21, ఫిబ్రవరి 2024, బుధవారం

సమస్య - 4683

22-2-2024 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“త్రాగు నరునకు మోక్షమ్ము దప్పదెపుడు”
(లేదా...)
“త్రాగెడువాఁడు మోక్షమును దప్పక పొందు నటంద్రు పండితుల్”
(విట్టుబాబుకు ధన్యవాదాలతో...)

26 కామెంట్‌లు:

  1. విమలసద్భక్తినెప్పుడు విష్ణు దలచి
    కనులుమోడ్చుచుకవితలకంఠమెత్తి
    పదపదమ్మున జిప్పిలుపానకమ్ము
    త్రాగునరునకుమోక్షమ్ము తప్పదెపుడు

    రిప్లయితొలగించండి

  2. భోగ భాగ్యముల్ వీడుచు ముక్తిగోరు
    వారలకదేలర జపతపమ్ము లిలను
    దాశరథి నామ మనెడు సుధామృతమును
    త్రాగు నరునకు మోక్షమ్ము దప్పదెపుడు.


    భోగములన్నియున్ విడిచి ముక్తిపథమ్మును గోరు వాడిలన్
    యోగిగ మారకున్న పురు షోత్తముడంచు యశోధనుండె యౌ
    భాగరి జానకీ ధవుని పావస నామ సుధామృతమ్మునే
    త్రాగెడువాఁడు మోక్షమును దప్పక పొందు నటంద్రు పండితుల్.

    రిప్లయితొలగించండి
  3. మీఁగడపాలుతేనియలుమెక్కినబాలునివెంటనంటుచున్
    సాగినగోపకాంతలటసన్నిధిగోరిముదంబునందగా
    ఆగనివేణుగానమధువాగతి నీయగజీవసారమున్
    త్రాగెడువాడు మోక్షమునుతప్పకబొందునటండ్రుపండితుల్

    రిప్లయితొలగించండి
  4. ఉ.

    నాగువు వోలె శీర్షమును నాదము వీనుల విందు నూపుచున్
    పోగులు కర్ణమందు నిడి పూజను విష్ణు సహస్ర నామముల్
    రాగము భావముల్ మెరయ రాముని వేడుచు గీర్తనల్ హృదిన్
    *త్రాగెడువాఁడు మోక్షమును దప్పక పొందు నటంద్రు పండితుల్.*

    రిప్లయితొలగించండి
  5. ఈశు మదిలోన నిలిపి యు నిచ్చ తోడ
    నామ జపమును వదలక నైజ ముగను
    ఫాల నేత్రుని లీలలన్ భక్తిసుధను
    త్రాగు నరునకు మోక్షమ్ము దప్ప దెపుడు

    రిప్లయితొలగించండి
  6. జాగరూకుడై త్యజియించి రాగములను
    బాగుమీరగ భజియించు భక్తవరుడు
    మధురమైనట్టి రామ నామామృతమును
    త్రాగు నరునకు మోక్షమ్ము దప్పదెపుడు

    రిప్లయితొలగించండి
  7. పాల మీగడ కన్నను పంచదార
    చిలుక కన్నను తీయని పలుకు కనఁగ
    రామనామము, రుచ్యమౌ రామ సుధను
    త్రాగు నరునకు మోక్షమ్ము దప్పదెపుడు

    రిప్లయితొలగించండి
  8. పిన్నతనమున మొదలిడి విడుపకుండ
    ప్రతి దినము దూరముగనున్న పాళెముజేరి
    యిమ్ముగ నట దేవళమున నిడు యుదకము
    త్రాగు నరునకు మోక్షమ్ము దప్పదెపుడు

    రిప్లయితొలగించండి
  9. మనసులోగల కోర్కెల మట్టుపెట్టి
    భక్తి మార్గాన పరమాత్మ పై నిరతము
    మదిని నిలుపుచు రామనా మామృతమును
    త్రాగు నరునకు మోక్షమ్ము దప్పదెపుడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాగము ద్వేషమున్ విడిచి రాముని పైమది నిల్పియున్నచో
      వేగమె లభ్యమౌనుగద విజ్ఞత తోడుతఁ వీతరాగమే
      త్రాగుము రామనామసుధ తన్మయ మొందుచు పారవశ్యతన్
      త్రాగెడువాఁడు మోక్షమును దప్పక పొందు నటంద్రు పండితుల్

      తొలగించండి
  10. ప్రాగహరమ్ము తారకము రమ్యసుధామధురమ్ము నిచ్చలున్
    యోగులహృత్సరోజములనూర్జితమై దనరారునట్టిదౌ
    మీగడపాలు తేనియల మించిన తీయని రామనామమున్
    త్రాగెడువాఁడు మోక్షమును దప్పక పొందు నటంద్రు పండితుల్

    రిప్లయితొలగించండి
  11. రిప్లయిలు
    1. తే॥ ధర్మ మార్గము విడువక ధరణి లోన
      పరుల కుపకార మొనరించు పథముఁ గనుచు
      ముక్తిఁ బడయఁగ సతతము భక్తి రసముఁ
      ద్రాగు నరునకు మోక్షమ్ము దప్పదెపుడు

      ఉ॥ సాగుచు ధర్మ మార్గమున సర్వుల మన్ననఁ బొందుచున్ భువిన్
      బ్రోగుగఁ జేసి పుణ్యమును బోడిమి తోడఁ బరోపకారియై
      యాగక రామ నామపు రసామృత ధారలు ధాత్రిలో సదా
      త్రాగెడు వాఁడు మోక్షమును దప్పక పొందునటంద్రు పండితుల్

      ఈరోజు ఆంధ్రభారతి నిఘంటువు పనిచేయడము లేదండి. This account has been suspended అనివస్తోంది. I tried in 2 mobiles and here too. Everywhere the same message is propping up.
      I have sent the mail also in accordance with the directions provided therein.

      తొలగించండి
    2. ఇప్పుడు ఆంధ్రభారతి నిఘంటువు పనిచేస్తున్నదండి

      తొలగించండి
  12. తే.గీ:కర్మలను మున్ గి యున్నను, కర్మఫలము
    తాను వదలి, తనను నిమిత్తముగ దలచి,
    అహము విడి కృష్ణదత్తగీతామృతమ్ము
    ద్రాగు నరునకు మోక్షమ్ము తప్ప దెపుడు

    రిప్లయితొలగించండి
  13. ఉ:త్రాగు డటంచు కల్లు నిడ ద్రాగగ గ్రక్కున శంకరుండు,మీ
    రీ గతి వేడి సీసము గ్రసింతురె యన్న గ్రసించె భేదముల్
    త్యాగము జేసి బ్రహ్మమునె యంతట జూచు సమత్వ మున్నచో
    త్రాగెడు వాడు మోక్షమును దప్పక బొందు నటంద్రు పండితుల్.
    (ఆది శంకరునికి ఒకడు త్రాగటానికి కల్లు ఇస్తే ఏదీ పవిత్రం కాదు,అపవిత్రం కాదు అని తాగేశారు.ఆయన్ని వేళాకోళం చెయ్యటానికి మరొకడు కరిగించిన సీసం ఇచ్చి త్రాగమంటే అదీ త్రాగేశారు.భేదభావం లేకుండా దేన్నైనా గ్రహించ గలిగితే త్రాగిన వాడు కూడా మోక్షానికి అర్హుడే.)

    రిప్లయితొలగించండి
  14. భక్తి కన్ననైశ్వర్యము వరము లేదు
    ముక్తి సాధనమడచును భుక్తి పాట్లు
    నిరతమిది యెరిగి హరికథా రసంబుఁ
    ద్రాగు నరునకు మోక్షమ్ము దప్పదెపుడు

    రిప్లయితొలగించండి
  15. నిత్య‌శివనామ‌‌ జపమును‌ నిగ్రహముగ‌
    సలిపినంతను‌ చాలును‌ శాంతి కలుగు‌
    మహిమ‌ గలిగిన‌ శివనామ‌ మధుర సుధను‌
    త్రాగు నరునకు‌ మోక్షమ్ము‌ దప్పదెపుడు‌.



    రిప్లయితొలగించండి
  16. ఎల్ల కాలమ్ము దైవమ్ము నుల్లమందు
    విడువ కుండగ ధ్యానమ్ముఁబేర్మి తోడఁ
    జేయుచుండియుఁ దీయనౌ పాయి రసముఁ
    ద్రాగు నరునకు మోక్షమ్ము దప్పదెపుడు

    రిప్లయితొలగించండి
  17. తేటగీతి
    ధర్మవిగ్రహమంచును దాశరథిని
    వాడవాడలఁ బూజింత్రు భక్తిఁగలిగి
    తనర శ్రీరామనామసుధామృతమ్ముఁ
    ద్రాగు నరునకు మోక్షమ్ము దప్పదెపుడు


    ఉత్పలమాల
    తూగెడు వారు లేనరఁగ తోయజ నేత్రుడు రామచంద్రుఁడున్
    స్వాగతమీయఁగన్ బుడమి సద్గుణశోభుడు ధర్మవిగ్రహుం
    డాగమ రీతుల్ దలఁచి యా శుభనామ సుధామృతమ్మునే
    ద్రాగెడువాఁడు మోక్షమును దప్పక పొందు నటంద్రు పండితుల్

    రిప్లయితొలగించండి
  18. రిప్లయిలు
    1. ఆఁగక నమలు నరునకు రోగ మబ్బుఁ
      దూఁగ నిత్యమ్ము నరునకుఁ దొలఁగు సిరులు
      వాఁగు నరునకు దండమ్ము వఱలు సుమ్ము
      త్రాగు నరునకు మోక్షమ్ము దప్ప దెపుడు


      బాగుగ నమ్మి డెందమునఁ బాప మెఱుంగని శుద్ధ భక్తితో
      నాగమ సంచ యోక్తముగ నంచిత రీతిని నిత్య సుప్రశం
      సా గరి మార్చనా సహిత మాధవ నామ సుధా రసమ్మునుం
      ద్రాగెడు వాఁడు మోక్షమును దప్పక పొందు నఁటంద్రు పండితుల్

      తొలగించండి
  19. యాగముఁజేయకుండినను నాపరమాత్ముని నామ పాయినే
    త్రాగెడువాఁడు మోక్షమును దప్పక పొందు నటంద్రు పండితుల్
    భోగము లెన్ని యుండినను భూతల నాథుని సేవఁజేయుచో
    రాగల కాలమంతయును 'రంజిలఁజేయును జీవితాంతమున్

    రిప్లయితొలగించండి
  20. భోగము కామ క్రోధములు బూర్తిగ
    వీడియు నెల్లవేళలన్
    రాగముతోడ భక్తిమెయి ప్రార్థన
    జేయుచు చిత్తశుద్ధితో
    జాగొనరించకన్ మిగుల సన్మతి
    రాముని నామ సారమున్
    త్రాగెడువాడు మోక్షమును దప్పక
    పొందు నటంద్రు పండితుల్

    రిప్లయితొలగించండి

  21. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    రామకోటిని వ్రాయుచు ప్రతి దినమ్ము
    భజన చేసి రామాలయ ప్రాంగణమున
    నామ కీర్తనల్ బాడుచు రామ రసము
    త్రాగు నరునకు మోక్షమ్ము దప్పదెపుడు.

    రిప్లయితొలగించండి