23-9-2026 (బుధవారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కాచె విష్ణుమూర్తి నీచజనుల”
(లేదా...)
“కాచెను విష్ణుమూర్తి గడుఁ గావరమెక్కిన నీచులందఱన్”
(ఐతగోని వెంకటేశ్వర్లు గారి శతావధానంలో వేలేటి శైలజ గారి సమస్య)
తనను నమ్మినట్టి తన భక్త జనులనుకాచె విష్ణుమూర్తి ; నీచజనులనీతి ధర్మరహిత నేరస్తలనుబట్టితగిన శిక్ష వేయు దప్పకుండ
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
ఆగ్రహించి యనిని అపరాధులను గని సంహరించు నట్టి సమయమందు తిప్పకాయ కచట దివ్య దర్శన మిచ్చి కాచె విష్ణుమూర్తి నీచజనులనీచుల మౌచు ధరణీధరుడా హరి చేత చచ్చుటే ఔచితి గా దలంచి పణిహారులు దుర్మతు లై జనించి వా రా చిర జీవి చేత హతులై యపవర్గము నంద కాంచగా కాచెను విష్ణుమూర్తి గడుఁ గావరమెక్కిన నీచులందఱన్.
నీచుల నడఁచుటకు నిశ్చల చిత్తుడైకాచె విష్ణుమూర్తి నీచజనులపీఁచ మడచె గాదె వృజినముద్దీపింపఁవేచి చూచి కడకు విష్ణుమూర్తినీచుల నుక్కడించుటకు నిశ్చలుడైనను పద్మనాభుడేవేచెను వారి దోషములు విస్తృతి చెందగ దండనమ్ముకైకాచెను విష్ణుమూర్తి గడుఁ గావరమెక్కిన నీచులందఱన్ద్రోచెను గాదె తానెపుడుఁ దొందర పాటును చూపకుండగా[ కాచు = ఎదురుచూచు ]
పెక్కు తడవ లందు జిక్కుల బడగనె కాచె విష్ణుమూర్తి నీచజనులబారి నుండి శివుని , వరమిడిన కతన ,చెడ్డ వారి కోర్కె చేటు జేయ
తనను నమ్మినట్టి తన భక్త జనులను
రిప్లయితొలగించండికాచె విష్ణుమూర్తి ; నీచజనుల
నీతి ధర్మరహిత నేరస్తలనుబట్టి
తగిన శిక్ష వేయు దప్పకుండ
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిఆగ్రహించి యనిని అపరాధులను గని
సంహరించు నట్టి సమయమందు
తిప్పకాయ కచట దివ్య దర్శన మిచ్చి
కాచె విష్ణుమూర్తి నీచజనుల
నీచుల మౌచు ధరణీధరుడా హరి చేత చచ్చుటే
ఔచితి గా దలంచి పణిహారులు దుర్మతు లై జనించి వా
రా చిర జీవి చేత హతులై యపవర్గము నంద కాంచగా
కాచెను విష్ణుమూర్తి గడుఁ గావరమెక్కిన నీచులందఱన్.
నీచుల నడఁచుటకు నిశ్చల చిత్తుడై
రిప్లయితొలగించండికాచె విష్ణుమూర్తి నీచజనుల
పీఁచ మడచె గాదె వృజినముద్దీపింపఁ
వేచి చూచి కడకు విష్ణుమూర్తి
నీచుల నుక్కడించుటకు నిశ్చలుడైనను పద్మనాభుడే
వేచెను వారి దోషములు విస్తృతి చెందగ దండనమ్ముకై
కాచెను విష్ణుమూర్తి గడుఁ గావరమెక్కిన నీచులందఱన్
ద్రోచెను గాదె తానెపుడుఁ దొందర పాటును చూపకుండగా
[ కాచు = ఎదురుచూచు ]
పెక్కు తడవ లందు జిక్కుల బడగనె
రిప్లయితొలగించండికాచె విష్ణుమూర్తి నీచజనుల
బారి నుండి శివుని , వరమిడిన కతన ,
చెడ్డ వారి కోర్కె చేటు జేయ