31-3-2022 (గురువారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“లంచమునకు రాచగద్దె లభియించుఁ గదా”(లేదా...)“లంచము స్వీకరించిన ఫలంబుగ దక్కును రాజపీఠమే”
కందంపంచుదురు చీరసారెలువంచుదురు ధనమ్ము మందు వలలోఁ బడగన్గొంచముగ నోటరులకిడులంచమునకు రాచగద్దె లభియించుఁ గదా!ఉత్పలమాలపంచిన చీరసారెలను బంగరు దిద్దులు ముక్కుపుడ్కలున్బంచిన మందుగిందు తలవంచుచు వారివె గాక దొంగ యోట్లంచితమంచనన్ మనకు నర్పణజేసెదరన్న నోటరుల్లంచము స్వీకరించిన ఫలంబుగ దక్కును రాజపీఠమే!
సంచితపాపపుకర్మముమించగమానవులయందుమేతయెదగిలెన్ఎంచగపదవినిగొప్పగలంచమునకురాచగద్దెలభియించుగదా
సంచుల కొద్ది నిధిని దననెంచు కొనగ నేలుకోటికెనికల వేళన్కొంచెముగ పంచి యిచ్చినలంచమునకు రాచగద్దె లభియించుఁ గదాఏలుకోటి = ఏలుబడికి లోపడిన జనము
వంచకబుద్ధిజూపెగదభారతమందునరాజరాజుతాపంచనుజేర్చికర్ణునినిభాసురరీతినిరాజ్యమిచ్చియున్సంచితపాపకర్మమునషండుడునయ్యెనుసూర్యపుత్రుడేలంచముస్వీకరించినఫలంబుగదక్కునురాజపీఠమే
సంచలనోపన్యాసపువంచనయే మూలధనము పంచిన నోట్లేపెంచునుగద వోట్లనిచటలంచమునకు రాచగద్దె లభియించుఁ గదా
మంచిగ హామీ లొసగుచు సంచులతో ధనము బంచి జయమును బొందున్ కొంచక కాకా పట్టియు లంచమునకు రాచ గద్దె లభియించు గదా !
సంచులతో నల్లధనమునించుకయును సిగ్గులేకనిచ్చుచు ప్రజలన్వంచనచేయు కుమతులకులంచమునకు రాచగద్దె లభియించుఁ గదా
సంచితపాపమున్ ప్రజకు సంచులలో గొనితెచ్చి పంచుచున్వంచనచేసి గద్దెలను స్వంతమొనర్పగ జూచునట్టి వారించుకయేని సిగ్గిలక నీప్సిత సిద్ధికి నడ్డదారులన్ లంచము స్వీకరించిన ఫలంబుగ దక్కును రాజపీఠమే
ఎంచడెవండును నేతలమంచితనంబును, విరివిగ మద్యము ధనమున్ బంచినను చాలు నిల నాలంచమునకు రాచగద్దె లభియించుఁ గదా!మంచికి లేవు రోజులను మాన్యుల మాటలు సత్యమే సుమీ వంచన జేయ నాయకులు పాలకులై వెలుగంగ నెంచుచున్ బంచెడు మద్యమున్ ధనము వద్దనకుండ జనాళి స్వార్థమున్ లంచము స్వీకరించిన ఫలంబుగ దక్కును రాజపీఠమే.
పంచను చేరి నాయకుల ప్రస్తుతి చేయుచు దండిసొమ్ములన్పంచుచు వోట్లు పొందుచు, వ్యవస్థల దన్నును దొడ్డిదారిలోగాంచుచు నున్న నాకుటిల కర్కశ చిత్తుడు, వక్ర మార్గమున్లంచము స్వీకరించిన ఫలంబుగ దక్కును రాజపీఠమే
కందంమంచిగ కోరు ధనేతరలంచమునకు రాచ గద్దె లభియించు గదా!ఇంచుక ప్రణమిల్లినచోసంచలన మహిమల దొంగ స్వాముల చెంతన్.ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రిఉండవల్లి సెంటర్.(రాజకీయ నాయకులు -దొంగ స్వాముల లీలల సందర్భంగా)
కంచెయె మేసినట్టు లధికారి ప్రజా ధనమున్ హరించుచున్ పంచుచు నట్టి సొమ్ములను పాలక పక్షపు పోషణమ్ముకై వంచన తోడ నేలికల ప్రాపున చేరెను నేతయై భళా !లంచము స్వీకరించిన ఫలంబుగ దక్కును రాజ పీఠమే!
పంచగ సొమ్మును నోట్లకు నంచిత ముగనుగె లిపింత్రు హర్షము తోడన్ పంచగ మంతిరి పదవిని లంచమునకు రాచగద్దె లభియించుగదా
అంచితముగ మన్నన జన సంచయ మిచ్చిన వరించి సద్గుణ రాశిన్మించి నిలువ నాశ పడక లంచమునకు రాచ గద్దె లభియించుఁ గదాలంచము వేలు వే లొసఁగి రాజ్యము దక్కినఁ గోట్ల కోట్లనున్ మించి గడింప కుండుటకు మేదిని వెఱ్ఱులె వార లక్కటా యించుక శంక నూనకయె యెన్నిక లప్పుడు నేత లీయఁగా లంచము స్వీకరించిన ఫలంబుగ దక్కును రాజ పీఠమే
ఎంచగ నాయకా గణము లెన్నిక లప్పుడుస్వార్థ బుద్ధితోబంచును డబ్బు మద్యమును బంచనుగుత్రిమమైన మ్రొక్కులున్వంచన భావ నాయకుల వస్తువులంగొను నట్టి యోటరుల్లంచము స్వీకరించిన ఫలంబుగ దక్కనురాజపీఠమే.
లంచము లెక్కువాయెనిల లంచము లేనిది జర్గవేవియున్ లంచములోటు వేయుటకు లంచముదైవము జూడగోరినన్ లంచము స్వీకరించిన ఫలంబుగ దక్కును రాజపీఠమే లంచము లేని శాఖలిట లక్ష్మణ! కానవు నీవెఱుంగవే!
కందం
రిప్లయితొలగించండిపంచుదురు చీరసారెలు
వంచుదురు ధనమ్ము మందు వలలోఁ బడగన్
గొంచముగ నోటరులకిడు
లంచమునకు రాచగద్దె లభియించుఁ గదా!
ఉత్పలమాల
పంచిన చీరసారెలను బంగరు దిద్దులు ముక్కుపుడ్కలున్
బంచిన మందుగిందు తలవంచుచు వారివె గాక దొంగ యో
ట్లంచితమంచనన్ మనకు నర్పణజేసెదరన్న నోటరుల్
లంచము స్వీకరించిన ఫలంబుగ దక్కును రాజపీఠమే!
సంచితపాపపుకర్మము
రిప్లయితొలగించండిమించగమానవులయందుమేతయెదగిలెన్
ఎంచగపదవినిగొప్పగ
లంచమునకురాచగద్దెలభియించుగదా
సంచుల కొద్ది నిధిని దన
రిప్లయితొలగించండినెంచు కొనగ నేలుకోటికెనికల వేళన్
కొంచెముగ పంచి యిచ్చిన
లంచమునకు రాచగద్దె లభియించుఁ గదా
ఏలుకోటి = ఏలుబడికి లోపడిన జనము
వంచకబుద్ధిజూపెగదభారతమందునరాజరాజుతా
రిప్లయితొలగించండిపంచనుజేర్చికర్ణునినిభాసురరీతినిరాజ్యమిచ్చియున్
సంచితపాపకర్మమునషండుడునయ్యెనుసూర్యపుత్రుడే
లంచముస్వీకరించినఫలంబుగదక్కునురాజపీఠమే
సంచలనోపన్యాసపు
రిప్లయితొలగించండివంచనయే మూలధనము పంచిన నోట్లే
పెంచునుగద వోట్లనిచట
లంచమునకు రాచగద్దె లభియించుఁ గదా
మంచిగ హామీ లొసగుచు
రిప్లయితొలగించండిసంచులతో ధనము బంచి జయమును బొందున్
కొంచక కాకా పట్టియు
లంచమునకు రాచ గద్దె లభియించు గదా !
సంచులతో నల్లధనము
రిప్లయితొలగించండినించుకయును సిగ్గులేకనిచ్చుచు ప్రజలన్
వంచనచేయు కుమతులకు
లంచమునకు రాచగద్దె లభియించుఁ గదా
సంచితపాపమున్ ప్రజకు సంచులలో గొనితెచ్చి పంచుచున్
రిప్లయితొలగించండివంచనచేసి గద్దెలను స్వంతమొనర్పగ జూచునట్టి వా
రించుకయేని సిగ్గిలక నీప్సిత సిద్ధికి నడ్డదారులన్
లంచము స్వీకరించిన ఫలంబుగ దక్కును రాజపీఠమే
రిప్లయితొలగించండిఎంచడెవండును నేతల
మంచితనంబును, విరివిగ మద్యము ధనమున్
బంచినను చాలు నిల నా
లంచమునకు రాచగద్దె లభియించుఁ గదా!
మంచికి లేవు రోజులను మాన్యుల మాటలు సత్యమే సుమీ
వంచన జేయ నాయకులు పాలకులై వెలుగంగ నెంచుచున్
బంచెడు మద్యమున్ ధనము వద్దనకుండ జనాళి స్వార్థమున్
లంచము స్వీకరించిన ఫలంబుగ దక్కును రాజపీఠమే.
పంచను చేరి నాయకుల ప్రస్తుతి చేయుచు దండిసొమ్ములన్
రిప్లయితొలగించండిపంచుచు వోట్లు పొందుచు, వ్యవస్థల దన్నును దొడ్డిదారిలో
గాంచుచు నున్న నాకుటిల కర్కశ చిత్తుడు, వక్ర మార్గమున్
లంచము స్వీకరించిన ఫలంబుగ దక్కును రాజపీఠమే
కందం
రిప్లయితొలగించండిమంచిగ కోరు ధనేతర
లంచమునకు రాచ గద్దె లభియించు గదా!
ఇంచుక ప్రణమిల్లినచో
సంచలన మహిమల దొంగ స్వాముల చెంతన్.
ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
ఉండవల్లి సెంటర్.
(రాజకీయ నాయకులు -దొంగ స్వాముల లీలల సందర్భంగా)
కంచెయె మేసినట్టు లధికారి ప్రజా ధనమున్ హరించుచున్
రిప్లయితొలగించండిపంచుచు నట్టి సొమ్ములను పాలక పక్షపు పోషణమ్ముకై
వంచన తోడ నేలికల ప్రాపున చేరెను నేతయై భళా !
లంచము స్వీకరించిన ఫలంబుగ దక్కును రాజ పీఠమే!
పంచగ సొమ్మును నోట్లకు
రిప్లయితొలగించండినంచిత ముగనుగె లిపింత్రు హర్షము తోడన్
పంచగ మంతిరి పదవిని
లంచమునకు రాచగద్దె లభియించుగదా
అంచితముగ మన్నన జన
రిప్లయితొలగించండిసంచయ మిచ్చిన వరించి సద్గుణ రాశిన్
మించి నిలువ నాశ పడక
లంచమునకు రాచ గద్దె లభియించుఁ గదా
లంచము వేలు వే లొసఁగి రాజ్యము దక్కినఁ గోట్ల కోట్లనున్
మించి గడింప కుండుటకు మేదిని వెఱ్ఱులె వార లక్కటా
యించుక శంక నూనకయె యెన్నిక లప్పుడు నేత లీయఁగా
లంచము స్వీకరించిన ఫలంబుగ దక్కును రాజ పీఠమే
ఎంచగ నాయకా గణము లెన్నిక లప్పుడు
రిప్లయితొలగించండిస్వార్థ బుద్ధితో
బంచును డబ్బు మద్యమును బంచను
గుత్రిమమైన మ్రొక్కులున్
వంచన భావ నాయకుల వస్తువులంగొను
నట్టి యోటరుల్
లంచము స్వీకరించిన ఫలంబుగ దక్కను
రాజపీఠమే.
లంచము లెక్కువాయెనిల లంచము లేనిది జర్గవేవియున్
రిప్లయితొలగించండిలంచములోటు వేయుటకు లంచముదైవము జూడగోరినన్
లంచము స్వీకరించిన ఫలంబుగ దక్కును రాజపీఠమే
లంచము లేని శాఖలిట లక్ష్మణ! కానవు నీవెఱుంగవే!