2, నవంబర్ 2026, సోమవారం

సమస్య - 5639

3-11-2026 (మంగళవారం)

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“బకనామజపంబుచేతఁ బడయమె ముక్తిన్”

(లేదా...)

“బకనామమ్ముఁ జపింప మోక్షమది సంప్రాప్తంబు గాకుండునే”

19 కామెంట్‌లు:

  1. కందము
    ఇక పంచాక్షరి మంత్రమ
    గు కీలక "నమశ్శివాయ" కు యలవడంగన్
    సకలమమరునయ్య త్రయం
    బక నామ జపంబు చేత బడయమె ముక్తిన్

    దైవజ్ఞ రత్న-సర్వ కళాభిజ్ఞ
    డాక్టర్ బొక్కా శ్రీనివాసరావు
    ఎన్-ఫోర్సుమెంట్ ఆఫీసర్ (విశ్రాంత)
    9030734124

    రిప్లయితొలగించండి
  2. కందం
    సకలానర్థక విషమా
    గక రేగన్ గుడిచెనట జగద్రక్షణకై
    నికరముగ శివములిడు త్ర్యం
    బకనామజపంబుచేతఁ బడయమె ముక్తిన్!

    మత్తేభవిక్రీడితము
    సకలమ్మున్ లయమొందఁజేయు విషమే సంధింప క్షీరాబ్ధి తా
    నకలంకుండన భక్తవత్సలునిగా నందెన్ మహేశుండహో
    నికరంబెంచఁగ నిత్యమున్ శివములందింపన్ విలోకించు త్ర్యం
    బకనామమ్ముఁ జపింప మోక్షమది సంప్రాప్తంబు గాకుండునే!

    రిప్లయితొలగించండి
  3. సకలము మంచినె సలిపితి ,
    నకారణమయిన విధముగ నాక్షే పించే
    చకితమున, నాదు కొనత్ర్యం
    బకనామజపంబుచేతఁ బడయమె ముక్తిన్

    రిప్లయితొలగించండి
  4. మత్తేభము:
    అకలంకంబగు భక్తి నెక్కొనగ నవ్యాజంపు తాదాత్మ్యతన్
    వికచాంభోరుహ చంచరీకము వలెన్ ప్రీతిన్ జటాధారి స
    ర్వకరున్ హృత్కమలంబునందునిచి నిర్వ్యాజమ్ము పెంపార త్ర్యం
    బకనామమ్ముఁ జపింప మోక్షమది సంప్రాప్తంబు గాకుండునే

    రిప్లయితొలగించండి
  5. సకలము వ్యాప్తి o జెందియు
    వికసిత రూపమున మించు విశ్వే శ్వ రు నిన్
    త్రికరణ శుద్ధు లు గను త్ర్య o
    బక నామ జపంబు చేత బడ య మె ముక్తి న్

    రిప్లయితొలగించండి

  6. సకాలర్థంబుల నొసగెడి
    యకాయడా యంతకహరు డసమాంబకు డై
    న కపాల ధారియగు త్ర్యం
    బకనామజపంబుచేతఁ బడయమె ముక్తిన్.


    సకలార్థంబుల నిచ్చు వాడనేడి విశ్వాసంబు తోనిత్యమున్
    సికలో చంద్రుని దాల్చి దివ్యనదినే శీర్షమ్ము పై, దార యం
    బిక దేహార్ధము నిల్పుకొన్న ఘనుడా విశ్వాత్ముడైనట్టి త్ర్యం
    బకనామమ్ముఁ జపింప మోక్షమది సంప్రాప్తంబు గాకుండునే.

    రిప్లయితొలగించండి
  7. -
    కలడతడం......


    నికటము ప్రకటంబెందై
    న కటాక్షము కలదు సూవె నమ్మిక తోడై
    టకటక రారండి తతిని
    బకనామజపంబుచేతఁ బడయమె ముక్తిన్


    .

    రిప్లయితొలగించండి
  8. ప్రకటిత పరాక్రమముతో
    సకల జనుల మేలు గూర్చు శంకరుడతడే
    త్రికరణశుద్ధిగ నసమాం
    బకనామజపంబుచేతఁ బడయమె ముక్తిన్

    ప్రకటంబైన పరాక్రమంబు తనదై భాసిల్లు ముక్కంటిగా
    సకలప్రాణుల రక్షకై గరళమాస్వాదింప శంకింపడే
    మకరాంకుండను బూదిచేసిన విభున్ మల్లారినేగొల్తు త్ర్యం
    బకనామమ్ముఁ జపింప మోక్షమది సంప్రాప్తంబు గాకుండునే

    రిప్లయితొలగించండి
  9. మ॥ సకలమ్మాతఁడు సర్వపాలకుఁడు విశ్వాత్ముండు శ్రీనాథుఁడే!
    సకలమ్మీధర నీవటంచు హృది విశ్వాసమ్ముతో నింపుచున్
    బ్రకటించంగను భక్తి తత్పరత సద్భావమ్ముతో నెంచి యం
    బక నామమ్ము జపింప మోక్షమది సంప్రాప్తంబు గాకుండునే

    అంబక తండ్రి సద్భావము సద్గుణము

    రిప్లయితొలగించండి
  10. కం: ప్రకటించి మథుర భక్తిని
    సకలము శ్రీకృష్ణు కొసగి, సతి నే నని దా
    చక ప్రేమ గోపికా చుం
    బకనామజపంబుచేతఁ బడయమె ముక్తిన్”
    (గోపికా చుంబకుడు= శ్రీ కృష్ణుడు.మథురభక్తి ప్రతిపాదకము.)



    రిప్లయితొలగించండి
  11. సకలైశ్వర్యములున్న వారలు
    మహా సత్కావ్య విద్వాంసులున్
    ఒకనా డెల్లరు మృత్యులోకమున
    కోయీ మానవా తప్పకన్
    సకలమ్మున్ విడి పోవుచుందు
    రిటనే సత్యంబిదే సుమ్మి త్ర్యం
    "బక నామమ్ముజపింప మోక్షమది
    సంప్రాప్తంబు గాకుండునే"

    రిప్లయితొలగించండి
  12. 2)మ:ప్రకటించన్ సతి నేను నాదు పతి గోపాలుండె యంచున్, స్మరిం
    పక యే భౌతిక బంధమున్, మథురమౌ భక్తిన్ సదా నిల్పి, యో
    పక దూర మ్మిసు మంత గృష్ణు మది దల్పన్ గోపికా ఫాల చుం
    బకనామమ్ముఁ జపింప మోక్షమది సంప్రాప్తంబు గాకుండునే”
    (గోపికాఫాల చుంబక = గోపికల ఫాలభాగమును చుంబించే వాడు. )

    రిప్లయితొలగించండి
  13. సక లామర సంపూజితు
    వికసిత నలి నాభ నేత్రు వినుత మహా భ
    క్త కరిత్రాతృ విదారిత
    బక నామ జపంబు చేతఁ బడయమె ముక్తిన్


    బక వత్శ్వేత ధరాధరాలయు శిరో బాలేందు సాహస్ర కాం
    బక యుక్తామర సంఘ పూజితుని శర్వప్రోక్తు చంచన్మహా
    బక సంహార కరాబ్జ పూజితుని తద్భస్మాంగు ఫాలస్థ లాం
    బక నామమ్ము జపింప మోక్ష మది సంప్రాప్తంబు గాకుండునే

    రిప్లయితొలగించండి
  14. అకళంకమ్మగు చిత్తమెప్డు చన న్యాయమ్మైన మార్గమ్ములో
    సుకమౌజీవతమున్ పరిశ్రమముతో శుద్ధాతరంగమ్ముతో
    నికరమ్మౌగతి సాగు చుండ భువిలో నిశ్చింతుడై యా త్రియం
    బక, నామమ్ముఁ జపింప మోక్షమది సంప్రాప్తంబు గాకుండునే

    రిప్లయితొలగించండి
  15. శుకశౌనకాది మునివరు
    లకలంకమ్మైన భక్తి నర్చించిన యా
    సకల శుభములొసగెడు త్ర్యం
    బకనామజపంబుచేతఁ బడయమె ముక్తిన్

    రిప్లయితొలగించండి

  16. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    సకల చరాచర జగమున
    కొకడే దేవుడని యెంచి యొద్దిక భక్తిన్
    వికసిత మనంబునన్ త్ర్యం
    బకనామ జపంబు చేతఁ బడయమె ముక్తిన్!

    రిప్లయితొలగించండి
  17. సకలజనులయారాధ్యుని
    వికలముగానిమదితోడ వేడిన చాలున్
    సకలమెరిగినట్టి త్రయం
    *“బకనామజపంబుచేతఁ బడయమె ముక్తిన్”*

    రిప్లయితొలగించండి