5, జులై 2022, మంగళవారం

సమస్య - 4126

6-7-2022 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“హర్మ్యంబునఁ దగవులాడె హస్తి మకరముల్”
(లేదా...)
“హర్మ్యంబందున హస్తి నక్రములు సేయంజొచ్చె సంగ్రామమున్”

23 కామెంట్‌లు:

  1. ఐర్మ్యమునఁ బుండు మానును,
    ధర్మ్యంబగు కర్మ గూర్చు ధన్యత్వము, సా
    ధర్మ్యముఁ గనఁ గమలిని యను
    హర్మ్యంబునఁ దగవులాడె హస్తి మకరముల్.

    రిప్లయితొలగించండి
  2. హర్మ్యం బే కాసారము
    హర్మ్యంబు గఁదలచి మొసలి హాయిగ నుండన్
    హర్మ్యంబుఁ గలచ యేనుగు
    హర్మ్యంబునఁ దగవులాడె హస్తి మకరముల్

    రిప్లయితొలగించండి
  3. కందం
    హర్మ్యంబులేర్పడ నసా
    ధర్మ్యంబున చిత్రశాల! దర్శకుఁడెంచన్
    ధర్మ్యమ్ము చెడక కల్పిత
    హర్మ్యంబునఁ దగవులాడె హస్తి మకరముల్!

    శార్దూలవిక్రీడితము
    హర్మ్యంబుల్ గనువిందు జేయ వెలసెన్ హ్లాదంబుఁ జేకూర్ప సా
    ధర్మ్యంబుల్ గనఁ జిత్రశాలఁ గలవే దర్శింపగా నొప్పెడున్
    ధర్మ్యంబున్ గని జీవహింసవిడఁ జిత్రంబందుఁ గల్పింపఁగన్
    హర్మ్యంబందున హస్తి నక్రములు సేయంబొచ్చె సంగ్రామమున్!

    రిప్లయితొలగించండి
  4. కర్మ్యంబుననంటదుగా
    ధర్మ్యంబైచనగపనులుతరచియుచూడన్
    నైర్మ్యంబునశ్రుతిస్మ్రుతియు
    హర్మ్యంబునఁదగవులాడెహస్తిమకరముల్

    రిప్లయితొలగించండి
  5. తేటగీతి
    వేడుకలు మీఱ శ్రీలక్ష్మి తోడనుండె
    నగధరుండు*హర్మ్యంబున;దగవులాడె
    హస్తిమకరముల్*సరసున,నామొఱవిని
    యు,కరి బ్రోచెను చక్రి యా మకరిఁజంపి.

    రిప్లయితొలగించండి
  6. సతితోడ ముదముగ సరసము లాడినిదురలోన జారిన హరికి
    నొక్క

    సారిగ వినబడె శరణు శరణుమను పిలుపులు,మత్తును‌ వీడి‌ నిదుర

    లేచి చూచుచు నుండ కాచగ రమ్మని యరుపులు వినబడె వరుసగ తన

    *హర్మ్యంబున,తగవు లాడె హస్తి మకరముల్* జలమున, ప్రాణములు రయముగ


    కరికి పోవునని తలచి సిరికి తెలుప

    క కరమున చక్రమున్ దాల్చక తన వాహ

    నంబు నెక్కక పరుగిడె నభము‌ వీడి

    కరిని రక్షించ భువికి యా కంబు పాణి

    రిప్లయితొలగించండి
  7. హర్మ్యం బేగద చింతఁ జేయగను భో యాలాస్య పుంజీవికిన్
    హర్మ్యంబంతయు హస్తి యిష్టపు గతిన్ హల్ చల్ గ జేయంగ నౌ
    హర్మ్యంబందున హస్తి నక్రములు సేయంజొచ్చె సంగ్రామమున్
    హర్మ్యం బంతయు ముర్కి కూపము గనౌ నట్లుం బ్ర కోపంబు గా

    రిప్లయితొలగించండి
  8. ధర్మ్యంబేవిడెధర్మరాజునటయుద్ధంబందునల్పజ్ఞుడై
    నైర్మ్యంబేయదికృష్ణుమాటనహహానీల్గెన్గదాకవ్వడిన్
    మార్మ్యమబందుననల్గిపోయెగదరామాలావువేదాంగముల్
    హర్మ్యంబందునహస్తినక్రములుసేయంజొచ్చెసంగ్రామమున్

    రిప్లయితొలగించండి

  9. హర్మ్యము లేదని తలచుచు
    హర్మ్యంబొక్కటి సృజించెనద్భుత రీతిన్
    భర్మ్యాశ్వుడు చిత్రించెను
    హర్మ్యంబునఁ దగవులాడె హస్తి మకరముల్.

    రిప్లయితొలగించండి
  10. భర్మ్యాశ్వుడు సుతుల కిడిన
    హర్మ్యంబుల నడుమ కొలను హర్షముగూర్చున్
    హర్మ్యంబాకాసారము
    హర్మ్యంబునఁ దగవులాడె హస్తి మకరముల్

    రిప్లయితొలగించండి
  11. హర్మ్యంబును విడిచి మకరి
    హర్మ్యానికి పరుగునొచ్చె హరి కావ కరిని
    హర్మ్యమేసిరికి కడలి
    హర్మ్యంబున దగవులాడే హస్తిమకరముల్

    రిప్లయితొలగించండి
  12. హర్మ్యంబును నిర్మించియు
    హర్మ్యము న దూర దర్శ మమరి న వేళన్
    నిర్మ్యంబు గ గాo చ నచట
    హర్మ్యంబున దగవు లాడె హస్తి మకరముల్

    రిప్లయితొలగించండి
  13. ఈ'ర్మ్య'ప్రాసము దుష్కరంబు సుకవీ!యీరీతిగా నిచ్చుటల్
    ధర్మ్యంబేయగు,చక్రధారి సతితోఁదాకేళియందుండగా
    హర్మ్యంబందున;హస్తి నక్రములు సేయంజొచ్చె సంగ్రామమున్
    ధర్మ్యంబంచును హస్తి బ్రోచి మకరిన్ దైత్యారి ఖండించెగా.

    రిప్లయితొలగించండి
  14. హర్మ్యమన పెద్ద భవనము ,
    హర్మ్యముల దెరగు ప్రతిమల నమరచ వచ్చున్
    హర్మ్యములను జూడగ నొక
    హర్మ్యంబునఁ దగవులాడె హస్తి మకరముల్

    రిప్లయితొలగించండి

  15. హర్మ్యంబన్నది లేనివాడనని సత్యాన్వేషిగా పిల్చెడిన్
    భర్మ్యాశ్వండు వడిన్ సృజింప దలచెన్ వాసంబు తానొక్కటిన్
    ధర్మ్యంబౌ ధన మున్ వ్యయించి, నట చిత్రంబొక్కటిన్ వేసెనా
    హర్మ్యంబందున, హస్తి నక్రములు సేయంబొచ్చె సంగ్రామమున్.

    రిప్లయితొలగించండి
  16. రిప్లయిలు
    1. [నాగరిక ప్రపంచంలో న్యాయాన్యాయాలను వీడి పాపభీతి లేక బ్రతికి తుదిఘడియలలో చికిత్సాలయ
      హర్మ్యంబునఁ (multistorey, multispeciality hospital) లో జరుగు జీవన్మరణ పోరాటానికి బమ్మెర పోతన గారి గజేంద్రమోక్షం కథ సామ్యంతో]

      కందం

      ధర్మ్యా ధర్మ్య క్రియల సా
      ధర్మ్యంబులనొదలి యౌపధర్మ్యం బెంచన్
      ధర్మ్యమది చికిత్సాలయ
      హర్మ్యంబునఁ దగవులాడె హస్తి మకరముల్

      తొలగించండి
  17. ధర్మ్యంబెటులగు భువిలో
    హర్మ్యంబుల నాకసమున హరువుగ గట్టన్
    ధర్మ్యము కాదిట్టులనిన
    "హర్మ్యంబునఁ దగవులాడె హస్తి మకరముల్"

    రిప్లయితొలగించండి
  18. ధర్మ్యంబున్ నిలబెట్టు వారి సరసన్ దైత్యారి తోడుండు సా
    ధర్మ్యమ్మున్ పరిరక్ష చేయ, మనగా దారా పరిష్వంగమున్
    హర్మ్యంబందున, హస్తి నక్రములు సేయంజొచ్చె సంగ్రామమున్
    ఐర్మ్యమ్మిచ్చి దయామయుండు వడిగా యాహస్తిఁ గాపాడెతాన్

    రిప్లయితొలగించండి
  19. కందం
    నైర్మ్యంబా కాసారము
    హర్మ్యంబదియగు హ్రదగ్రహమ్మున కపుడున్
    ధర్మ్యంబుగాని పోరున్
    హర్మ్యంబున దగవులాడె హస్తి మకరముల్

    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటర్.

    రిప్లయితొలగించండి
  20. ధర్మ్యచ్యుతు లయి నిజ పితృ
    హర్మ్యార్థము సోదరు లనయం బక్కట నై
    ష్కర్మ్య రతులు పగతు రయిరి
    హర్మ్యంబునఁ దగవు లాడె హస్తి మకరముల్

    ధర్మ్యాధర్మ్య విదుండు భక్త జన హృద్ధాముండు రక్షింప నై
    ష్కర్మ్యుం డవ్యయుఁ డప్ర మేయుఁడును శ్రీకాంతుండు బాంధవ్య సా
    ధర్మ్యంబై జల జీవ సంచయము నిత్యం బుండు తత్పద్మినీ
    హర్మ్యం బందున హస్తి నక్రములు సేయం జొచ్చె సంగ్రామమున్

    రిప్లయితొలగించండి