18-10-2023 (బుధవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“కష్టమూలమ్ము గాదె రాఘవుని పూజ”(లేదా...)“మూలం బయ్యెను గష్టసంతతికి రామున్ నమ్మి పూజించుటే”
తనకు మాలిన ధర్మము, దాన గుణము,అమిత మగుభక్తి తోడప రమని రతినిగల్గి, యిల్లుప ట్టకయున్న, కడకు తనకుకష్టమూలమ్ము గాదె రాఘవుని పూజ.
ఇంతిని వనములకు పంపి యిడుముల నిడెననుచు జనులందరు దలచి నట్టివేళనీవతని మెచ్చి స్తోత్రము నెరప జూడగష్టమూలమ్ము గాదె రాఘవుని పూజ
సంకటములులేక బ్రతుకు సాగునాడుదలపడెప్పుడు దేవుని, వదలకుండదలచుగష్టముల్ వచ్చిన దప్పకుండ కష్టమూలమ్ముగాదె రాఘవుని పూజ.
అదను నందున వర్షపు పదునులేకపంట లెండియు కర్షకుల్ బాధ పడగకష్ట కాలమ్ము గాదె :: రాఘవుని పూజసలుపు వారికి నొన గూడు శాంతి సుఖము
కష్టములన వెరపులేక కారడవులకేగి దేవేరి దూరము కాగ తానుకష్టములపాల్పడెనుగద కపిరథుండుకష్టమూలమ్ము గాదె రాఘవుని పూజమూలము = నాశము
మూలం బయ్యెను దుష్టరావణుడు తాఁమోసంబుతో క్షోభకున్కాలాతీతము కాగ గాడ్పుకొడుకే కాన్పించెగా భృత్యుడైమేలే జక్కొనగా జనుల్ రఘుపతిన్ మేయింతురే ఖేద నిర్మూలం బయ్యెను గష్టసంతతికి రామున్ నమ్మి పూజించుటే
పాపకూపమ్ము లీ భవ బంధములనివిబుధు లాడిన మాటలన్ విశ్వసించియిలను జరిపించి నంతట తొలుగు నంద్రుకష్టమూలమ్ము గాదె , రాఘవుని పూజ.*( కంచర్ల గోపన్న తో అక్కన్న మాదన్నలు అన్నట్లుగా నూహించి........)*ఆలోచింపక పూనుకుంటివి గదా యచ్చోట నామందిరమ్మేలన్ గట్టగ సాహసించితివొ నీకెవ్వాడు వాచించెనో హ్వాలమ్మందున బంధిఖాన గతియై యాపత్తులో చిక్కగా మూలం బయ్యెను గష్టసంతతికి రామున్ నమ్మి పూజించుటే.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తే॥ రాముఁడు సకల సద్గుణ ధాముఁడు సుజనులకు వరదుఁడు దుష్టులను దునుము హరిదుష్ట కార్యములకుఁ బూను దురితులకిలఁగష్టమూలమ్ము గాదె రాఘవుని పూజశా॥ మూలంబయ్యెను గష్టసంతతికి రామున్ నమ్మి పూజించుటేయేలాయీ యపవాదు రామ పదమే యేనాటికిన్ మంత్రమే!మేలే గాంచును రామనామము నిటుల్ మిథ్యన్ గనన్ దప్పుగున్జాలా పాపముఁ జేయు దుష్టులకిలన్ సంతాప మిచ్చున్ గదా
శార్దూలము రెండవ పాదములో రామపదమే ని రామపదమౌ అని సవరించానండి
శార్దూలము 3వ పాదము చివర దప్పగున్ పొరపాటున దప్పుగున్ యైనదండి
సవరించిన పద్యముశా॥ మూలంబయ్యెను గష్టసంతతికి రామున్ నమ్మి పూజించుటేయేలాయీ యపవాదు రామ పదమౌ యేనాటికిన్ మంత్రమే!మేలే గాంచును రామనామము నిటుల్ మిథ్యన్ గనన్ దప్పగున్జాలా పాపముఁ జేయు దుష్టులకిలన్ సంతాప మిచ్చున్ గదా
తే.గీ.॥భక్తిభావము పెనఁగొన భద్రగిరినిరామునర్చించి భక్తుఁడు రామదాసు బందిఖానలోనిడుమల బడెను నాడు“కష్టమూలమ్ము గాదె రాఘవుని పూజ”శార్దూలవిక్రీడితము:కాలంపుంగతియందు మర్త్యతతికిన్ కష్టంబులున్ సౌఖ్యముల్లీలన్ గూర్చుచునుండు దైవము సదా రేయింబవల్ పోలికన్మేలౌ రాముని నామసంస్మరణ మున్మేషంబగున్, యెవ్విధిన్మూలం బయ్యెను గష్టసంతతికి రామున్ నమ్మి పూజించుటే
తేటగీతిరామ పట్టాభిషేకమ్ము రమణుఁడెంచదాసి పర్యవసానమ్ము దగులఁ జెప్పభరతుఁగన్న తల్లి రగిలి పంతమూనకష్టమూలమ్ము గాదె రాఘవుని పూజశార్దూలవిక్రీడితమువేళాకోళము గాదె! నీ బ్రతుకు గావింపంగ శ్రీరామునిన్భూలోకమ్మున రాజుగన్ ,భరతుడే మున్ముందు భృత్యుండు నీవాలోచింపుమటన్న మంధర విధేయంబొప్పఁ గైకమ్మకున్మూలం బయ్యెను గష్టసంతతికి రామున్ నమ్మి పూజించుటే!
కష్టమూలమ్ము గాదె రాఘవుని పూజ”తప్పు పైమాట పొరపాటు తగదుతగదుశ్రేష్ట మౌగద శ్రీరామ సేవచేయశుభము రామనామజపము శుభము శుభముదొడ్డ భక్తితో చేయగ తొలగిపోవుకష్టమూలమ్ము గాదె ! రాఘవుని పూజసర్వహితమును కూర్చును సకలజయమురామ నామంబు జపియింప రావు వెతలు
దైవమునునిరసించుటతగదదెపుడుకష్టమూలమ్ముగాదె,రాఘవునిపూజ చిత్తశుద్ధిని చూపుచుచేయుచున్నకరుణ చూపికాపాడును కరమువిడక
తనకు మాలిన ధర్మము, దాన గుణము,
రిప్లయితొలగించండిఅమిత మగుభక్తి తోడప రమని రతిని
గల్గి, యిల్లుప ట్టకయున్న, కడకు తనకు
కష్టమూలమ్ము గాదె రాఘవుని పూజ.
ఇంతిని వనములకు పంపి యిడుముల నిడె
రిప్లయితొలగించండిననుచు జనులందరు దలచి నట్టివేళ
నీవతని మెచ్చి స్తోత్రము నెరప జూడ
గష్టమూలమ్ము గాదె రాఘవుని పూజ
సంకటములులేక బ్రతుకు సాగునాడు
రిప్లయితొలగించండిదలపడెప్పుడు దేవుని, వదలకుండ
దలచుగష్టముల్ వచ్చిన దప్పకుండ
కష్టమూలమ్ముగాదె రాఘవుని పూజ.
అదను నందున వర్షపు పదునులేక
రిప్లయితొలగించండిపంట లెండియు కర్షకుల్ బాధ పడగ
కష్ట కాలమ్ము గాదె :: రాఘవుని పూజ
సలుపు వారికి నొన గూడు శాంతి సుఖము
కష్టములన వెరపులేక కారడవుల
రిప్లయితొలగించండికేగి దేవేరి దూరము కాగ తాను
కష్టములపాల్పడెనుగద కపిరథుండు
కష్టమూలమ్ము గాదె రాఘవుని పూజ
మూలము = నాశము
మూలం బయ్యెను దుష్టరావణుడు తాఁమోసంబుతో క్షోభకున్
తొలగించండికాలాతీతము కాగ గాడ్పుకొడుకే కాన్పించెగా భృత్యుడై
మేలే జక్కొనగా జనుల్ రఘుపతిన్ మేయింతురే ఖేద ని
ర్మూలం బయ్యెను గష్టసంతతికి రామున్ నమ్మి పూజించుటే
పాపకూపమ్ము లీ భవ బంధములని
రిప్లయితొలగించండివిబుధు లాడిన మాటలన్ విశ్వసించి
యిలను జరిపించి నంతట తొలుగు నంద్రు
కష్టమూలమ్ము గాదె , రాఘవుని పూజ.
*( కంచర్ల గోపన్న తో అక్కన్న మాదన్నలు అన్నట్లుగా నూహించి........)*
ఆలోచింపక పూనుకుంటివి గదా యచ్చోట నామందిర
మ్మేలన్ గట్టగ సాహసించితివొ నీకెవ్వాడు వాచించెనో
హ్వాలమ్మందున బంధిఖాన గతియై యాపత్తులో చిక్కగా
మూలం బయ్యెను గష్టసంతతికి రామున్ నమ్మి పూజించుటే.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితే॥ రాముఁడు సకల సద్గుణ ధాముఁడు సుజ
రిప్లయితొలగించండినులకు వరదుఁడు దుష్టులను దునుము హరి
దుష్ట కార్యములకుఁ బూను దురితులకిలఁ
గష్టమూలమ్ము గాదె రాఘవుని పూజ
శా॥ మూలంబయ్యెను గష్టసంతతికి రామున్ నమ్మి పూజించుటే
యేలాయీ యపవాదు రామ పదమే యేనాటికిన్ మంత్రమే!
మేలే గాంచును రామనామము నిటుల్ మిథ్యన్ గనన్ దప్పుగున్
జాలా పాపముఁ జేయు దుష్టులకిలన్ సంతాప మిచ్చున్ గదా
శార్దూలము రెండవ పాదములో రామపదమే ని రామపదమౌ అని సవరించానండి
తొలగించండిశార్దూలము 3వ పాదము చివర దప్పగున్ పొరపాటున దప్పుగున్ యైనదండి
తొలగించండిసవరించిన పద్యము
తొలగించండిశా॥ మూలంబయ్యెను గష్టసంతతికి రామున్ నమ్మి పూజించుటే
యేలాయీ యపవాదు రామ పదమౌ యేనాటికిన్ మంత్రమే!
మేలే గాంచును రామనామము నిటుల్ మిథ్యన్ గనన్ దప్పగున్
జాలా పాపముఁ జేయు దుష్టులకిలన్ సంతాప మిచ్చున్ గదా
తే.గీ.॥
రిప్లయితొలగించండిభక్తిభావము పెనఁగొన భద్రగిరిని
రామునర్చించి భక్తుఁడు రామదాసు
బందిఖానలోనిడుమల బడెను నాడు
“కష్టమూలమ్ము గాదె రాఘవుని పూజ”
శార్దూలవిక్రీడితము:
కాలంపుంగతియందు మర్త్యతతికిన్ కష్టంబులున్ సౌఖ్యముల్
లీలన్ గూర్చుచునుండు దైవము సదా రేయింబవల్ పోలికన్
మేలౌ రాముని నామసంస్మరణ మున్మేషంబగున్, యెవ్విధిన్
మూలం బయ్యెను గష్టసంతతికి రామున్ నమ్మి పూజించుటే
తేటగీతి
రిప్లయితొలగించండిరామ పట్టాభిషేకమ్ము రమణుఁడెంచ
దాసి పర్యవసానమ్ము దగులఁ జెప్ప
భరతుఁగన్న తల్లి రగిలి పంతమూన
కష్టమూలమ్ము గాదె రాఘవుని పూజ
శార్దూలవిక్రీడితము
వేళాకోళము గాదె! నీ బ్రతుకు గావింపంగ శ్రీరామునిన్
భూలోకమ్మున రాజుగన్ ,భరతుడే మున్ముందు భృత్యుండు నీ
వాలోచింపుమటన్న మంధర విధేయంబొప్పఁ గైకమ్మకున్
మూలం బయ్యెను గష్టసంతతికి రామున్ నమ్మి పూజించుటే!
కష్టమూలమ్ము గాదె రాఘవుని పూజ”
రిప్లయితొలగించండితప్పు పైమాట పొరపాటు తగదుతగదు
శ్రేష్ట మౌగద శ్రీరామ సేవచేయ
శుభము రామనామజపము శుభము శుభము
దొడ్డ భక్తితో చేయగ తొలగిపోవు
కష్టమూలమ్ము గాదె ! రాఘవుని పూజ
సర్వహితమును కూర్చును సకలజయము
రామ నామంబు జపియింప రావు వెతలు
దైవమునునిరసించుటతగదదెపుడు
రిప్లయితొలగించండికష్టమూలమ్ముగాదె,రాఘవునిపూజ
చిత్తశుద్ధిని చూపుచుచేయుచున్న
కరుణ చూపికాపాడును కరమువిడక