ఆ.వె:భీమ సేను విడచి పెట్టి కర్ణుడు ఘటో త్కచుని, సుతునిఁ జంపెఁ, గైటభారి యర్జునునకు నింక హాని లేదని సంత సించె తనదు మాయ చెల్లి నంత (కర్ణుడు తల్లి కిచ్చిన మాట ప్రకారం భీముణుడికి హాని తలపలేదు కానీ అతని సుతుడైన ఘటోత్కచుణ్ని చంపాడు.కృష్ణుడు అతని మరణం తో అర్జునుని కి ప్రమాదం తప్పిందని సంతోషించాడు.)
ఆటవెలది
రిప్లయితొలగించండిబ్రహ్మశాపముండ బర్బరీకుని మీద
కృష్ణమూర్తి చేతి కృత్యమగుట
లోక శుభమనుచు కురుక్షేత్రమున ఘటో
త్కచుని సుతునిఁ జంపెఁ గైటభారి
చంపకమాల
తొలగించండిప్రచలిత బ్రహ్మ శాపమున బంకజనేత్రుడు బర్బరీకుఁ దే
ఱుచ ననివార్యమై, బలికి రూఢిగఁ దానుగ నొప్పినంత కో
రుచుఁ దన శీర్షమే యనిని లోకన జేయగ, వీరునిన్ ఘటో
త్కచుని కుమారునిం దునిమెఁ గైటభవైరి గరమ్ము బ్రీతితో!
దురమునందు నాడు ద్రోణ సుతుడు ఘటో
రిప్లయితొలగించండిత్కచుని సుతునిఁ జంపెఁ ; గైటభారి
శాపమిడె నతనికి జాడ్యముతోడుత
పెక్కు వత్సరములు ప్రేముడించ
రిప్లయితొలగించండిబలములేని వారి పక్షమున్ జేరెద
వీరు విరలనెడి భేదమెంచ
ననుచు చెప్పినట్టి యగ్రగుడగు ఘటో
త్కచుని సుతునిఁ జంపెఁ గైటభారి
వచనము చేసె బర్బరుడు భండన మున్ బల హీన పక్షమం
దు చెలగువాడనంచు తనతో వచియించిన వాడు గాంచగా
విచలిత మానసమ్ముగల వీరుడు వీడని యెంచుచున్ ఘటో
త్కచుని కుమారునిం దునిమెఁ గైటభవైరి గరమ్ము బ్రీతితో.
ఉచితవిధానమున్ జరుగ యుద్ధము కౌరవవంశమందు, నూ
రిప్లయితొలగించండిని చతురయుక్తి యాదవు డనిన్ జననీయక బర్బరీకు, న
క్తచరుశిరంబునున్ వరముగాఁగొని మాన్పగ శాపమున్, ఘటో
త్కచుని కుమారునిం దునిమెఁ గైటభవైరి గరమ్ము బ్రీతితో!
బర్బరీకుడెంచె బవరము సేయగా
రిప్లయితొలగించండిమార్గమందునిల్పె మాధవుండు
అడిగినట్టివరము నాతడొసగ ఘటో
త్కచుని సుతునిఁ జంపెఁ గైటభారి
అచలితమైన పంతమున నాతడు సాగెను యుద్ధభూమికై
సుచరితుడాతనిన్ నిలిపి సూక్ష్మముఁ గైకొనె మారురూపమున్
విచలితుడైన సౌరథుడు వింతగ నీయ వరంబటన్ ఘటో
త్కచుని కుమారునిం దునిమెఁ గైటభవైరి గరమ్ము బ్రీతితో
ఆ.వె:భీమ సేను విడచి పెట్టి కర్ణుడు ఘటో
రిప్లయితొలగించండిత్కచుని, సుతునిఁ జంపెఁ, గైటభారి
యర్జునునకు నింక హాని లేదని సంత
సించె తనదు మాయ చెల్లి నంత
(కర్ణుడు తల్లి కిచ్చిన మాట ప్రకారం భీముణుడికి హాని తలపలేదు కానీ అతని సుతుడైన ఘటోత్కచుణ్ని చంపాడు.కృష్ణుడు అతని మరణం తో అర్జునుని కి ప్రమాదం తప్పిందని సంతోషించాడు.)
యుద్ధ రంగ మందు యో ధు డై నిలువంగ
రిప్లయితొలగించండిమాధ వుండు వాని మట్టు బెట్ట
బర్భ రీకు వరము పాటింప గా ఘ టో
త్క చుని సుతుని జంపె కైట భారి
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి2)చం:వచననిబద్ధుడై విడచి వైచియు కర్ణుడు భీమసేనునిన్
రిప్లయితొలగించండివిచలిత రీతి గాసి బడ వేసెడు మాయలమారి యౌ ఘటో
త్కచుని, కుమారునిం దునిమెఁ, గైటభవైరి కరమ్ము బ్రీతితో
"రుచిరమె" యంచు చిర్నగవు రువ్వెను పార్థుని కీడు తొల్గుటన్.
(ఇది కూడా పై భావమే.)
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఆ॥ చదివినది తెలుపఁగఁ జదివినటుల ఘటో
రిప్లయితొలగించండిత్కచుని సుతునిఁ జంపెఁ గైటభారి
పలుక నేల వింత పలుకులీ పగిదినిఁ
గచుని సుతునిఁ జంపెఁ గైటభారి
చం॥ కచునకుఁ బుత్రుఁడున్నటులఁ గావ్యము లందునఁ గాంచ లేదయా
కచునకు దేవయాని తన కాంక్షనుఁ దెల్పఁగ నొప్ప లేదటం
చు చదివి యుంటి నేనటులఁ జూచిన పాఠము నందునన్ ఘటో
త్కచుని కమారునిం దునిమెఁ గైటభవైరి గరమ్ము బ్రీతితో
పెనుకొండ రామబ్రహ్మం బెంగుళూరు
ముని సుర నర వరులఁ బ్రోవఁగ గుణము లం
రిప్లయితొలగించండిదధమునిం గుమతిని మధు వరాఖ్యు
రాక్షస గణ ముఖ్యు భ్రమరాలి సన్నిభ
కచుని సుతునిఁ జంపెఁ గైటభారి
[కచము=జుట్టు]
విచలిత మౌని సంచయుని వీరవరేణ్యునిఁ బాపకర్ము సం
కుచిత దురాత్ము నగ్నిముఖ కోటి విరోధి ఘనాసితప్రభా
త్వచు ఖలుఁ గైట భాఖ్య ఘన దైత్యుఁ దృణీకృత ఘోర సంచర
త్కచుని కుమారునిం దునిమెఁ గైటభవైరి గరమ్ము ప్రీతితో
[కచము=మేఘము]
కదన రంగ మందు కర్ణుడు తాఘటో
రిప్లయితొలగించండి*త్కచుని సుతుని చంపె ,కైట భారి*
దలచె పవి యొసగిన దాని వలన దప్పె
యర్జునునకు మృతియ టంచు మదిని
వచనమొసంగియుండగనువాసిగతల్లికికర్ణుడచ్చటన్
విచలితుడౌక తానచటభీమునిజంపక వేగమా ఘటో
*త్కచునికుమారునిం దునిమె గైటభవైరిగరమ్ము ప్రీతితో*
రుచికరమైనవార్తయనిరువ్వుచునవ్వునుపల్కె క్రీడితో
బ్రహ్మ శాపుఁడైన బర్బరీ కునికృష్ణుఁ
రిప్లయితొలగించండిడంద రెదుట తనదు నాయుధమున
యుద్ధ రంగ మందు నౌద్ధత్యమునఘటో
ట్కచుని సుతునిఁజంపెఁ గైటభారి
కచునికి దేవయానికినిఁగల్గినబిడ్దనుజూచి కృష్ణుఁడే
రిప్లయితొలగించండియచలితమానసంబున
భయానక రూపమునొందియాఘటో
త్కచుని కుమారునిం దునిమెఁ గైటభవైరి గరమ్ము బ్రీతితోఁ
బ్రచురితమాయెదుష్టులకుభైరవుఁడిచ్చెడుశిక్ష లిట్లెయౌ
చం:కచు డసురాళి చేష్టలకు కాయము వీడగ దుఃఖ మొంది యా
రిప్లయితొలగించండిసుచరితు దండ్రి తల్చి మధుసూదను మ్రొక్కెను "రాక్షసాళి నా
కచుని, కుమారునిం దునిమెఁ ,గైటభవైరి !గరమ్ము బ్రీతితో
కచునికి బ్రాణదాన మిడి కాచగదే!"యని దోసి లొగ్గుచున్
(కచుణ్ని యథాతథం గానే ఉంచాను. కచుడు మరణించిన విషయం తెలిసిన బృహస్పతి విష్ణువును ప్రార్థించాడు.)