22, సెప్టెంబర్ 2026, మంగళవారం

సమస్య - 5598

23-9-2026 (బుధవారం)

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“కాచె విష్ణుమూర్తి నీచజనుల”

(లేదా...)

“కాచెను విష్ణుమూర్తి గడుఁ గావరమెక్కిన నీచులందఱన్”

(ఐతగోని వెంకటేశ్వర్లు గారి శతావధానంలో వేలేటి శైలజ గారి సమస్య)

5 కామెంట్‌లు:

  1. తనను నమ్మినట్టి తన భక్త జనులను
    కాచె విష్ణుమూర్తి ; నీచజనుల
    నీతి ధర్మరహిత నేరస్తలనుబట్టి
    తగిన శిక్ష వేయు దప్పకుండ

    రిప్లయితొలగించండి

  2. ఆగ్రహించి యనిని అపరాధులను గని
    సంహరించు నట్టి సమయమందు
    తిప్పకాయ కచట దివ్య దర్శన మిచ్చి
    కాచె విష్ణుమూర్తి నీచజనుల


    నీచుల మౌచు ధరణీధరుడా హరి చేత చచ్చుటే
    ఔచితి గా దలంచి పణిహారులు దుర్మతు లై జనించి వా
    రా చిర జీవి చేత హతులై యపవర్గము నంద కాంచగా
    కాచెను విష్ణుమూర్తి గడుఁ గావరమెక్కిన నీచులందఱన్.

    రిప్లయితొలగించండి
  3. నీచుల నడఁచుటకు నిశ్చల చిత్తుడై
    కాచె విష్ణుమూర్తి నీచజనుల
    పీఁచ మడచె గాదె వృజినముద్దీపింపఁ
    వేచి చూచి కడకు విష్ణుమూర్తి

    నీచుల నుక్కడించుటకు నిశ్చలుడైనను పద్మనాభుడే
    వేచెను వారి దోషములు విస్తృతి చెందగ దండనమ్ముకై
    కాచెను విష్ణుమూర్తి గడుఁ గావరమెక్కిన నీచులందఱన్
    ద్రోచెను గాదె తానెపుడుఁ దొందర పాటును చూపకుండగా

    [ కాచు = ఎదురుచూచు ]

    రిప్లయితొలగించండి
  4. పెక్కు తడవ లందు జిక్కుల బడగనె
    కాచె విష్ణుమూర్తి నీచజనుల
    బారి నుండి శివుని , వరమిడిన కతన ,
    చెడ్డ వారి కోర్కె చేటు జేయ

    రిప్లయితొలగించండి