కం:బొమ్మలకు బూజ లే లన బమ్మగ గల విప్రు డిట్లు బలికె ప్రతిష్ఠన్ బమ్మలు మంత్రముల బలుక బొమ్మకుఁ బ్రాణమ్ము వచ్చి పూజ్యత నందెన్” (బమ్మ అంటేనే బ్రాహ్మణుడు అని అర్థం. అది కాక యజ్ఞం లో బ్రాహ్మణులు బ్రహ్మ,హోత,ఋత్వికుడు,అధ్వర్యుడు ఇలా వేరు వేరు పదవులలో ఉంటారు. బొమ్మలకు పూజ లేమిటి? అని ఎవరో అంటే బ్రహ్మస్థానం లో ఉన్న బ్రాహ్మణుడు ఊరకే బొమ్మలను పూజించము. ఈ మంత్రాల తో ప్రాణప్రతిష్ఠ చేస్తాము అన్నాడు.)
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికందం
తొలగించండికమ్మని రూపము శిల్పులు
నిమ్ముగ వాసవికిఁ గూర్చ, నీమముగన్ మం
త్రమ్ములఁ బ్రతిష్ఠ జరుపన్
బొమ్మకుఁ బ్రాణమ్ము వచ్చి పూజ్యత నందెన్
ఉత్పలమాల
కమ్మని రూపమున్ గలుగు కన్యక వాసవి విగ్రహమ్మునే
యిమ్ముగ శిల్పులున్మలచ నేర్పడ,శంకరులాగమించి మం
త్రమ్ములతోఁ ప్రతిష్ఠ జనరంజకమౌ విభవాన సల్పఁగన్
బొమ్మకుఁ బ్రాణముల్ గలిగి పూజ్యత నందెను దేవళమ్మునన్
నమ్మిమనంబున రాముని
రిప్లయితొలగించండిసమ్ముదమున విగ్రహాన్ని శ్రద్ధగ గుడిలో
నిమ్ముగ ప్రతిష్ట జేయగ
బొమ్మకు ప్రాణమ్ము వచ్చి పూజ్యత నందెన్
గండూరి లక్ష్మినారాయణ
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి*విగ్రహమును* అనండి.
మమ్ముల గాపాడుననెడి
రిప్లయితొలగించండినమ్మిక మదినందునుంచి నయమగు రీతిన్
ఇమ్ముగ జెక్కిన దేవుని
బొమ్మకుఁ బ్రాణమ్ము వచ్చి పూజ్యత నందెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిఅమ్మారుతి గుడి లోనికి
నిమ్మళముగచేరెనటకు నీడ వెదుకు చున్
తిమ్మి గని మ్రొక్కి పలికిరి
బొమ్మకుఁ బ్రాణమ్ము వచ్చి పూజ్యత నందెన్.
ఇమ్మగు దేవళమ్మున కపీశ్వరు గొల్చెడి పాళ మందునన్
తిమ్మడు వచ్చి చేరె సవితృండట తీక్ష్ణత చూప వానినిన్
నమ్ముచు గాంచి దాశరథి నమ్మిన బంటటంచు పల్కిరే
బొమ్మకుఁ బ్రాణముల్ గలిగి పూజ్యత నందెను దేవళమ్మునన్.
నమ్మిన శిల్పి కుకీలపు
రిప్లయితొలగించండికొమ్మునగల శిలను జెక్క కోవెల నందున్
గ్రమ్మనఁ బ్రతిష్ఠ సలుపగ
బొమ్మకుఁ బ్రాణమ్ము వచ్చి పూజ్యత నందెన్
నమ్మిన శిల్పకారునికి నచ్చిన రాయిని తెచ్చియిచ్చి తా
నిమ్ముగ చెక్కినట్టిదగు నిర్మల శిల్పము చూచి భక్తితోఁ
గ్రమ్మనఁ గోవెలన్ దగిన లగ్నము నందు ప్రతిష్ట చేయగా
బొమ్మకుఁ బ్రాణముల్ గలిగి పూజ్యత నందెను దేవళమ్మునన్
-
రిప్లయితొలగించండిఅమ్మగ కొని గణనాథుని
పమ్ముచు స్తుతి జేసి ప్రాణ వాయువులన్ నే
కమ్మగ కీర్తింప తృటిని
బొమ్మకుఁ బ్రాణమ్ము వచ్చి పూజ్యత నందెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఉ॥ అమ్మవు లోకమాతవని యాదరముంచితి నమ్మ ప్రీతిగన్
రిప్లయితొలగించండినమ్మితి నమ్మ నిక్కముగ నన్నిలఁ బ్రోచెద వంచు నెంచుచున్
గ్రమ్మిన భక్తితో నొకఁడు కన్నులు మూయగ మానసమ్మునన్
బొమ్మకుఁ బ్రాణముల్ గలిగి పూజ్యత నందెను దేవళమ్మునన్
బొమ్మ ప్రతిమ
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండికం:బొమ్మలకు బూజ లే లన
రిప్లయితొలగించండిబమ్మగ గల విప్రు డిట్లు బలికె ప్రతిష్ఠన్
బమ్మలు మంత్రముల బలుక
బొమ్మకుఁ బ్రాణమ్ము వచ్చి పూజ్యత నందెన్”
(బమ్మ అంటేనే బ్రాహ్మణుడు అని అర్థం. అది కాక యజ్ఞం లో బ్రాహ్మణులు బ్రహ్మ,హోత,ఋత్వికుడు,అధ్వర్యుడు ఇలా వేరు వేరు పదవులలో ఉంటారు. బొమ్మలకు పూజ లేమిటి? అని ఎవరో అంటే బ్రహ్మస్థానం లో ఉన్న బ్రాహ్మణుడు ఊరకే బొమ్మలను పూజించము. ఈ మంత్రాల తో ప్రాణప్రతిష్ఠ చేస్తాము అన్నాడు.)
ప్రశ్నోత్తరి
రిప్లయితొలగించండిఉ:సొమ్ముల గుంజ విప్రులకు సోకుగ మూర్తులు దక్కె, నెవ్విధిన్
బొమ్మకుఁ బ్రాణముల్ గలిగి పూజ్యత నందెను దేవళమ్మునన్?
బొమ్మకు బ్రాణశక్తి నిడ బూతసుమంత్రయుతప్రతిష్ఠ చే
బొమ్మకుఁ బ్రాణముల్ గలిగి పూజ్యత నందెను దేవళమ్మునన్.
కొమ్మరొ వింటివె వైద్యుం
రిప్లయితొలగించండిడిమ్ముగఁ దగు నౌషధమ్ము నీయఁ దొలఁగ మో
హమ్ము త్రుటి ముద్దు గుమ్మకు
బొమ్మకుఁ బ్రాణమ్ము వచ్చి పూజ్యత నందెన్
వమ్మగు టెల్ల వింత యగుఁ బర్వత రాజ కుమారి యెంచి లో
నిమ్మహిఁ జేసి నట్టి పను లెల్లను బ్రహ్మయు నాప నేర్వఁడే
గుమ్మము వద్దఁ గాపుగను గూర్మినిఁ బార్వతి సేయఁ బిండితో
బొమ్మకుఁ బ్రాణముల్ గలిగి పూజ్యత నందెను దేవళమ్మునన్