10, జనవరి 2025, శుక్రవారం

సమస్య - 4999

11-1-2025 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మరలందున్ గనె భ్రమరము మకరందమ్మున్”
(లేదా...)
“మరలందున్ మకరంద మున్నదని సంభావించె షట్పాదముల్”

30 కామెంట్‌లు:

  1. కందం
    సురల కనుల, కరముల మరి
    చరణములన్ పోల్చఁ గవులు స్వచ్చము ననుచున్
    బరిమళమునకు మురిసి తా
    మరలందున్ గనె భ్రమరము మకరందమ్మున్!

    మత్తేభవిక్రీడితము
    కరముల్ కన్నులు పాదముల్ సురల సింగారంపు దేహంబునన్
    సరిపోలన్ కవి పండితాళి పొగడన్ స్వారస్యమేపారఁగన్
    నిరతమ్మున్ విరులందు గ్రోలు కతనందెంతెంతొ నాశించి తా
    మరలందున్ మకరంద మున్నదని సంభావించె షట్పాదముల్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సవరించిన వృత్తము:

      మత్తేభవిక్రీడితము
      కరముల్ కన్నులు పాదముల్ సురల సింగారంపు దేహంబునన్
      సరిపోలన్ కవి పండితాళి పొగడన్ స్వారస్యమేపారఁగన్
      నిరతమ్మున్ విరులందు గ్రోలు కతనంతెంతెంతొ యాశించి తా
      మరలందున్ మకరంద మున్నదని సంభావించె షట్పాదముల్!

      తొలగించండి
  2. విరివిగ వానలు కురియగ
    పురమున గల చిన్ని చెరువు భువనము తోడన్
    నెరవుగ నిండ న చటి తా
    మరలందున్ గనె భ్రమరము మకరందమ్మున్

    రిప్లయితొలగించండి

  3. మరణంబే దిక్కని యో
    గిరమెచ్చట గానలేక ఖేదము తోడన్
    తిరిగెడి తరి కొలనున తా
    మర లందున్ గనె భ్రమరము మకరందమ్మున్.


    సిరి మల్లెల్ విరబూసినట్టి వనమున్ జేరన్ ఫలంబేమి యో
    గిరమచ్చోట లభింపదయ్యె ననుచున్ ఖేదమ్ము నేపొందెడిన్
    దరి కాసారము గాంచి నందుగల సత్యంబందు శోభించు తా
    మర లందున్ మకరంద మున్నదని సంభావించె షట్పాదముల్.

    రిప్లయితొలగించండి
  4. చెరువులు నిండెను వానల
    వరుణుడు గరుణించ వెలసె వనజము లందున్
    దరుణము దొరికె ననుచు దా
    మరల o దు న్ గనె భ్రమరము మక రందమ్మున్

    రిప్లయితొలగించండి
  5. స్థిరమై క్షామము పట్టి వీడని తఱిన్ తేనెల్ భుజింపంగనే
    తరులన్ పువ్వులు గానరావు వనముల్ దగ్ధంబులయ్యెన్ సరో
    వరమే యొక్కటి కానవచ్చెనట దైవంబే కృపంజూప దా
    మరలందున్ మకరంద మున్నదని సంభావించె షట్పాదముల్!!

    రిప్లయితొలగించండి
  6. సరిపోల్తురు కవివర్యుల్
    తరుణీమణులఁ గమనీయ తామరలనుచున్
    బొరబడినన్ జివరకు తా
    మరలందున్ గనె భ్రమరము మకరందమ్మున్

    విరిబోడుల్ సరిపోలుచుంద్రు కవులుత్ప్రేక్షించి వర్ణింప తా
    మరపూలన్, గననౌను పద్మముఖులై మత్తిల్లగాజేయు సుం
    దర రూపుల్ తమ మోములే విరులుగా తారాడ వీక్షించి తా
    మరలందున్ మకరంద మున్నదని సంభావించె షట్పాదముల్


    రిప్లయితొలగించండి
  7. వరపద్మాక్షిని సూర్యసన్నిభసురుగ్వక్త్రన్ మదోన్మత్తబం
    భరవేణిన్ గని నీటిలోన, శశిసంప్రాపించనౌ వేళ, ముం
    గురులన్ స్వీయకులాప్తసంచయముగాఁ, గ్రొంబూవులౌ గన్నుదా
    మర లందున్ మకరంద మున్నదని సంభావించె షట్పాదముల్.

    రిప్లయితొలగించండి
  8. కం:తిరుగక తోటల యందున
    మర లందున శుద్ధి జేయ మకరందము నె
    వ్వరొ పారిశ్రామికు లా
    మరలందున్ గనె భ్రమరము మకరందమ్మున్”
    (ఆ భ్రమరానికి కష్ట పడకండా మరలలో తేనె లభిస్తోంది.)

    రిప్లయితొలగించండి
  9. విరబూసిన సుమముల కై
    తరువులు వెదకంగ యుదయ,తారస పడెనే
    చెరువుల నందు చివర తా
    మరలందున్ గనె భ్రమరము మకరందమ్మున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వెదుకంగ నుదయ... చెరువుల యందు..' అనండి.

      తొలగించండి
  10. మ:తరుణుల్ స్వచ్ఛసుమమ్ములన్ గొనక యిన్తన్ తావి యేపాటి మా
    థురి నే యీయని బొమ్మ పూవులనె యెంతో మెచ్చి యా కొయ్య య
    ల్మరలం దుంచగ తుమ్మెదల్ తిరిగె కాలమ్మివ్విధిన్ మారె,న
    ల్మరలందున్ మకరంద మున్నదని సంభావించె షట్పాదముల్”
    (అల్మరా లో ఉన్న ప్లాస్టిక్ పూలని చూసి మకరందం ఉన్నదని తుమ్మెదలు భావించాయి.)

    రిప్లయితొలగించండి
  11. కం॥ సరుగున పువ్వులఁ గోయఁగఁ
    బరుగిడి జనులమ్ముటకని స్వార్థము తోడన్
    విరులను గూర్చిన వింజా
    మరలందున్ గనె భ్రమరము మకరందమ్మున్

    మ॥ త్వరితంగానటు తెల్లవారకనె సంపాదించఁగన్ విత్తమున్
    విరులన్ గోయఁగ స్వార్థ చింతనను బెంబేలెత్తుచున్ దేటియల్
    పరికించంగను దీక్షతో మిగుల పుష్పాలంకృతంబైన చా
    మరలందున్ మకరంద మున్నదని సంభావించె షట్పాదముల్

    రిప్లయితొలగించండి
  12. "కందము"
    దరిజేరిన దాసులకు సు
    పరిచితుడుగ భుక్తి నిచ్చు పర్యాయమునన్
    పరమ శివుడు బంపిన తా
    మరలందున్ గనె భ్రమరము మకరందమ్మున్

    సదానందం కందారపు - హైదరాబాద్

    రిప్లయితొలగించండి
  13. సురుచిరముగ సతతమ్మును
    దిరుగాడుచుఁ గూఁత లిడుచుఁ దృప్తిం గొనుచున్
    సరసీ జాతమ్ములఁ దా
    మర లందుం గనె భ్రమరము మకరందమ్మున్


    ధరలోనన్ భ్రమ రాలి యత్యధిక నందం బిచ్చు వర్ణింపఁగా
    వర కావ్యమ్ముల సత్కవీంద్రులకుఁ బుంభామా విలాపమ్మునే
    యరవిందమ్ముల నన్య పుష్పతతిఁ జైత్రాంతర్గ తాంచన్మ హా
    మర లందున్ మకరంద మున్నదని సంభావించె షట్పాదముల్

    [అమర = మామిడి చెట్టు]

    రిప్లయితొలగించండి

  14. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    తిరుగుచు వనమ్ము నంతయు
    విరులెక్కడ కానరాక వేదనతోడన్
    సరసున తుదకున్ పలు తా
    మరలందున్ గనె భ్రమరము మకరందమ్మున్.

    రిప్లయితొలగించండి
  15. తరతమభేదములెంచక
    పరిమళమునుచిమ్మునట్టి ప్రతిపుష్పముపై
    సరసతతో వాలుచు తా
    *“మరలందున్ గనె భ్రమరము మకరందమ్మున్”*

    తరువుల్ గొట్టగ పూలతల్ విరుల నెత్తావున్ గనన్ జాలమిన్
    సరసున్జేరుచు వేగమే యెగురుచున్ సంతోషమేహెచ్చగా
    పరుగుల్దీయుచు నెల్లయున్కలియుచున్ పానంబుచేయంగ తా
    మరలందున్ మకరందమున్నదని సంభావించె షట్పాదముల్ .

    రిప్లయితొలగించండి