30, సెప్టెంబర్ 2019, సోమవారం

సమస్య - 3148 (చైత్రములోన...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"చైత్రమునఁ గడుపై కనె శ్రావణమున"
(లేదా...)
"చైత్రములోనఁ దప్పె నెల జన్మ మొసంగెను శ్రావణంబునన్"
(గంగుల ధర్మరాజు గారికి ధన్యవాదాలతో...)

29, సెప్టెంబర్ 2019, ఆదివారం

సమస్య - 3147 (ఏడ్పే యిష్టమ్ము...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"ఏడ్పే యిష్టమ్ము నా కదే మోద మిడున్"
(లేదా...)
"ఏడ్పే యిష్ట మటంచుఁ జెప్పెద నదే యెంతేని మోదం బిడున్"
(ఆముదాల మురళి గారి శ్రీకాకుళం శతావధాన సమస్య)

28, సెప్టెంబర్ 2019, శనివారం

సమస్య - 3146 (చుక్కలు భూమిపై...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"చుక్కలు భువిపైన వెల్గెఁ జోద్యం బయ్యెన్"
(లేదా...)
"చుక్కలు భూమిపై వెలిఁగె సూర్యుఁడు చంద్రుఁడుఁ జోద్యమందఁగన్"
(ఈరోజు పూరణలు ప్రసారం కానున్న ఆకాశవాణి వారి సమస్య)

27, సెప్టెంబర్ 2019, శుక్రవారం

సమస్య - 3145 (ఏనుఁగు చంపనోపునొకొ...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"చంపఁగలదె యేనుంగు మూషకమునైన"
(లేదా...)
"ఏనుఁగు చంపనోపునొకొ యెల్కఁ గడుంగడు విక్రమించినన్"
(డా. వెలుదండ సత్యనారాయణ గారు పంపిన సమస్య)

26, సెప్టెంబర్ 2019, గురువారం

సమస్య - 3144 (ఎంత పండితుండైన...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"ఎంత పండితుండైనఁ దా నెఱుఁగఁ గలఁడె"
(లేదా...)
"ఎంతటి పండితుండయిన నేర్పడఁ దా నెఱుఁగంగ శక్యమే"
(డా. వెలుదండ సత్యనారాయణ గారు పంపిన సమస్య)

25, సెప్టెంబర్ 2019, బుధవారం

సమస్య - 3143 (నకులునితోడ రాఘవుఁడు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

"నకులునితో రాఘవుఁడు రణం బొనరించెన్"
(లేదా...)
"నకులునితోడ రాముఁడు రణం బొనరించె బుధుల్ నుతింపఁగన్"
(ఆముదాల మురళి గారి శ్రీకాకుళం శతావధాన సమస్య)

24, సెప్టెంబర్ 2019, మంగళవారం

సమస్య - 3142 (పాటలగంధి యింపుగను...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"మాటలే రాని మగువయే పాటఁ బాడె"
(లేదా...)
"పాటలగంధి యింపుగను బాడెను మాటలు రాకపోయినన్"

(పోచిరాజు కామేశ్వర రావు గారు పంపిన సమస్య)

23, సెప్టెంబర్ 2019, సోమవారం

సమస్య - 3141 (కులమును గుర్తించు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కులమును గుర్తించు వాఁడె గురువన నొప్పున్"
(లేదా...)
"కులముం గాంచియు బోధ సేయు గురువే క్షోణిన్ గడున్ బూజ్యుఁడౌ"

22, సెప్టెంబర్ 2019, ఆదివారం

సమస్య - 3140 (తమిళులకు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"తమిళులకు తెల్గుబాసపై తగని ప్రీతి"
(లేదా...)
"తమిళులకున్ దెలుంగనినఁ దద్దయుఁ బ్రీతి యటన్న నమ్ముమా"
(ఈరోజు తమిళనాడులోని హోసూరులో శ్రీమతి జయలక్ష్మి గారి పుస్తకావిష్కరణ సభలో నేను పాల్గొంటున్న సందర్భంగా...)

21, సెప్టెంబర్ 2019, శనివారం

సమస్య - 3139 (వచ్చెను మార్గశీర్షమున...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"మార్గశిరమందు వచ్చె నామని పుడిమికి"
(లేదా...)
"వచ్చెను మార్గశీర్షమున భవ్యవసంతము ధాత్రి నిండుగన్"
(ఈరోజు పూరణలు ప్రసారం కానున్న ఆకాశవాణి వారి సమస్య)