25, సెప్టెంబర్ 2023, సోమవారం

సమస్య - 4542

26-9-2023 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ద్వైతము విడక చేసె నద్వైతబోధ”
(లేదా...)
“ద్వైతభ్రాంతి నివృత్తి యెందుకొఱ కద్వైతమ్ము బోధింపఁగన్”

35 కామెంట్‌లు:

  1. తపము జేయుచుండె ముని ద్వైత వనమందు,
    కోరి వచ్చిన వారలకు తగు బోధ
    జేసె, రాజు రమ్మని బిలిచినను బోక
    ద్వైతము విడక చేసె నద్వైతబోధ.

    రిప్లయితొలగించండి
  2. లౌక్యమెంచినసంస్కర్తలోలబుద్ధి
    సామ్యవాదమునెంచియుసంఘమందు
    ఆస్తిపరుడునునయ్యెగానవనియందు
    ద్వైతమందునజేసెనద్వైతబోధ

    రిప్లయితొలగించండి
  3. ద్వైత మద్వ బోధకులలో తరతరాల
    నుండి వాగ్వివాదము జర్గుచుండె గాని
    సత్యమేదోయొరుగక యసత్యమేదొ
    ద్వైతము విడక చేసె నద్వైతబోధ






    రిప్లయితొలగించండి
  4. తత్వచింతనమందున తానుమునిగి
    ధర్మ భావవిధులనుసంధానపడగ
    నాదిశంకరాచార్యులు ప్రోదిచేసె
    ద్వైతము విడక చేసె నద్వైతబోధ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వైతత్యంబుగ లభ్యమైన తలపుల్ వాగ్ధాటితోకూడగా
      చైతన్యంబలరారుచుండు నెపుడున్ సంపూర్ణమౌ చింతనా
      ద్వైతమ్మున్ గని మేళవించి మనమున్ దైవంబుపైచేర్చగా
      ద్వైతభ్రాంతి నివృత్తి యెందుకొఱ కద్వైతమ్ము బోధింపఁగన్

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  5. ఏవి షయమందున నయిన నెంచి జూడ
    సంఘమందున ద్వైతము సహజమేను
    ఛాత్రునికి దనకు నడుమ జ్ఞానమందు
    ద్వైతము విడక చేసె నద్వైతబోధ

    రిప్లయితొలగించండి
  6. తెలిపె రామానుజా చారి తిరము గాను
    ద్వై త ము :విడక న ద్వై త బోధ
    శంక రా చార్యులు భువిని చాటె నదియ
    మంచి తత్త్వమటంచు ను మానవులకు

    రిప్లయితొలగించండి
  7. వైష్ణవ మదియే గోప్పను వారొకండ్రు
    కాదు శైవమే ఘనమంచు వాదు లాడు
    పాళమున శంకరార్యులు వలదటంచు
    ద్వైతము , విడక చేసె నద్వైతబోధ.



    చైతన్యమ్మది శూన్యమై జనులు హింసా మార్గమున్ పట్టుచున్
    జాతిన్ ముక్కలు జేయ వైష్ణవమనిన్ శైవమ్ము
    గా ద్రుంచెడిన్
    ద్వైతమ్మున్ గని శంకరార్యులట యుక్తంబంచు తాజేసెనే
    ద్వైతభ్రాంతి నివృత్తి , యెందుకొఱ కద్వైతమ్ము బోధింపఁగన్.

    రిప్లయితొలగించండి
  8. తే॥ ద్వైతముఁ దెలుపు స్థిరమ్ము దైవ మనుచు
    ముక్తినిఁ బడయు దైవాను రక్తియనుచుఁ
    దరచి చూడ నద్వైతముఁ దలఁపు నిదియె
    ద్వైతము విడుక చేసె నద్వైత బోధ


    శా॥ ద్వైతారాధన భక్తి తత్పరతతో దాసాను దాసాగ్రులై
    ప్రాతఃకాలము నండి సంధ్య వరకున్ బ్రార్థించి కీర్తించఁగన్
    దాతైమోక్షమొసంగు దైవమని సంధానించఁగన్ దెల్పుమా
    ద్వైత భ్రాంతి నివృత్తి యెందు కొఱ కద్వైతము బోధింపఁగన్

    (ముక్తి వరకు ద్వైత అద్వైత విశిష్టాద్వైత భావ మొకటే నండి., కాకపోతే తరువాత ఆత్మల గురించే పేచీ. ముఖ్యంగా మోక్షార్హము గాని ఆత్మతో మరీ పేచీ. ద్వైత భావములో దాసోహానికి పెద్ద పీట.)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
      తేటగీతి మొదటి పాదంలో గణభంగం. "ద్వైతముం దెలుపు స్థిరమ్ము..." అనండి.

      తొలగించండి
    2. కడుంగడు ధన్యవాదములండి. నాకెందుకో తట్టనేలేదు

      తొలగించండి
  9. లూతే పూజలు సేయగన్నలుగుచున్ రువ్వంగ సారంగము
    న్నేతున్మామ్పె మదావలంబు గరిమన్నేకంబుగా పూజ జే
    సెన్ తత్వంబలరంగ ముక్తిగొనగన్ శ్రీ కాళహస్తీశులో
    ద్వైతభ్రాంతి నివృత్తి యెందుకొఱ కద్వైతమ్ము బోధింపగన్

    సారంగము = సర్పము
    మదావలము = ఏనుగు
    ఏతు = గర్వము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదం అర్థం కాలేదు. మూడవ పాదంలో ప్రాస తప్పింది. సవరించండి.

      తొలగించండి
  10. ఒకటి జీవాత్మ పరమాత్మలొకటె యనును
    రెండు వేరని వాదించు నొండు మతము
    దైవమును జేరనివి రెండు దారులనుచు
    ద్వైతము విడక చేసె నద్వైతబోధ

    రిప్లయితొలగించండి
  11. ద్వైతమ్మే సరియైన మార్గము గనన్ దైవమ్మునుంజేర న
    ద్వైతమ్మే యసలైన దారియనుచున్ వాదోప వాదమ్ములన్
    చేతోజాతముగా నొనర్చ తగవా చింతించ వేదాంతికిన్
    ద్వైతభ్రాంతి నివృత్తి యెందుకొఱ కద్వైతమ్ము బోధింపఁగన్

    రిప్లయితొలగించండి
  12. తేటగీతి
    ఒకటె జీవాత్మ పరమాత్మలునికిననెడు
    సత్యమెఱిగింపగా నాది శంకరుండు
    చేర్చినారయ వేరను శిష్యులుండ
    ద్వైతము విడక, చేసె నద్వైతబోధ

    శార్దూలవిక్రీడితము
    ద్వైతమ్మై పరమాత్మఁ జేరుకొన జీవాత్ముండు సేవించెడున్
    బ్రీతిన్ భక్తిగనంచు శిష్యులిలలో విశ్వాసమున్ గల్గగన్
    వ్రాతల్ నేర్చిన నాది శంకరులు నవ్వారొందఁ గల్పించెడున్
    ద్వైతభ్రాంతి నివృత్తి యెందుకొఱ కద్వైతమ్ము బోధింపఁగన్

    రిప్లయితొలగించండి
  13. శా.

    ద్వైతంబండము మూత్ర మార్గములు స్త్రీ దైవంబు దేహంబునన్
    రేతమ్మున్ నర మూత్ర మేక బిలమున్ రేగంగ నద్వైతమే
    నీతంబౌ నిది వెజ్జు తెల్పు పలుకుల్ నిత్యంబు శాస్త్రోక్తమే
    *ద్వైతభ్రాంతి నివృత్తి యెందుకొఱ కద్వైతమ్ము బోధింపఁగన్.*

    రిప్లయితొలగించండి
  14. శ్రోతల్గాగనువేదమున్జనులుతాశుశ్రూషన్తలంపన్పరున్
    చైతన్యకృతిజీవముల్నిలుపుచున్ఛేదింపమూల్యంబునే
    పాతంబందకమానసంబునహహాపారంబునంటున్గదా
    ద్వైతభ్రాంతినివృత్తియెందుకొఱకద్వైతమ్ముబోధింపగన్

    రిప్లయితొలగించండి

  15. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    శివుడు గొప్ప వాడనుచును చెప్పు నొకరు
    వైష్ణవ మతమె గొప్పని పల్కు నొకరు
    సమమె యన్ని మతములని శంకరుండు
    ద్వైతము విడక చేసె నద్వైత బోధ.

    రిప్లయితొలగించండి