12-9-2023 (మంగళవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“భాస కాళిదాసులు దెల్గువారలె కద”(లేదా...)“భాసుఁడుఁ గాళిదాసు మఱి భారవి యెంచఁగఁ దెల్గువారలే”(అయ్యగారి కోదండ రావు గారికి ధన్యవాదాలతో...)
ప్రతిమ వాసవదత్తయుపసనుజూపఅమరెశాకుంతలంబునునయ్యెతెలుగుదేవభాషయుతెలుగింటతేజముడిగెభాసకాళిదాసులుతెల్గువారలెగద
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
భావ మైనను మధురమౌ భాషనైనచతురు లై తెల్గు లెబలికించగలరుగద,ఆధునిక యుగమున కవులందభినవభాస కాళిదాసులు దెల్గు వారలెకద.
"భాసకాళిదాసులు దెల్గు వారలె కద"యంచు దెలియక పల్కుదు రంతె కానివార లిరువురు సంస్కృత భాషయందువాసి గాంచిన కవివరుల్ వసుధయందు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
నాటకము సూసెడు కవిమిత్రుల సంభాషణ:తేటగీతి"ఇంద్రలోకమున కవిసమ్మేళనమననాటకముగూర్చి నారలు నవ్యరీతిపాత్రలందు సంస్కృతమును వల్లెవేయుభాస కాళిదాసులు దెల్గువారలె కద?" ఉత్పలమాల"వేసవి నాటకోత్సవపు వేదికపై కవిసంగమంబునన్భాసుర కావ్యకర్తలను బాత్రలఁ జేసిన నాటకంబునన్వేసము లందునన్ జెలగి వేడుక జేసిన పాత్రధారులౌభాసుఁడుఁ గాళిదాసు మఱి భారవి యెంచఁగఁ దెల్గువారలే!"
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
వాసవదత్తగాథయటపంచెనుతెల్గునప్రేమమాధురిన్వాసినిగాంచెవీరుడనువాదముజేసియుకాళిదాసునేగాసినిగాంచలేదుతెలుగాయదిశంభునియర్జునిన్గనిన్భాసుడుకాళిదాసుమఱిభారవిగాంచగతెల్గువారలే
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ధన్యవాదములండిగురువుగారు
ఉ.హాసముతోడ నాటికలు హాయిని గొల్పెడి భాస కల్పనల్భాసిలె గాళిదాసు కవి భారవి, సంస్కృత భాషలో బుధుల్*భాసుఁడుఁ గాళిదాసు మఱి భారవి, యెంచఁగఁ దెల్గువారలే*ప్రాసల కట్టు, ప్రాస యతి, పద్యములందు ప్రవేశపెట్టెడిన్.
ఎన్నగను మనవారుకాకున్ననేమి వ్యాస వాల్మీకిభారవి భానుడు మఱిభాస కాళిదాసులు , దెల్గువారలె కదనన్నయ తెనాలి రామకృష్ణాది కవులు.ఆ సుర శారదాంబ చరణాంబుజముల్ విడనట్టి వారలైభాసురమానమైన కవి పండిత శ్రేణిని యగ్ర గణ్యులై వాసి యశస్సుగల్గి జనవంద్యులటంచు జనాళి మెచ్ఛెడిన్ భాసుఁడుఁ గాళిదాసు మఱి భారవి యెంచఁగఁ దెల్గువారలే!?
భాసిల దేవనాగరి విపంచికపై వినిపించె కావ్యముల్భాసుడు, గాళిదాసు మఱిభారవి; యెంచగ దెల్గువారలేవ్రాసె ప్రబంధ కావ్యములుప్రాకటి నొప్పగ సంస్కృతి ప్రభాభాసితమౌచు వర్ధిలగ వాణి సమర్చన జేసిరెందరో!
తే॥ సంస్కృతమరయకఁ దెలుఁగు సరళ మగునతెలుఁగు సంస్కృత పదములు వెలుఁగు పగిదియొకటె యనుచు నుడివిరఁట యుత్సుకతనుభాస కాళిదాసులు దెల్గు వారలె కదఉ॥ వ్రాసినఁ దెల్గు సంస్కృతము భాసిలు చుండవె యొక్క రీతిగన్వ్రాసిరి యాంధ్రమందునను వాసిగ సంస్కృత కావ్యరాజముల్వ్రాసిన కావ్యముల్ జదివి భావన మీరఁగఁ బల్కిరెల్లరున్భాసుఁడుఁ గాళిదాసు మఱి భారవి యెంచఁగఁ దెల్గు వారలేమేము BSc లో భాస విరచిత ప్రతిమా నాటకము కాళిదాసు కుమారసంభవము (6-7 సర్గలు) బాణుని కాదంబరి (Abridged version) చదువుకున్నామండి.
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
కనక దుర్గను నిత్యము గాంచుచుండికృష్ణవేణి తటి నిలిచి కృతులవ్రాయువిజయవాడలో నున్నట్టి వివిధ కవులభాస కాళిదాసులు దెల్గువారలె కద
తెలుగు కవులు రచించిరి తెలుగులోననాటకాలను హృదయాలఁ మీటునటులవేష ధారులఁ గాంచిన వేదికపయి భాస కాళిదాసులు దెల్గువారలె కద!భాసురమైనకావ్యములు ప్రస్తుతమైనవి తెల్గువారిచేకాసుల కోర్కెలేక పలు కావ్యములంగొని నాటకంబులన్వ్రాసిరి పాత్రపోషణము రంజిలజేసిన పాత్రధారులౌభాసుఁడుఁ గాళిదాసు మఱి భారవి యెంచఁగఁ దెల్గువారలే
ధన్యవాదాలు గురూజీ🙏
మూల మైనట్టి భాషగా మోహనంపుసంస్కృతo బర యగవెల్గి సౌరు మించతె ల్గు సంపన్న మై యుండ దివ్యు లైనభాస కాళి దాసులు దెల్గు వార లె గద
వేసము జూచి నీవునను వెంగలివిత్తుగ నెంచబోకు సేదోసిలిబట్టి కావ్య గుణదోషములెల్లను జుర్రుకొంటి నాభాసముగా కవిత్వమును వ్రాసిన సత్కవివర్యు లందునన్భాసుఁడుఁ గాళిదాసు మఱి భారవి యెంచఁగఁ దెల్గువారలే
మొదటిపాదం చివర టైపాటు. సే బదులు నే అని చదువగోర్తాను.
తెలుగు సాహితీ విభవము తెలుసు నాకుపద్యకవులనౌపాసన బట్టినానుభాసమానమౌ కావ్యముల్ వ్రాసినట్టిభాస కాళిదాసులు దెల్గువారలె కద
పిన్నక నాగేశ్వరరావు.హనుమకొండ. కావ్యములను రచించిన గాని సంస్కృతమున నాడు కీర్తి గడించి తనరినట్టిభాస కాళిదాసులు దెల్గువారలె గదనన్నయాది కవుల వోలె మన్ననొందె.
భాసిల దేవనాగరినివ్రాసిరి విస్తృత కావ్యరాజముల్భాసుడు, గాళిదాసు మఱిభారవి; యెంచగ దెల్గువారలేవ్రాసి ప్రబంధ కావ్యములుప్రాకటి నొప్పగ సంస్కృతి ప్రభాభాసితమౌచు వర్ధిలగ వాణి సమర్చన జేసిరెందరో!
ప్రతిమ వాసవదత్తయుపసనుజూప
రిప్లయితొలగించండిఅమరెశాకుంతలంబునునయ్యెతెలుగు
దేవభాషయుతెలుగింటతేజముడిగె
భాసకాళిదాసులుతెల్గువారలెగద
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిభావ మైనను మధురమౌ భాషనైన
రిప్లయితొలగించండిచతురు లై తెల్గు లెబలికించగలరుగద,
ఆధునిక యుగమున కవులందభినవ
భాస కాళిదాసులు దెల్గు వారలెకద.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"భాసకాళిదాసులు దెల్గు వారలె కద"
రిప్లయితొలగించండియంచు దెలియక పల్కుదు రంతె కాని
వార లిరువురు సంస్కృత భాషయందు
వాసి గాంచిన కవివరుల్ వసుధయందు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండినాటకము సూసెడు కవిమిత్రుల సంభాషణ:
రిప్లయితొలగించండితేటగీతి
"ఇంద్రలోకమున కవిసమ్మేళనమన
నాటకముగూర్చి నారలు నవ్యరీతి
పాత్రలందు సంస్కృతమును వల్లెవేయు
భాస కాళిదాసులు దెల్గువారలె కద?"
ఉత్పలమాల
"వేసవి నాటకోత్సవపు వేదికపై కవిసంగమంబునన్
భాసుర కావ్యకర్తలను బాత్రలఁ జేసిన నాటకంబునన్
వేసము లందునన్ జెలగి వేడుక జేసిన పాత్రధారులౌ
భాసుఁడుఁ గాళిదాసు మఱి భారవి యెంచఁగఁ దెల్గువారలే!"
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండివాసవదత్తగాథయటపంచెనుతెల్గునప్రేమమాధురిన్
రిప్లయితొలగించండివాసినిగాంచెవీరుడనువాదముజేసియుకాళిదాసునే
గాసినిగాంచలేదుతెలుగాయదిశంభునియర్జునిన్గనిన్
భాసుడుకాళిదాసుమఱిభారవిగాంచగతెల్గువారలే
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములండిగురువుగారు
తొలగించండిఉ.
రిప్లయితొలగించండిహాసముతోడ నాటికలు హాయిని గొల్పెడి భాస కల్పనల్
భాసిలె గాళిదాసు కవి భారవి, సంస్కృత భాషలో బుధుల్
*భాసుఁడుఁ గాళిదాసు మఱి భారవి, యెంచఁగఁ దెల్గువారలే*
ప్రాసల కట్టు, ప్రాస యతి, పద్యములందు ప్రవేశపెట్టెడిన్.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిఎన్నగను మనవారుకాకున్ననేమి
వ్యాస వాల్మీకిభారవి భానుడు మఱి
భాస కాళిదాసులు , దెల్గువారలె కద
నన్నయ తెనాలి రామకృష్ణాది కవులు.
ఆ సుర శారదాంబ చరణాంబుజముల్ విడనట్టి వారలై
భాసురమానమైన కవి పండిత శ్రేణిని యగ్ర గణ్యులై
వాసి యశస్సుగల్గి జనవంద్యులటంచు జనాళి మెచ్ఛెడిన్
భాసుఁడుఁ గాళిదాసు మఱి భారవి యెంచఁగఁ దెల్గువారలే!?
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిభాసిల దేవనాగరి వి
రిప్లయితొలగించండిపంచికపై వినిపించె కావ్యముల్
భాసుడు, గాళిదాసు మఱి
భారవి; యెంచగ దెల్గువారలే
వ్రాసె ప్రబంధ కావ్యములు
ప్రాకటి నొప్పగ సంస్కృతి ప్రభా
భాసితమౌచు వర్ధిలగ
వాణి సమర్చన జేసిరెందరో!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండితే॥ సంస్కృతమరయకఁ దెలుఁగు సరళ మగున
రిప్లయితొలగించండితెలుఁగు సంస్కృత పదములు వెలుఁగు పగిది
యొకటె యనుచు నుడివిరఁట యుత్సుకతను
భాస కాళిదాసులు దెల్గు వారలె కద
ఉ॥ వ్రాసినఁ దెల్గు సంస్కృతము భాసిలు చుండవె యొక్క రీతిగన్
వ్రాసిరి యాంధ్రమందునను వాసిగ సంస్కృత కావ్యరాజముల్
వ్రాసిన కావ్యముల్ జదివి భావన మీరఁగఁ బల్కిరెల్లరున్
భాసుఁడుఁ గాళిదాసు మఱి భారవి యెంచఁగఁ దెల్గు వారలే
మేము BSc లో భాస విరచిత ప్రతిమా నాటకము కాళిదాసు కుమారసంభవము (6-7 సర్గలు) బాణుని కాదంబరి (Abridged version) చదువుకున్నామండి.
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండికనక దుర్గను నిత్యము గాంచుచుండి
రిప్లయితొలగించండికృష్ణవేణి తటి నిలిచి కృతులవ్రాయు
విజయవాడలో నున్నట్టి వివిధ కవుల
భాస కాళిదాసులు దెల్గువారలె కద
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండితెలుగు కవులు రచించిరి తెలుగులోన
రిప్లయితొలగించండినాటకాలను హృదయాలఁ మీటునటుల
వేష ధారులఁ గాంచిన వేదికపయి
భాస కాళిదాసులు దెల్గువారలె కద!
భాసురమైనకావ్యములు ప్రస్తుతమైనవి తెల్గువారిచే
కాసుల కోర్కెలేక పలు కావ్యములంగొని నాటకంబులన్
వ్రాసిరి పాత్రపోషణము రంజిలజేసిన పాత్రధారులౌ
భాసుఁడుఁ గాళిదాసు మఱి భారవి యెంచఁగఁ దెల్గువారలే
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలు గురూజీ🙏
తొలగించండిమూల మైనట్టి భాషగా మోహనంపు
రిప్లయితొలగించండిసంస్కృతo బర యగవెల్గి సౌరు మించ
తె ల్గు సంపన్న మై యుండ దివ్యు లైన
భాస కాళి దాసులు దెల్గు వార లె గద
వేసము జూచి నీవునను వెంగలివిత్తుగ నెంచబోకు సే
రిప్లయితొలగించండిదోసిలిబట్టి కావ్య గుణదోషములెల్లను జుర్రుకొంటి నా
భాసముగా కవిత్వమును వ్రాసిన సత్కవివర్యు లందునన్
భాసుఁడుఁ గాళిదాసు మఱి భారవి యెంచఁగఁ దెల్గువారలే
మొదటిపాదం చివర టైపాటు. సే బదులు నే అని చదువగోర్తాను.
తొలగించండితెలుగు సాహితీ విభవము తెలుసు నాకు
రిప్లయితొలగించండిపద్యకవులనౌపాసన బట్టినాను
భాసమానమౌ కావ్యముల్ వ్రాసినట్టి
భాస కాళిదాసులు దెల్గువారలె కద
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హనుమకొండ.
కావ్యములను రచించిన గాని సంస్కృ
తమున నాడు కీర్తి గడించి తనరినట్టి
భాస కాళిదాసులు దెల్గువారలె గద
నన్నయాది కవుల వోలె మన్ననొందె.
భాసిల దేవనాగరిని
రిప్లయితొలగించండివ్రాసిరి విస్తృత కావ్యరాజముల్
భాసుడు, గాళిదాసు మఱి
భారవి; యెంచగ దెల్గువారలే
వ్రాసి ప్రబంధ కావ్యములు
ప్రాకటి నొప్పగ సంస్కృతి ప్రభా
భాసితమౌచు వర్ధిలగ
వాణి సమర్చన జేసిరెందరో!