20, ఫిబ్రవరి 2025, గురువారం

సమస్య - 5040

21-2-2025 (శుక్రవారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అతివయే మూలమౌఁ గలహమ్ములకును”
(లేదా...)
“అతివయె మూలమౌను గలహమ్ములకున్ భువిలోన నెప్పుడున్”

41 కామెంట్‌లు:

  1. చంపకమాల
    క్షితిగన నెల్లరిన్ భ్రమల కీర్తియు కాంతయు కన్కమన్నవే
    కుతిగొన జేయునంచనరె కోరికలూరగ మోహమద్దుచున్
    వెతలను ధార్తరాష్ట్రులును వెన్కటిరావణులొంద, నన్యయౌ
    యతివయె మూలమౌను గలహమ్ములకున్ భువిలోన నెప్పుడున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తేటగీతి
      కీర్తి, కాంతయు, కన్కము లార్తి పెంచు
      కౌతుకము రగిలించెడు హేతువనఁగ
      ధార్తరాష్ట్ర, రావణ వధ ధరణి జూడ
      అతివయే మూలమౌఁ గలహమ్ములకును!

      తొలగించండి
    2. మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    3. 🌻ధన్యోస్మి గురుదేవా!🌻తమరు సూచించిన సవరణలతో...

      తేటగీతి
      కీర్తి, కాంతయు, కనకము లార్తి పెంచు
      కౌతుకము రగిలించెడు హేతువనఁగ
      ధార్తరాష్ట్ర, రావణ వధ ధరణి జూడ
      అతివయే మూలమౌఁ గలహమ్ములకును!


      చంపకమాల
      క్షితిగన నెల్లరిన్ భ్రమల కీర్తియు కాంతయు హేమమన్నవే
      కుతిగొన జేయునంచనరె కోరికలూరగ మోహమద్దుచున్
      వెతలను ధార్తరాష్ట్రులును వెన్కటిరావణులొంద, నన్యయౌ
      నతివయె మూలమౌను గలహమ్ములకున్ భువిలోన నెప్పుడున్

      తొలగించండి
  2. -
    అతివయే మూలమౌ కలహమ్ములకు ను
    డువుట సహజము పెద్దలు; డోలు గట్టి
    దంచు దానిని కొట్టగ దాని నుండి
    శబ్ధము వెలువడదకొ విచారశీలి!



    రిప్లయితొలగించండి
  3. గత చరిత్రల నెల్లను గాంచి నపుడు
    నెల్ల వారలకు దోచును నిజము గాగ
    నతి వ యే మూల మౌ కలహమ్ము లకును
    సమ ర ములు సాగి నశియించె క్రమము గాను

    రిప్లయితొలగించండి
  4. వల్లభుడవిరతము త్రాగి వచ్చుచుండ ,
    నతివయే మూలమౌఁ గలహమ్ములకును .
    పతిని సరిదిద్దుకొన నామె పన్ను సకల
    యత్నములు సఫలమగు నీయవనియందు

    రిప్లయితొలగించండి
  5. గతమున జర్గినట్టి కథ గాంచగ
    గోచరమౌను బూర్తిగా
    మతి చెడినట్టి శూర్పనక మానిని
    ద్రౌపదియొక్క మాటలే
    యతి రణరంగమాయె జని రందున
    రావణ ధార్తరాష్టులున్
    అతివయె మూలమౌను కలహం
    బులకున్ భువిలోన నెప్పుడున్.

    రిప్లయితొలగించండి
  6. స్తుతమతి యైన సీత,పతి తోడుగ కానకు వచ్చె గాని దై
    త్యతతుల కేమి జేసె? మరి దాయలు మత్సరమెక్కి పట్టె ద్రౌ
    పతిని! నిజమ్ము మానవతి పాపములుండెనె? యే విధమ్ముగా
    నతివయె మూలమౌను గలహమ్ములకున్ భువిలోన నెప్పుడున్??

    రిప్లయితొలగించండి
  7. నాడు పలు దేశములమధ్య నడచు. వాటి
    కతివయే మూలమట గలహమ్ములకును ;
    నేడు ప్రతియింటినందున నిత్యముగన
    నతివయే మూలమౌఁ గలహమ్ములకును

    రిప్లయితొలగించండి
  8. తే॥ చతురత విడిచి కోర్కెల సాధనఁ గన
    సతతము పతిని వేధించి సఖ్యత మదిఁ
    దలఁపక చరించు కఠినత తరుణి పడయ
    నతివయే మూలమౌఁ గలహమ్ములకును

    చం॥ చతురత వీడి వర్తిలుచు సంపద లేమినిఁ గాంచఁ జాలకన్
    సతమత మౌచు కోర్కెలను సాధ్యత నెంచకఁ దీర్చఁ గోరుచున్
    సతతము కష్టపెట్టుచును సఖ్యతఁ బాసి చరించు చుండఁగా
    నతివయె మూలమౌను గలహమ్ములకున్ భువిలోన నెప్పుడున్

    రిప్లయితొలగించండి
  9. రిప్లయిలు
    1. మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
      'మూలమౌ విరహమ్ములకును, మూలమౌ విజయమ్ములకును' అన్నపుడు అరసున్నలు అవసరం లేదు.

      తొలగించండి
    2. ధన్యవాదాలు గురూజీ 🙏

      అతివయే మూలమౌఁ గద హమ్మునకును
      అతివయే మూలమౌ విరహమ్మునకును
      అతివయే మూలమౌఁ గలహమ్ములకును
      అతివయే మూలమౌ విజయమ్ములకును

      పతులకు వెన్నుదన్నులన పత్నులనే గద చూపుచుంద్రు నే
      డతివల పాత్రలేక పరమాద్భుత కార్యములే సుసాధ్యమా!
      అతివయె మూలమౌను విజయమ్ములు నెక్కొన నిశ్చయంబుగా
      నతివయె మూలమౌను గలహమ్ములకున్ భువిలోన నెప్పుడున్

      తొలగించండి
  10. ధరణిజను చెఱఁబట్టిన దానవుండు
    రావణుని గూల్చె రాముఁడు రణమునందు
    అతివయే మూలమౌఁ గలహమ్ములకు, ను
    విదను కామదృక్కుల జూడ వెతలు మిగులు

    రిప్లయితొలగించండి
  11. సతతము సచ్చరిత్రలగు సాధ్వుల నారడిపెట్టు రావణుల్
    వితతముగా సతీమణుల వేసటబెట్టు సుయోధనాదులున్
    యతివల యాగ్రహమ్మునకు నంతమునొందిరి వీక్షసేయగా
    నతివయె మూలమౌను గలహమ్ములకున్ భువిలోన నెప్పుడున్

    రిప్లయితొలగించండి
  12. మతియతివర్తనంబునకు మర్మము కాలము చెల్లుటౌను దు
    ర్మతులగు వారి దౌష్ట్యపు పరాక్రమమెంతగ చూపబోయినన్
    అతివయె మూలమౌను గలహమ్ములకున్ భువిలోన నెప్పుడున్”
    పతనము కాకతప్పదట పాపపు చర్యల కారణంబుచే

    రిప్లయితొలగించండి
  13. తే.గీ:"అందరకు మోహమున్ గూర్చు నంద మైన
    యతివయే మూలమౌఁ గలహమ్ములకు"న
    టంచు నిజము పల్కిరి సమస్య యిట నేది?
    యతివయే మూలమౌ కలహమ్ములకును.
    (ఉన్న నిజం ఉన్నట్టు చెప్పేసారు కదా! పూరించటానికి సమస్య ఏముంది? అని.)

    రిప్లయితొలగించండి
  14. చం:అతివకు స్వేచ్ఛ కావలయు నందురు,స్వేచ్ఛ యొసంగ వేషమం
    దతి యగుచుండు,స్త్రీని గని నంతట మోహము జెంది యెవ్వడో
    అతి యొనరించు,స్త్రీకి కరవయ్యెను రక్షణ యంచు గోల యౌ
    అతివయె మూలమౌను గలహమ్ములకున్ భువిలోన నెప్పుడున్”
    (స్త్రీ ఇంటి పట్టున ఉంటే ఆమెకి స్వేచ్ఛ లేదంటారు.ఆమెకి స్వేచ్ఛ ఇస్తే ఆమె వేష భాషల్లో అతి చెయ్య వచ్చు. కొన్ని సార్లు ఆడదాని పట్ల మోహం తో ఎవడో అతి చెయ్య వచ్చు.అప్పుడు మళ్లీ స్త్రీకి రక్షణ లేదంటారు.మొత్తానికి స్త్రీతో ఏదో ఒక సమస్య ఉంటుంది.)

    రిప్లయితొలగించండి
  15. పతిని తృణీకరింప నొక వామ రగిల్చెను దక్ష వాటికన్
    హితము నధఃకరించె నొక యింతి దశానను నాశ హేతువై
    సతి కవమానమే దలప సంక్షయ హేతువు కౌరవాళికౌ
    నతివయె మూలమౌను గలహమ్ములకున్ భువిలోన నెప్పుడున్

    రిప్లయితొలగించండి
  16. అతివయే మూలమౌ సృష్టికంత దెలియ
    నతివయే శక్తియై జగమంత వెలయు
    నతి వలదనదగదిటుల దపహసితమె
    టతివయే మూలమౌఁ గలహమ్ములకును

    రిప్లయితొలగించండి
  17. “అతివయె మూలమౌను గలహమ్ములకున్ భువిలోన నెప్పుడున్”

    అతివయె మూలమౌను గలహమ్ములకున్ భువిలోన నెప్పుడున్
    మతియదిలేనిమాటలివి మానినిఁకించగ జూడ భావ్యమే
    స్తుతిపదమైన జన్మమని సుంతయు గాంచక పల్కుటేలనో
    కతనము నోర్పు వీడుటని గాదిలి కాదని నమ్ము సోదరా

    రిప్లయితొలగించండి
  18. పర దనమ్ముల పైనఁ దనరెడు నాస
    పరుల దారల కయి మదిఁ బరఁగు కోర్కి
    పరుల నేలఁ జూఱఁగొను తపనయు సత్య
    మ తివయే మూలమౌఁ గలహమ్ములకును

    [తివ = త్రికము]


    సతి యగు సీతకై యసుర సంతతి సచ్చెను వత్సరమ్మునన్
    సతి నగ వక్కజమ్ముగను జ్ఞాతుల నెల్ల వధించె నాజిలోఁ
    గుతకుత లాడు నాగమ ప్రకోపము కూల్చెను మానవాళినే
    యతివయె మూల మౌను గలహమ్ములకున్ భువి లోన నెప్పుడున్

    రిప్లయితొలగించండి
  19. చ.
    పతితవిధర్మసంగతికి ప్రాప్తమ సౌఖ్యమ దెట్లు కామనా
    జితులయి రావణుండును విశేషబలుం డగు నట్టి వాలియున్
    వెతలను జిక్కలేద చెరఁ బెట్టి పరాంగన నాజిఁ గూలగా
    నతివయె మూలమౌను గలహమ్ములకున్ భువిలోన నెప్పుడున్ !

    రిప్లయితొలగించండి
  20. అతివయె మూలమౌను గలహమ్ములకున్ భువిలోన నెప్పుడున్
    మతియదిలేనిమాటలివి మానినిఁకించగ జూడ భావ్యమే
    స్తుతిపదమైన జన్మమని సుంతయు గాంచక పల్కుటేలనో
    కతనము నోర్పు వీడుటని గాదిలి కాదని నమ్ము సోదరా

    రిప్లయితొలగించండి

    రిప్లయితొలగించండి
  21. 1. అతివను సృష్టిఁజేసి తన యాత్మను నిచ్చెను సృష్టి కార్యమై
    ప్రతిమలఁబోలు నందమును ప్రాప్తపు నోరిమి పొందుపర్చియే
    హితమును గూర్చ బందుగుల హీనత లేకయె యుక్తి తోడ నా
    యతివయె మూలమౌను గలహమ్ములకున్ భువిలోన నెప్పుడున్
    2. పతి తన దైవమంచు ప్రతి బల్కదు మీరియు సేవచేయుగా
    గతియును దప్పు భర్తకును గారవ మిచ్చియు మార్గదర్శియై
    చితికిని జేరుదాక కన చింతన సేయగ నేల నిందలో
    అతివయె మూలమౌను గలహమ్ములకున్ భువిలోన నెప్పుడున్!!

    రిప్లయితొలగించండి

  22. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    ద్రౌపదియె మహాభారత రణమునకును
    కారణము; రామరావణ కదనమునకు
    రాముని సతి జానకియె కారణము గద!
    అతివయే మూలమౌఁ గలహమ్ములకును.

    రిప్లయితొలగించండి
  23. సదన మందు సంతసమది సతత ముండ
    నతివయే మూలమౌ, కలహమ్ములకును*
    కారణము లౌదురటనట కాంత లగన
    నహము చూపుచు మరికొంద రతివ లుంద్రు


    పతిసుఖమున్ సదా మదిని వాంఛను చేయుచు ప్రొద్దుపుచ్చుచున్
    క్షితిగడుపంగయోచనముచేయుచునుండిగృహమ్ములోపలన్
    నతివయె మూలమౌను,కలహమ్ములకున్ భువిలో న నెప్పుడున్
    చతురతతోడతంపులనుచక్కగపెట్టుచుకొందరుందురే

    రిప్లయితొలగించండి