17-3-2022 (గురువారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“అరిషడ్వర్గమ్ము మోక్ష మందించుఁ గదా”(లేదా...)“అరిషడ్వర్గము మోక్షసాధనమునం దందించు సాహాయ్యమున్”
కందంపరులై మనలోఁ జెలఁగుచుదురితులుగా మార్చి వగయఁ దోషము వాపున్దొరకొని వీడగ నెంచఁగనరిషడ్వర్గమ్ము మోక్ష మందించుఁ గదా!
మత్తేభవిక్రీడితముపరులై మానసమందునన్ జెలఁగి నిర్భాగ్యమ్మునందించుచున్దురితమ్ముల్వొనరించి మించి మన సంతోషమ్ములన్ బాపెడున్గురణమ్మందున దైవభక్తిఁ గొనుచున్ గోల్పోవగా వీడ నయ్యరిషడ్వర్గము మోక్షసాధనమునం దందించు సాహాయ్యమున్
అరయంగ పతన కారణమరిషడ్వర్గమ్ము; మోక్ష మందించుఁ గదాసరియగు ధర్మపు నడవడిపరిపూర్ణముగా వహించి పాటింపంగన్
తఱిగనిసాధనమందునపొరిపొరిబాధలవలననుపొందగసుఖమున్నరుడునుజేయుడుగాగాఅరిషడ్వర్గమ్ముమోక్షమందించుగదా
అరికట్ట వలెను గద మనుజుడరిషడ్వర్గమ్ము ; మోక్ష మందించుఁ గదాపరమముపయి నమ్మకమునబరులకు సేవ సలుపుటయె భాజనమనుటన్
నరులకు పతనము గదరా యరి షడ్వర్గమ్ము : మోక్ష మందించు గదా నిరత ము దైవ పు చింతన పర సేవా గుణము గలిగి పరగుట వలనన్
హరినామస్మరణమ్మునహరియించును పాతకమ్ము లతి శీఘ్రముగాహరియన్నఁ జాలును దొలఁగునరిషడ్వర్గమ్ము మోక్ష మందించుఁ గదా
నిరతము విడువక చేసెడుహరినామస్మరణ మరియు నసహాయజనోద్ధరణము తోడను వీడిననరిషడ్వర్గమ్ము మోక్షమందించుఁ గదా. కరుణన్ జూపెడు భావకుని నిష్కామంబుతో గొల్చి దెప్పరమున్ జిక్కినపేదవారికిల యాపద్బంధువై సాయమున్ నిరతమ్మందగ జేయుచున్ వసుధలో నిస్వార్థుడై వీడి యయ్యరిషడ్వర్గము, మోక్షసాధనము నందించు సాహాయ్యమున్.
క్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా: మరులు గొనక నహమించక మురినులిమి కసివిడి లోభమోహ మడచుచున్ హరి నామము జపియించగ అరిషడ్వర్గమ్ము మోక్షమందించుఁ గదా.విరలిన్ తక్కువజేయుచున్ పగటునావేశాది గర్వోన్నతిన్ వరుసన్ మానుచు మోహలోభములు సంప్రస్థానమున్ పొందకున్ హరిపై చిత్తము నిల్పుచున్ గొలువ మాయాదేహ చింతల్ జనున్ అరిషడ్వర్గము మోక్షసాధనమునం దందించు సాహాయ్యమున్
కె.వి.యస్. లక్ష్మి, ఉడ్బర్రీ, అమెరికా: దురితావేశము లన్నిటిన్ దునుమగా దూరంబునౌ శోకముల్ పరిహారంబొనరించగా వలయు లోభామోహ మాత్సర్యముల్ పరితాపంబున మంచి సల్పగను నీబాహ్యంపు దేహమ్ముతో అరిషడ్వర్గము మోక్షసాధనమునందందించు సాహాయ్యమున్.
కె.వి.యస్. లక్ష్మి, ఉడ్బర్రీ, అమెరికా: దురితావేశములన్నిటిపరిహరణ మొనర్చి సతము పరిణితి తోడన్ పరితాపమొంది మనగను అరిషడ్వర్గమ్ము మోక్షమందించు గదా!
కరమౌభక్తిని శౌరి పూజనములన్ గావించుచున్ నిత్యమున్స్థిర సంకల్పముతోడ పేద జనులన్ సేవించుచున్ బ్రోచుచున్వరమౌనంచును సత్యమార్గమును సంభావించుచున్ వీడగానరిషడ్వర్గము మోక్షసాధనమునం దందించు సాహాయ్యమున్
ధరలో మిక్కిలి కష్టము చరియింపఁగ సంయమమున సాధువు వోలెన్ నరునకు నిష్ఠ జయించిన నరిషడ్వర్గమ్ము మోక్ష మందించుఁ గదామరలన్ నేరవు లోభ మోహ మద కామక్రోధ మాత్సర్యముల్ నర లోకమ్మున సంతతం బొసఁగు సంతాపమ్ము మర్త్యాలికిం గర మాసక్తినిఁ జేయ నా పనియె యే కార్యమ్ము ఖండించు నాయరిషడ్వర్గము మోక్షసాధనమునం దందించు సాహాయ్యమున్
కందంఅరయ నరుని చెడగొట్టునుఅరిషడ్వర్గమ్ము ,మోక్ష మందించు గదాహరిని దలచి మదిన నిలిపినిరంతరము తప మొనర్చి నియతిగ మనినన్ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రిఉండవల్లి సెంటర్.
హరియే దైవము జీవులెల్లరకు తాహర్షంబుజేకూర్చు శ్రీహరి నామస్మరణంబునన్దొలఁగునాహాయిత్యముల్ నిచ్చలున్హరి దైన్యంబున సొక్కువారలయెడన్నాపన్నుడై, బాపగానరిషడ్వర్గము, మోక్షసాధనమునందందించు సాహాయ్యమున్
కందం
రిప్లయితొలగించండిపరులై మనలోఁ జెలఁగుచు
దురితులుగా మార్చి వగయఁ దోషము వాపున్
దొరకొని వీడగ నెంచఁగ
నరిషడ్వర్గమ్ము మోక్ష మందించుఁ గదా!
మత్తేభవిక్రీడితము
తొలగించండిపరులై మానసమందునన్ జెలఁగి నిర్భాగ్యమ్మునందించుచున్
దురితమ్ముల్వొనరించి మించి మన సంతోషమ్ములన్ బాపెడున్
గురణమ్మందున దైవభక్తిఁ గొనుచున్ గోల్పోవగా వీడ న
య్యరిషడ్వర్గము మోక్షసాధనమునం దందించు సాహాయ్యమున్
అరయంగ పతన కారణ
రిప్లయితొలగించండిమరిషడ్వర్గమ్ము; మోక్ష మందించుఁ గదా
సరియగు ధర్మపు నడవడి
పరిపూర్ణముగా వహించి పాటింపంగన్
తఱిగనిసాధనమందున
రిప్లయితొలగించండిపొరిపొరిబాధలవలననుపొందగసుఖమున్
నరుడునుజేయుడుగాగా
అరిషడ్వర్గమ్ముమోక్షమందించుగదా
అరికట్ట వలెను గద మనుజు
రిప్లయితొలగించండిడరిషడ్వర్గమ్ము ; మోక్ష మందించుఁ గదా
పరమముపయి నమ్మకమున
బరులకు సేవ సలుపుటయె భాజనమనుటన్
నరులకు పతనము గదరా
రిప్లయితొలగించండియరి షడ్వర్గమ్ము : మోక్ష మందించు గదా
నిరత ము దైవ పు చింతన
పర సేవా గుణము గలిగి పరగుట వలనన్
హరినామస్మరణమ్మున
రిప్లయితొలగించండిహరియించును పాతకమ్ము లతి శీఘ్రముగా
హరియన్నఁ జాలును దొలఁగు
నరిషడ్వర్గమ్ము మోక్ష మందించుఁ గదా
రిప్లయితొలగించండినిరతము విడువక చేసెడు
హరినామస్మరణ మరియు నసహాయజనో
ద్ధరణము తోడను వీడిన
నరిషడ్వర్గమ్ము మోక్షమందించుఁ గదా.
కరుణన్ జూపెడు భావకుని నిష్కామంబుతో గొల్చి దె
ప్పరమున్ జిక్కినపేదవారికిల యాపద్బంధువై సాయమున్
నిరతమ్మందగ జేయుచున్ వసుధలో నిస్వార్థుడై వీడి య
య్యరిషడ్వర్గము, మోక్షసాధనము నందించు సాహాయ్యమున్.
క్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా:
రిప్లయితొలగించండిమరులు గొనక నహమించక
మురినులిమి కసివిడి లోభమోహ మడచుచున్
హరి నామము జపియించగ
అరిషడ్వర్గమ్ము మోక్షమందించుఁ గదా.
విరలిన్ తక్కువజేయుచున్ పగటునావేశాది గర్వోన్నతిన్
వరుసన్ మానుచు మోహలోభములు సంప్రస్థానమున్ పొందకున్
హరిపై చిత్తము నిల్పుచున్ గొలువ మాయాదేహ చింతల్ జనున్
అరిషడ్వర్గము మోక్షసాధనమునం దందించు సాహాయ్యమున్
కె.వి.యస్. లక్ష్మి, ఉడ్బర్రీ, అమెరికా:
రిప్లయితొలగించండిదురితావేశము లన్నిటిన్ దునుమగా దూరంబునౌ శోకముల్
పరిహారంబొనరించగా వలయు లోభామోహ మాత్సర్యముల్
పరితాపంబున మంచి సల్పగను నీబాహ్యంపు దేహమ్ముతో
అరిషడ్వర్గము మోక్షసాధనమునందందించు సాహాయ్యమున్.
కె.వి.యస్. లక్ష్మి, ఉడ్బర్రీ, అమెరికా:
రిప్లయితొలగించండిదురితావేశములన్నిటి
పరిహరణ మొనర్చి సతము పరిణితి తోడన్
పరితాపమొంది మనగను
అరిషడ్వర్గమ్ము మోక్షమందించు గదా!
కరమౌభక్తిని శౌరి పూజనములన్ గావించుచున్ నిత్యమున్
రిప్లయితొలగించండిస్థిర సంకల్పముతోడ పేద జనులన్ సేవించుచున్ బ్రోచుచున్
వరమౌనంచును సత్యమార్గమును సంభావించుచున్ వీడగా
నరిషడ్వర్గము మోక్షసాధనమునం దందించు సాహాయ్యమున్
ధరలో మిక్కిలి కష్టము
రిప్లయితొలగించండిచరియింపఁగ సంయమమున సాధువు వోలెన్
నరునకు నిష్ఠ జయించిన
నరిషడ్వర్గమ్ము మోక్ష మందించుఁ గదా
మరలన్ నేరవు లోభ మోహ మద కామక్రోధ మాత్సర్యముల్
నర లోకమ్మున సంతతం బొసఁగు సంతాపమ్ము మర్త్యాలికిం
గర మాసక్తినిఁ జేయ నా పనియె యే కార్యమ్ము ఖండించు నా
యరిషడ్వర్గము మోక్షసాధనమునం దందించు సాహాయ్యమున్
కందం
రిప్లయితొలగించండిఅరయ నరుని చెడగొట్టును
అరిషడ్వర్గమ్ము ,మోక్ష మందించు గదా
హరిని దలచి మదిన నిలిపి
నిరంతరము తప మొనర్చి నియతిగ మనినన్
ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
ఉండవల్లి సెంటర్.
హరియే దైవము జీవులెల్లరకు తాహర్షంబుజేకూర్చు శ్రీ
రిప్లయితొలగించండిహరి నామస్మరణంబునన్దొలఁగునాహాయిత్యముల్ నిచ్చలున్
హరి దైన్యంబున సొక్కువారలయెడన్నాపన్నుడై, బాపగా
నరిషడ్వర్గము, మోక్షసాధనమునందందించు సాహాయ్యమున్