23-2-2015 (ఆదివారం)ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“రణమె యశమును గవిరాజుల కిడు”(లేదా...)“రణమొనరింపకుండఁ గవిరాజుల కచ్చపుఁ గీర్తి గల్గునే”
ఆటవెలదివాణి దయను విద్య రాణింప నేర్చియుచెణుకుల నవధాన సిరులు పండఁబ్రాజ్ఞలు వొగడఁగ నలంకారయుక్త పూరణమె యశమును గవిరాజుల కిడు! చంపకమాలప్రణతులతో సరస్వతిని రాజిత విద్యను బొందవేడుచున్జెణుకులు చిందు పాటవము సేకొని పృచ్ఛకులెల్ల నొప్పెడున్గణుతి వధానమున్ సలిపి కమ్రపు రీతి కవిత్వ మద్ది పూరణమొనరింపకుండఁ గవిరాజుల కచ్చపుఁ గీర్తి గల్గునే?
గణములు పద్య పాదములు కావ్య రసమ్ములు మేటి పాత్ర భాషణములు శబ్ధ భావములు సారమెఱింగెడి శైలిఁ గూర్చుచున్ప్రణయము మీర వ్రాసినను పాఠక బృందము మోదమొంది ధారణమొనరింపకుండఁ గవిరాజుల కచ్చపుఁ గీర్తి గల్గునే!!
కవుల సంస్థ యందు కైపదము నొకటిపూరణ సలుపుడని పురజనులిడ వలనగు నెరినెంచి పద్య శాస్త్రపు యాచరణమె యశమును గవిరాజుల కిడు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
ప్రణతులతోడ భారతికి ప్రార్ధన జేసియు యప్ట పృచ్ఛకాగణమతి పెక్కు రీతులను కక్కసప్రశ్నలు వేయ నేర్పుతోనణుకువతోడ నుత్తరము నందరకిచ్చు వధాని , సాహితీరణమొనరించకుండ కవిరాజుల కచ్చపు కీర్తి కలుగునే"
చెణుకుల తోడ సాగెడివి శ్రేష్ఠుల గోష్ఠులు రాయలాస్థమున్గణనము చేయజాలనగు కావ్యములల్లె కవీంద్రబృందముల్చణమును రామలింగడివి చాటువులొప్పుగ చెప్పు శైలి ధారణమొనరింపకుండఁ గవిరాజుల కచ్చపుఁ గీర్తి గల్గునే”
తేట తేనె లూరు తెలుగు దనమునింపు కవుల గౌరవించు కల్పతరువు'శంకరాభరణము' జ్ఞాననికేతన తోరణమె యశమును గవిరాజుల కిడు
పండి తాళి మెచ్చు పద్యము లల వో క నల్లు ప్రజ్ఞ కలుగు నాశు కవి గ పేరు గాంచి నట్టి విజ్ఞాని చేయు పూ రణ మె యశమును గవి రాజుల కిడు
ప్రణవ సునాదలోల వర వాగ్విభవాన్విత వాణి కెన్నికన్గుణమయ ఛందరీతులను గూర్చి సముత్పల చంపకంబులన్ మణి మకుటంబులన్ శతక మంగళ హారతులిచ్చి వేడ్క తోరణమొనరింపకుండఁ గవిరాజుల కచ్చపుఁ గీర్తి గల్గునే
క్షణమునకొక క్రొత్త కవితను విరచించిగణుతికెక్కదలచి కవివరుండు గణములఁ బసరించె కైతలరాణి వరణమె యశమును గవిరాజుల కిడుక్షణమున కైతలల్లి గుణకావ్యములన్ వెలయించు వానిగాగణుతి లభింపవచ్చునని కన్నకలల్ నెరవేరు రీతినిన్ మణియననొప్పు కూర్పునకు మాటలబోటి కృపారసప్రసారణమొనరింపకుండఁ గవిరాజుల కచ్చపుఁ గీర్తి గల్గునే
నెరిగ సమితి యందు నిత్యము ఛందస్సునుచిత రీతి నడప కుండ ప ద్యములనుకుటిల తెరగు కూర్చు కుకవుల తోఠుతరణమె యశమును గవిరాజుల కిడు
గణములఁ సరిజూచి కలమును కదిలించిపదముపదమునందు మధువునింపిపృచ్ఛకాళి మెచ్చు హృద్యమౌ పద్య పూరణమె యశమును గవిరాజుల కిడు
గణములయందు దృష్టినిడి కమ్మని మాటల పోహళించుచున్ప్రణవమువంటి ప్రాసఁ, యతిఁ బన్నుగఁ గూరిచి భావయుక్తమౌచెణుకులు నింపు వర్ణనలఁ జెన్నుగ సల్పుచు హృద్యమైన పూరణమొనరింపకుండఁ గవిరాజుల కచ్చపుఁ గీర్తి గల్గునే
చెణకుచునుండు పద్యము రచించెడి బాలుడు చేయు తొందరన్గణముల కూర్చుటందు గొరగామిగ జేయ భరిఃచ లేమియౌగుణమును గల్గియుండ దగుకోపమునొందుచు వాని తోడనేరణమొనరింపకుండఁ గవిరాజుల కచ్చపుఁ గీర్తి గల్గునే
పద్యమల్లుటందు పట్టునుపడయుచుక్షణమునందె వ్రాయు శక్తి యున్న గాని ఘనముగా ను కడపటి తెలుపుధా*రణమె యశమును కవిరాజులకిడు*[ గణములు ప్రాసలన్సతము కమ్మగ కూర్చుచుమంచి పద్యముల్క్షణమునచెప్ప వచ్చునటకౌతుకమొప్పవధానమందునన్గణనముచేయుచున్తుదకుగాభరలేకయవెల్ల వేగధా*రణమొనరింపకుండ కవిరాజుల కచ్చపు కీర్తి కల్గునే*
శంకారాభరణం వారి సమస్య23/02/2025/ఆదివారమురణమొనరింపకుండ గవిరాజుల కచ్చపు గీర్తిగల్గునేప్రణతులు జేసి ముందు కవిరాజులు వాణికి భక్తితోడుగన్ఘనతరమైన పద్యములు గంటకు వందల నప్పజెప్పినన్సునిశితమైన బాణములు సూటిగ వేసెడు పృచ్ఛకాళితోరణమొనరింపకుండ గవిరాజుల కచ్చపు గీర్తిగల్గునేఆర్కే శర్మ
గణములు ప్రాసలున్ యతుల గ్రాహ్యత మేలుగ సంతరించినన్చెణుకులు సద్విశేషములు చిక్కుల లంకెల తోడగూడి ప్రేరణనిడు కంది శంకరుల ప్రాగ్ర్య సమస్యలవెల్ల లెస్స పూరణమొనరింపకుండఁ గవిరాజుల కచ్చపుఁ గీర్తి గల్గునే
చక్కని సభ లోన శబ్దార్థ భావ నైపుణ్యము పరికించు పూన్కి యందుఁగవి గణమ్ము తోడి కమనీయ భాషార్థ రణమె యశమును గవిరాజుల కిడు తృణ నిభ భావ యోగ మితివృత్త లయమ్ము ద్రుతైక సంధి మారణము కడింది గ్రామ్య పద రాగ నిమగ్న మనోరథమ్ము దారుణ వికృతోప మావళి విరోధి సమాస వృథాప శబ్ద వారణ మొనరింపకుండఁ గవి రాజుల కచ్చపుఁ గీర్తి గల్గునే
ఆ.వె:"ఎపుడు దత్తపదుల,కీ సమస్యలకు పూరణమె యశమును గవిరాజుల కిడు"నంచు దలతురేల యందమౌ కావ్యముల్ వ్రాయ నెంచు డయ్య రసిక కవులు(పూరణలు,అవధానాలు శాశ్వతం గా నిలవవు.అందమైన కావ్యం వల్ల ప్రయోజనం ఎక్కువ.పది కాలాలు నిలుస్తుంది.)
నిండు సభను జక్క నిపదము లుగలపూ రణమె యశమును గవిరాజుల కిడు దేట తెనుఁగు భాష తీయగా వినువార లమన ములకు సంత సముల నిచ్చు
పిన్నక నాగేశ్వరరావు.హైదరాబాద్.పద్యములను వ్రాసి భావ యుక్తమ్ముగాఅన్వయమున లోప మసలు లేకమాధ్యమమున నిడు సమస్యలన్నింటి పూరణమె యశమును గవి రాజులకిడు.
చం:గణముల గూర్చ సుంతయును కష్టము నొందక యాశుధార తోమణులను బోలు బద్యముల మాకు నొసంగిరి, నెగ్గి రయ్య పూరణముల నో వధాని వర !రాజిల జేయుడు ధారణమ్ము,ధారణమొనరింపకుండఁ గవిరాజుల కచ్చపుఁ గీర్తి గల్గునే!”(అవధానం లో సమస్య లన్నిటిని చక్కగా పూరించిన అవధానిని మెచ్చుకొని ఇక ధారణ కూడా చేసెయ్యండి అని సంచాలకులు,ప్రాశ్నికులు అన్నట్టు.)
ఆటవెలది
రిప్లయితొలగించండివాణి దయను విద్య రాణింప నేర్చియు
చెణుకుల నవధాన సిరులు పండఁ
బ్రాజ్ఞలు వొగడఁగ నలంకారయుక్త పూ
రణమె యశమును గవిరాజుల కిడు!
చంపకమాల
ప్రణతులతో సరస్వతిని రాజిత విద్యను బొందవేడుచున్
జెణుకులు చిందు పాటవము సేకొని పృచ్ఛకులెల్ల నొప్పెడున్
గణుతి వధానమున్ సలిపి కమ్రపు రీతి కవిత్వ మద్ది పూ
రణమొనరింపకుండఁ గవిరాజుల కచ్చపుఁ గీర్తి గల్గునే?
గణములు పద్య పాదములు కావ్య రసమ్ములు మేటి పాత్ర భా
రిప్లయితొలగించండిషణములు శబ్ధ భావములు సారమెఱింగెడి శైలిఁ గూర్చుచున్
ప్రణయము మీర వ్రాసినను పాఠక బృందము మోదమొంది ధా
రణమొనరింపకుండఁ గవిరాజుల కచ్చపుఁ గీర్తి గల్గునే!!
కవుల సంస్థ యందు కైపదము నొకటి
రిప్లయితొలగించండిపూరణ సలుపుడని పురజనులిడ
వలనగు నెరినెంచి పద్య శాస్త్రపు యాచ
రణమె యశమును గవిరాజుల కిడు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిప్రణతులతోడ భారతికి ప్రార్ధన
రిప్లయితొలగించండిజేసియు యప్ట పృచ్ఛకా
గణమతి పెక్కు రీతులను కక్కస
ప్రశ్నలు వేయ నేర్పుతో
నణుకువతోడ నుత్తరము నందర
కిచ్చు వధాని , సాహితీ
రణమొనరించకుండ కవిరాజుల
కచ్చపు కీర్తి కలుగునే"
చెణుకుల తోడ సాగెడివి శ్రేష్ఠుల గోష్ఠులు రాయలాస్థమున్
రిప్లయితొలగించండిగణనము చేయజాలనగు కావ్యములల్లె కవీంద్రబృందముల్
చణమును రామలింగడివి చాటువులొప్పుగ చెప్పు శైలి ధా
రణమొనరింపకుండఁ గవిరాజుల కచ్చపుఁ గీర్తి గల్గునే”
తేట తేనె లూరు తెలుగు దనమునింపు
రిప్లయితొలగించండికవుల గౌరవించు కల్పతరువు
'శంకరాభరణము' జ్ఞాననికేతన తో
రణమె యశమును గవిరాజుల కిడు
పండి తాళి మెచ్చు పద్యము లల వో క
రిప్లయితొలగించండినల్లు ప్రజ్ఞ కలుగు నాశు కవి గ
పేరు గాంచి నట్టి విజ్ఞాని చేయు పూ
రణ మె యశమును గవి రాజుల కిడు
ప్రణవ సునాదలోల వర వాగ్విభవాన్విత వాణి కెన్నికన్
రిప్లయితొలగించండిగుణమయ ఛందరీతులను గూర్చి సముత్పల చంపకంబులన్
మణి మకుటంబులన్ శతక మంగళ హారతులిచ్చి వేడ్క తో
రణమొనరింపకుండఁ గవిరాజుల కచ్చపుఁ గీర్తి గల్గునే
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిక్షణమునకొక క్రొత్త కవితను విరచించి
రిప్లయితొలగించండిగణుతికెక్కదలచి కవివరుండు
గణములఁ బసరించె కైతలరాణి వ
రణమె యశమును గవిరాజుల కిడు
క్షణమున కైతలల్లి గుణకావ్యములన్ వెలయించు వానిగా
గణుతి లభింపవచ్చునని కన్నకలల్ నెరవేరు రీతినిన్
మణియననొప్పు కూర్పునకు మాటలబోటి కృపారసప్రసా
రణమొనరింపకుండఁ గవిరాజుల కచ్చపుఁ గీర్తి గల్గునే
నెరిగ సమితి యందు నిత్యము ఛందస్సు
రిప్లయితొలగించండినుచిత రీతి నడప కుండ ప ద్యములను
కుటిల తెరగు కూర్చు కుకవుల తోఠుత
రణమె యశమును గవిరాజుల కిడు
గణములఁ సరిజూచి కలమును కదిలించి
రిప్లయితొలగించండిపదముపదమునందు మధువునింపి
పృచ్ఛకాళి మెచ్చు హృద్యమౌ పద్య పూ
రణమె యశమును గవిరాజుల కిడు
గణములయందు దృష్టినిడి కమ్మని మాటల పోహళించుచున్
రిప్లయితొలగించండిప్రణవమువంటి ప్రాసఁ, యతిఁ బన్నుగఁ గూరిచి భావయుక్తమౌ
చెణుకులు నింపు వర్ణనలఁ జెన్నుగ సల్పుచు హృద్యమైన పూ
రణమొనరింపకుండఁ గవిరాజుల కచ్చపుఁ గీర్తి గల్గునే
చెణకుచునుండు పద్యము రచించెడి బాలుడు చేయు తొందరన్
రిప్లయితొలగించండిగణముల కూర్చుటందు గొరగామిగ జేయ భరిఃచ లేమియౌ
గుణమును గల్గియుండ దగుకోపమునొందుచు వాని తోడనే
రణమొనరింపకుండఁ గవిరాజుల కచ్చపుఁ గీర్తి గల్గునే
రిప్లయితొలగించండిపద్యమల్లుటందు పట్టునుపడయుచు
క్షణమునందె వ్రాయు శక్తి యున్న
గాని ఘనముగా ను కడపటి తెలుపుధా
*రణమె యశమును కవిరాజులకిడు*
[
గణములు ప్రాసలన్సతము కమ్మగ కూర్చుచుమంచి పద్యముల్
క్షణమునచెప్ప వచ్చునటకౌతుకమొప్పవధానమందునన్
గణనముచేయుచున్తుదకుగాభరలేకయవెల్ల వేగధా
*రణమొనరింపకుండ కవిరాజుల కచ్చపు కీర్తి కల్గునే*
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిశంకారాభరణం వారి సమస్య
రిప్లయితొలగించండి23/02/2025/ఆదివారము
రణమొనరింపకుండ గవిరాజుల కచ్చపు గీర్తిగల్గునే
ప్రణతులు జేసి ముందు కవిరాజులు వాణికి భక్తితోడుగన్
ఘనతరమైన పద్యములు గంటకు వందల నప్పజెప్పినన్
సునిశితమైన బాణములు సూటిగ వేసెడు పృచ్ఛకాళితో
రణమొనరింపకుండ గవిరాజుల కచ్చపు గీర్తిగల్గునే
ఆర్కే శర్మ
గణములు ప్రాసలున్ యతుల గ్రాహ్యత మేలుగ సంతరించినన్
రిప్లయితొలగించండిచెణుకులు సద్విశేషములు చిక్కుల లంకెల తోడగూడి ప్రే
రణనిడు కంది శంకరుల ప్రాగ్ర్య సమస్యలవెల్ల లెస్స పూ
రణమొనరింపకుండఁ గవిరాజుల కచ్చపుఁ గీర్తి గల్గునే
చక్కని సభ లోన శబ్దార్థ భావ నై
రిప్లయితొలగించండిపుణ్యము పరికించు పూన్కి యందుఁ
గవి గణమ్ము తోడి కమనీయ భాషార్థ
రణమె యశమును గవిరాజుల కిడు
తృణ నిభ భావ యోగ మితివృత్త లయమ్ము ద్రుతైక సంధి మా
రణము కడింది గ్రామ్య పద రాగ నిమగ్న మనోరథమ్ము దా
రుణ వికృతోప మావళి విరోధి సమాస వృథాప శబ్ద వా
రణ మొనరింపకుండఁ గవి రాజుల కచ్చపుఁ గీర్తి గల్గునే
ఆ.వె:"ఎపుడు దత్తపదుల,కీ సమస్యలకు పూ
రిప్లయితొలగించండిరణమె యశమును గవిరాజుల కిడు"
నంచు దలతురేల యందమౌ కావ్యముల్
వ్రాయ నెంచు డయ్య రసిక కవులు
(పూరణలు,అవధానాలు శాశ్వతం గా నిలవవు.అందమైన కావ్యం వల్ల ప్రయోజనం ఎక్కువ.పది కాలాలు నిలుస్తుంది.)
నిండు సభను జక్క నిపదము లుగలపూ
రిప్లయితొలగించండిరణమె యశమును గవిరాజుల కిడు
దేట తెనుఁగు భాష తీయగా వినువార
లమన ములకు సంత సముల నిచ్చు
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
పద్యములను వ్రాసి భావ యుక్తమ్ముగా
అన్వయమున లోప మసలు లేక
మాధ్యమమున నిడు సమస్యలన్నింటి పూ
రణమె యశమును గవి రాజులకిడు.
చం:గణముల గూర్చ సుంతయును కష్టము నొందక యాశుధార తో
రిప్లయితొలగించండిమణులను బోలు బద్యముల మాకు నొసంగిరి, నెగ్గి రయ్య పూ
రణముల నో వధాని వర !రాజిల జేయుడు ధారణమ్ము,ధా
రణమొనరింపకుండఁ గవిరాజుల కచ్చపుఁ గీర్తి గల్గునే!”
(అవధానం లో సమస్య లన్నిటిని చక్కగా పూరించిన అవధానిని మెచ్చుకొని ఇక ధారణ కూడా చేసెయ్యండి అని సంచాలకులు,ప్రాశ్నికులు
అన్నట్టు.)