26-3-2022 (శనివారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“కారముతో వచ్చెనఁట జగత్పతికి నతుల్”(లేదా...)“కారముతోడ వచ్చిన జగత్పతికిన్ బ్రణమిల్లఁగాఁ దగున్”
నారాయణుడే వాడనివారించిన శుక్రుని గని బల వచియించెన్ భూరి యిట వామనుని యాకారముతో వచ్చెనట జగత్పతికి నుతుల్.
కందంతా రథ చక్రము గొని హుంకారము నన్ భీష్ముఁ గూల్చి కవ్వడిఁ గావన్సారించి వేగఁ గోపాకారముతో వచ్చెనఁట, జగత్పతికి నతుల్ఉత్పలమాలతా రథ చక్రమున్ గొనుచు తాండవ కృష్ణుడు యుద్ధభూమినిన్వీరవరేణ్యుడై చెలఁగు భీష్ముని గూల్చుచు గ్రీడిఁ గావగన్వారణమందగన్ దుముకు భారి మృగేంద్రపు రీతిఁ జేర హుంకారముతోడ వచ్చిన జగత్పతికిన్ బ్రణమిల్లఁగాఁ దగున్
పారమునంటుటసాధనభారమునాయెనుజనులకుభావనసేయన్తారొకవిగ్రహమనునాకారముతోవచ్చెనటజగత్పతికినతుల్
నారాయణ గావు మనుచు భారము వేసి గజరాజు ప్రార్థన సేయన్ భోరున భక్తునికై సా కారముతో వచ్చె నట జగత్పతికి నతుల్
ఉత్పలమాల లో 'భీష్ముని నిల్పఁగఁ' అని చదువుకొన ప్రార్థన.
ధారుణిఁ ధర్మమున్ నిలుపు దక్షుడు ధృత్వుడు పృశ్నిశృంగుడా భూరి త్రిధాముడా జినుడు పుష్కరనాభుడు దేవదేవుడావారిశుడా యధోక్షజుడు వ్యక్తుడు తామరకంటి వామనా కారము తోడవచ్చిన జగత్పతికిన్ బ్రణమిల్లగా దగున్.
కోరుకొనిన రీతిగ కడుదూరపు నెలకువల నుండి తొలగిన కతనన్చేరుకొనియుండ కడు మమకారముతో వచ్చెనఁట జగత్పతికి నతుల్
సారసలోచనుడనుచునుశ్రీరాముండనుచుహరిని సేవింప నిరాకారుండగు దైవము సాకారముతో వచ్చెనఁట, జగత్పతికి నతుల్
ఔరా!స్వయంవరంబునశ్రీరాముఁడు విల్లువిఱిచి సీతాదేవిన్దారగఁగొనగ ధనుష్టంకారముతో వచ్చెనట జగత్పతికి నతుల్.
భారత దేశ జంతువుల భాగ్యము సర్వము నీవెఱుంగవే!భారతవర్షమందు హరి పల్మఱుఁ బుట్టుచు జీవకోటికిన్జేరువ యయ్యె, కుయ్యిడగ శ్రీహరి బందుగు డౌచు దా శుభాకారముతోడ వచ్చిన జగత్పతికిన్ బ్రణమిల్లఁగాఁ దగున్.
కారుణ్యహృదయగత మమకారముతో భక్తజనుల కనులకు సాక్షాత్కారముతో సౌందర్యాకారముతో వచ్చెనఁట జగత్పతికి నతుల్
చేరగనెంచి శ్రీహరిని చిత్తమునందున నిలిపి సర్వదాసారములేన జీవితము చాలని మ్రొక్కుచుస్వామి నీదరిన్జేరెడు త్రోవజూపుమని చింతులు భక్తుడుసంస్తుతించ నాకారముతోడ వచ్చిన జగత్పతికిన్ ప్రణమిల్లగా వలెన్.
క్షీర సముద్ర ముంజిలుక చేకురెగా సుధ,దానిఁబంచగావారిజనేత్రమోహినిగ వారిజనాభుడు వచ్చినంతనేవీరులు దేవదానవులు విస్మయమందిరి,దివ్య సుందరా*కారముతోడ వచ్చిన జగత్పతికిన్ ప్రణమిల్లగా దగున్.*
ఘోర పయోధిమధ్యమునఁ గొట్టుకు పోవుచు దిక్కుతోచకన్తీరము కానరానితరి తీరుగనొడ్డుకు జేర్చ నార్తితోభారము నీదెయంచు కడు భక్తిగ దోసిలియొగ్గి వేఁడ నోంకారముతోడ, వచ్చిన జగత్పతికిన్ బ్రణమిల్లఁగాఁ దగున్
కందంఆరాధ్య దేవ దర్శనకోరిక మదిన పొడజూప ఘోర తపమునున్తీరుగ జేయగ సగుణాకారము తో వచ్చెనట ,జగత్పతికి నతుల్.ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రిఉండవల్లి సెంటర్.
ధారుణి భారము మోయుచుఁబౌరజన క్షేమ మెంచి పన్నుగ నిటకుం దోర మెడఁద మీఱిన మమకారముతో వచ్చె నఁట జగత్పతికి నతుల్ కారణ జన్ముఁడై భువినిఁ గావఁగ శిష్టులఁ ద్రుంచ దుష్టులం గోరఁగ ధర్మనందనుఁడు కూర్మి సెలంగఁగ వాసుదేవుఁడేగౌరవ మొప్ప నెల్లరకుఁ గౌరవ పాండవ సంధి నెంచి శ్రీకారము తోడ వచ్చిన జగత్పతికిన్ బ్రణమిల్లఁగాఁ దగున్
ఇలపై దైత్యుల కృత్యముల్ మడఁ చగా నెల్లప్పుడున్ శౌరితాన్గలుగున్ తప్పక మారురూపములతో కాంక్షించి సంక్షేమమున్చెలువంమొప్పగ వెంకటేశ్వరునిగా జీమూత శృంగమ్ముపైకలికాలంబునఁ బుట్టె రాఘవుఁడు లోకంబెల్ల రక్షించఁగన్
నైరృతులన్ కనుంగొని వినాశమొనర్చు తలంపు శౌరియే ధారుణి పైన జన్మగొనె తామరవిందు కులమ్ము నందునన్ కారణ జన్ముడై ప్రజల కష్టములన్ శమియించగా పరి ష్కారము తోడ వచ్చిన జగత్పతికిన్ బ్రణమిల్లఁగాఁ దగున్
నారాయణ నారాయణనారాయణ యంచు గజము నయమున వేడన్ నారవము వినిన హరిసా కారముతో వచ్చెనట జగత్పతికి నతుల్
తోరము నీరసంబడిన తొండపు జంతువు వేడుకోగసా కారముతోడ వచ్చిన జగత్పతికిన్ బ్రణమిల్లగా దగున్ దీరని యాపదల్గలుగ దేకువతోడను దైవప్రార్ధనే మూలము నెల్లవారలకు మోదము గూర్చగ నొప్పునీధరన్
రిప్లయితొలగించండినారాయణుడే వాడని
వారించిన శుక్రుని గని బల వచియించెన్
భూరి యిట వామనుని యా
కారముతో వచ్చెనట జగత్పతికి నుతుల్.
కందం
రిప్లయితొలగించండితా రథ చక్రము గొని హుం
కారము నన్ భీష్ముఁ గూల్చి కవ్వడిఁ గావన్
సారించి వేగఁ గోపా
కారముతో వచ్చెనఁట, జగత్పతికి నతుల్
ఉత్పలమాల
తా రథ చక్రమున్ గొనుచు తాండవ కృష్ణుడు యుద్ధభూమినిన్
వీరవరేణ్యుడై చెలఁగు భీష్ముని గూల్చుచు గ్రీడిఁ గావగన్
వారణమందగన్ దుముకు భారి మృగేంద్రపు రీతిఁ జేర హుం
కారముతోడ వచ్చిన జగత్పతికిన్ బ్రణమిల్లఁగాఁ దగున్
పారమునంటుటసాధన
రిప్లయితొలగించండిభారమునాయెనుజనులకుభావనసేయన్
తారొకవిగ్రహమనునా
కారముతోవచ్చెనటజగత్పతికినతుల్
నారాయణ గావు మనుచు
రిప్లయితొలగించండిభారము వేసి గజరాజు ప్రార్థన సేయన్
భోరున భక్తునికై సా
కారముతో వచ్చె నట జగత్పతికి నతుల్
ఉత్పలమాల లో 'భీష్ముని నిల్పఁగఁ' అని చదువుకొన ప్రార్థన.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిధారుణిఁ ధర్మమున్ నిలుపు దక్షుడు ధృత్వుడు పృశ్నిశృంగుడా
భూరి త్రిధాముడా జినుడు పుష్కరనాభుడు దేవదేవుడా
వారిశుడా యధోక్షజుడు వ్యక్తుడు తామరకంటి వామనా
కారము తోడవచ్చిన జగత్పతికిన్ బ్రణమిల్లగా దగున్.
కోరుకొనిన రీతిగ కడు
రిప్లయితొలగించండిదూరపు నెలకువల నుండి తొలగిన కతనన్
చేరుకొనియుండ కడు మమ
కారముతో వచ్చెనఁట జగత్పతికి నతుల్
సారసలోచనుడనుచును
రిప్లయితొలగించండిశ్రీరాముండనుచుహరిని సేవింప నిరా
కారుండగు దైవము సా
కారముతో వచ్చెనఁట, జగత్పతికి నతుల్
ఔరా!స్వయంవరంబున
రిప్లయితొలగించండిశ్రీరాముఁడు విల్లువిఱిచి సీతాదేవిన్
దారగఁగొనగ ధనుష్టం
కారముతో వచ్చెనట జగత్పతికి నతుల్.
భారత దేశ జంతువుల భాగ్యము సర్వము నీవెఱుంగవే!
రిప్లయితొలగించండిభారతవర్షమందు హరి పల్మఱుఁ బుట్టుచు జీవకోటికిన్
జేరువ యయ్యె, కుయ్యిడగ శ్రీహరి బందుగు డౌచు దా శుభా
కారముతోడ వచ్చిన జగత్పతికిన్ బ్రణమిల్లఁగాఁ దగున్.
కారుణ్యహృదయగత మమ
రిప్లయితొలగించండికారముతో భక్తజనుల కనులకు సాక్షా
త్కారముతో సౌందర్యా
కారముతో వచ్చెనఁట జగత్పతికి నతుల్
చేరగనెంచి శ్రీహరిని చిత్తమునందున
రిప్లయితొలగించండినిలిపి సర్వదా
సారములేన జీవితము చాలని మ్రొక్కుచు
స్వామి నీదరిన్
జేరెడు త్రోవజూపుమని చింతులు భక్తుడు
సంస్తుతించ నా
కారముతోడ వచ్చిన జగత్పతికిన్ ప్రణ
మిల్లగా వలెన్.
క్షీర సముద్ర ముంజిలుక చేకురెగా సుధ,దానిఁబంచగా
రిప్లయితొలగించండివారిజనేత్రమోహినిగ వారిజనాభుడు వచ్చినంతనే
వీరులు దేవదానవులు విస్మయమందిరి,దివ్య సుందరా
*కారముతోడ వచ్చిన జగత్పతికిన్ ప్రణమిల్లగా దగున్.*
ఘోర పయోధిమధ్యమునఁ గొట్టుకు పోవుచు దిక్కుతోచకన్
రిప్లయితొలగించండితీరము కానరానితరి తీరుగనొడ్డుకు జేర్చ నార్తితో
భారము నీదెయంచు కడు భక్తిగ దోసిలియొగ్గి వేఁడ నోం
కారముతోడ, వచ్చిన జగత్పతికిన్ బ్రణమిల్లఁగాఁ దగున్
కందం
రిప్లయితొలగించండిఆరాధ్య దేవ దర్శన
కోరిక మదిన పొడజూప ఘోర తపమునున్
తీరుగ జేయగ సగుణా
కారము తో వచ్చెనట ,జగత్పతికి నతుల్.
ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
ఉండవల్లి సెంటర్.
ధారుణి భారము మోయుచుఁ
రిప్లయితొలగించండిబౌరజన క్షేమ మెంచి పన్నుగ నిటకుం
దోర మెడఁద మీఱిన మమ
కారముతో వచ్చె నఁట జగత్పతికి నతుల్
కారణ జన్ముఁడై భువినిఁ గావఁగ శిష్టులఁ ద్రుంచ దుష్టులం
గోరఁగ ధర్మనందనుఁడు కూర్మి సెలంగఁగ వాసుదేవుఁడే
గౌరవ మొప్ప నెల్లరకుఁ గౌరవ పాండవ సంధి నెంచి శ్రీ
కారము తోడ వచ్చిన జగత్పతికిన్ బ్రణమిల్లఁగాఁ దగున్
ఇలపై దైత్యుల కృత్యముల్ మడఁ చగా నెల్లప్పుడున్ శౌరితాన్
రిప్లయితొలగించండిగలుగున్ తప్పక మారురూపములతో కాంక్షించి సంక్షేమమున్
చెలువంమొప్పగ వెంకటేశ్వరునిగా జీమూత శృంగమ్ముపై
కలికాలంబునఁ బుట్టె రాఘవుఁడు లోకంబెల్ల రక్షించఁగన్
నైరృతులన్ కనుంగొని వినాశమొనర్చు తలంపు శౌరియే
రిప్లయితొలగించండిధారుణి పైన జన్మగొనె తామరవిందు కులమ్ము నందునన్
కారణ జన్ముడై ప్రజల కష్టములన్ శమియించగా పరి
ష్కారము తోడ వచ్చిన జగత్పతికిన్ బ్రణమిల్లఁగాఁ దగున్
నారాయణ నారాయణ
రిప్లయితొలగించండినారాయణ యంచు గజము నయమున వేడన్
నారవము వినిన హరిసా
కారముతో వచ్చెనట జగత్పతికి నతుల్
తోరము నీరసంబడిన తొండపు జంతువు వేడుకోగసా
రిప్లయితొలగించండికారముతోడ వచ్చిన జగత్పతికిన్ బ్రణమిల్లగా దగున్
దీరని యాపదల్గలుగ దేకువతోడను దైవప్రార్ధనే
మూలము నెల్లవారలకు మోదము గూర్చగ నొప్పునీధరన్