27, సెప్టెంబర్ 2026, ఆదివారం

సమస్య - 5603

28-9-2026 (సోమవారం)

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“కాకి కోకిలయౌఁ బైడి కాంస్యమగును”

(లేదా...)

“కాకి కోకిలయౌ ధరిత్రిని కాంస్యమన్నది పైడియౌ”

(ఐతగోని వెంకటేశ్వర్లు శతావధానంలో మాచవోలు శ్రీధర రావు గారి సమస్య)

18 కామెంట్‌లు:

  1. కలియుగమున జరుగబోవు కార్యముగన
    చిరుత కాలమందన్నియు చిత్తరముగ
    తారు మారగుచుండును దప్పకుండ
    కాకి కోకిలయౌఁ బైడి కాంస్యమగును

    రిప్లయితొలగించండి
  2. లక్ష్మీ కటాక్షము:

    నాకపాలకుడౌను భిక్షువు నారదుండగు మూగయే
    పాకయౌను నరేంద్ర గేహము పక్షియౌను ఖగేంద్రమే
    కాకి కోకిలయౌ ధరిత్రిని కాంస్యమన్నది పైడియౌ
    సోకగానె భవత్ కటాక్షము సునృతమ్మిది శ్రీకరీ!

    రిప్లయితొలగించండి
  3. ఖలుని దయతోడ బ్రోచుచు కవిగ మార్చి
    నట్టి మాతను కొల్వగ నంత మౌను
    బాధలే తల్లి తలచిన వసుధ యందు
    కాకి కోకిలయౌఁ బైడి కాంస్యమగును.


    శ్రీకరమ్మని నీదు సేవల చిత్త శుద్ధిగ చేసెదన్
    నీ కటాక్షమె చాలు నింకను నీల లోహిత వేడగా
    నాకతాయియె పండితుండయె, యమ్మ దల్చిన చాలీకన్
    కాకి కోకిలయౌ ధరిత్రిని కాంస్యమన్నది పైడియౌ.

    రిప్లయితొలగించండి
  4. క్రీడ లందున పాల్గొన్న గెలువదగును
    పసిడి కాకుండినన్ గాంస్య పతక మైన
    పట్టు వీడని యత్నమే ఫలము నొసగు
    కాకి కోకిలయౌఁ బైడి కాంస్యమగును

    ఏకలవ్యుని మాడ్కి ధీమసమేరికైనను యోగ్యమౌ
    సాకులెంచక పట్టుబట్టిన సర్వ విద్యలు సాధ్యమౌ
    చాకచక్యము చూపువారికి సంక్రమించును లక్ష్యమే
    కాకి కోకిలయౌ ధరిత్రిని కాంస్యమన్నది పైడియౌ

    రిప్లయితొలగించండి
  5. లోకరక్షకుడైన దేవుని రూపమున్ మది నెక్కొనన్
    ప్రాకటమ్మగు భక్తి గొల్చిన బాపునక్కఱపాటులన్
    శ్రీకరంబగు దేవదేవుని లీలలెంచగ శక్యమా
    కాకి కోకిలయౌ ధరిత్రిని కాంస్యమన్నది పైడియౌ

    రిప్లయితొలగించండి
  6. తే.గీ: తాను మునిగినదే గంగ, తాను వలచు
    నదియె రంభయె యనువాని మదికి నల్ల
    నైన స్త్రీ నచ్చు, తెల్ల నౌ నాలి వీడు
    కాకి కోకిలయౌఁ బైడి కాంస్యమగును”


    రిప్లయితొలగించండి
  7. తేటగీతి
    విమల రసవాద విద్యచే వింతగాను
    మార్పునొందును లోహముల్ మహిని చూడ;
    సిద్ధ జనుల స్పర్శ వలనఁ జెంద మార్పు
    కాకి కోకిలయౌఁ బైడి కాంస్యమగును!

    ఉత్పలమాల
    శ్రీకి నాయకుడైన విష్ణుని సేవ జేసెడు వేళలన్
    జోకగన్ మహి పుణ్యమబ్బును; శోభ కల్గును జీవికిన్;
    పాక మందెడు యోగసిద్ధుల ప్రాభవమ్మున వింతగా
    కాకి కోకిలయౌ ధరిత్రిని కాంస్యమన్నది పైడియౌ!

    రిప్లయితొలగించండి
  8. మ.కో:ఏ కవిత్వము గొప్పదో గమనించు ప్రజ్ఞయె శూన్యమై
    ఏ కులమ్మునొ, సొమ్మునో గని యీయగా బిరుదమ్ములన్
    నాకు దోచు విచిత్ర మై , యది నల్గురున్ విన జెప్పెదన్
    కాకి కోకిలయౌ ధరిత్రిని కాంస్యమన్నది పైడియౌ”


    రిప్లయితొలగించండి
  9. రిప్లయిలు
    1. తే॥ పలుకు చుండె నొకఁడిటులఁ బలువురుఁ గన
      “నింద్రజాలముఁ జేయ పసందుఁ గనుడి
      కాకి కోకిలయౌఁ బైడి కాంస్యమగును”
      కోటి విద్యలుండుఁ దెలుపఁ గూటి కొరకె

      మత్త॥ ప్రాకటమ్ముగ నింద్రజాలము వాడ వాడలఁ జేయుచున్
      దేకువన్ గని మంత్రదండముఁ ద్రిప్పి పల్కెను దీటుగన్
      మీకు చూపెడి వాఁడ నిచ్చట మేటి మాయల నెన్నియో
      కాకి కోకియయౌ ధరిత్రిని కాంస్యమన్నది పైడియౌ

      మత్త॥ ప్రాకటమ్ముగ దేవుఁడంచును పల్కువారలు నెందరో
      మీకు చూపుచు విద్య లెన్నియొ మెచ్చు రీతిని గొప్పగాఁ
      బ్రాకులాడరె నమ్మకమ్ముకు వారు మాయలఁ జేయఁగన్
      గాకి కోకిలయౌ ధరిత్రిని కాంస్యమన్నది పైడియౌ

      1. తేటగీతిలో సందర్భోచితంగా సమస్య 3వ పాదములో పెట్టినానండి.
      2. ⁠మత్తకోకిలలు రెండు మనము చూస్తున్నవేనండి. కనికట్టు చేసేవారు పెద్దమాటలు చెప్పి ఏవో చిన్నవి చేసి పొట్ట గడుపుకుంటారు. ఇంక నేనే దేవుడను స్వాములు ఎందరో. 1979లో ననుకుంటాను అప్పటి బెంగుళూరు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ హెచ్ నరసింహయ్య గారు Scientific Investigation of Miracles అని ఒక study ప్రారంభించారు, IISc సహాయం కూడా తీసుకొని. కాని అది ముందుకెళ్ళలేదండి

      తొలగించండి
  10. సమస్య : కాకి కోకిలయౌఁ బైడి కాంస్యమగును

    ప్రతిభ యించుకలేకున్న ప్రముఖులయ్యె
    మాయ చేయవారలునేడు మాన్యులయ్యె
    ఏమనందును తలకిందు లీజగమ్ము
    కాకి కోకిలయౌఁ బైడి కాంస్యమగును

    రిప్లయితొలగించండి
  11. అబ్బ మంద బుద్ధికి జ్ఞాన మబ్బె నేని
    పిసిని గొట్టు నడుగ దాన మొసఁగె నేని
    పాట లింపుగ నే మూఁగ పాడె నేని
    కాకి కోకిలయౌఁ బైడి కాంస్య మగును


    దూఁకు చుండిన దండ యాత్రకుఁ దొంటి గౌరవ మబ్బునే
    వీఁకఁ బంపిన నుగ్ర వాదుల వీట శాంతియె నిల్చునే
    ప్రాకు లాడిన దుడ్డు కోసము భాగ్య మబ్బిన వింతగాఁ
    గాకి కోకిలయౌ ధరిత్రినిఁ గాంస్య మన్నది పైడియౌ

    రిప్లయితొలగించండి
  12. చాకచక్యము చూప జాలక, శాస్త్రవిద్యయు లేకయున్
    ప్రాకటమ్మగు ప్రజ్ఞ యుండక వంతపాడుచు నేరికో
    మోకరిల్లుచు నాయకావళి పొందు నందుచు నుండినన్
    కాకి కోకిలయౌ ధరిత్రిని కాంస్యమన్నది పైడియౌ
    అసనారె

    రిప్లయితొలగించండి

  13. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    మాతనే గొల్వ మతిలేని మందమతిని
    కరుణతో బ్రోచి తల్లియె కవిగ మార్చె
    నమ్మ తలచగ కాని కార్యమ్ము గలదె?
    కాకి కోకిలయౌఁ బైడి కాంస్య మగును.

    రిప్లయితొలగించండి