23, ఫిబ్రవరి 2025, ఆదివారం

సమస్య - 5043

24-2-2025 (సోమవారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సతి గలిగిన బ్రహ్మచారి సత్పురుషుండౌ”
(లేదా...)
“సతి గల బ్రహ్మచారిఁ గని సత్పురుషుండని మెచ్చి రెల్లరున్”

33 కామెంట్‌లు:

  1. కందం
    క్షితి గోపికావిలోలుడు
    మతిమంతుఁడె? యగ్రపూజ మన్ననకెంచన్
    కుతుకాన మూలమూలకు
    సతి గలిగిన? బ్రహ్మచారి! సత్పురుషుండౌ!!

    చంపకమాల
    కుతుకము మీర గోపికలఁ గూడెడు కాముకు నెట్టులెంతు? స
    మ్మతమదె? ధర్మజా! మిగుల మన్నన బిల్చుట లగ్రపూజకున్
    హతవిధి! వెన్న దొంగఁ? గొన న్యాయమె? యింటిని మూల మూలకున్
    సతి గల బ్రహ్మచారిఁ! గని సత్పురుషుండని మెచ్చి రెల్లరున్! !

    రిప్లయితొలగించండి
  2. సతతము జపతపములతో
    వ్రతముగ సతిపొందు వీడి వర్తించెడునా
    పతినిగని లోకులనిరిటు
    సతి గలిగిన బ్రహ్మచారి సత్పురుషుండౌ

    రిప్లయితొలగించండి
  3. అతులిత మైన నిగర్వియు
    చతురతగను మాటలాడు చక్కని గుణమున్
    బ్రతుకును పండించెడి కుల
    సతి గలిగిన" బ్రహ్మచారి" సత్పురుషుండౌ!

    రిప్లయితొలగించండి
  4. స్తుతుని కుమారుడాతడగు సూత్రవతీశుడు దండనాథుడై
    ప్రతిఘటియించు తారకుని పావకి యంతము చేసె బాలుడై
    సతులుగ వల్లి వజ్రి సుత జ్ఞాన స్వరూపుని పత్నులైననున్
    సతి గల బ్రహ్మచారిఁ గని సత్పురుషుండని మెచ్చి రెల్లరున్”

    రిప్లయితొలగించండి
  5. చతురుడని సంఘమున పర
    పతి నొందిన యా చిరుతడు బ్రతుకుట జూడన్
    నతి సాధారణమైన వ
    సతి గలిగిన బ్రహ్మచారి సత్పురుషుండౌ

    రిప్లయితొలగించండి
  6. కం॥ సతతము పార్వతినిఁ గొలువ
    నతులిత భక్తిని నిలుపుచు నమ్మ కృపఁ గనన్
    ధృతి విరియుచుండు రక్షగ
    సతి గలిగిన బ్రహ్మచారి సత్పురుషుండౌ

    చం॥ సతతము నమ్మ పార్వతిని సద్గుణ సంపదఁ గాంచి శ్రద్ధతో
    నతులిత భక్తి భావమున నర్చనచేయఁగ భాగ్య మొందరే!
    ధృతిఁ గని మోదమందగను దేవి కటాక్షమె చాలు రక్షగా
    సతి గల బ్రహ్మచారిఁ గని సత్పురుషుండని మెచ్చిరెల్లరున్

    సతి పార్వతి ధృతి సంతోషము సౌఖ్యము

    రిప్లయితొలగించండి
  7. వితతముగా నహర్నిశలు వేదములధ్యయనమ్ము జేయుచున్
    సతతము బ్రహ్మచర్యమున సంశ్రయణమ్మును జూపి నద్దియే
    వ్రతముగ బూని యెన్నడును పత్ని మొగంబును జూడనట్టి యా
    సతి గల బ్రహ్మచారిఁ గని సత్పురుషుండని మెచ్చి రెల్లరున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
      *...జూపి యద్దియే* అనండి.

      తొలగించండి
  8. గతమునొనర్చినట్టి హితకార్య విశేష ఫలంబనంగ మా
    నిత శుభ వంశమందున జనించి చెలంగుచు బ్రహ్మతేజమున్
    సతము పురాణపూరుషుని సాత్విక తాత్విక చిత్తవృత్యను
    స్సతి గల బ్రహ్మచారిఁ గని సత్పురుషుండని మెచ్చి రెల్లరున్

    రిప్లయితొలగించండి
  9. సతతము వేదపాఠముల శాస్త్ర విశేష విచార గోష్ఠులన్
    వ్రతముగ మూడు సంధ్యలకు బ్రహ్మకు వందనమాచరించుచున్
    మితమది లేక విద్యలను మేలుగ నేర్చి మనమ్మునందు వా
    క్సతి గల బ్రహ్మచారిఁ గని సత్పురుషుండని మెచ్చి రెల్లరున్!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శత మర్కట సమమె గదా
      సతతము గతి తప్ప బ్రహ్మచారి వివశుఁడై
      నుతముగ పెద్దలు జూపిన
      సతి గలిగిన బ్రహ్మచారి సత్పురుషుండౌ!!

      తొలగించండి
    2. మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  10. అతులిత మాతని సత్త్వము
    సతతము శాస్త్రముఁ జదివెడు సద్గుణుడతడే
    స్థితిమంతుండై మంచి వ
    సతి గలిగిన బ్రహ్మచారి సత్పురుషుండౌ

    అతడొక బ్రహ్మచారి మరియాతని శిక్షణ వాస్తుశాస్త్రమే
    సతతము జాగరూకుడయి చక్కగ శాస్త్రము నేర్చుచుండగా
    నతనికి సంక్రమించెనొక యంగన పత్నిగ సుందరాంగియౌ
    సతి గల బ్రహ్మచారిఁ గని సత్పురుషుండని మెచ్చి రెల్లరున్

    [బ్రహ్మచారి = Bachelor Degree చదువు విద్యార్థి]

    రిప్లయితొలగించండి
  11. సతతము శివుని జ పంబును
    వితరణ శీలిగ మనుచును విద్వా o సండై
    మిత భాషి యై వర లగ వ
    సతి గలిగిన బ్రహ్మ చారి సత్పురుషుo డౌ

    రిప్లయితొలగించండి
  12. అతి మతి యున్న గొప్పకవి యద్భత
    మైన వధాన మొప్పగా
    సతతము చేయుచుండగని సర్వ
    జనావళి సంతసంబుతో
    నతులనొనర్చిమిక్కిలి గుణా
    ఘననున్ మరి, నాల్కపైన వా
    క్సతిగల బ్రహ్మచారిగని సత్పురు
    షుండని మెచ్చి రెల్లరున్

    రిప్లయితొలగించండి
  13. కం:యతివరుల దర్శనమ్ము,యు
    వతులకు దూరమ్ము దొరకి , బ్రహ్మవిదుల పం
    డితుల బ్రసంగము లుండు వ
    సతి గలిగిన బ్రహ్మచారి సత్పురుషుండౌ
    (ఒక బ్రహ్మచారి పెళ్లి కానంత మాత్రానే సత్పురుషుని గా ఉండ లేడు.అతడు ఇలాంటి వసతి లో,వాతావరణం లో ఉండాలి.)

    రిప్లయితొలగించండి
  14. చం:మితముగ నుండు సభ్యతను మీరిన చర్చలు రెచ్చుచుండ,నే
    యతివయు మాట గల్ప జగదంబగ జూచి నమస్కరించు, నే
    యతియును లేక మంత్రముల నందెడు వేళల నాల్క పైన వా
    క్సతి గల బ్రహ్మచారిఁ గని సత్పురుషుండని మెచ్చి రెల్లరున్”
    (సభ్యత లేని సంభాషణ జరుగుతుంటే అతను మితభాషి.అమ్మాయిలు మాట కలిపితే జగదంబ గా చూస్తాడు. వేదమంత్రా లందుకుంటే అతని నాలుక పై సరస్వతి నర్తిస్తుంది.)

    రిప్లయితొలగించండి
  15. విత తాగమ వేత్త విబుధ
    నుత చారిత్రుఁడు లసత్తనుండు మనమునన్
    సతతమ్ము దేవ తాను
    స్సతి గలిగిన బ్రహ్మచారి సత్పురుషుండౌ


    నుత గుణవంతురాలు సు మనోహర రూప మహా పతివ్రతా
    సతి గల ధన్య జీవిఁ గని సత్పురుషుం డని మెచ్చి రెల్లరున్
    సతతము నింద్రియమ్ములు వశమ్మున నుండఁగ వేద విద్య నా
    సతి గల బ్రహ్మచారిఁ గని సత్పురుషుం డని మెచ్చి రెల్లరున్

    రిప్లయితొలగించండి
  16. సమస్య:
    సతి గల బ్రహ్మచారిఁగని సత్పురుషుండని మెచ్చి రెల్లరున్!!

    చంపకమాల :

    ప్రతినల బూన నేల రఘు ప్రాభవమున్ వినియుండ రక్కసుల్
    గతి గల గాలిచూలి నృపు గాంచుచు నూరక యుండనోపునే
    అతివను గాంచ లంక చని యానక సాయము సేయ యుద్ధమున్
    ప్రతిభన రామబంటె యన ప్రాభవ మందిన యా సులోచనా
    సతి గల బ్రహ్మచారిఁ గని, సత్పురుషుండని మెచ్చి రెల్లరున్!!

    రిప్లయితొలగించండి
  17. హితమును కోరుచు పరులకు
    సతతము గురువుల కరుణను చక్కగ దొరకన్
    జతనము లేకయె మంచి వ
    *సతి గలిగిన బ్రహ్మచారి సత్పురుషుం డౌ*


    సతమతమొందకుండగనుచక్కగ విద్యలనేర్పుయొజ్జయున్
    సతతముమేలుకోరుచునుసన్నిహితమ్ముగనుండుమిత్రులున్
    పితవలెనాదరించుచును ప్రేమనుపంచెడువారలున్నధీ
    *సతి గల బ్రహ్మచారి గని సత్పురుషుండని మెచ్చిరెల్లరున్

    రిప్లయితొలగించండి

  18. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    హితమెంచుచు నెల్ల జనుల
    సతతము దేవుని గొలుచుచు సద్భావనతో
    కుతుకమున విద్య నేర్చు వ
    సతి గలిగిన బ్రహ్మచారి సత్పురుషుండౌ.

    రిప్లయితొలగించండి