ఈ పూరణలలో చాలా వరకూ పరిష్కారాలు జరిగాయి కానీ "వాక్పతి యాన తీయగన్"అనేది సమర్ధించ బడ లేదు.శ్రీమహావిష్ణువు కి బ్రహ్మ ఆనతీయట మేమిటి? పురాణాల ప్రకారం శ్రీహరే సూపర్ పవర్.అది సమర్థించటం కుదరక నేను వాక్యవిభజన తో పూరించాను.ఇది మంచి క్లిష్టసమస్యే.క్రమాలంకారం తో,లేక వాక్యవిభజన తోనే సాధ్యం.
బాహాటంబుగతానే
రిప్లయితొలగించండిసోహమ్మంచును పురహరు శుద్ధున్గనుచున్
ఓహో నీవెందులకని
శ్రీహరియజునానతిఁగొని శ్రీశునిఁజంపెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికాశినివాసమందుటనుకాంచిరిమోక్షముయోగులాయెడన్
రిప్లయితొలగించండిపాశమువేసిరాముఁడును వాసిగనిల్చెనయోధ్యయందునన్
గాసినిబాసిరీజనులు కమ్మనివిష్ణుకథామృతంబుతో
శ్రీశుని సంహరించెను శ్రీహరివాక్పతియానతీయగన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసంహరించెనట
రిప్లయితొలగించండిశ్రీహరి నాయకుడుఁగథకు
రిప్లయితొలగించండిశ్రీహరి గురువజుడు బుధుడు శ్రీశుని చేతెం
తో హానిఁబడగ కడకును
శ్రీహరి యజునానతిఁగొని శ్రీశుని జంపెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిశ్రీహరి యజడును రుద్రుడు
రిప్లయితొలగించండితాహతులో సము లటంచు తత్త్వము దెలుపన్
మోహము గా పల్క తగు నె?
శ్రీహరి యజు నానతి గొని శ్రీ శుని జంపెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికందం
రిప్లయితొలగించండిఆ హాలా హలధారి ప
రాహతమున 'త్రిపురులనని' ,రగులుచునిడి కో
లాహలమున బాణమనఁగ
శ్రీహరి, యజునానతిఁగొని, శ్రీశునిఁ, 'జంపెన్'
(శ్రీహరి, బ్రహ్మల అనుమతి గొని , కోలాహలమున నిడి
బాణముగ నమరిన శ్రీశుని, త్రిపురాసురుల హాలాహల ధారియైన శివుడు చంపెన్)
ఉత్పలమాల
ఆశగ వేల్పులెంచ త్రిపురాసుర సంహరణమ్ము నీశుఁడా
వేశము బూనుచున్ మలచ వింటిగ మేరునగమ్మనంతుడే
పాశమునౌచుఁ జుట్ట తనె బాణమనంగను వైచినంతటన్
శ్రీశుని, సంహరించెనఁట శ్రీహరి, వాక్పతి యానతీయఁగన్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి🙏ధన్యోస్మి గురుదేవా!🙏
తొలగించండిఓహోయస నుడి నడుగగ
రిప్లయితొలగించండిదేహి జనన రక్షణనిడీ త్రెంచునొ కడనన్
సాహస బాలుడిటుల ననె
శ్రీహరి యజునానతిఁ గొని శ్రీశునిఁ జంపెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిమోహవశుడగుచు నా వై
దేహిని బంధించిన పొలదిండిని తిమి నా
బాహుకములతో దాటుచు
శ్రీహరి యజునానతిఁ గొని శ్రీశునిఁ జంపెన్.
ఆశిరుడౌ హిరణ్య కశిపాధము డడ్గెవరమ్మటంచు వా
గీశుడొసంగినంత కడు క్షేపము తోడ చరించు నట్టి కీ
నాశుని జంప తుత్థపు కణమ్ములు రాల్చుచు సింగ రూపమున్
శ్రీశుని సంహరించెనఁట శ్రీహరి వాక్పతి యానతీయఁగన్.
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిఊహల కందని రీతిని
రిప్లయితొలగించండిశ్రీహరి ప్రత్యక్షమాయె లీలను జూపన్
దేహము నరసింహంబై
శ్రీహరి యజునానతిఁ గొని శ్రీశునిఁ జంపెన్
క్లేశము లూడ్చువాడుగద కేశవుడే యిహలోకమందునన్
నాశకుడైన రాక్షస వినాశన మాపగ నిశ్చయమ్ముతో
కేశవుడేగె నచ్చటకు కేశికుడై నవ నారసింహుడై
శ్రీశుని సంహరించెనఁట శ్రీహరి వాక్పతి యానతీయఁగన్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలు గురూజీ 🙏
తొలగించండిఆశువుగా నసత్యముల నాదరబాదర బల్కునట్టి యే
రిప్లయితొలగించండిబ్రాసి యతండు ప్రేలరి యభాసము చేయు పురాణ గాథలన్
వాసిగ దెల్పెదన్ వినుఁడు భాగవతమ్మని మూఢుఁ డిట్లనున్
"శ్రీశుని సంహరించెనఁట శ్రీహరి వాక్పతి యానతీయఁగన్"
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిబాహాటముగనసత్యపు
రిప్లయితొలగించండిటూహాజనితంపు మాటలుక్కివుఁడనె కో
లాహలముగ నీరీతిగ
"శ్రీహరి యజునానతిఁ గొని శ్రీశునిఁ జంపెన్"
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికం॥ ఆహా యసత్యముఁ బలుక
రిప్లయితొలగించండినోహో యందురు పదుగురు నొప్పుచు నిలలో
నూహించి తెలిపె నొక్కఁడు
శ్రీహరి యజు నానతిఁ గొని శ్రీశునిఁ జంపెన్
ఉ॥ శ్రీశుని సంహరించెనఁట శ్రీహరి వాక్పతి యానతీయఁగన్
కేశవుఁడన్న సర్వజన క్లేశముఁ బాపుచు గాయువాఁడిలన్
గ్లేశము గ్రమ్మలోకమున కేళిగఁ జంపును జన్మమెత్తుచున్
బాశపు బద్ధుఁడై భువిని పాపులఁ జేయుచు ధర్మరక్షణన్
క్రమాలంకారము
తొలగించండిఉ॥ పాశము తోడ నాశగను భర్తగఁ గోరెను లక్ష్మి యెవ్వనిన్
గ్లేశముఁ బాపగన్ గరికి కేశవుఁడా మకరిన్ ఘటించెనే
కేశవ నామమే యిదియు కేళిగ సృష్టి చరించు నెట్టులన్
శ్రీశుని సంహరించెనఁట శ్రీహరి వాక్పతి యానతీయఁగన్
తప్పుల నెవ్వరు సూచించినా ధన్యవాదములు
కం:ఊహాతీతుం డెవ్వడొ?
రిప్లయితొలగించండిసాహంకృతదైత్యు లెట్టు లవని జెలగిరో?
శ్రీహరి నెట్లు భజింతము
శ్రీహరి- యజు నానతి గొని- శ్రీశుని జంపెన్
(క్రమాలంకారము-శ్రీ హరి నెట్లు భజింతము? శ్రీశుని జంపెన్.శ్రీ హరి భజనను జంపె తాళం తో చేద్దాము.)
ఉ:ఆశలు పెచ్చరిల్లియు, దురాక్రమణమ్ముల జేసి దూరగా
రిప్లయితొలగించండిశ్రీశుని, సంహరించె నట శ్రీహరి; వాక్పతి యానతీయగన్
లేశము సద్వివేకమును లేని వరమ్ముల గోరి ధారుణీ
నాశకరీతి దైత్యకులనాథులు రెచ్చగ ధర్మరక్ష కై.
ఆహా దైవ వశమ్మున
రిప్లయితొలగించండిబాహాబాహి మరణింప వల్లవ జన సం
దోహము కిరాతుఁ డొక్కఁడు
శ్రీహరి! యజునానతిఁ గొని శ్రీశునిఁ జంపెన్
ఈశుని వాసుదేవుని నహీన పరాక్రము నండ నుండఁగా
నా శర ణాగతవ్రజ జ నార్భకులం బరిమార్ప నెంచ దై
త్యేశు నఘాభిధేయుని ఫణీంద్ర వరాకృతి నున్న వానినిన్
శ్రీశుని సంహరించె నఁట శ్రీహరి వాక్పతి యానతీయఁగన్
[శ్రీశుఁడు=విషమున కధిపతి; వాక్పతి యానతి= బ్రహ్మ వ్రాత]
హారము వేసెను మెడలో
రిప్లయితొలగించండిశ్రీహరి యజునానతిఁ గొని శ్రీశునిఁ,, జంపెన్
గ్రూరుఁడగు మేన మామను
శ్రీహరియే చంపి ప్రజకు సేమముఁ గూర్చెన్
శ్రీశుఁడు రావణాసురుఁడు చేవకొలందిని హింసబెట్టగా
రిప్లయితొలగించండిశ్రీశుని సంహరించెనఁట శ్రీహరి వాక్పతి యానతీయఁగన్
క్లేశము లన్నియుందొలగుఁ గేశవు నామముఁబల్కువారికిన్
శ్రీశుఁడె రక్షసేయునిక శ్రీయను నామము లోఁదలంచినన్
ఈ పూరణలలో చాలా వరకూ పరిష్కారాలు జరిగాయి కానీ "వాక్పతి యాన తీయగన్"అనేది సమర్ధించ బడ లేదు.శ్రీమహావిష్ణువు కి బ్రహ్మ ఆనతీయట మేమిటి? పురాణాల ప్రకారం శ్రీహరే సూపర్ పవర్.అది సమర్థించటం కుదరక నేను వాక్యవిభజన తో పూరించాను.ఇది మంచి క్లిష్టసమస్యే.క్రమాలంకారం తో,లేక వాక్యవిభజన తోనే సాధ్యం.
రిప్లయితొలగించండి