18, అక్టోబర్ 2025, శనివారం

సమస్య - 5278

19-10-2025 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ఎలుకలెల్లఁ జేరి యినుముఁ దినెను”
(లేదా...)
“ఎలుకలు పెక్కులై యినుము నెల్లఁ దినెన్ సఖ యేమి సెప్పుదున్”

15 కామెంట్‌లు:

  1. పార్టీ అంతరంగిక సమావేశములో నేతతో సఖులు:

    ఆటవెలది
    హెచ్చరించినంత నెలుకలు వారంచు
    లెక్కజేయకుండ వెక్కిరింప
    లీలలెన్నొ పన్ని యేలికలై రేగి
    యెలుకలెల్లఁ జేరి యినుముఁ దినెను!

    చంపకమాల
    తలపుల నేరినిన్ మదిని తక్కువగాఁ దలపోయకూడదన్
    మెలకువ లేదొకో? వినక మించెడు వారిని నెల్కలంటివే!
    కలుగుల వీడుచున్ జెలఁగి గద్దెను కైవసమొంద గెల్చి య
    య్యెలుకలు పెక్కులై యినుము నెల్లఁ దినెన్ సఖ యేమి సెప్పుదున్!

    రిప్లయితొలగించండి
  2. తొలి దినముల్ గనంగనిక దూరము, కాలము మారెఁ జూడగా
    పలు దెసలన్ నవీనముగు పద్ధతులన్నియు వచ్చె, పోరుకై
    నిలుప విమానముల్, రిపులు నేర్పుగఁ బంపిరి యాంత్రికంబుగా
    నెలుకలు పెక్కులై యినుము నెల్లఁ దినెన్ సఖ యేమి సెప్పుదున్!!

    రిప్లయితొలగించండి

  3. సఖుని లోహము తెగనమ్మి స్వార్థ చిత్తు
    డా ధనమ్మును కాజేయ యత్న మందు
    పలికె నిట్లు చెలిమరి తో తెలివి లేక
    యెలుకలెల్లఁ జేరి యినుముఁ దినెను.


    పలికెడి కల్ల మాటలను వాస్తవ మంచును నమ్మునట్లుగా
    పలుకగ లేని వాడు పొరపాటును చేసితి నంచు భీతితో
    చెలిమరి సొమ్ము నమ్మియు వచించెను తత్తర పాటు నిట్లుగా
    నెలుకలు పెక్కులై యినుము నెల్లఁ దినెన్ సఖ యేమి సెప్పుదున్.

    రిప్లయితొలగించండి
  4. చ.
    విలవిలలాడుచున్ దనుజు వింతల లోకము వీడి యాశ్రయిం
    ప లలి సమాదరించితిని బద్ధతి జిల్లులు సూపి యింటిలో
    వెలలుచు రేయి నాకలుల వేగము సంధిలి దాగి దాగి యీ
    యెలుకలు పెక్కులై యినుము నెల్ల దినెన్ సఖ యేమి చెప్పుదున్ !

    రిప్లయితొలగించండి
  5. పిండపు దిట గలిగి భీరువగుటజేత
    పిల్ల వాళ్ళు గూడి బెదర గొట్ట
    మల్లు డొచ్చె ననగ , మరుగు పడెనతడు .
    ఎలుకలెల్లఁ జేరి యినుముఁ దినెను

    రిప్లయితొలగించండి
  6. బాసట యనినమ్మి పరదేశమరుగగా
    ద్రోహమెంచి సఖుని లోహమమ్మి
    చెలిమికాడు పలికెఁ జిడిముడి విడనాడి
    యెలుకలెల్లఁ జేరి యినుముఁ దినెను

    చెలువునిఁ జూచుచుండమని జెప్పి సగంధుఁడు దూరమేగినన్
    విలువగు వస్తుసంపదను వెంటనె గుట్టుగ నమ్మి పిమ్మటన్
    జెలువుఁడు పల్కెఁబోఁడిమిని జీరుకుపాటుకుఁ దావులేకనే
    యెలుకలు పెక్కులై యినుము నెల్లఁ దినెన్ సఖ యేమి సెప్పుదున్

    రిప్లయితొలగించండి
  7. ధనము పంచిపెట్టి దండిగానోట్లకై
    గద్దె లెక్కినారు పెద్ద లిపుఁడు
    తెఱఁగు జూడ తేటతెల్లమౌ నీరీతి
    యెలుకలెల్లఁ జేరి యినుముఁ దినెను

    రిప్లయితొలగించండి
  8. కలుషపు రాజకీయములఁ గాంచక దమ్మము వక్రబుద్ధితో
    విలువలు పాతిపెట్టి కడు వేదన గూర్చుచు పేదసాదకున్
    యెలుకలవోలె బొక్కసము నేలికలై దినుచుండి రక్కటా
    యెలుకలు పెక్కులై యినుము నెల్లఁ దినెన్ సఖ యేమి సెప్పుదున్

    రిప్లయితొలగించండి
  9. ఆ॥ మలచ నెలుక రూపు మరబొమ్మ లెన్నియొ
    వింత చేష్టలఁ గను విధము పరఁగ
    శాస్త్ర విద్యనెఱిగి సంధించి చూడఁగా
    నెలుకలెల్లఁ జేరి యినుము దినెను

    చం॥ ఇల మరబొమ్మ లావిధిగ నెన్నియొ మూషిక రూపు నొప్పఁగన్
    దలఁచుచు శాస్త్ర విజ్ఞతను దాలిచి చేయఁగ వింత పద్ధతిన్
    మలచుచు మీట నొక్కగను మక్కువఁ జూపుచుఁ జేరి చూడఁగా
    నెలుకలు పెక్కులై యినుము నెల్ల దినెన్ సఖా యేమి సెప్పుదున్

    మరబొమ్మ Robot

    (Robots could be designed in any shape for a specific purpose అండి దాని ఆధారంగా)

    రిప్లయితొలగించండి
  10. ప్రజల సొమ్ము కోరి పన్నాగములు పన్ని
    పనికి రాని యట్టి పలుకులాడి
    దొరికి నంత మేర దోచగ నెంచుచు
    ఎలుక లెల్ల చేరి యినుము దినెను

    రిప్లయితొలగించండి
  11. వేసిన తలుపు లవి వేసి నట్టుండఁగ
    నెట్టి వింత యయ్యె నేరి కెఱుక
    లోన నున్న యట్టి లోహమే లేదయ్యె
    నెలుక లెల్లఁ జేరి యినుముఁ దినెను


    చిలుకలఁ బోలెఁ బల్కెదరు సిగ్గన నేరక నేఁటి నేతలే
    నిలయము లెన్నొ కట్టితిమి నేలను గూల్చెను బందికొక్కులే
    కొలనులఁ బెక్కు త్రవ్వితిమి గుట్టలు కట్టెను గండుచీమలే
    యెలుకలు పెక్కులై యినుము నెల్లఁ దినెన్ సఖ యేమి సెప్పుదున్

    రిప్లయితొలగించండి
  12. ప్రజల మభ్య పెట్టి పదవులు సాధించి
    ముసుగు వీరు లౌచు మోసగించి
    ధనము మెక్కి నారు దందిగా నేడిల
    నెలుక లెల్ల జేరి యినుము దినెను

    రిప్లయితొలగించండి
  13. రిప్లయిలు
    1. సమస్య:
      “ఎలుకలు పెక్కులై యినుము నెల్లఁ దినెన్ సఖ యేమి సెప్పుదున్”

      చం.మా :

      పలురక యీతిబాధలును పంటయు పుట్టెడు చేతికందదే !
      కలుపును దీసి కోతయన కానని వెల్లువ ముంచి పోయెనే !
      పొలముకు కంచెయున్ సరని పోడిమి లోహముఁజుట్ట నేమిలే !
      కలిసమయం బిదంచు నెఱుగన్, తొలిపూజలరాయ శక్తితో
      “ఎలుకలు పెక్కులై యినుము నెల్లఁ దినెన్ సఖ యేమి సెప్పుదున్”

      తొలగించండి