30, జనవరి 2024, మంగళవారం

సమస్య - 4661

31-1-2024 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“తన్నెదను సమస్యాక్లేశమున్న యెడల”
(లేదా...)
“అవమానించెదఁ బృచ్ఛకా నిను సమస్యాక్లేశమున్నన్ వడిన్”

49 కామెంట్‌లు:

  1. తేటగీతి
    క్లిష్టమున్ గాని దైనను ప్రీతి తోడ
    పూరణమలవోకగఁ జెప్పు దారఁగలుఁగుఁ
    బూని లోన యోచనలదన్ బుట్టఁ బగులఁ
    దన్నెదను సమస్యాక్లేశమున్న యెడల

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మత్తేభవిక్రీడితము
      అవధానంబది చాతురిన్ దెలిపి యాహ్లాదమ్మునందించెడున్
      గవనంబున్ మధురమ్ముగా నొలుక విజ్ఞానంబుతో నల్లఁగన్
      శ్రవనీయంబగు, లేక వేరు నవకాశాలే నధిక్షేపణ
      న్నవమానించెదఁ బృచ్ఛకా నిను సమస్యాక్లేశమున్నన్ వడిన్

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
    3. వృత్తపద్యము మూడవ పాదము మొదట శ్రవణీయంబగు అని చదువుకొన మనవి.

      తొలగించండి
  2. పురమున నవధానము జేయ బూనుకొనుచు
    తన్నెదను సమస్యాక్లేశమున్న యెడల
    యనుచు బృచ్ఛకుని యిటుల నడలజేయ
    భాజనమగునే నీవంటి పండితులకు !

    రిప్లయితొలగించండి

  3. ప్రాశ్నికుడడుగ దుష్కర ప్రాసగల స
    మస్యయె రసాంచితమయిన మరువకుండ
    నిక్కముగ నవధానియె నిల్పుకొనడె
    తన్నెదను, సమస్యాక్లేశమున్న యెడల.

    తన్ను ఎదను (తనను ఎదను)

    రిప్లయితొలగించండి
  4. నవయుగమునిదియుగనుమానవకమొప్ప
    కుసుమసుకుమారమౌగాదెగొప్పకవిత
    వారికేళమునొప్పరునాగరికులు
    తన్నెదనుసమస్యాక్లేశమున్నయెడల

    రిప్లయితొలగించండి
  5. పూనియ వ ధాన మును జేయ బుధ వరుండు
    పృచ్చ కాళి యొసంగె డు వింత యైన
    జటిలపు సమస్య లకు నేను జక్కగానె
    తన్నె దను సమస్యా క్లే శ మున్న యెడల

    రిప్లయితొలగించండి
  6. చవులూరించెడి పాండితీప్రతిభకున్ చాలెన్గదాజీవముల్
    కవిసమ్రాట్టులు విశ్వనాథులకు నీకాలంబుగీసెన్గిరిన్
    వివరంబెంచుమువిజ్ఞతన్గనుము నీవేదాలుమాకొద్దురా
    అవమానించెదపృచ్ఛకానినుసమస్యాక్లేశమున్నన్వడిన్

    రిప్లయితొలగించండి

  7. స్తవనీయోన్నత భావమున్ గొనుచుఁ బద్మాక్షున్ మదిన్ నమ్ముచున్
    గవిగానల్లిన పద్యరాజములనే ఖండింపగా భావ్యమా?
    యవలోకింపక నొల్ల నొల్ల యనుచున్ వ్యాఖ్యానముల్ సేయగా
    అవమానించెదఁ బృచ్ఛకా నిను సమస్యాక్లేశమున్నన్ వడిన్.

    రిప్లయితొలగించండి

  8. అవరోధించుటె పృచ్ఛకాళి పనియంచజ్ఞాని యొక్కండు పా
    టవమేలేని సమస్యనొక్కటిని క్లిష్టంబంచు తానిచ్చి నన్
    జవమున్ జెప్పి వధాని పల్కెనట హాస్యంబందు నేనెందుకై
    అవమానించెదఁ బృచ్ఛకా నిను, సమస్యా క్లేశమున్నన్ వడిన్.

    రిప్లయితొలగించండి
  9. తల్లిని కొలుతు నాపల్కు చెల్లఁజేయ
    రక్తి కట్టించుమా యని భక్తి తోడ
    వేడెద నలువరాణిని, పెట్టుకొందు
    తన్నెదను సమస్యాక్లేశమున్న యెడల

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అవధానంబొనరింతు నెల్లరకుఁ బూర్ణానందమున్ గూర్చగా
      శ్రవణానందము కల్గజేతు సభకున్ సంతృప్తిగా ప్రశ్నలన్
      వివరింతున్ వినుమా పరాకువిడుమా వేగాన పూరింపనీ
      యవ! మానించెదఁ బృచ్ఛకా నిను సమస్యాక్లేశమున్నన్ వడిన్

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి.

      తొలగించండి

  10. అవరోధింపదలంచి యిచ్చిన సమస్యన్ గాంచుచున్ మీరు న
    న్నవమానింపకు శ్రేష్ఠుడా యనుచు నభ్యర్థింపగా వానితో
    నవధానిట్లు వచించె సౌమ్యుడయి యార్యామిమ్ము నేనెందుకై
    యవమానించెదఁ బృచ్ఛకా నిను సమస్యాక్లేశమున్నన్ వడిన్.

    రిప్లయితొలగించండి
  11. మత్తేభము:
    అవధానంబున నిన్ను పృచ్ఛకునిగా నాహ్వానమందించ నీ
    వ్యవహారంబును మాటతీరుఁ గన నన్యాయంబుగా దోచె ని
    న్నవలోకింపగ నీ విధిత్సితము నన్నఱ్ఱాకలం బెట్టుటే
    యవమానించెదఁ బృచ్ఛకా నిను సమస్యాక్లేశమున్నన్ వడిన్

    రిప్లయితొలగించండి
  12. పృచ్ఛకా! ననునంకిలి పెట్టఁ దలుపఁ
    బాడియౌనొకొ నాపైన పగను బూని
    మార్చుకొమ్మిక నీతీరు మారకున్న
    తన్నెదను సమస్యాక్లేశమున్న యెడల

    రిప్లయితొలగించండి
  13. -

    ఇది మొదటి కుదురాట మైత్రిని మదినిడు
    తన్నెదను సమస్యాక్లేశమున్న యెడల
    గండముగడచసాయము గట్టు శంక
    రార్య! నీదుమేల్ మరువనురా హితుండ!


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో యతి తప్పింది. "కుదురాటయె మదిని దలచి" అందామా?

      తొలగించండి
  14. రిప్లయిలు
    1. తే॥ తన్నెదను సమస్యా క్లేశమున్న యెడల
      మిగుల దుష్కరమ్మగు ప్రాస బిగిని యడుగఁ
      బద్య సుధలతో దీటుగఁ బదుగురు విని
      పరవశించ వధానముఁ బరుగు లిడఁగ

      మ॥ కవిగాఁ బద్య సుధారసమ్ముఁ గని సాకారంబుగన్ బూరణల్
      చవులూరించెడి ధార నొందఁగ జనుల్ చప్పట్లు మ్రోగించఁగన్
      భవనమ్మంతయు దద్దరిల్లఁగను సంభావించెడిన్ రీతితో
      నవమానించెదఁ బృచ్ఛకా నిను సమస్యా క్లేశమున్నన్ వడిన్

      ఇద్దరూ ఉద్దండులే నండి. పృచ్ఛకుడు నిన్ను కష్టపెట్టే రీతిలో సమస్య నిస్తానంటే నేనేమి తక్కువా అంతకంటే చక్కగా పూరించి నిన్నవమానిస్తాను అనుట., సరస సంభాషణ

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
      తేటగీతిలో "బిగిని నడుగ" అని ఉండాలి కదా?

      తొలగించండి
    3. ధన్యవాదములండి. చాలాసేపు తర్జనభర్జన పడి బిగిని తరువాత ద్రుతము రాదని తలచి అలా వ్రాసాను. మారుస్తానండి. ధన్యవాదములు

      తొలగించండి
  15. తే.గీ:నాదు నర్థాంగి యన్నిట నాదు కొనుచు
    పలు సమస్యల లో తీర్చు బలము నిచ్చు
    తట్టకున్న నుపాయమ్ము తలచెదనుగ
    త న్నెదను సమస్యాక్లేశ మున్న యెడల

    రిప్లయితొలగించండి
  16. క్లిష్టమైన సమస్యల నిష్టముగను
    స్వీకరించి పూరించక చిత్రముగను
    ఆత్మ న్యూనతన కుకవు లనెద రిటుల
    తన్నెదను సమస్యాక్లేశమున్న యెడల

    రిప్లయితొలగించండి
  17. మ:ఎవరే క్లిష్ట సమస్యనీయ సులభమ్మే తీర్చ నిన్నేల నే
    నవమానించెద బృచ్ఛకా నిను సమస్యాక్లేశమున్నన్ ,వడిన్
    స్తవనీయమ్ముగ నేను తీర్చ మరి యర్థ మ్నేమనన్ నీవు, నా
    కవమానమ్మగు నిట్టి వారికి సమస్యల్ తీర్చుటే మిత్రమా!

    రిప్లయితొలగించండి
  18. దుష్కరప్రాస నొసఁగక పుష్కల దయ
    యంతరంగమ్మునం జూపి నంత నేను
    సంతసించి భృశమ్ము కీర్తింతు నెమ్మిఁ
    దన్నెదను సమస్యాక్లేశ మున్న యెడల

    [తన్ను+ఎదను=తన్నెదను; సమస్యా+అక్లేశము= సమ స్యాక్లేశము]


    అవలీలం జెలరేఁగి పూరణము నీ కందింతు శీఘ్రమ్ముగా
    భువిలో నెందఱిఁ గాంచఁ బృచ్ఛకుల నంభోరాశి గంభీరులన్
    శివ మేపార భృశమ్ముగా నిలుమ నిశ్చింతన్ మదిన్నేల నే
    నవమానించెదఁ బృచ్ఛకా నిను సమస్యాక్లేశ మున్నన్ వడిన్

    రిప్లయితొలగించండి
  19. వేగ వంతము బూరించి విన్నుతింతు
    తన్నెదను సమస్యాక్లేశమున్న యెడల
    కఠిన మగువిధముగ నీయ పఠితు లౌర
    యనగ పూరింతుఁబాదము నద్భుతముగ

    రిప్లయితొలగించండి

  20. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    తన్నెదను సమస్యా క్లేశమున్న యెడల
    ననుట భావ్యమా?యవధాని యనెడు వాని
    కెట్టి కఠిన సమస్యల నిడిన గాని
    పటుతరముగను పూరించ వలె వధాని.

    రిప్లయితొలగించండి
  21. పద్యములనల్లురీతిని వాసిగాను
    సఖునిచెంతను నేర్చుచు జవము గాను
    నివ్విధమ్ముగా పలికెతానిమ్ముగాను
    తన్నెదను సమస్యా‌ క్లేశమున్న యెడల

    రిప్లయితొలగించండి