8-10-2023 (ఆదివారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“దుస్ససేను భీముఁడు గని తొలఁగె నడలి”(లేదా...)“తొలఁగెన్ భీముఁడు భీతితో రణమునన్ దుశ్శాసనున్ గాంచుచున్”
తేటగీతిఱొమ్ము జీల్చివైచియు రుధిరమ్ము గుడుతునను ప్రతిజ్ఞఁ జేసియుఁ గదనమ్ము నందుచండ కోపమ్మునన్ జేయి సాచి చేరదుస్ససేను భీముడు, గని తొలఁగె నడలి
మత్తేభవిక్రీడితముపిలువన్ మేలన పండితున్ వినక నీ పిండమ్ము కాకుల్ దినా!పలుకన్ లేడను వానిఁ బిల్చి దసరా పర్వమ్ము సాగింతువే? యలఘుల్ ప్రేక్షకులై వినన్ ప్రవచనంబందించె! నే గాథలోతొలఁగెన్ భీముఁడు భీతితో రణమునన్ దుశ్శాసనున్ గాంచుచున్?
ప్రతిన నెరవేర్చె భీముడు పాపి నణచి,వేచియున్న ద్రౌపది నవ్వె వికట రీతి,నెత్తురంటించె కురులకు, రక్త సిక్తదుస్ససేను భీముఁడు గని తొలఁగె నడలి.
ప్రతిన నెరవేర్చ నని లోన పంత మూనిరుధిర మును గ్రోల నెంచెను రొమ్ము జీల్చిదుస్స సేను భీముడు గని ::తొలగె నడలికాంచి భీముని రౌ ద్ర మ్ము కయ్య మందు
ద్రౌపతివలువ లూడ్చిన దారుణంపువేగలముహెచ్చి కడదేర్చ విగతమైనదుస్ససేను భీముఁడు గని తొలఁగె నడలిసైన్య మంతయు నటనుండి సంకటపడి
బలవంతుండగు భీముడే కఠినుడై పాషాణ చిత్తంబుతోనిలిచెన్, గౌరవ నందనుండు వడిగా నిస్త్రాణువై చావగాతొలఁగెన్ భీముఁడు, భీతితో రణమునన్ దుశ్శాసనున్ గాంచుచున్దొలఁగెన్ సైన్యము సర్వమున్ రయమునన్ దూరంబుగా గుంపులై
తే॥ సమయము కొరకు చూచుచు సాఁగు చుండదుస్ససేను భీముఁడు గని తొలగె నడలితొలుత ననుజుల నితరులఁ దొలఁగఁ జేసిపిదప దుశ్శాసనుండను పిలుకుమార్చమ॥ వలదీ నాఁడునె దుస్ససేనుఁడను జంపంగాను బోరాటమున్దొలుతన్ జేతును గౌరవాధముల యుద్ధోన్మాదమున్ రేఁచినన్బలగమ్మంతటినీ వధించెదననిన్ పంతమ్ముతో సంయతిన్ తొలఁగెన్ భీముఁడు భీతితో రణమునన్ దుశ్శాసనున్ గాంచుచున్పిలుకుమార్చు చంపు (నిఘంటువు సహాయమండి)దుశ్శాసుని నెమ్మదిగా (16వ రోజు కదండీ) చంపుదాము. అంతలోపు మిగతా సోదరులను కౌరవవీరులను చంపవచ్చు ననండి
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
మరొక పూరణమ॥ సలుపన్ యుద్ధము చుట్టుముట్ట ననుజున్ సైన్యమ్ముతోఁ గౌరవుల్గాలునిన్ వోలెను శత్రు సైన్యమును సంగ్రామమ్మునన్ ద్రుంచఁగన్బలమున్ జూపుచుఁ జెండుచున్ రిపుల సంభాలించఁగన్ దమ్మునిన్తొలఁగెన్ భీముఁడు భీతితో రణమునన్ దుశ్శాసనున్ గాంచుచున్
ద్రోవదినవమా నించిన దుష్టుఁ జంపిరొమ్ము రుధిరమ్ము ననియందు గ్రోలు ప్రతినదీర్చుకొనవచ్చినాడని తెలిసి పారుదుస్ససేను భీముఁడు గని తొలఁగె నడలి
అలనాడాకురు సార్వభౌము సభలో నత్యంత హేయంబుగావలువల్నూడ్చియు కేశపాశములఁ చేబట్టంగ పాంచాలికిన్వడితాఁ జేసిన భీకరప్రతిన నిర్వర్తించ నుగ్రాత్ముఁడైతొలఁగెన్ భీముఁడు, భీతితో రణమునన్ దుశ్శాసనున్ గాంచుచున్
ఆలిని సభకీడ్చుకు వచ్చెననుచు కెరలిరొమ్ము చీల్చుచు త్రాగెద రుధిరమనెనుదుస్ససేను భీముఁడు గని ; తొలఁగె నడలియా దురాత్ముడు వెంటనె వామెను విడి
పిన్నక నాగేశ్వరరావు.హనుమకొండ. (క్రమాలంకారము)ద్రోవది వలువ లూడ్చిన దుష్టుడెవరు?కీచకాదుల నెవ్వరు పీచమడచె?చూడ బంధువుల్ కనిపించు చుండిరంతయనుచు నేమి చేసె ననిని యర్జునుండు?దుస్ససేనుఁ;భీముడు; గని దొలగె నడలి.
ద్రోవదివలువలూడ్చినదుష్టుడనగకీచకబకాసురాదులపీచమడచెచంపలేనుబంధువులనంచర్జునుండు*దుస్ససేను భీముఁడు గని తొలఁగె నడలి”*
తేటగీతి
రిప్లయితొలగించండిఱొమ్ము జీల్చివైచియు రుధిరమ్ము గుడుతు
నను ప్రతిజ్ఞఁ జేసియుఁ గదనమ్ము నందు
చండ కోపమ్మునన్ జేయి సాచి చేర
దుస్ససేను భీముడు, గని తొలఁగె నడలి
మత్తేభవిక్రీడితము
తొలగించండిపిలువన్ మేలన పండితున్ వినక నీ పిండమ్ము కాకుల్ దినా!
పలుకన్ లేడను వానిఁ బిల్చి దసరా పర్వమ్ము సాగింతువే?
యలఘుల్ ప్రేక్షకులై వినన్ ప్రవచనంబందించె! నే గాథలో
తొలఁగెన్ భీముఁడు భీతితో రణమునన్ దుశ్శాసనున్ గాంచుచున్?
ప్రతిన నెరవేర్చె భీముడు పాపి నణచి,
రిప్లయితొలగించండివేచియున్న ద్రౌపది నవ్వె వికట రీతి,
నెత్తురంటించె కురులకు, రక్త సిక్త
దుస్ససేను భీముఁడు గని తొలఁగె నడలి.
ప్రతిన నెరవేర్చ నని లోన పంత మూని
రిప్లయితొలగించండిరుధిర మును గ్రోల నెంచెను రొమ్ము జీల్చి
దుస్స సేను భీముడు గని ::తొలగె నడలి
కాంచి భీముని రౌ ద్ర మ్ము కయ్య మందు
ద్రౌపతివలువ లూడ్చిన దారుణంపు
రిప్లయితొలగించండివేగలముహెచ్చి కడదేర్చ విగతమైన
దుస్ససేను భీముఁడు గని తొలఁగె నడలి
సైన్య మంతయు నటనుండి సంకటపడి
బలవంతుండగు భీముడే కఠినుడై పాషాణ చిత్తంబుతో
తొలగించండినిలిచెన్, గౌరవ నందనుండు వడిగా నిస్త్రాణువై చావగా
తొలఁగెన్ భీముఁడు, భీతితో రణమునన్ దుశ్శాసనున్ గాంచుచున్
దొలఁగెన్ సైన్యము సర్వమున్ రయమునన్ దూరంబుగా గుంపులై
తే॥ సమయము కొరకు చూచుచు సాఁగు చుండ
రిప్లయితొలగించండిదుస్ససేను భీముఁడు గని తొలగె నడలి
తొలుత ననుజుల నితరులఁ దొలఁగఁ జేసి
పిదప దుశ్శాసనుండను పిలుకుమార్చ
మ॥ వలదీ నాఁడునె దుస్ససేనుఁడను జంపంగాను బోరాటమున్
దొలుతన్ జేతును గౌరవాధముల యుద్ధోన్మాదమున్ రేఁచినన్
బలగమ్మంతటినీ వధించెదననిన్ పంతమ్ముతో సంయతిన్
తొలఁగెన్ భీముఁడు భీతితో రణమునన్ దుశ్శాసనున్ గాంచుచున్
పిలుకుమార్చు చంపు (నిఘంటువు సహాయమండి)
దుశ్శాసుని నెమ్మదిగా (16వ రోజు కదండీ) చంపుదాము. అంతలోపు మిగతా సోదరులను కౌరవవీరులను చంపవచ్చు ననండి
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిమరొక పూరణ
తొలగించండిమ॥ సలుపన్ యుద్ధము చుట్టుముట్ట ననుజున్ సైన్యమ్ముతోఁ గౌరవుల్
గాలునిన్ వోలెను శత్రు సైన్యమును సంగ్రామమ్మునన్ ద్రుంచఁగన్
బలమున్ జూపుచుఁ జెండుచున్ రిపుల సంభాలించఁగన్ దమ్మునిన్
తొలఁగెన్ భీముఁడు భీతితో రణమునన్ దుశ్శాసనున్ గాంచుచున్
ద్రోవదినవమా నించిన దుష్టుఁ జంపి
రిప్లయితొలగించండిరొమ్ము రుధిరమ్ము ననియందు గ్రోలు ప్రతిన
దీర్చుకొనవచ్చినాడని తెలిసి పారు
దుస్ససేను భీముఁడు గని తొలఁగె నడలి
అలనాడాకురు సార్వభౌము సభలో నత్యంత హేయంబుగా
రిప్లయితొలగించండివలువల్నూడ్చియు కేశపాశములఁ చేబట్టంగ పాంచాలికిన్
వడితాఁ జేసిన భీకరప్రతిన నిర్వర్తించ నుగ్రాత్ముఁడై
తొలఁగెన్ భీముఁడు, భీతితో రణమునన్ దుశ్శాసనున్ గాంచుచున్
ఆలిని సభకీడ్చుకు వచ్చెననుచు కెరలి
రిప్లయితొలగించండిరొమ్ము చీల్చుచు త్రాగెద రుధిరమనెను
దుస్ససేను భీముఁడు గని ; తొలఁగె నడలి
యా దురాత్ముడు వెంటనె వామెను విడి
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హనుమకొండ.
(క్రమాలంకారము)
ద్రోవది వలువ లూడ్చిన దుష్టుడెవరు?
కీచకాదుల నెవ్వరు పీచమడచె?
చూడ బంధువుల్ కనిపించు చుండిరంత
యనుచు నేమి చేసె ననిని యర్జునుండు?
దుస్ససేనుఁ;భీముడు; గని దొలగె నడలి.
ద్రోవదివలువలూడ్చినదుష్టుడనగ
రిప్లయితొలగించండికీచకబకాసురాదులపీచమడచె
చంపలేనుబంధువులనంచర్జునుండు
*దుస్ససేను భీముఁడు గని తొలఁగె నడలి”*