3, నవంబర్ 2026, మంగళవారం

సమస్య - 5640

4-11-2026 (బుధవారం)

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“భార్యాసంగమము ఘోరపాపమ్మె కదా”

(లేదా...)

“భార్యాసంగము పాపహేతువగుఁ దద్భావంబు వర్జింపుమా”

22 కామెంట్‌లు:

  1. ఆర్యా ! జూడగ పాలక
    వర్యులు లోకులకు జేయ వలదని యనుచున్
    చర్యల లో జేసెడి పర
    భార్యాసంగమము ఘోరపాపమ్మె కదా

    రిప్లయితొలగించండి
  2. కార్యానుకూలవతియును
    ఆర్యా !సుగుణాలరాశి యతివ మిగుల సౌం
    ధర్యపు సతియుండగ పర
    భార్యాసంగమము ఘోరపాపమ్మె కదా”

    రిప్లయితొలగించండి
  3. కందం
    ఆర్యులు వలదని చెప్పిన
    చర్యలు చేపట్టకెపుడు, సత్ఫలమిడదన్
    గార్యమ్మనఁ దిరుమలపై
    భార్యాసంగమము ఘోరపాపమ్మె కదా!

    శార్దూలవిక్రీడితము
    ఆర్యుల్ మంచిది కాదటంచనగనే యాచారబాహ్యమ్ములౌ
    కార్యాసక్తత సత్ఫలమ్మిడదనన్ గర్హింతురెవ్వారలున్
    ధైర్యమ్మూనుట తప్పగున్ దిరుమలన్ దర్శించగాఁ బోయినన్
    భార్యాసంగము పాపహేతువగుఁ దద్భావంబు వర్జింపుమా!

    రిప్లయితొలగించండి
  4. రిప్లయిలు
    1. ఆర్యా నిజము పలికితిరి
      మర్యాదనతి క్ర మించి మానవ మృగమై
      చర్య గ కామము తో పర
      భార్యా సంగమము ఘోర పాప మ్మె కదా

      తొలగించండి
  5. *(రావణునితో విభీషణుని మాటలు గా......)*

    సూర్య కులాన్వయ రాముని
    భార్యనపహరించి తెచ్చి బంధించితివే
    చౌర్యమున, తగదంటిని పర
    భార్యాసంగమము ఘోరపాపమ్మె కదా.


    *(కీచకుని తో ద్రౌపది మాటలుగా........)*

    ధైర్యంబంచు దలంచినావొ యిదియే దౌర్జన్యమౌ నంటినే
    యార్యా నేనొక దాస దాసినయి యీ యంతః పురమ్మందు కైం
    కర్యమ్ముల్ సలుపంగ జేరితిని, దుష్కార్యమ్మె యన్యుండ్రదౌ
    భార్యాసంగము పాపహేతువగుఁ దద్భావంబు వర్జింపుమా.

    రిప్లయితొలగించండి
  6. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. [విభీషణుడు రావణునితో....]

      ధైర్యము కలదని రాముని
      భార్యను చూఱాడదగునె పంక్తిగ్రీవా
      పర్యాలోచింపగ పర
      భార్యాసంగమము ఘోరపాపమ్మె కదా

      ధైర్యంబున్నదటంచు సీత కనులన్ దైన్యంబు వీక్షింతువా
      పర్యాలోచన సల్పి పాతకములన్ వారించు వేరొండుదౌ
      భార్యాసంగము పాపహేతువగుఁ దద్భావంబు వర్జింపుమా
      కార్యోన్ముక్తుడవై మహీసుతనికన్ కాకుత్స్థు కర్పింపుమా

      తొలగించండి
  7. కం॥ కార్యాకార్య విచారము
    చర్యా నిర్దేశమిడక సతి విముఖతకున్
    నిర్యంత్రణమగు పగిదిని
    భార్యాసంగమము ఘోర పాపమ్మె కదా!

    శా॥ కార్యాకార్య విచక్షణా గతిని సంస్కారమ్ముతో వర్తిలన్
    బర్యాప్తంబగు పుణ్యమీధరను సంప్రాప్తించు గర్వమ్ముతో
    జర్యల్ గాంచి నిషిద్ధ కాలముల నుత్సాహించి కామమ్ముతో
    భార్యాసంగమము పాప హేతువగుఁ దద్భావంబు వర్జింపుమా

    నిర్యంత్రణము అడ్డులేనిది

    రిప్లయితొలగించండి
  8. శార్దూలము:
    చౌర్యమ్మున్ పరదార సంగమము దుశ్చర్యల్ దురాచారముల్
    క్రౌర్యంబున్ ప్రతిరంభమున్ రిపువులై గాసించు నెన్నండు, దు
    ష్కార్యంబౌ సహధర్మచారిణి తిరస్కారమ్ము వేఱొండుదౌ
    భార్యాసంగము, పాపహేతువగుఁ దద్భావంబు వర్జింపుమా

    రిప్లయితొలగించండి
  9. కం: ఆర్యా! ప్రొద్దుటి నుండియు
    కార్యమ్ముల జేయ నాలి కరుణ గొనవె! త్వ
    ద్భార్యా స్వాస్థ్యము నెంచక
    భార్యాసంగమము ఘోరపాపమ్మె కదా!
    (భార్య పై కరుణ లేక చాకిరీ మాత్రం అనుభవిస్తూ,ఆమె ఆరోగ్యా న్నైనా చూడక భార్య తో సంగమం మాత్రం కోరుకోవటం ఘోర పాపమే. )







    రిప్లయితొలగించండి
  10. శా:ఆర్యుల్ జెప్పిన రీతి పైతృకములౌ నా కర్మలందున్ శిరో
    ధార్య మ్మోయి గృహస్థ! యాబ్దిక మెటుల్ ధర్మమ్మె, పాటించు మా
    కార్యమ్మున్ గడు బ్రహ్మచర్యవిధి తత్కర్మంపు రాత్రమ్మునన్
    భార్యాసంగము పాపహేతువగుఁ దద్భావంబు వర్జింపుమా”

    (యథాతథ పూరణమే.పితృకర్మ చేసే రాత్రి భార్యాసంగమం నిషిద్ధము. )



    రిప్లయితొలగించండి
  11. క్రౌర్యం బగు నా భావమె
    వార్యం బెవ్వారి కేని వసుధం గడు దు
    ష్కార్యం బది త్యాజ్యము పర
    భార్యా సంగమము ఘోర పాపమ్మె కదా


    కార్యాకార్య మహా విచక్షణులు నిక్కం బందు రీ ధర్మమున్
    భార్యా హీనులు మోక్ష మన్న యది సంపాదింప రే నాఁటికిన్
    భార్యా రత్న మిలం బితౄణమును దీర్పన్ హేతువై భాసిలున్
    భా ర్యాసంగము పాప హేతు వగుఁ దద్భావంబు వర్జింపుమా

    [భార్యా +అసంగమము = భా ర్యాసంగమము]

    రిప్లయితొలగించండి
  12. చౌర్యము,నిష్కారణదు
    ష్కార్యము,దుర్వ్యసనవిషయసాంగత్యములున్,
    క్రౌర్యము,పరహింసయు,పర
    భార్యాసంగమము ఘోరపాపమ్మెకదా!

    రిప్లయితొలగించండి

  13. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    మర్యాదయె లేకుండగ
    శౌర్యము కలదనుచు సతము సతితో
    తగవుల్
    క్రౌర్యమును జూపుచున్ పర
    భార్యాసంగమము ఘోర పాపమ్మె కదా!

    రిప్లయితొలగించండి
  14. శౌర్యము కలదని సతతము
    క్రౌర్యపుటాలోచనములు గరిపిన మదిలో
    మర్యాదుండదు విను పర
    *“భార్యాసంగమము ఘోరపాపమ్మె కదా”*

    రిప్లయితొలగించండి
  15. అర్యానాథుని భక్తితో సతతమున్ ప్రార్థించుచున్, యుక్తమౌ
    కార్యమ్ముల్ పొనరించుచున్, బ్రజలదౌ కళ్యాణమున్ తల్చి చా
    తుర్యమ్మున్ సతితో చరించినను సంతోషమ్మునన్ సందెలో
    భార్యాసంగమము పాప హేతువగుఁ దద్భావంబు వర్జింపుమా

    రిప్లయితొలగించండి