5-11-2026 (గురువారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అమ్మను నన్నుఁ గనిన మహితాత్మున్ గొల్తున్”
(లేదా...)
“అమ్మను నన్నుఁ గన్న మహితాత్ముఁ దలంచెద నెమ్మనమ్మునన్”
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
ఒక కుమారుని మానసం..కందంఇమ్ముగ గృహమును నడుపుచుఁగమ్మని వరమై, ప్రమాద ఘటనన్ జిక్కన్దమ్మము దప్పక చూడగ నమ్మను, నన్నుఁ గనిని మహితాత్మున్ గొల్తున్ఉత్పలమాల ఇమ్ముగ నింటి దీపముగ నెల్లరి సేమము ముచ్చటన్ గనన్గమ్మగ మా వరమ్మనఁగ,గాయమునొందఁ బ్రమాదసంఘటన్దమ్మము దప్పకే తనకు దంపతియంచును నోర్మిఁ జూడఁగానమ్మను, నన్నుఁ గన్న మహితాత్ముఁ దలంచెద నెమ్మనమ్మునన్
రమ్మని తనయింటికి మముకమ్మని భోజనము బెట్టి కడు దయతోడన్మమ్ముల పరచియు చల్లగఅమ్మను నన్నుఁ గనిన మహితాత్మున్ గొల్తున్”
(చంద్రుని ఆలౌచన)ఇమ్ముగ కడలి మథనమున నెమ్మది గ నొకొకరు పుట్టు నేమము నందున్ వమ్మొనరించక పద్మినియమ్మను , నన్నుఁ గనిన మహితాత్మున్ గొల్తున్”
ఉత్పలమాలిక.నమ్మను దుర్మదాంధులను నశ్వరభోగవిలాసచిత్తులన్,సొమ్ములనాశజూపివినసొంపుగమాటలుజెప్పుదొంగలన్నమ్మను మోసగాళ్లనిక నాదగునర్థముతోనెతృప్తితోనిమ్ముగ ధర్మబద్ధముగనేదిలభించినదానిలోనె హర్షమ్మునెరుంగు ప్రజ్ఞనిక సర్వపరిగ్రహ త్యాగబుద్ధినేయిమ్మనివేడుకుందు పరమేశ్వరతుల్యులు, వేల్పులైన మా అమ్మను, నన్ను గన్న మహితాత్ముఁ దలంచెద నెమ్మనమ్మునన్*
ఇమ్మహి దైవ సమానులు నమ్మయు నాన్నలని నమ్మి యనవరతము త్యా గమ్మొనరించెడి యనఘులు నమ్మను నన్నుఁ గనిన మహితాత్మున్ గొల్తున్.ఇమ్మహి జన్మ నిచ్చి పరమేశుని రూపము తెల్పు వారలౌ త్రిమ్మట కోర్చి నన్ను గని దీమతి జేయగ జీవితమ్ము త్యా గమ్మును జేయుచుండిన యకాయులంచును డెందమందు నే నమ్మను నన్నుఁ గన్న మహితాత్ముఁ దలంచెద నెమ్మనమ్మునన్.
ఉమ్మలికమ్ముబాపి మది నూర్జితముం దొరయించ భక్తితోఅమ్మల గన్నయమ్మయగు హైమవతిన్ మునుముందు గొల్చి సద్మమ్మను భారవాహనము తాలిమితో నడిపించునట్టిమాయమ్మను, నన్నుఁ గన్న మహితాత్ముఁ దలంచెద నెమ్మనమ్మునన్
కమ్మని జన్మము నొసగిరిపిమ్మట నను తీర్చిదిద్ది పెంచిరి ప్రేమన్ నమ్మిన వేల్పులనుచు మాయమ్మను నన్నుఁ గనిన మహితాత్మున్ గొల్తున్కమ్మని జీవమిచ్చి నను గాచిన వారలు తల్లిదండ్రులేనమ్మిన నీతి సూత్రములు నాకు వచించుచు స్వీయశక్తిపైనమ్మక మేర్పడన్ నిలిపి నైతికమౌ బల మిచ్చియున్న మా యమ్మను నన్నుఁ గన్న మహితాత్ముఁ దలంచెద నెమ్మనమ్మునన్
ఉమ్మలికమ్మును బాపగనమ్మలకే యమ్మయైన నగజాతను, గేహమ్మును నడిపించెడు మాయమ్మను, నన్నుఁ గనిన మహితాత్మున్ గొల్తున్
ఇమ్ముగ నాహ్వా నించియు కమ్మని భోజన ము లొసగి కాపాడిన నాతమ్ముని వలె జూడగనా యమ్మ ను నన్ను గనిన మ హి తాత్ముని గొల్తు న్
అమ్మాన వోత్తమునితో నెమ్మెయిఁ గన లేక యున్న నింతయు బాంధవ్యమ్ము కరుణతో వెంకాయమ్మను నన్నుఁ గనిన మహితాత్మున్ గొల్తున్ పమ్మిన నీతి బాధలు నపారము మూరిన ప్రేమ తోడ నంకమ్మున నుంచి పెంచ మము గౌరవ భావము నాత్మ నూని నిత్యమ్మును నీదు తాతను దయా గుణ భాసితు సచ్చరిత్రు మీ యమ్మను నన్నుఁ గన్న మహితాత్ముఁ దలంచెద నెమ్మనమ్మునన్
ఇమ్ముగ పంచుచు ప్రేమను కమ్మని వంటల నతి మమకారము తోడన్తమ్మునకు నాకునొసగెడి*“యమ్మను నన్నుఁ గనిన మహితాత్మున్ గొల్తున్”*నెమ్మిని పంచుచున్ విడక నీతులు చెప్పుచు మంచి దారిలోమమ్మిల లోన సాగుమని మానుగ బోధన చేయుచున్ సదాకమ్మగవంటలెల్లమమకారముతోడనుచేయుచున్నమా*“యమ్మను నన్నుఁ గన్న మహితాత్ముఁ దలంచెద నెమ్మనమ్మునన్”*
పిన్నక నాగేశ్వరరావు.హైదరాబాద్.కమ్మని వంటలు వండుచునిమ్ముగ గృహమును నడుపుచు నేకాగ్రతతోతమ్ముని నాకొసగిన మాయమ్మను,నన్నుఁ గనిన మహితాత్మున్ గొల్తున్.
(ఇది నాకు తెలిసిన మద్రాసులో నాకు చాలా పైఅధికారి కథ అండి. ఆయన భార్య చనిపోయిన తరువాత ఆయనే ఇద్దరు కూతుర్లను పెంచారు. చివరి సారిగా ఆయనను పలకరించినపుడు మేలుకోటె లో సీనియర్ హోమ్ లో ఉండేవారు)ఉ॥ అమ్మ గతించ బాధ్యతల నన్నియుఁ దాల్చుచుఁ దీర్చి దిద్దఁగన్నెమ్మిని సైఁచి కష్టముల నెమ్మదిఁ గూర్చుచుఁ బెంచె నొక్కఁడేయిమ్మహి సంతు నిద్దరిని నీశుఁడు గాదొకొ మాకు నక్క రామమ్మను, నన్నుఁ గన్న మహితాత్ముఁ దలంచెద నెమ్మనమ్మునన్అక్కచెల్లెండ్రలో చెల్లెలు తెలిపి నట్టుగా నండి. గతములో లక్ష్మమ్మ రామమ్మ పేర్లు ఉండేవండి
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిఒక కుమారుని మానసం..
తొలగించండికందం
ఇమ్ముగ గృహమును నడుపుచుఁ
గమ్మని వరమై, ప్రమాద ఘటనన్ జిక్కన్
దమ్మము దప్పక చూడగ
నమ్మను, నన్నుఁ గనిని మహితాత్మున్ గొల్తున్
ఉత్పలమాల
ఇమ్ముగ నింటి దీపముగ నెల్లరి సేమము ముచ్చటన్ గనన్
గమ్మగ మా వరమ్మనఁగ,గాయమునొందఁ బ్రమాదసంఘటన్
దమ్మము దప్పకే తనకు దంపతియంచును నోర్మిఁ జూడఁగా
నమ్మను, నన్నుఁ గన్న మహితాత్ముఁ దలంచెద నెమ్మనమ్మునన్
రమ్మని తనయింటికి మము
రిప్లయితొలగించండికమ్మని భోజనము బెట్టి కడు దయతోడన్
మమ్ముల పరచియు చల్లగ
అమ్మను నన్నుఁ గనిన మహితాత్మున్ గొల్తున్”
(చంద్రుని ఆలౌచన)
రిప్లయితొలగించండిఇమ్ముగ కడలి మథనమున
నెమ్మది గ నొకొకరు పుట్టు నేమము నందున్
వమ్మొనరించక పద్మిని
యమ్మను , నన్నుఁ గనిన మహితాత్మున్ గొల్తున్”
ఉత్పలమాలిక.
రిప్లయితొలగించండినమ్మను దుర్మదాంధులను నశ్వరభోగవిలాసచిత్తులన్,
సొమ్ములనాశజూపివినసొంపుగమాటలుజెప్పుదొంగలన్
నమ్మను మోసగాళ్లనిక నాదగునర్థముతోనెతృప్తితో
నిమ్ముగ ధర్మబద్ధముగనేదిలభించినదానిలోనె హ
ర్షమ్మునెరుంగు ప్రజ్ఞనిక సర్వపరిగ్రహ త్యాగబుద్ధినే
యిమ్మనివేడుకుందు పరమేశ్వరతుల్యులు, వేల్పులైన మా
అమ్మను, నన్ను గన్న మహితాత్ముఁ దలంచెద నెమ్మనమ్మునన్*
రిప్లయితొలగించండిఇమ్మహి దైవ సమానులు
నమ్మయు నాన్నలని నమ్మి యనవరతము త్యా
గమ్మొనరించెడి యనఘులు
నమ్మను నన్నుఁ గనిన మహితాత్మున్ గొల్తున్.
ఇమ్మహి జన్మ నిచ్చి పరమేశుని రూపము తెల్పు వారలౌ
త్రిమ్మట కోర్చి నన్ను గని దీమతి జేయగ జీవితమ్ము త్యా
గమ్మును జేయుచుండిన యకాయులంచును డెందమందు నే
నమ్మను నన్నుఁ గన్న మహితాత్ముఁ దలంచెద నెమ్మనమ్మునన్.
ఉమ్మలికమ్ముబాపి మది నూర్జితముం దొరయించ భక్తితో
రిప్లయితొలగించండిఅమ్మల గన్నయమ్మయగు హైమవతిన్ మునుముందు గొల్చి స
ద్మమ్మను భారవాహనము తాలిమితో నడిపించునట్టిమా
యమ్మను, నన్నుఁ గన్న మహితాత్ముఁ దలంచెద నెమ్మనమ్మునన్
కమ్మని జన్మము నొసగిరి
రిప్లయితొలగించండిపిమ్మట నను తీర్చిదిద్ది పెంచిరి ప్రేమన్
నమ్మిన వేల్పులనుచు మా
యమ్మను నన్నుఁ గనిన మహితాత్మున్ గొల్తున్
కమ్మని జీవమిచ్చి నను గాచిన వారలు తల్లిదండ్రులే
నమ్మిన నీతి సూత్రములు నాకు వచించుచు స్వీయశక్తిపై
నమ్మక మేర్పడన్ నిలిపి నైతికమౌ బల మిచ్చియున్న మా
యమ్మను నన్నుఁ గన్న మహితాత్ముఁ దలంచెద నెమ్మనమ్మునన్
ఉమ్మలికమ్మును బాపగ
రిప్లయితొలగించండినమ్మలకే యమ్మయైన నగజాతను, గే
హమ్మును నడిపించెడు మా
యమ్మను, నన్నుఁ గనిన మహితాత్మున్ గొల్తున్
ఇమ్ముగ నాహ్వా నించియు
రిప్లయితొలగించండికమ్మని భోజన ము లొసగి కాపాడిన నా
తమ్ముని వలె జూడగనా
యమ్మ ను నన్ను గనిన మ హి తాత్ముని గొల్తు న్
అమ్మాన వోత్తమునితో
రిప్లయితొలగించండినెమ్మెయిఁ గన లేక యున్న నింతయు బాంధ
వ్యమ్ము కరుణతో వెంకా
యమ్మను నన్నుఁ గనిన మహితాత్మున్ గొల్తున్
పమ్మిన నీతి బాధలు నపారము మూరిన ప్రేమ తోడ నం
కమ్మున నుంచి పెంచ మము గౌరవ భావము నాత్మ నూని ని
త్యమ్మును నీదు తాతను దయా గుణ భాసితు సచ్చరిత్రు మీ
యమ్మను నన్నుఁ గన్న మహితాత్ముఁ దలంచెద నెమ్మనమ్మునన్
ఇమ్ముగ పంచుచు ప్రేమను
రిప్లయితొలగించండికమ్మని వంటల నతి మమకారము తోడన్
తమ్మునకు నాకునొసగెడి
*“యమ్మను నన్నుఁ గనిన మహితాత్మున్ గొల్తున్”*
నెమ్మిని పంచుచున్ విడక నీతులు చెప్పుచు మంచి దారిలో
మమ్మిల లోన సాగుమని మానుగ బోధన చేయుచున్ సదా
కమ్మగవంటలెల్లమమకారముతోడనుచేయుచున్నమా
*“యమ్మను నన్నుఁ గన్న మహితాత్ముఁ దలంచెద నెమ్మనమ్మునన్”*
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
కమ్మని వంటలు వండుచు
నిమ్ముగ గృహమును నడుపుచు నేకాగ్రతతో
తమ్ముని నాకొసగిన మా
యమ్మను,నన్నుఁ గనిన మహితాత్మున్
గొల్తున్.
(ఇది నాకు తెలిసిన మద్రాసులో నాకు చాలా పైఅధికారి కథ అండి. ఆయన భార్య చనిపోయిన తరువాత ఆయనే ఇద్దరు కూతుర్లను పెంచారు. చివరి సారిగా ఆయనను పలకరించినపుడు మేలుకోటె లో సీనియర్ హోమ్ లో ఉండేవారు)
రిప్లయితొలగించండిఉ॥ అమ్మ గతించ బాధ్యతల నన్నియుఁ దాల్చుచుఁ దీర్చి దిద్దఁగన్
నెమ్మిని సైఁచి కష్టముల నెమ్మదిఁ గూర్చుచుఁ బెంచె నొక్కఁడే
యిమ్మహి సంతు నిద్దరిని నీశుఁడు గాదొకొ మాకు నక్క రా
మమ్మను, నన్నుఁ గన్న మహితాత్ముఁ దలంచెద నెమ్మనమ్మునన్
అక్కచెల్లెండ్రలో చెల్లెలు తెలిపి నట్టుగా నండి. గతములో లక్ష్మమ్మ రామమ్మ పేర్లు ఉండేవండి