7, అక్టోబర్ 2022, శుక్రవారం

సమస్య - 4211

8-10-2022 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మోహము మోక్షమ్ము నిచ్చి మోదముఁ గూర్చున్”
(లేదా...)
“మోహము మోక్షకారణము మోదముఁ గూర్చును సజ్జనాళికిన్”

19 కామెంట్‌లు:

  1. ఆహా గద గీ తావ్యా
    మోహము మోక్షమ్ము నిచ్చి మోదముఁ గూర్చున్
    బాహాటంబుగఁ జెప్పుదు
    నీహారిక! నమ్ముమిదియ నిజమే సుమ్మీ

    రిప్లయితొలగించండి
  2. దేహము కాదు శాశ్వతము ధీమతికైన
    ధనాఢ్యుకేనియున్
    సాహస వర్యుకేనియును సత్యము, ద్వేషము వీడి ప్రాణుల
    న్నీహలయందు నిత్యమతి యింపుగ
    నిత్యము ప్రేముడించు , వ్యా
    మోహము మోక్ష కారణము మోదము గూర్చును సజ్జనాళికిన్

    రిప్లయితొలగించండి
  3. కందము
    దేహమశాశ్వతమేయగు
    నూహింపగ దైవమెపుడు నుండును స్థిరమై
    యైహిక వాంఛలపై,ని
    ర్మోహము మోక్షమ్ము నిచ్చి మోదముఁగూర్చున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉత్పలమాల
      మోహము క్రోధలోభమదముల్ మఱి మత్సర కామ షట్కమున్
      దేహికి వైరి వర్గములు,తీవ్రముగానవి చుట్టుముట్టెడిన్
      ఐహిక భోగభాగ్యములయందు సతంబు నిరాశ యౌర!ని
      ర్మోహము మోక్షకారణము మోదముఁగూర్చును సజ్జనాళికిన్ .

      తొలగించండి
  4. కందం
    శ్రీహరి జయవిజయులకై
    యూహించిన వైరభక్తి యుపయుక్తమనన్
    సాహసమన హరినెదిరెడు
    మోహము మోక్షమ్ము నిచ్చి మోదముఁ గూర్చున్

    ఉత్పలమాల
    శ్రీహరి ద్వారపాలకులు శీఘ్రమె శాపము వాయుమార్గమై
    యూహల వైరభక్తి మదినొప్పగ నెంచిన మూడుజన్మలన్
    సాహసమెంచి మాధవుని సైచని రాక్షసజన్మలెత్తెడున్
    మోహము మోక్షకారణము మోదముఁ గూర్చును సజ్జనాళికిన్

    రిప్లయితొలగించండి
  5. దేహము పైన మోహమును దీరిన పిమ్మట గీత పైని వ్యా
    మోహము, మోక్షకారణము మోదముఁ గూర్చును సజ్జనాళికిన్
    సాహస కార్య మే యగును సద్గురు సేవన ముండు చోనగున్
    మోహము పాప పంకిలము మూర్ఖునిఁ జేయును జీవితాంతమున్

    రిప్లయితొలగించండి
  6. మోహమె ముక్తిని బొందెడు
    వాహనమై మోక్షలక్ష్మి వశపడ నిస్సం
    దేహము ముక్తిపయిన వ్యా
    మోహము మోక్షమ్ము నిచ్చి మోదముఁ గూర్చున్

    రిప్లయితొలగించండి
  7. లాహిరి గూర్చును ధన వ్యా
    మోహము ; మోక్షమ్ము నిచ్చి మోదముఁ గూర్చున్
    దేహముపై ప్రీతి విడిచి
    యా హరిహరులను కొలుచుట నడరుచు గడుపన్

    రిప్లయితొలగించండి
  8. దేహికి దేహముపైగల
    మోహము ఖేదము మిగుల్చు ముమ్మాటికి నా
    మోహము తెగటార్చగ ని
    ర్మోహము మోక్షమ్ము నిచ్చి మోదముఁ గూర్చున్

    రిప్లయితొలగించండి
  9. దేహముపైన మోహమన దేహికి నెన్నడు దుఃఖ హేతువౌ
    మోహము వీడి నెమ్మనము మోహనకృష్ణునిపైన నిల్ప సం
    దేహములేదు తక్షణమె తీరును వంతలు శాంతిగల్గు ని
    ర్మోహము మోక్షకారణము మోదముఁ గూర్చును సజ్జనాళికిన్

    రిప్లయితొలగించండి
  10. దేహము శాశ్వత మనుకొని
    వాహనములు మేడ లంచు వాంఛలు పెరుగన్
    సాహసులై వదలిన వ్యా
    మో హమ్ము మోక్షమ్ము నిచ్చి మోదము గూర్చున్

    రిప్లయితొలగించండి
  11. శ్రీహరి నిల్పుచున్ సతము చిత్తము నందున, పేదవారికిన్
    స్నేహము పంచుచున్, బుడమి నీతిగ సాగుచు నెంచి చూడగా,
    దేహముపైన బ్రాంతి విడి త్రెంప ధనమ్మును గూర్చి కల్గు వ్యా
    మోహము, మోక్షకారణము మోదముఁ గూర్చును సజ్జనాళికిన్

    రిప్లయితొలగించండి

  12. దేహమ్మది తాత్కాళిక
    మే హితుడా దానిపైన నేటికిరా వ్యా
    మోహము పరమాత్మునిపై
    మోహము మోక్షమ్ము నిచ్చి మోదముఁ గూర్చున్.


    గేహము భోగ భాగ్యములు కీర్తియశస్సులు ధాత్రియందు నీ
    దేహమశాశ్వతమ్మని ప్రతీక్ష్యులు చెప్పిన మాట యందు సం
    దేహము లేదు వాస్తవము తీర్థకరుండగు ప్రత్యగాత్మ పై
    మోహము మోక్షకారణము మోదముఁ గూర్చును సజ్జనాళికిన్.

    రిప్లయితొలగించండి
  13. శ్రీహరినామస్మరణము
    దాహమ్మైధర్మమార్గఁదాదాత్మ్యమునై,
    ఆహా!నెంతటిదా!స
    మ్మోహము మోక్షమ్ము నిచ్చి మోదముఁ గూర్చున్
    కొరుప్రోలు రాధాకృష్ణ రావు

    రిప్లయితొలగించండి
  14. దేహము దేవాలయ మా
    గేహము పరమాత్మ యుండు కేలీ గృహమే
    శ్రీ హరిఁ గొల్వుమ వీడుమ
    మోహము మోక్షమ్ము నిచ్చి మోదముఁ గూర్చున్

    శ్రీహరి! మోహనాంగి పయు రేఁగిన దుర్భర మైన యట్టి నీ
    మోహము శిక్ష కర్హ మగుఁ బోరు నొసంగును బ్రాణ హారియౌ
    శ్రీ హరి పైన డెందమునఁ జెన్నుగ రేఁగిన మిక్కుటంపు వ్యా
    మోహము మోక్ష కారణము మోదముఁ గూర్చును సజ్జనాళికిన్

    రిప్లయితొలగించండి
  15. ఉ.

    దేహపు టందచందములు దిక్కులు జూడక ప్రత్యవేక్షణన్
    కాహళి లోభమున్ మదము కామము క్రోధము మత్సరంబులున్
    *మోహము మోక్షకారణము మోదముఁ గూర్చును, సజ్జనాళికిన్*
    బాహువులన్ బ్రయోగమను పాలక సైన్యము దేశరక్షణన్.

    రిప్లయితొలగించండి
  16. దేహము ధరించి నందరు
    గేహము భార్యయు కుటుంబ కృత్యము నడుపన్
    సాహసముగ కోరుకొనుము
    “మోహము మోక్షమ్ము నిచ్చి మోదముఁ గూర్చున్”

    రిప్లయితొలగించండి
  17. మోహన మూర్తినింగనగ ముద్దుగ ధ్యానము నందు మున్గుచున్
    దేహపు భావనల్ మరిచి దేవుని సన్నిధి నుండగోరుచున్
    సాహసవంతులై సరిగ సాధన సల్పిన వార్లపక్షమై
    “మోహము మోక్షకారణము మోదముఁ గూర్చును సజ్జనాళికిన్”

    రిప్లయితొలగించండి
  18. దేహమ శాశ్వత మనుచును
    దేహులు శ్రద్ధగ సతతము దేవుని కొలువన్
    ఈహల్ వీడుచు నా ని
    ర్మోహము మోక్షమ్ము నిచ్చి మోదము కూర్చున్

    రిప్లయితొలగించండి