31, ఆగస్టు 2010, మంగళవారం

30, ఆగస్టు 2010, సోమవారం

సమస్యా పూరణం - 81

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ....
గర్భమునందున్న పులియె గాండ్రించె నయో!

29, ఆగస్టు 2010, ఆదివారం

సమస్యా పూరణం - 80

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ....
బాసు భళి యటంచు ప్రణతుఁ డయ్యె.

గళ్ళ నుడికట్టు - 48


అడ్డం
1. ఆవిడ వాడి గృహిణి తమ్ముడూ! పెండ్లి కాలేదనకు (4)
3. అనుకూలంగా కలుషములు కడిగే నది (4)
7. నావికుడి చూపు ఈ వైపే (2)
8। బావి కడ వదలి వచ్చావా నీళ్ళు తెచ్చేది (3)
9. చచ్చేముందైనా దేవుడి పేరులో సగమైనా పలికిద్దామని నార చూపించి ఇదేమని అడిగితే ఆ నాస్తికుడేమన్నాడు? (2)
12. ఇక్కడి గురుతులు నీళ్ళు ఇంకి, ఆవిరైన చర్యను సూచిస్తున్నాయి. చిగురులో ఒక హల్లును తొలగించండి (3)
13. విడుదల కోసము యథాశక్తి పోరాడితే లభించింది (3)
17. ఈ పోస్ట్ శీర్షికలోని మాట (2)
18. ప్రతిసారి భీమన చేసే శపథం (3)
19. చేకూరి రామారావు పొట్టివాడయ్యాడు (2)
22. ఏ పనిని ముట్టుకోవాలన్నా సాధనం కావాలి (4)
23. పార్వతి. దక్షుని కూతురా? (4)
నిలువు
1. అల్లుని తండ్రైనా, కోడలు తండ్రైనా ఇతడే (4)
2. తోక తెగిన మంచును తిరగేస్తే భూమి (2)
4. ఆలంబనంలో దీర్ఘం, విశాలం, 90 డిగ్రీలు (2)
5. జిహ్వ గ్రహించేవి ఆరు (4)
6. పడతుక (3)
10. రోత. చికిత్సలా ధ్వనిస్తుంది (3)
11. బొమిక (3)
14. కంటిలోని పసిబిడ్డ (4)
15. దూతకు స్త్రీలింగం (3)
16. అడ్డం 23 లోని ఆవిడే. "శరణ్యే త్ర్యంబకే దేవి ......... నమోస్తు తే" (4)
20. లిస్టులో మీరు లేరా? ఉన్నామని చెప్పకండి (2)
21. క్షాతలమంతా నిండిన కరువు తలక్రిందయింది

28, ఆగస్టు 2010, శనివారం

సమస్యా పూరణం - 79

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ....
రావణుఁడు సీత మగఁడయి రక్ష సేయు.

వారాంతపు సమస్యా పూరణం - 6

తల్లిని చంపియున్ సుతుఁడు తండ్రి పదంబుల వ్రాలె భక్తితోన్.

27, ఆగస్టు 2010, శుక్రవారం

సమస్యా పూరణం - 78

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ....
అర్ధరాత్రి సూరుఁ డస్తమించె.

వారాంతపు సమస్యా పూరణం - 6

తల్లిని చంపియున్ సుతుఁడు తండ్రి పదంబుల వ్రాలె భక్తితోన్.

గళ్ళ నుడికట్టు - 47


అడ్డం
1. రసరాజం. మెర్క్యురీ (4)
3. మధుమక్షిక. బీ (4)
7. కడుపు (2)
7. కరుణ లేనిది (3)
9. జాతరకు ప్రకృతి తిరగబడింది (2)
12. మిక్కిలి ప్రసిద్ధి కెక్కింది (3)
13. గర్భిణీ స్త్రీలకు వచ్చే వాంతులు (3)
17. వేషగాళ్ళు, వాద్యగాళ్ళ సమ్మేళనం తిరగబడింది (2)
18. సముద్రం (3)
19. పశువుల సమూహం (2)
22. హితోపదేశ మనే పంచతంత్ర కథల సృష్టికర్త (4)
23. నీరజనేత్ర! పద్మాక్ష! (4)
నిలువు
1. పాపి (4)
2. మణి, శ్రేష్టం (2)
4. గెలుచు (వ్యవహారార్థం), నిర్వహిందు (నైఘంటికార్థం) (2)
5. కాల సూచిక. క్లాక్ (4)
6. గాడిద (3)
10. కామెంటరీ (3)
11. ఇంగ్లీషు రంపంతో మొదలై, ఇంగ్లీషు మూడుతో అంతమయ్యే నటి (3)
14. కీ (4)
15. బంగార"ము" (3)
16. చెప్పు (4)
20. కోరిక, దిక్కు (2)
21. మట్టి తోడే పనిముట్టు (2)

26, ఆగస్టు 2010, గురువారం

సమస్యా పూరణం - 77

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ....
వరలక్ష్మీ వ్రతముఁ జేసె వహిదా రెహమాన్.

వారాంతపు సమస్యా పూరణం - 6
తల్లిని చంపియున్ సుతుఁడు తండ్రి పదంబుల వ్రాలె భక్తితోన్.

25, ఆగస్టు 2010, బుధవారం

సమస్యా పూరణం - 76

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ....
అమ్మా రమ్మనుచు పిలిచె నాలిన్ పతియే.

వారాంతపు సమస్యా పూరణం - 6
తల్లిని చంపియున్ సుతుఁడు తండ్రి పదంబుల వ్రాలె భక్తితోన్.

24, ఆగస్టు 2010, మంగళవారం