21-10-2022 (శుక్రవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“హరుని పుణ్యవాసమ్ము సింహాచలమ్ము”(లేదా...)“శివుఁడే పూజలనందఁగా వెలసె నా సింహాచలంబందునన్”
తేటగీతిపేరుఁగాంచిన క్షేత్రమౌవారణాసిహరుని పుణ్యవాసమ్ము;సింహాచలమ్ము నరహరి క్షేత్ర రాజమై వరలు, నన్న వరము సత్యనారాయణ స్వామి పురము.
👌
మత్తేభము భువి కాశీపురి నన్నపూర్ణయుతుఁడై ముక్తిప్రదాయుండునై శివుఁడే పూజలనందగా వెలసె ;నాసింహాచలంబందునన్ దివిజుల్ మెచ్చగ శ్రీనృసింహుఁడగుచున్ దీపించుగా నౌర!మాధవుఁడే యిచ్చుఁజిరాయురున్నతులు సద్భక్తాళి దర్శింపగన్.
సతతము హరినామమొకటె సర్వమనుచుతలచినట్టి బాలున కండదండ యగుచు దనుజుని పరిమార్చిన చక్రధరుడు పాపహరుని పుణ్యవాసమ్ము సింహాచలమ్ము.
తేటగీతిహరియె ప్రహ్లాద భక్తునినాదుకొనఁగస్తంభమున నరసింహావతారమెత్తెనిశిత నఖయుతుని, కనక కశిపు ప్రాణహరుని పుణ్యవాసమ్ము సింహాచలమ్ముమత్తేభవిక్రీడితముస్తవముల్ భక్తిని మిన్ను ముట్ట వడి గుంజందున్ నృసింహంబుగన్రవముల్ జేయుచు నుగ్రరూపమునఁ బ్రహ్లాదాఖ్యు నాహూతి మాధవుడే గూల్చెనహో! హిరణ్యకశిపున్ దండించి దిగ్భ్రాంతిలన్శివుడే, పూజలనందఁగా వెలసె నా సింహాచలంబందునన్
స్తవనీయంబగు దేవశైవలిని తా జాలెత్తు క్షేత్రంబుగా శ్రవణంబందిన కాశికాపురిని పశ్వత్పాలుడైనట్టి యాశివుఁడే పూజలనందఁగా వెలసె, నా సింహాచలంబందునన్ ధ్రువడౌ బభ్రువు సింహరూపిగ చతుర్వ్యూహుండె తానిల్చెనే
అందరు గొలుచు దేవత యమల మనపుహరుని పుణ్యవాసమ్ము సింహాచలమ్ము,ఆలయ విశిష్టతయె గాక నందరి మదితస్కరించి ముదమునిడు తాన కమది
అతులి తానంద లహరి జూచితి తిరుపతిదూర మరిగి దర్శించితి వారణాసిహరుని పుణ్యవాసమ్ము, సింహాచలమ్మునార సింహ నిశాంతమానందమయము
అరయుము కైలా సంబే హరుని పుణ్యవాసమ్ము, సింహాచలమ్ము బరగెను యాత్రా స్థలముగ నరసింహుడు వెలయు కతన నరులను బ్రోవన్
హరుని ధామము రజతాద్రి యనవరతముహిమజతోగూడి భక్తుల హితముగూర్చునరయ ప్రహ్లాద జనకుడౌ యసురు ప్రాణహరుని పుణ్యవాసమ్ము సింహాచలమ్ము
అవురా యేమని జెప్పగాఁ దగును నామాహాత్మ్యుఁడాకారమే శివుఁడే ,పూజలనందఁగా వెలసె నా సింహాచలంబందునన్ భవనాశంబును జేయనౌ బ్రజకుఁ దాభద్రంబుఁజేకూర్చగన్ బవలున్ రేయియు ఱెప్పవోలెఁగడునవ్యాజానురాగంబునై
హరిని భజియించుప్రహ్లాదు నాదు కొనగనవత రించె నృసింహు డై నచ్యు తుండుశక్తి గ హిరణ్య కశ్య పు చంపెను గదహరుని పుణ్య వాసమ్ము సింహా చల మ్ము
అవనీ భక్తజనాళి బాధలును సర్వాత్ముండు గష్టంబులున్నవసాదంబులు బాపగా ధరణిలో నాభవ్య శ్రీకుల్యపైశివుడే పూజలనందగా వెలసె; నా సింహా చలంబందునన్వెలసెన్నుగ్రపు నారసింహుడు మహా విఖ్యాత నామంబుతో
దైత్య నాథుఁడు నిర్జర ధర్షణుండు నై హిరణ్యాక్షుఁడు వెతల నవని కొసఁగె నర మృగేంద్రుని వాని ప్రాణమ్ముల యపహరుని పుణ్య వాసమ్ము సింహాచలమ్మువివరింపంగ నృసింహ రూపమున నా విష్ణుండు లక్ష్మీశుఁడే ఛవి విశ్వమ్మున జ్ఞాన సంపదల నాచ్ఛాదింప నుత్సాహియైభువిలో శుద్ధ దయా రసార్ద్రహృదియై ముల్లోక జీవాళికిన్ శివుఁడే పూజల నందఁగా వెలసె నా సింహాచలం బందునన్
భవనాశంకరుడైన శంకరుడు, సంభావింప శ్రీకాంతుడున్భువనాలేలెడి దైవమూర్తు లిలలో పూజింతు రెల్లన్ మదిన్శివునిన్ కేశవు వేరుగా గనఁకవిశ్లేషింప శ్రీశుండు దాశివుఁడే పూజలనందఁగా వెలసె నా సింహాచలం బందునన్
తేటగీతి
రిప్లయితొలగించండిపేరుఁగాంచిన క్షేత్రమౌవారణాసి
హరుని పుణ్యవాసమ్ము;సింహాచలమ్ము
నరహరి క్షేత్ర రాజమై వరలు, నన్న
వరము సత్యనారాయణ స్వామి పురము.
👌
తొలగించండిమత్తేభము
తొలగించండిభువి కాశీపురి నన్నపూర్ణయుతుఁడై ముక్తిప్రదాయుండునై
శివుఁడే పూజలనందగా వెలసె ;నాసింహాచలంబందునన్
దివిజుల్ మెచ్చగ శ్రీనృసింహుఁడగుచున్ దీపించుగా నౌర!మా
ధవుఁడే యిచ్చుఁజిరాయురున్నతులు సద్భక్తాళి దర్శింపగన్.
రిప్లయితొలగించండిసతతము హరినామమొకటె సర్వమనుచు
తలచినట్టి బాలున కండదండ యగుచు
దనుజుని పరిమార్చిన చక్రధరుడు పాప
హరుని పుణ్యవాసమ్ము సింహాచలమ్ము.
తేటగీతి
రిప్లయితొలగించండిహరియె ప్రహ్లాద భక్తునినాదుకొనఁగ
స్తంభమున నరసింహావతారమెత్తె
నిశిత నఖయుతుని, కనక కశిపు ప్రాణ
హరుని పుణ్యవాసమ్ము సింహాచలమ్ము
మత్తేభవిక్రీడితము
స్తవముల్ భక్తిని మిన్ను ముట్ట వడి గుంజందున్ నృసింహంబుగన్
రవముల్ జేయుచు నుగ్రరూపమునఁ బ్రహ్లాదాఖ్యు నాహూతి మా
ధవుడే గూల్చెనహో! హిరణ్యకశిపున్ దండించి దిగ్భ్రాంతిలన్
శివుడే, పూజలనందఁగా వెలసె నా సింహాచలంబందునన్
రిప్లయితొలగించండిస్తవనీయంబగు దేవశైవలిని తా జాలెత్తు క్షేత్రంబుగా
శ్రవణంబందిన కాశికాపురిని పశ్వత్పాలుడైనట్టి యా
శివుఁడే పూజలనందఁగా వెలసె, నా సింహాచలంబందునన్
ధ్రువడౌ బభ్రువు సింహరూపిగ చతుర్వ్యూహుండె తానిల్చెనే
అందరు గొలుచు దేవత యమల మనపు
రిప్లయితొలగించండిహరుని పుణ్యవాసమ్ము సింహాచలమ్ము,
ఆలయ విశిష్టతయె గాక నందరి మది
తస్కరించి ముదమునిడు తాన కమది
అతులి తానంద లహరి జూచితి తిరుపతి
రిప్లయితొలగించండిదూర మరిగి దర్శించితి వారణాసి
హరుని పుణ్యవాసమ్ము, సింహాచలమ్ము
నార సింహ నిశాంతమానందమయము
అరయుము కైలా సంబే
రిప్లయితొలగించండిహరుని పుణ్యవాసమ్ము, సింహాచలమ్ము
బరగెను యాత్రా స్థలముగ
నరసింహుడు వెలయు కతన నరులను బ్రోవన్
హరుని ధామము రజతాద్రి యనవరతము
రిప్లయితొలగించండిహిమజతోగూడి భక్తుల హితముగూర్చు
నరయ ప్రహ్లాద జనకుడౌ యసురు ప్రాణ
హరుని పుణ్యవాసమ్ము సింహాచలమ్ము
అవురా యేమని జెప్పగాఁ దగును నామాహాత్మ్యుఁడాకారమే
రిప్లయితొలగించండిశివుఁడే ,పూజలనందఁగా వెలసె నా సింహాచలంబందునన్
భవనాశంబును జేయనౌ బ్రజకుఁ దాభద్రంబుఁజేకూర్చగన్
బవలున్ రేయియు ఱెప్పవోలెఁగడు
నవ్యాజానురాగంబునై
హరిని భజియించు
రిప్లయితొలగించండిప్రహ్లాదు నాదు కొనగ
నవత రించె నృసింహు డై నచ్యు తుండు
శక్తి గ హిరణ్య కశ్య పు చంపెను గద
హరుని పుణ్య వాసమ్ము సింహా చల మ్ము
అవనీ భక్తజనాళి బాధలును సర్వా
రిప్లయితొలగించండిత్ముండు గష్టంబులు
న్నవసాదంబులు బాపగా ధరణిలో నా
భవ్య శ్రీకుల్యపై
శివుడే పూజలనందగా వెలసె; నా సింహా చలంబందునన్
వెలసెన్నుగ్రపు నారసింహుడు మహా
విఖ్యాత నామంబుతో
దైత్య నాథుఁడు నిర్జర ధర్షణుండు
రిప్లయితొలగించండినై హిరణ్యాక్షుఁడు వెతల నవని కొసఁగె
నర మృగేంద్రుని వాని ప్రాణమ్ముల యప
హరుని పుణ్య వాసమ్ము సింహాచలమ్ము
వివరింపంగ నృసింహ రూపమున నా విష్ణుండు లక్ష్మీశుఁడే
ఛవి విశ్వమ్మున జ్ఞాన సంపదల నాచ్ఛాదింప నుత్సాహియై
భువిలో శుద్ధ దయా రసార్ద్రహృదియై ముల్లోక జీవాళికిన్
శివుఁడే పూజల నందఁగా వెలసె నా సింహాచలం బందునన్
భవనాశంకరుడైన శంకరుడు, సంభావింప శ్రీకాంతుడున్
రిప్లయితొలగించండిభువనాలేలెడి దైవమూర్తు లిలలో పూజింతు రెల్లన్ మదిన్
శివునిన్ కేశవు వేరుగా గనఁకవిశ్లేషింప శ్రీశుండు దా
శివుఁడే పూజలనందఁగా వెలసె నా సింహాచలం బందునన్