25-10-2025 (శనివారం) కవిమిత్రులారా, ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది... “కర్తవ్యము మరచు జాతి గనును శుభంబుల్” (లేదా...) “కర్తవ్యంబును విస్మరించినపుడే కళ్యాణమౌ జాతికిన్” (వద్దిపర్తి పద్మాకర్ గారి శతావధానంలో యం.యస్.వి. గంగరాజు గారి సమస్య)
శా;ఆర్తిన్ బాపుచు పేద వారి కెపుడున్ న్యాయమ్ము గావించుచున్ గీర్తిన్ బొందగ నట్టి పక్ష మపుడున్ గెల్పొంద గా నీవు నీ కర్తవ్యమ్ముగ సేవ జేసితివి దీక్షన్ వీడె నా పక్ష మా కర్తవ్యంబును విస్మరించినపుడే కళ్యాణమౌ జాతికిన్” (ఆ పార్టీ ఒకప్పుదు న్యాయం గా ఉంది కనుక ఆనాదు దాని గెలుపుకి సేవ చేయటం నీ కర్తవ్యం.కానీ ఆ పార్టీ ఇప్పుదు ఆ దీక్ష వదిలేసింది. కనుక దాన్ని గెలిపించే కర్తవ్యాన్ని నువ్వు వదులుకో. )
శా.
రిప్లయితొలగించండితార్తీయారికి బద్ధులౌచు విషముల్ తాకింపగా బూని దు
ర్వార్తల్ చూపెడు మాధ్యమంపు జనులీ రాష్ట్రంబులో మంచినే
కర్తల్ వోలిక మారి ఖ్యాతిరతులై గావించి యీ దుష్టమౌ
కర్తవ్యంబును విస్మరించినపుడే కళ్యాణమౌ జాతికిన్ !
కందం
రిప్లయితొలగించండికర్తయె కర్మము క్రియ ని
ర్వర్తనమర్పించి హరికి ఫలమెంచని స
ద్వర్తన సాగుమనఁగ నే
కర్తవ్యము మరచు జాతి గనును శుభంబుల్?
శార్దూలవిక్రీడితము
ధూర్తుల్ మాత్రమె వంచనన్ పరులనే దోచంగ నాశించుచున్
వర్తింపన్ జగమీసడించుసతమున్ వారిన్ విరోధంబుగన్
కీర్తింపన్ బ్రజ బాధ్యతాయుతముగన్ గెల్పొందెడున్వారి, నే
కర్తవ్యంబును విస్మరించినపుడే కళ్యాణమౌ జాతికిన్?
కార్తీక మాస మందున
రిప్లయితొలగించండిఆర్తుల రక్షిని గొలువక , నన్నము దినుచున్
మూర్తిని బెంచుకొనెడి , యా
కర్తవ్యము మరచు జాతి గనును శుభంబుల్
వర్తన లోపించి తుదకు
రిప్లయితొలగించండికర్తవ్యము మరుచు జాతి గనునా శుభముల్?
వర్తిలు సందేహాస్పద
కర్తవ్యము మరచు జాతి గనును శుభంబుల్
కర్తవ్యోన్ముఖులై చరించు సుజనుల్ కన్పించుటే శూన్యమై
వార్తా పత్రికలందుఁ వచ్చునెపుడున్ వంచించు వృత్తాంతముల్
కర్తవ్యంబనుమానమైన పిదపన్ గాలాను గుణ్యంబునా
కర్తవ్యంబును విస్మరించినపుడే కళ్యాణమౌ జాతికిన్
ధూర్తుల్ కయ్యము లాడి దేశమునకున్ ద్రోహంబు చేబూనినన్
రిప్లయితొలగించండిస్ఫూర్తిన్ జూపుచు శత్రులన్
తునుమ సంస్ఫోటంబునన్ శక్తితో
కర్తవ్యంబుగ నెంచి తా రయముగా కాల్దృవ్వుచున్ స్వంతమౌ
కర్తవ్యంబును విస్మరించినపుడే కల్యాణమౌ జాతికిన్
(అజరా అమరవాత్ ప్రాజ్ఞో విద్యామర్థంచ సాధయేత్ ఆధారంగా ఇతర కర్తవ్యములు విద్య గడించే సమయంలో వదలిపెట్టాలి అని అండి)
రిప్లయితొలగించండికం॥ స్ఫూర్తిని విద్య బడయఁగను
వర్తిల్లరె బాల్యమందుఁ బట్టు విడవకన్
గీర్తి పొసఁగు నితరములౌ
కర్తవ్యము మరచు జాతి గనును శుభంబుల్
శా॥ స్ఫూర్తిన్ గాంచుచు విద్య నేర్వఁగను సంపూర్ణమ్మునౌ ధ్యాసతో
వర్తిల్లంగను బాల్యమందుఁ గని యభ్యాసమ్ము నిష్ఠాధృతిన్
గీర్తిన్ బొందెడు విజ్ఞుఁడై వెలుఁగు నిక్షేపమ్మునౌ నన్యమౌ
కర్తవ్యంబును విస్మరించినపుడే కల్యాణమౌ జాతికిన్
కం:కర్తవ్య బోధ జేయుచు
రిప్లయితొలగించండిగర్తవ్యము లోనె యోగ కాంతి నిడు నహం
హర్తను గృష్ణు విడి యెటుల్
కర్తవ్యము మరచు జాతి గనును శుభంబుల్”?
(శ్రీకృష్ణుని కర్మ యోగాన్ని మరిస్తే శుభం ఎలా జరుగుతుంది?)
శా;ఆర్తిన్ బాపుచు పేద వారి కెపుడున్ న్యాయమ్ము గావించుచున్
రిప్లయితొలగించండిగీర్తిన్ బొందగ నట్టి పక్ష మపుడున్ గెల్పొంద గా నీవు నీ
కర్తవ్యమ్ముగ సేవ జేసితివి దీక్షన్ వీడె నా పక్ష మా
కర్తవ్యంబును విస్మరించినపుడే కళ్యాణమౌ జాతికిన్”
(ఆ పార్టీ ఒకప్పుదు న్యాయం గా ఉంది కనుక ఆనాదు దాని గెలుపుకి సేవ చేయటం నీ కర్తవ్యం.కానీ ఆ పార్టీ ఇప్పుదు ఆ దీక్ష వదిలేసింది. కనుక దాన్ని గెలిపించే కర్తవ్యాన్ని నువ్వు వదులుకో. )
డా బల్లూరి ఉమాదేవి
రిప్లయితొలగించండికీర్తిని పొందతలంచిన
నార్తిని బాపుహరిదల్చు చనయముమదిలో
ధూర్తతవీడుచు దుష్కృత
*"కర్తవ్యము మరచు జాతి గనును శుభంబుల్”*
ఆర్తుల బాధలు దీర్చక
రిప్లయితొలగించండిధూర్తు ల కైవడి మెలగుచు దుర్మార్గము తో
వర్తిలు దేశమున నెటుల
కర్తవ్యము మరచు జాతి గనును శుభంబు ల్
సమస్య:
రిప్లయితొలగించండికర్తవ్యంబును విస్మరించి నపుడే కళ్యాణమౌ జాతికిన్
శార్దూలము :
ధూర్తుండై పరదారనే పఱిగొనే దూషించి దాచేనులే
ఆర్తిన్ శ్రీ రఘురాముడే వెతుకగా నంపేను ప్రాభంజనిన్
కీర్తిం గోరని బంటునిన్ వదలరే, కీడెంచ, కాల్చేనులే,
కర్తవ్యంబును విస్మరించి నపుడే కళ్యాణమౌ జాతికిన్
మూర్తీభవించిన విమల
రిప్లయితొలగించండివర్తన మనఁగఁ జరియించి ఫలితమ్మును, ని
ర్వర్తించి చక్కఁగఁ దనదు
కర్తవ్యము, మఱచు జాతి గనును శుభంబుల్
కర్తృత్వమ్ము వహించి భూధవుఁడు లోకవ్రాతమే మెచ్చఁగాఁ
గర్తవ్యమ్ముల నాచరించిననె నిక్కం బైన కల్యాణమౌ
ధూర్తవ్రాతము సేర్ష్యఁ జాట నిల నెందుం గాన రానట్టిదౌ
కర్తవ్యంబును విస్మరించి నపుడే కల్యాణమౌ జాతికిన్