27, అక్టోబర్ 2025, సోమవారం

సమస్య - 5287

28-10-2025 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“తుచ్ఛవాంఛలన్ ధర్మమ్ము దోఁచు మదికి”
(లేదా...)
“తుచ్ఛపుఁ గోర్కెలన్ గొనినఁ దోఁచును బుద్ధికి ధర్మసూక్ష్మముల్”
(వద్దిపర్తి పద్మాకర్ గారి శతావధానంలో కవిశ్రీ సత్తిబాబు గారి సమస్య)

14 కామెంట్‌లు:

  1. తేటగీతి
    బోధపడదెవ్వరికినైన పుడమి మీదఁ
    దనకు కల్గెడు కోర్కెల తప్పుగనుట
    పరులు ప్రకటింపఁగ నెదుటివారివైన
    తుచ్ఛవాంఛలన్ ధర్మమ్ము దోఁచు మదికి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉత్పలమాల
      స్వచ్చమటంచు తోచు తమ స్వాంతమునందున గల్గు కోర్కెలున్
      మచ్చుకునైన తప్పుగన మానసమొప్పదు నిత్యసత్యమై!
      యచ్ఛదునట్లుగన్, పరులు యావగఁ బొందఁగ నెంచి సాగుటన్
      తుచ్ఛపుఁ గోర్కెలన్ గొనినఁ, దోఁచును బుద్ధికి ధర్మసూక్ష్మముల్

      తొలగించండి
  2. ఇచ్ఛలనుజ్జగించి పరమేశ్వరునిన్ మదినిల్పి భక్తితో
    స్వచ్ఛమనస్కులై పరమ సాత్వికులై నడయాడు సజ్జనుల్
    ఉచ్ఛలితంపు వాంఛల సముచ్చయమున్గదియించి, వైరిగా
    తుచ్ఛపుఁ గోర్కెలన్ గొనినఁ, దోఁచును బుద్ధికి ధర్మసూక్ష్మముల్

    రిప్లయితొలగించండి

  3. సకల శాస్త్రాల నెఱగిన సర్వ రసుడ
    వీవు ధర్మము నెప్పుడు విడువ వలదు
    భీరువాసీతను విడువు, విడిచి నంత
    తుచ్ఛవాంఛలన్, ధర్మమ్ము దోఁచు మదికి.


    ఇచ్ఛగ మద్య శాలజని హీన గుణాత్ముల గూడి యచ్చటన్
    స్వేచ్ఛయటంచు నీవిటుల సీధువు గ్రోలిన మైక మందునన్
    పృచ్ఛక పుంగవుండనని వేసితి వంట సవాలు
    నెవ్విధిన్
    తుచ్ఛపుఁ గోర్కెలన్ గొనినఁ దోఁచును బుద్ధికి ధర్మసూక్ష్మముల్.

    రిప్లయితొలగించండి
  4. మచ్చయె లేని జీవితము మంచి గుణంబులు భక్తి భావనల్
    స్వచ్ఛపు కీర్తి సంపదలు సజ్జన స్నేహము ధాత్రిఁకల్గునా
    తుచ్ఛపుఁగోర్కెలన్ గొనినఁ? దోచును బుద్ధకి ధర్మసూక్ష్మముల్
    నిచ్చలు సేవజేసినను నేత్రికి నిర్మల మౌ మనస్సుతో

    రిప్లయితొలగించండి
  5. అన్నిటందున మంచియే యగుపడు గద
    యతనికెడదెగక , నదియె నలవడుటన
    దుచ్ఛవాంఛలన్ ధర్మమ్ము దోఁచు మదికి ;
    వింత గొలుపుచుండును గాని విషయమదియ

    రిప్లయితొలగించండి
  6. స్వచ్ఛత కలిగిన మనసు సల్పుచుండు
    నెపుడు ధర్మంపు చింతనల్ తపనతోడ
    విచ్చలవిడి చరించక వీడనాడ
    తుచ్ఛ వాంఛలన్ ధర్మమ్ము దోఁచు మదికి

    స్వచ్ఛత నిండఁ మానసము సల్పును నిత్యము ధర్మ చింతనే
    స్వేచ్ఛ లభించినన్ మదినిఁ శ్రేష్ఠతమంబులు గావె యోచనల్
    తుచ్ఛపుఁ గోర్కెలన్ గొనినఁ దోఁచును బుద్ధికి ధర్మసూక్ష్మముల్
    గుచ్ఛములై నిరంతరము గూఢవిగూఢములైన సంగతుల్

    రిప్లయితొలగించండి
  7. వాంఛ లే లేని వాడైన పరమ యోగి
    జప తపంబు ల జేయు ప్రశాంతు డ గుచు
    దరికి రానీ డు కోర్కె ల దన క దె టుల
    తుచ్ఛ వాంఛ లన్ ధర్మ మ్ము దోచు మదికి?

    రిప్లయితొలగించండి
  8. (తుచ్ఛ కోరికల భోగ లాలసత వలన దుఃఖమే గలిగిన సత్యము గ్రహించ గలడు. పరోక్షంగా ఇచ్ఛలు ధర్మ సూక్ష్మమును తెలిపినాయి అని భావమండి)

    తే॥ భువినిఁ గోర్కెల పరిఁ గని పొరలు చుండు
    నరుఁడు దుఃఖ భాజనుఁ డౌచు నలఁగ నిజము
    తెలిసి మిథ్య నెఱుఁగఁ గల్గు తెలివిఁ బడయు
    తుచ్ఛ వాంఛలన్ ధర్మము దోఁచు మదికి

    ఉ॥ ఇచ్ఛలఁ దేలి తుష్టిఁ గన నెంచుచు నచ్చిన రీతి సాగ యా
    దృచ్ఛిక మైచనన్ బడయఁ దృప్తిని దుఃఖమె మీరు చుండగా
    స్వచ్ఛతఁ గాంచుఁ గాంక్షలటు బాధల వెట్టగ జ్ఞాన మొందెడున్
    దుచ్ఛపు గోర్కెలన్ గొనినఁ దోఁచును బుద్ధికి ధర్మ సూక్ష్మముల్

    రిప్లయితొలగించండి
  9. తే.గీ:కామమే క్రోధమును దెచ్చు,గలచి వైచు
    లోభ మోహ మదములకు లోనొనర్చి,
    మత్సరమ్ముల బెంచును , మదిని విడువ
    తుచ్ఛవాంఛలన్ ధర్మమ్ము దోఁచు మదికి”
    (అరిషడ్వర్గాన్ని పద్యం లో ఇమిడ్చే ప్రయత్నం.వాటిలో కామము అనగా కోరిక మొదటిది.)

    రిప్లయితొలగించండి
  10. తీరని వ్యధఁ జేకూర్చును దీరకున్న
    కోరినట్టి కోర్కులు నర నారుల కిల
    మూరినట్టి ధృతిని మీఱి కోరకున్నఁ
    దుచ్ఛ వాంఛలన్ ధర్మమ్ము దోఁచు మదికి


    కృచ్ఛ్రము లందు నైన మఱి మృత్యు భయం బది సంతరించినం
    దుచ్ఛపుఁ గోర్కులన్ హృదయ తోయధి లోన జనింప నీకుమా
    స్వచ్ఛము గాఁగ మానసము సచ్చరితుండవు గాఁగ నీవ లోఁ
    దుచ్ఛపుఁ గోర్కెలన్గొనినఁ దోఁచును బుద్ధికి ధర్మ సూక్ష్మముల్

    [తుచ్ఛము = 1. నీచము; 2. శూన్యము]

    రిప్లయితొలగించండి

  11. ద్రౌపది కీచకుని తో అన్నట్లుగా

    పరసతిని కోరుటయునీకు పాడిగాదు
    మత్పతుల్ మహా బలులని మదినె రంగి
    వేగ మీవీ దురాశను వీడు మిట్టి
    *“తుచ్ఛవాంఛలన్, ధర్మమ్ము దోఁచు మదికి”*


    ఇచ్ఛయువచ్చినట్లుగను నెల్లయు చేయుచు నెంచకేదియున్
    ఉచ్ఛము నీచమున్ మరువ నుర్విని దప్పదు చేటు వీడినన్
    *తుచ్ఛపు కోర్కెలన్ గొనిన, దోచును బుద్ధికి ధర్మ సూక్ష్మముల్*
    స్వచ్ఛపుదర్పణమ్ముననుసత్యపుదారియు తోచినట్లుగా

    రిప్లయితొలగించండి

  12. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    రావణా! సర్వ శాస్త్రముల నెఱిగినను
    పర సతిని కోర తెలియదా పాపమనుచు
    నీచ సంస్కృతి యేలను?నీవు విడువ
    తుచ్ఛ వాంఛలన్; ధర్మమ్ము దోచు మదికి.

    రిప్లయితొలగించండి