్ రేపి లతాంగి యీ జగతినే కాదంచు దా వెళ్లగా
    చలి వేళన్ జెలి గౌగిలింత మిగులన్ సంతాపముం గూర్చెరా!

    రిప్లయితొలగించండి
  24. పులకింతలుకలిగించును
    చలిలో చెలిగౌగిలింత:సంతాపమిడెన్
    కలలో దరిచేరకతా
    నలుకనుబూనుచునుసాగ నతిరోషముతో

    రిప్లయితొలగించండి
  25. కం. వలదన్నను వినకయె, కౌ
    గిలిలో యూర్వశి యదుమగ, క్రీడికి శాపం
    బు లభించి, ఘర్మజలముల
    చలిలోఁ, జెలి గౌగిలింత సంతాపమిడెన్.

    రిప్లయితొలగించండి
  26. చలిమల కనుమల సొగసుల
    తిలకింపగనొదవె మదిని తీయని తలఁపుల్
    వలకాకను రేపెనహా
    చలిలోఁ జెలి గౌగిలింత సంతాపమిడెన్

    రిప్లయితొలగించండి
  27. తలపన్ నాటి విహారయాత్ర, హిమవత్శైలాంకమందా నిశిన్
    చలి వేళన్ జెలి గౌగిలింత, మిగులన్ సంతాపముం గూర్చెరా
    కలగా మారెను నాటి ప్రేమ మిగిలెన్ గన్నీరు నాకిట్టులన్
    కలచున్ మానసమందు వేదనకటా కాంతా వియోగంబయో

    రిప్లయితొలగించండి