19, జనవరి 2024, శుక్రవారం

సమస్య - 4650

20-1-2024 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పీనుఁగును రమించి కాంత పిల్లలనుఁ గనెన్”
(లేదా...)
“పీనుఁగునున్ రమించి యలివేణి యొకర్తుక పిల్లలన్ గనెన్”

35 కామెంట్‌లు:

  1. కందం
    ఏనుగువలె తినుచుండియు
    బీనుగువలె నుంటివనుచు వెటకారములన్
    గానెడు వారికి వింతగఁ
    బీనుగును రమించి కాంత పిల్లలనుఁ గనెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉత్పలమాల
      ఏనుగు రీతిగన్ దినుచు నెంతయొ పీలగ నుండు వాడనన్
      బీనుగటంచు స్నేహితులు బిల్వగ నవ్వుచు వెక్కిరింతలన్
      వానికి తక్కువేమిటని పంతము తోడను బెళ్లిఁజేయగన్
      బీనుఁగునున్ రమించి యలివేణి యొకర్తుక పిల్లలన్ గనెన్

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి

      తొలగించండి
  2. మా నుగసంతానమునకు
    కానగనాధునికరీతికాంతయుతానే
    పూనికభర్తయులేకను
    పీనుగునురమించికాంతపిల్లలనుగనెన్

    రిప్లయితొలగించండి
  3. కానడుకాంతమోమునట గాఢమునౌసిరమత్తునీయగా
    తానుగజీవహీనుడుగ దారుణమౌస్థితియందునుండగా
    మానిసిజచ్చెనాయనుచుమందునిగూడెను నిస్సహాయగా

    పీనుగునున్రమించియలివేణియొకర్తుక పిల్లలన్గనెన్

    రిప్లయితొలగించండి
  4. దానము సేయగ నెరుగని
    మానవు ధనమెల్లగాంచి మక్కువ తోడన్
    తానును దినకను జిక్కిన
    పీనుగును రమించి కాంత పిల్లలనుఁ గనెన్

    రిప్లయితొలగించండి

  5. మానక యోగా చేయుచు
    పీనుగులా మారితివను భీరువు తో నా
    జ్ఞానియె నవ్వుచు ననె యీ
    పీనుఁగును రమించి కాంత పిల్లలనుఁ గనెన్.


    ఏనుగులాంటి దేహమని హేళన సేయగ లోకులెల్లరున్
    బోనము మానె నందులకు పుద్గలమే కృశియించి నంతటన్
    బీనుగు పీనుగంచు సతి వెంగము లాడగ పల్కె నాతడీ
    పీనుఁగునున్ రమించి యలివేణి యొకర్తుక పిల్లలన్ గనెన్.

    రిప్లయితొలగించండి
  6. రాణగ పాడెకు గట్టిరి
    పీనుఁగును ; రమించి కాంత పిల్లలనుఁ గనెన్
    ప్రాణేశుని కోరికపై ,
    మానము చూపించదామె మగనిపయి యిలన్

    రిప్లయితొలగించండి
  7. మానినికాలస్యముగా
    మానస చోరుని వివరము మఱిమఱి తెలిసెన్
    దానసమర్థుడనుచు మను
    పీనుఁగును రమించి కాంత పిల్లలనుఁ గనెన్

    పీనుఁగు వాడటంచు మనుపీనుఁగు నిర్ధనుడంచు గేలిగా
    వానిని పీనుఁగందురట బంధువు లందరు మారుపేరుతో
    పీనుఁగుఁ బోలురూపమొక వెఱ్ఱికి నచ్చగ పెండ్లి చేయ నా
    పీనుఁగునున్ రమించి యలివేణి యొకర్తుక పిల్లలన్ గనెన్

    రిప్లయితొలగించండి
  8. నానీ ! ఏమి గని భయము ?
    మోనిక యెటుల మనువాడె మోహనుని ? సుధా
    రాణీ ! పెండిలి పిదపన్ ?
    పీనుఁగును; రమించి; కాంత పిల్లలనుఁ గనెన్.

    రిప్లయితొలగించండి
  9. మేనకను బోలు నామె కు
    గానక పెండిలి ని సేయ కాపుర మందున్
    దానే సర్దుకు పోవుచు
    పీనుగు ను రమించి కాంత పిల్లలను గనె న్

    రిప్లయితొలగించండి
  10. తానొక సుందరాంగి గనె దర్పకు బోలిన సుందరాంగునిన్
    మానసమందు వానిపయి మక్కువ కోలుమసంగె నింతలో
    వానికి వచ్చె నామయము బక్కగ క్రుంగి కృశించి పోయెనా
    పీనుఁగునున్ రమించి యలివేణి యొకర్తుక పిల్లలన్ గనెన్

    రిప్లయితొలగించండి
  11. ఏనుగుఁ బోలిన కాయము
    పీనుగుగా నయ్యె జబ్బు పీడించగ న
    వ్వానిని ప్రేమించు కతన
    పీనుఁగును రమించి కాంత పిల్లలనుఁ గనెన్

    రిప్లయితొలగించండి
  12. రిప్లయిలు
    1. కం॥ మేనును గదపఁగఁ జాలడు
      కాని యతఁడు చదువరి యనిఁ గాంచి యతనినే
      మానక మనువాడఁగ నడ
      పీనుఁగును రమించి కాంత పిల్లలనుఁ గనెన్

      ఉ॥ కానఁగ శాస్త్ర విజ్ఞతను గాంచఁగఁ జాలము తుల్య మెవ్వరిన్
      మేనన నీరసించెఁ గన మేదిని మందులు లేని జబ్బుతో
      మానకఁ బెండ్లియాడెనొక మక్కువ నొందిన యింతి యాతనిన్
      బీనుఁగనున్ రమించి యలివేణి యొకర్తుక పిల్లలన్ గనెన్

      తొలగించండి
    2. ఇది స్టీఫెన్ హాకింగ్ (1942-2018) నిజ జీవితమండి. ప్రపంచంలో ఐన్ స్టీన్ తరువాత అత్యంత ప్రతిభాశాలిగా పేరు పొందిన శాస్త్రజ్ఞుడు. 1963 తరువాత నెమ్మదిగా motor nuerone disease తో wheel chair కే పరిమితం అతని జీవితం. జేన్ అతనితో 3 పిల్లలను పొందుతుందండి. గతములాగ ప్రతిదానికి గ్రంథాలయము కెళ్ళవలసిన పని లేదండి. నెట్లో అతనిని గురించి చదువవచ్చు.

      తొలగించండి
  13. రాణినని కలలుగను నెర
    జాణ యొకతి వయసుడగఁగ జనకుడు కన్యా
    దానము సేయగ నొక మగ
    పీనుఁగును రమించి కాంత పిల్లలనుఁ గనెన్

    రిప్లయితొలగించండి
  14. మానక యొనర్చి వెస నొక
    మానిని యేనుంగుఁ బోలు మనుజు నొకనిఁ బం
    తానం గడుచిత్రమ్ముగఁ
    బీనుఁగును రమించి కాంత పిల్లలనుఁ గనెన్


    కానము కారణమ్ములను గాంతల ప్రేమకు నెంత నేర్చినన్
    మానుగఁ బ్రేమ గ్రుడ్డి దను మాటను నిక్కము సేయ నెంచియో
    సూనృత యైన లోక నుత సుందరి సుందరుఁ డైన యట్టి మ
    న్పీనుఁగునున్ రమించి యలివేణి యొకర్తుక పిల్లలం గనెన్

    [మన్పీనుఁగు = మనుపీనుఁగు, జీవచ్ఛవము]

    రిప్లయితొలగించండి
  15. పానము చేయుచు మద్యము
    కానకమంచిచెడులనిలకాపురుషునటుల్
    మానమువీడితిరుగునడ
    పీనుగునురమించికాంతపిల్లలగనియెన్

    రిప్లయితొలగించండి

  16. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    పీనుగు వలె నున్నను నీ
    వేనుగులా తినుచునుంటి వేది బలమనెన్
    గానీ, తృప్తిపడుచు నా
    పీనుగును రమించి కాంత పిల్లలనుఁ గనెన్.

    రిప్లయితొలగించండి