ఉ:నీచులె ద్వారపాలకులు? నీతిగ నుండిన వారె కాని తా మే చెడు చేయకున్న ముని యీయగ శాపము వైరభక్తి తో నీచము లెన్నొ చేయుచును నెగ్గిరి మోక్షము బొంద, నే కథన్ కాచెను విష్ణుమూర్తి గడుఁ గావరమెక్కిన నీచులందఱన్?
(నిజానికి జయవిజయు లనే ద్వారపాలకులది తప్పు కాదు.కానీ ముని శాపం తో రాక్షసు లై వైరభక్తి తో నీచాలు చేసి మోక్షం పొందారు. అంతే కానీ నీచు లందరినీ విష్ణు మూర్తి రక్షించాడా?)
తనను నమ్మినట్టి తన భక్త జనులను
రిప్లయితొలగించండికాచె విష్ణుమూర్తి ; నీచజనుల
నీతి ధర్మరహిత నేరస్తలనుబట్టి
తగిన శిక్ష వేయు దప్పకుండ
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిఆగ్రహించి యనిని అపరాధులను గని
సంహరించు నట్టి సమయమందు
తిప్పకాయ కచట దివ్య దర్శన మిచ్చి
కాచె విష్ణుమూర్తి నీచజనుల
నీచుల మౌచు ధరణీధరుడా హరి చేత చచ్చుటే
ఔచితి గా దలంచి పణిహారులు దుర్మతు లై జనించి వా
రా చిర జీవి చేత హతులై యపవర్గము నంద కాంచగా
కాచెను విష్ణుమూర్తి గడుఁ గావరమెక్కిన నీచులందఱన్.
నీచుల నడఁచుటకు నిశ్చల చిత్తుడై
రిప్లయితొలగించండికాచె విష్ణుమూర్తి నీచజనుల
పీఁచ మడచె గాదె వృజినముద్దీపింపఁ
వేచి చూచి కడకు విష్ణుమూర్తి
నీచుల నుక్కడించుటకు నిశ్చలుడైనను పద్మనాభుడే
వేచెను వారి దోషములు విస్తృతి చెందగ దండనమ్ముకై
కాచెను విష్ణుమూర్తి గడుఁ గావరమెక్కిన నీచులందఱన్
ద్రోచెను గాదె తానెపుడుఁ దొందర పాటును చూపకుండగా
[ కాచు = ఎదురుచూచు ]
సవరణతో...
తొలగించండినీచుల నుక్కడించుటకు నిశ్చలుడైనను పద్మనాభుడే
వేచెను వారి దోషములు విస్తృతి చెందగ శిక్షవేయగా
కాచెను విష్ణుమూర్తి గడుఁ గావరమెక్కిన నీచులందఱన్
ద్రోచెను గాదె తానెపుడుఁ దొందర పాటును చూపకుండగా
పెక్కు తడవ లందు జిక్కుల బడగనె
రిప్లయితొలగించండికాచె విష్ణుమూర్తి నీచజనుల
బారి నుండి శివుని , వరమిడిన కతన ,
చెడ్డ వారి కోర్కె చేటు జేయ
ఆ.వె:శిష్టరక్షకుడని, దుష్టశిక్షకు డని
రిప్లయితొలగించండిపొగడు చుంద్రు చేసి పూజ లెన్నొ
గుడిని దోచు వారి విడచె, శిక్షించెనే
కాచె విష్ణుమూర్తి నీచజనుల”
ఉ:నీచులె ద్వారపాలకులు? నీతిగ నుండిన వారె కాని తా
రిప్లయితొలగించండిమే చెడు చేయకున్న ముని యీయగ శాపము వైరభక్తి తో
నీచము లెన్నొ చేయుచును నెగ్గిరి మోక్షము బొంద, నే కథన్
కాచెను విష్ణుమూర్తి గడుఁ గావరమెక్కిన నీచులందఱన్?
(నిజానికి జయవిజయు లనే ద్వారపాలకులది తప్పు కాదు.కానీ ముని శాపం తో రాక్షసు లై వైరభక్తి తో నీచాలు చేసి మోక్షం పొందారు. అంతే కానీ నీచు లందరినీ విష్ణు మూర్తి రక్షించాడా?)
ఉ॥ కాచెను విష్ణుమూర్తి గడుఁ గావరమెక్కిన నీచులందఱన్
రిప్లయితొలగించండిదోఁచును మూర్ఖులైన నిటు తోరపు శాపము నొంది వేడఁగన్
బ్రోచఁగ ద్వారపాలకులఁ బుట్టగ వారలు మూడు మార్లిలన్
నీచుల వోలె కాచెనటు నీతిని వీడిన వారిఁ ద్రుంచుచున్
యోచనఁ జేయఁ దెల్పెనయ యోర్చను దుష్టము సాగు బుద్ధితో
అప్పుడప్పుడు పంచపాదుల పూరణలు సమూహములో వచ్చాయండి. అది చూసి అవసరమని 5వ పాదము జోడించాను. 4 పాదము వరకు తీసుకున్నా సరేనండి.
1. శాపగ్రస్తులై దుష్టులై పుట్టగ వధించి కాచెను విష్ణుమూర్రి
2. చెడు ప్రవర్తనకు ఫలము నీవిధంగా తెలియజేసాడు జనులందరికి.
ప్రోచెడి దైవమీవెయని మ్రొక్కిన భక్తజనాళి నెల్లరన్
రిప్లయితొలగించండిగాచెను విష్ణుమూర్తి, గడుఁ గావరమెక్కిన నీచులందఱన్
పీచమడంచి నెక్కొలిపె విశ్వమునందున శాంతి, దీనులన్
బ్రోచెడువాడు దుష్టులను ద్రుంచెడువాడును దేవదేవుడే
శిష్టు లైన లేక దుష్టు లైనను గాని
రిప్లయితొలగించండిమే లొసంగు చుండు నీల తనుఁడు
ముక్తి నొసఁగి యాజి మును రావ ణాదులఁ
గాచె విష్ణుమూర్తి నీచ జనుల
చూచితె యర్ధ బిందు ఘన చోద్యము మిత్రమ సద్దయా సుధా
వీచిక లందు సంతతము వీర విహార మొనర్చు చుండి తాఁ
గాచుచు నుండు భక్త జన కాయముఁ గాఁచెను గాని యేడఁ దాఁ
గాచెను విష్ణుమూర్తి గడుఁ గావర మెక్కిన నీచు లందఱన్
[కాచు = రక్షించు; కాఁచు= కాఁగఁ జేయు]
శౌచము తోడ యాగముల చక్కగ జేయుచు నుండగా మునుల్
రిప్లయితొలగించండినీచ నిశాచరుల్ జెలగి నిర్దయతో చఱచన్, జనించి తా
పీచ మడంచి, శాపముల వేసడలించి, విముక్తి నిచ్చుచున్
కాచెను విష్ణుమూర్తి గడుఁ గావరమెక్కిన నీచులందఱన్
ఆటవెది
రిప్లయితొలగించండిద్వారపాలకులను దండింప శాపము
మౌనులొసఁగినంత మర్మమొప్ప
శీఘ్రగతిని తన్ను చేరఁగఁ బురిఁగొల్పి
కాచె విష్ణుమూర్తి నీచజనుల
ఉత్పలమాల
చూచెదమన్న శ్రీహరిని, క్షోభను బెట్టిరటంచు ద్వారికుల్
లేచి శపింపఁగన్, రయమె శ్రీశుని జేరెడు మర్మమిట్లనన్
శోచనఁ జేసి నీచులుగఁ జొచ్చిన ధాత్రిని నుత్తరించుచున్
గాచెను విష్ణుమూర్తి గడుఁ గావరమెక్కిన నీచులందఱన్
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
మకరి కాలు పట్టగ కరి వేడుకొనగ
కాచె విష్ణుమూర్తి; నీచ జనుల
బుద్ధి మార్చి వారి బుద్ధిమంతులుగను
చేయ మనుచు మ్రొక్కె చిత్తమందు.