19-9-2023 (మంగళవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“ముక్తికిఁ గారణము విషయభుక్తియె తలఁపన్”(లేదా...)“ముక్తికి హేతువౌ విషయభుక్తియె భూషణ మెల్లవారికిన్”(కడిమెళ్ళ వారి శతావధానంలో ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు గారి సమస్య)
భుక్తియు, వస్త్రమును, గృహమువ్యక్తికి గావలెనెపుడునుబ్రదుకుట కొరకై,శక్తికి, బాధల నుండి విముక్తికిఁ, గారణము విషయభుక్తియె తలఁపన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
సక్తతవేమనగనెనువిరక్తినిరోసియుజగతిని రాగమునంటన్శక్తినిబొందెనుశోషిలిముక్తికికారణమువిషయభుక్తియెతలపన్
శక్తికి మించిన పనులనుయుక్తిగ నెరవేర్చదగును యుక్తవయసులోవ్యక్తికి ననుభవ పాఠముముక్తికిఁ గారణము విషయభుక్తియె తలఁపన్
శక్తికి మించు యత్నములు సాధ్యపడుంగద సాధనంబునన్యుక్తిగ కార్యనిర్వహణ యోగము శక్తిని వృద్ధిసేయగావ్యక్తికి సత్త్వమౌను విషయానుభవమ్మని నమ్మకుందురేముక్తికి హేతువౌ విషయభుక్తియె భూషణ మెల్లవారికిన్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
కందముభక్తియు మానవ సేవాసక్తియు ధర్మంబు కరుణ శాంతము క్షమయున్ "ముక్తికి కారణము;విషయభుక్తియె తలపన్"వినాశ మూలంబు గదా.
ఉత్పలమాల భక్తి సుశీలమార్జవము ప్రాణులయందనుకంప నిత్యమా సక్తియు దానధర్మముల శాంతియు దాంతి క్షమాదులెల్ల స న్ముక్తికి హేతువౌ; విషయ భుక్తియె భూషణమెల్లవారికిన్ యుక్తమనంగరాదుగద యోచన సేయగ పాపహేతువౌ.
కందంసక్తత తిరుమల రాయునిరక్తిని శృంగార భక్తి రంజిలఁ గొలువన్భక్తుండన్నమయ చివరిముక్తికిఁ గారణము విషయభుక్తియె తలఁపన్ఉత్పలమాలసక్తత తిర్మలన్ వెలుగు శౌరి పరాత్పరు వేంకటేశ్వరున్రక్తిని భక్తితో మలచి రాగము లల్లుచు కీర్తనంబులన్భక్తుడు నన్నమయ్యయె వినమ్రతఁ గొల్చియు బొందినట్టిదౌముక్తికి హేతువౌ విషయభుక్తియె భూషణ మెల్లవారికిన్
🙏ధన్యోస్మి గురుదేవా!🙏
సక్తమయె నైహికములకురక్తుండై విషయవాంఛలందున తుదకున్భక్తునిగ మారిపోయెనుముక్తికిఁ గారణము విషయభుక్తియె తలఁపన్
చక్కని పూరణ. అభినందనలు.
వ్యక్తికి పరమాత్మునిపైభక్తియె, కడు దు:ఖములకు బంధంబులకున్ ముక్తికి కారణము ,విషయ భుక్తియె తలపన్ముక్తిని దూరమ్ము సేయు భువిలో సుమ్మీ
భక్తి యె మూలము గాదాముక్తికి గారణము :: విషయ భుక్తి యె తలపన్రక్తి యు నాసక్తి కలిగిశక్తి ని వ్యర్థ ము గ దు ర్వసన బానిస గున్
చివరి పాదంలో శక్తిని వృథజేసి దు ర్వసన ముల పా లౌ అని సవరణ జేయడమైనది
శక్తియు మరియును విషయాసక్తియె తోడైన చాలు సత్పురుషుని సద్యుక్తియె కారాకూర వి ముక్తికిఁ గారణము విషయభుక్తియె తలఁపన్.భుక్తియె ముఖ్యమంచు నిల మూర్ఖపు వాదస లెల్ల వీడుచున్ భక్తిగ కొల్చువారికప వర్గము దక్కును సాక్షయే కదాశక్తియుతుండు చేతనుడు స్కంభుని గూర్చెఱంగినన్ ముక్తికి హేతువౌ , విషయభుక్తియె భూషణ మెల్లవారికిన్.
కం॥ శక్తిగ భగవద్విజ్ఞతయుక్తిగఁ బడయఁగ విరియును యోగము భువిలోరక్తియు ముక్తియుఁ గలుగఁగముక్తికి కారణము విషయ భుక్తియె తలఁపన్ఉ॥ శక్తికి మీర విజ్ఞతను సాధన తోడను గూర్చుకున్నచోయుక్తిగ దైవ జ్ఞానమును యోగముఁ బొందఁగ సాధ్యమై చనున్రక్తియు ముక్తియున్ గలుగు రాజిలు చుండఁగ జ్ఞాన సంపదల్ముక్తికి హేతువౌ విషయ భుక్తియె భూషణ మెల్లవారికిన్
శక్తి లలినెంచ లేమియెభక్తులనుకొనిన విధముగ, ఫాలుని పయినన్భక్తి గనబరచు టందు విముక్తికిఁ గారణము విషయభుక్తియె తలఁపన్
రక్తియె శాశ్వతంబని తలంచుచు నెంచక భక్తి మార్గమున్సక్తతనొందె నైహికఁపు సౌఖ్యములందునొకండు మూఢుఁడైయుక్తము కాదటంచెరిగి యొక్కదినంబున మారె భక్తుఁగాముక్తికి హేతువౌ విషయభుక్తియె భూషణ మెల్లవారికిన్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
నా ప్రయత్నం ఇలా....ఉ.భుక్తి శరీరమందు నిల భోగము స్వాస్థ్యము నిద్ర నిచ్చెడిన్శక్తికి రక్తికిన్ బలము సారము కొద్దిగ పొట్ట పూజచేభక్తిని పొందు మార్గమున భక్ష్యము భోజ్యము స్వల్పమాత్రమున్*ముక్తికి హేతువౌ విషయభుక్తియె భూషణ మెల్లవారికిన్.*... డా.. అయ్యలసోమయాజుల సుబ్బారావు.
శక్తికి మించిన పనులనుయుక్తము లేకుండ చేయ నుపయోగములున్రిక్తము కనుకన్ క్లేశ విముక్తికిఁ గారణము విషయభుక్తియె తలఁపన్”
భుక్తియు, వస్త్రమును, గృహము
రిప్లయితొలగించండివ్యక్తికి గావలెనెపుడునుబ్రదుకుట కొరకై,
శక్తికి, బాధల నుండి వి
ముక్తికిఁ, గారణము విషయభుక్తియె తలఁపన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసక్తతవేమనగనెనువి
రిప్లయితొలగించండిరక్తినిరోసియుజగతిని రాగమునంటన్
శక్తినిబొందెనుశోషిలి
ముక్తికికారణమువిషయభుక్తియెతలపన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిశక్తికి మించిన పనులను
రిప్లయితొలగించండియుక్తిగ నెరవేర్చదగును యుక్తవయసులో
వ్యక్తికి ననుభవ పాఠము
ముక్తికిఁ గారణము విషయభుక్తియె తలఁపన్
శక్తికి మించు యత్నములు సాధ్యపడుంగద సాధనంబునన్
తొలగించండియుక్తిగ కార్యనిర్వహణ యోగము శక్తిని వృద్ధిసేయగా
వ్యక్తికి సత్త్వమౌను విషయానుభవమ్మని నమ్మకుందురే
ముక్తికి హేతువౌ విషయభుక్తియె భూషణ మెల్లవారికిన్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండికందము
రిప్లయితొలగించండిభక్తియు మానవ సేవా
సక్తియు ధర్మంబు కరుణ శాంతము క్షమయున్
"ముక్తికి కారణము;విషయ
భుక్తియె తలపన్"వినాశ మూలంబు గదా.
ఉత్పలమాల
తొలగించండిభక్తి సుశీలమార్జవము ప్రాణులయందనుకంప నిత్యమా
సక్తియు దానధర్మముల శాంతియు దాంతి క్షమాదులెల్ల స
న్ముక్తికి హేతువౌ; విషయ భుక్తియె భూషణమెల్లవారికిన్
యుక్తమనంగరాదుగద యోచన సేయగ పాపహేతువౌ.
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండికందం
రిప్లయితొలగించండిసక్తత తిరుమల రాయుని
రక్తిని శృంగార భక్తి రంజిలఁ గొలువన్
భక్తుండన్నమయ చివరి
ముక్తికిఁ గారణము విషయభుక్తియె తలఁపన్
ఉత్పలమాల
సక్తత తిర్మలన్ వెలుగు శౌరి పరాత్పరు వేంకటేశ్వరున్
రక్తిని భక్తితో మలచి రాగము లల్లుచు కీర్తనంబులన్
భక్తుడు నన్నమయ్యయె వినమ్రతఁ గొల్చియు బొందినట్టిదౌ
ముక్తికి హేతువౌ విషయభుక్తియె భూషణ మెల్లవారికిన్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి🙏ధన్యోస్మి గురుదేవా!🙏
తొలగించండిసక్తమయె నైహికములకు
రిప్లయితొలగించండిరక్తుండై విషయవాంఛలందున తుదకున్
భక్తునిగ మారిపోయెను
ముక్తికిఁ గారణము విషయభుక్తియె తలఁపన్
చక్కని పూరణ. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండివ్యక్తికి పరమాత్మునిపై
భక్తియె, కడు దు:ఖములకు బంధంబులకున్
ముక్తికి కారణము ,విషయ భుక్తియె తలపన్
ముక్తిని దూరమ్ము సేయు భువిలో
సుమ్మీ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిభక్తి యె మూలము గాదా
రిప్లయితొలగించండిముక్తికి గారణము :: విషయ భుక్తి యె తలపన్
రక్తి యు నాసక్తి కలిగి
శక్తి ని వ్యర్థ ము గ దు ర్వసన బానిస గున్
చివరి పాదంలో శక్తిని వృథజేసి దు ర్వసన ముల పా లౌ అని సవరణ జేయడమైనది
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిశక్తియు మరియును విషయా
రిప్లయితొలగించండిసక్తియె తోడైన చాలు సత్పురుషుని స
ద్యుక్తియె కారాకూర వి
ముక్తికిఁ గారణము విషయభుక్తియె తలఁపన్.
భుక్తియె ముఖ్యమంచు నిల మూర్ఖపు వాదస లెల్ల వీడుచున్
భక్తిగ కొల్చువారికప వర్గము దక్కును సాక్షయే కదా
శక్తియుతుండు చేతనుడు స్కంభుని గూర్చెఱంగినన్
ముక్తికి హేతువౌ , విషయభుక్తియె భూషణ మెల్లవారికిన్.
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండికం॥ శక్తిగ భగవద్విజ్ఞత
రిప్లయితొలగించండియుక్తిగఁ బడయఁగ విరియును యోగము భువిలో
రక్తియు ముక్తియుఁ గలుగఁగ
ముక్తికి కారణము విషయ భుక్తియె తలఁపన్
ఉ॥ శక్తికి మీర విజ్ఞతను సాధన తోడను గూర్చుకున్నచో
యుక్తిగ దైవ జ్ఞానమును యోగముఁ బొందఁగ సాధ్యమై చనున్
రక్తియు ముక్తియున్ గలుగు రాజిలు చుండఁగ జ్ఞాన సంపదల్
ముక్తికి హేతువౌ విషయ భుక్తియె భూషణ మెల్లవారికిన్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిశక్తి లలినెంచ లేమియె
రిప్లయితొలగించండిభక్తులనుకొనిన విధముగ, ఫాలుని పయినన్
భక్తి గనబరచు టందు వి
ముక్తికిఁ గారణము విషయభుక్తియె తలఁపన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిరక్తియె శాశ్వతంబని తలంచుచు నెంచక భక్తి మార్గమున్
రిప్లయితొలగించండిసక్తతనొందె నైహికఁపు సౌఖ్యములందునొకండు మూఢుఁడై
యుక్తము కాదటంచెరిగి యొక్కదినంబున మారె భక్తుఁగా
ముక్తికి హేతువౌ విషయభుక్తియె భూషణ మెల్లవారికిన్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండినా ప్రయత్నం ఇలా....
రిప్లయితొలగించండిఉ.
భుక్తి శరీరమందు నిల భోగము స్వాస్థ్యము నిద్ర నిచ్చెడిన్
శక్తికి రక్తికిన్ బలము సారము కొద్దిగ పొట్ట పూజచే
భక్తిని పొందు మార్గమున భక్ష్యము భోజ్యము స్వల్పమాత్రమున్
*ముక్తికి హేతువౌ విషయభుక్తియె భూషణ మెల్లవారికిన్.*
... డా.. అయ్యలసోమయాజుల సుబ్బారావు.
శక్తికి మించిన పనులను
రిప్లయితొలగించండియుక్తము లేకుండ చేయ నుపయోగములున్
రిక్తము కనుకన్ క్లేశ వి
ముక్తికిఁ గారణము విషయభుక్తియె తలఁపన్”