1-8-2022 (సోమవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“అభయమిడి చంపుటయె ధర్మ మగును గనఁగ”(లేదా...)“అభయ మొసంగి చంపుటయె యన్నిఁటికంటెను మేటి ధర్మమౌ”
తేటగీతిమకరి పాదమ్ము బట్టగ మదముహెచ్చి,గజము చేవజాలదనుచున్ గావమనఁగనండనేనంచు శౌరి వేదండమునకునభయమిడి, చంపుటయె ధర్మ మగును గనఁగ!
చంపకమాలఇభము సరస్సునన్ మకరి కేర్పడఁ జిక్కుచు మ్లానమౌచుఁ దా,విభుడని శౌరినిన్ శరణు వేడ వికుంఠ పురాధినాథుఁడున్రభసమునందుఁ దన్మకరి రాజసమొంచి, గజేంద్రుగావఁగానభయ మొసంగి, చంపుటయె యన్నిఁటికంటెను మేటి ధర్మమౌ!
పరమ శత్రువు నైనఁ గాపాడ వలెను నభయమిడి ,చంపుటయె ధర్మ మగును గనఁగ బరుల హింసించు మూర్ఖుని పాప మనక మూర్ఖ జనమును రక్షించ మొఱకుఁ దనము
కావు మని వేడు వారిని గావ వలయునభయ మిడి : చంపుట యె ధర్మ మగును గనగసుజన రక్షణ కొఱకునై కుజన తతులశక్తి యుక్తులు జూపింప యుక్త ముగను
దిగులు నొందిన హితునికి ధీమసమిడభుజగము కరవకుండగ బ్రోచెదననియభయమిడి ; చంపుటయె ధర్మ మగును గనఁగనంచు దుడ్డుతో దానిపై యడుపు వేసె
చంపకమాల.రభసను సృష్టిజేయుచును రక్కసి తానయి సూక్ష్మజీవిగన్బ్రభవమునంద భూమిపయి, ప్రార్థన జేసెడి మానవాళికిన్విభవము దీర్చిదిద్దుటకు వేగమె వేంకట నాథుడేగగా*నభయమొసంగి,చంపుటయె యన్నిఁటికంటెను మేటి ధర్మమౌ*
తేటగీతివిడిచి యన్ననే రాగ విభీషణునకు*నభయమిడి;చంపుటయెధర్మమగును,గనగ*శిష్ట రక్షణఁజేసియు దుష్ట శిక్ష ణంబుఁజేసెరాముండు లోకంబు మెచ్చ.చంపకమాలవిభుఁడగు రావణున్ విడిచి వేగమె మంత్రులఁగూడి వచ్చియున్నభమున నిల్చియున్ శరణు నాకిడుమంచు విభీషణుండనన్*అభయమొసంగి;చంపుటయె యన్నిటి కంటెను మేటి ధర్మమౌ*ప్రభువులకంచు దుష్టుఁడగు రావణుఁజంపడె రామచంద్రుఁడున్.
ఘోర తపము పరిఘటించి కోర విభుడొసగె వరములు హిరణ్య కశపవిభునకుధర్మ రక్షణ కార్యపు మర్మమెరిగిఅభయమిడి చంపుటయె ధర్మ మగును గనఁగ
ఇభమది మూర్ఖ భావమున నేరునఁ గ్రుంగగఁ గుంభి పట్టగావిభుఁడగు నారసింహుని కివేగమె మ్రొక్కగఁ విష్ఞుఁ డంతటన్ నభయ మొసంగి చంపుటయె యన్నిఁటికంటెను మేటి ధర్మమౌ ప్రభులను వారలెప్పుడును బాధితు పక్షము నుండ గావలెన్
కరకుహృదయుఁడు కామంబు కనుల గప్పికన్నె పిల్లను బలిమిని గవయ బోవనభయమిడి చంపుటయె ధర్మ మగును గనఁగనాత్మ రక్షణ కొరకునా యబల కొరకు
భైరి బారిన పడినట్టి భార్గవమదిశరణమంచు వేడిన యంత చక్రధరుడువార్భటమునుండి కాపాడ వారణముకునభయమిడి, చంపుటయె ధర్మ మగును గనఁగ.విభుడవు నీవె కావుమని భీకర గ్రాహము చేతజిక్కి యాయిభమది ప్రాణగొడ్డమున నేడ్చుచు బిల్చెనంచు భూరియే రభసము నందు జేరుచు పలాంగము నుండి గజేంద్రు బ్రోవగా నభయ మొసంగి, చంపుటయె యన్నిఁటికంటెను మేటి ధర్మమౌ
విభవముఁ గోలుపోయి యరి వీర భయంకర పాండునందనుల్అభగులుగా విరాటు సభ నాశ్రయ మొందగ సాధ్వి ద్రౌపదిన్రభసముఁజేయు కీచకుని రమ్మని నర్తనశాల యందుతానభయ మొసంగి చంపుటయె యన్నిఁటికంటెను మేటి ధర్మమౌ
తేటగీతిఏక చక్రపురప్రజ లిడుము బాపఅభయమిడి ,చంపుటయె ధర్మ మగును గనగ!లోక భీకర లీలన లోక కంటకు బకుని వృకోదరుడు జంపె క్రోధ మొందిప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రిఉండవల్లి సెంటర్.
ఇభము, కరేణువుల్ గొలను నింపుగ కేళికలాడుచుండగారభసముతోడఁ గ్రోలుచు శరమ్ముల, పట్టెపదమ్ము నక్ర మంది భయము నాకరీంద్రుడు రతీశుని తండ్రిని వేడ, శౌరితానభయ మొసంగి, చంపుటయె యన్నిఁటికంటెను మేటి ధర్మమౌ
శుభమగునే దలంప మతి శూన్యుడవైతివి నీచ కార్యమౌనభయ మొసంగి చంపుటయె; యన్నిఁటికంటెను మేటి ధర్మమౌప్రభువుకు సత్య వాక్య పరిపాలనమే గనుమా శిబీంద్రు దానభయమొసంగి పారువము నాదుకొనంగ నిజాంగమిచ్చెనే
రాజ ధర్మము పాటించు రాడ్వరులకు భూత దయ మెండుగా నున్న పూరుషులకు సతము సత్య నిష్ఠా ధర్మ రతుల కెట్టు లభయ మిడి చంపుటయె ధర్మ మగును గనఁగఉభయ జగమ్ము లందుఁ గొన నుత్తమ మైన పదమ్ము కావలెన్ విభవము లున్న వ్యర్థములు పృథ్వి దయా గుణ మింత నిత్య మాహ భయము నింక దుస్సహపు టార్తినిఁ, దా శరణార్థి కింపుగానభయ మొసంగి, చంపుటయె యన్నిఁటి కంటెను మేటి ధర్మమౌ
కష్టసమయమ్మునందున కావగవలెనభయమిడి,చంపుటయె ధర్మమగును గనగదండనమ్మువిధించుట తప్పుచేయనదియె సత్కార్యమగునందు రార్యులిలనుమరొక పూరణవైరి సోదరుండే వేడ వచ్చినంత *"అభయమిడి, చంపుటయ ధర్మ మగును గనగ"*సతి నపహరించిన ఖలుని జాలి వీడిననుచు తెలిపె రామాయణ మవని యందుఅభయముగోరుచున్ వడిగ నాదర మొప్పగవచ్చినంతనే*“అభయ మొసంగి ,చంపుటయె యన్నిఁటికంటెను మేటి ధర్మమౌ”*ప్రభువగు వానికెప్పుడని వాసిగ చూపుచు రామ చంద్రుడున్ శుభమును గూర్చి రావణు నిసోదరునిన్ మరిచేసె రాజుగా
తేటగీతి
రిప్లయితొలగించండిమకరి పాదమ్ము బట్టగ మదముహెచ్చి,
గజము చేవజాలదనుచున్ గావమనఁగ
నండనేనంచు శౌరి వేదండమునకు
నభయమిడి, చంపుటయె ధర్మ మగును గనఁగ!
చంపకమాల
తొలగించండిఇభము సరస్సునన్ మకరి కేర్పడఁ జిక్కుచు మ్లానమౌచుఁ దా,
విభుడని శౌరినిన్ శరణు వేడ వికుంఠ పురాధినాథుఁడున్
రభసమునందుఁ దన్మకరి రాజసమొంచి, గజేంద్రుగావఁగా
నభయ మొసంగి, చంపుటయె యన్నిఁటికంటెను మేటి ధర్మమౌ!
పరమ శత్రువు నైనఁ గాపాడ వలెను
రిప్లయితొలగించండినభయమిడి ,చంపుటయె ధర్మ మగును గనఁగ
బరుల హింసించు మూర్ఖుని పాప మనక
మూర్ఖ జనమును రక్షించ మొఱకుఁ దనము
కావు మని వేడు వారిని గావ వలయు
రిప్లయితొలగించండినభయ మిడి : చంపుట యె ధర్మ మగును గనగ
సుజన రక్షణ కొఱకునై కుజన తతుల
శక్తి యుక్తులు జూపింప యుక్త ముగను
దిగులు నొందిన హితునికి ధీమసమిడ
రిప్లయితొలగించండిభుజగము కరవకుండగ బ్రోచెదనని
యభయమిడి ; చంపుటయె ధర్మ మగును గనఁగ
నంచు దుడ్డుతో దానిపై యడుపు వేసె
చంపకమాల.
రిప్లయితొలగించండిరభసను సృష్టిజేయుచును రక్కసి తానయి సూక్ష్మజీవిగన్
బ్రభవమునంద భూమిపయి, ప్రార్థన జేసెడి మానవాళికిన్
విభవము దీర్చిదిద్దుటకు వేగమె వేంకట నాథుడేగగా
*నభయమొసంగి,చంపుటయె యన్నిఁటికంటెను మేటి ధర్మమౌ*
తేటగీతి
రిప్లయితొలగించండివిడిచి యన్ననే రాగ విభీషణునకు
*నభయమిడి;చంపుటయెధర్మమగును,గనగ*శిష్ట రక్షణఁజేసియు దుష్ట శిక్ష ణంబుఁజేసెరాముండు లోకంబు మెచ్చ.
చంపకమాల
విభుఁడగు రావణున్ విడిచి వేగమె మంత్రులఁగూడి వచ్చియున్
నభమున నిల్చియున్ శరణు నాకిడుమంచు విభీషణుండనన్
*అభయమొసంగి;చంపుటయె యన్నిటి కంటెను మేటి ధర్మమౌ*
ప్రభువులకంచు దుష్టుఁడగు రావణుఁజంపడె రామచంద్రుఁడున్.
ఘోర తపము పరిఘటించి కోర విభుడొ
రిప్లయితొలగించండిసగె వరములు హిరణ్య కశపవిభునకు
ధర్మ రక్షణ కార్యపు మర్మమెరిగి
అభయమిడి చంపుటయె ధర్మ మగును గనఁగ
ఇభమది మూర్ఖ భావమున నేరునఁ గ్రుంగగఁ గుంభి పట్టగా
రిప్లయితొలగించండివిభుఁడగు నారసింహుని కివేగమె మ్రొక్కగఁ విష్ఞుఁ డంతటన్
నభయ మొసంగి చంపుటయె యన్నిఁటికంటెను మేటి ధర్మమౌ
ప్రభులను వారలెప్పుడును బాధితు పక్షము నుండ గావలెన్
కరకుహృదయుఁడు కామంబు కనుల గప్పి
రిప్లయితొలగించండికన్నె పిల్లను బలిమిని గవయ బోవ
నభయమిడి చంపుటయె ధర్మ మగును గనఁగ
నాత్మ రక్షణ కొరకునా యబల కొరకు
రిప్లయితొలగించండిభైరి బారిన పడినట్టి భార్గవమది
శరణమంచు వేడిన యంత చక్రధరుడు
వార్భటమునుండి కాపాడ వారణముకు
నభయమిడి, చంపుటయె ధర్మ మగును గనఁగ.
విభుడవు నీవె కావుమని భీకర గ్రాహము చేతజిక్కి యా
యిభమది ప్రాణగొడ్డమున నేడ్చుచు బిల్చెనంచు భూరియే
రభసము నందు జేరుచు పలాంగము నుండి గజేంద్రు బ్రోవగా
నభయ మొసంగి, చంపుటయె యన్నిఁటికంటెను మేటి ధర్మమౌ
విభవముఁ గోలుపోయి యరి వీర భయంకర పాండునందనుల్
రిప్లయితొలగించండిఅభగులుగా విరాటు సభ నాశ్రయ మొందగ సాధ్వి ద్రౌపదిన్
రభసముఁజేయు కీచకుని రమ్మని నర్తనశాల యందుతా
నభయ మొసంగి చంపుటయె యన్నిఁటికంటెను మేటి ధర్మమౌ
తేటగీతి
రిప్లయితొలగించండిఏక చక్రపురప్రజ లిడుము బాప
అభయమిడి ,చంపుటయె ధర్మ మగును గనగ!
లోక భీకర లీలన లోక కంట
కు బకుని వృకోదరుడు జంపె క్రోధ మొంది
ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
ఉండవల్లి సెంటర్.
ఇభము, కరేణువుల్ గొలను నింపుగ కేళికలాడుచుండగా
రిప్లయితొలగించండిరభసముతోడఁ గ్రోలుచు శరమ్ముల, పట్టెపదమ్ము నక్ర మం
ది భయము నాకరీంద్రుడు రతీశుని తండ్రిని వేడ, శౌరితా
నభయ మొసంగి, చంపుటయె యన్నిఁటికంటెను మేటి ధర్మమౌ
శుభమగునే దలంప మతి శూన్యుడవైతివి నీచ కార్యమౌ
రిప్లయితొలగించండినభయ మొసంగి చంపుటయె; యన్నిఁటికంటెను మేటి ధర్మమౌ
ప్రభువుకు సత్య వాక్య పరిపాలనమే గనుమా శిబీంద్రు దా
నభయమొసంగి పారువము నాదుకొనంగ నిజాంగమిచ్చెనే
రాజ ధర్మము పాటించు రాడ్వరులకు
రిప్లయితొలగించండిభూత దయ మెండుగా నున్న పూరుషులకు
సతము సత్య నిష్ఠా ధర్మ రతుల కెట్టు
లభయ మిడి చంపుటయె ధర్మ మగును గనఁగ
ఉభయ జగమ్ము లందుఁ గొన నుత్తమ మైన పదమ్ము కావలెన్
విభవము లున్న వ్యర్థములు పృథ్వి దయా గుణ మింత నిత్య మా
హ భయము నింక దుస్సహపు టార్తినిఁ, దా శరణార్థి కింపుగా
నభయ మొసంగి, చంపుటయె యన్నిఁటి కంటెను మేటి ధర్మమౌ
కష్టసమయమ్మునందున కావగవలె
రిప్లయితొలగించండినభయమిడి,చంపుటయె ధర్మమగును గనగ
దండనమ్మువిధించుట తప్పుచేయ
నదియె సత్కార్యమగునందు రార్యులిలను
మరొక పూరణ
వైరి సోదరుండే వేడ వచ్చినంత
*"అభయమిడి, చంపుటయ ధర్మ మగును గనగ"*
సతి నపహరించిన ఖలుని జాలి వీడి
ననుచు తెలిపె రామాయణ మవని యందు
అభయముగోరుచున్ వడిగ నాదర మొప్పగవచ్చినంతనే
*“అభయ మొసంగి ,చంపుటయె యన్నిఁటికంటెను మేటి ధర్మమౌ”*
ప్రభువగు వానికెప్పుడని వాసిగ చూపుచు రామ చంద్రుడున్
శుభమును గూర్చి రావణు నిసోదరునిన్ మరిచేసె రాజుగా