30, జూన్ 2022, గురువారం

సమస్య - 4122

1-7-2022 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పంతులే చెప్పెఁ దప్పులఁ బలుకుమనుచు”
(లేదా...)
“పంతులె తప్పులం బలుకవచ్చని చెప్పెను పిల్లవండ్రతో”

29, జూన్ 2022, బుధవారం

సమస్య - 4121

30-6-2022 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కాశి కేగిన కవికిఁ గాంక్షలు సెలంగె"
(లేదా...)
"కాశికిఁ బోయినట్టి కవి కాంక్షలు మిక్కుట మయ్యె నక్కటా"
(డా. వజ్జల రంగాచార్య గారికి ధన్యవాదాలతో...)

28, జూన్ 2022, మంగళవారం

సమస్య - 4120

29-6-2022 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“జీవితమున గొప్ప సుఖము చిక్కు మడిసినన్”
(లేదా...)
“జీవితమందు సౌఖ్యము విశేషముగా లభియించుఁ జచ్చినన్”

27, జూన్ 2022, సోమవారం

సమస్య - 4119

28-6-2022 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కవనమ్మును జెప్పు కవు లకారణశత్రుల్”
(లేదా...)
“కవనముఁ జెప్పి యెల్లర కకారణశత్రులు గారె సత్కవుల్”

26, జూన్ 2022, ఆదివారం

సమస్య - 4118

27-6-2022 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పండితుఁడై వింతమృగము పగిదిఁ జరించెన్”
(లేదా...)
“విద్య గడించి పండితుఁడు వింత మృగంబుగ సంచరించెనే”

25, జూన్ 2022, శనివారం

దత్తపది - 184

26-6-2022 (ఆదివారం)
కవిమిత్రులారా,
'మబ్బు - వాన - ముసురు - వరద'
ఈ పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ
ఖాండవ దహన వృత్తాంతాన్ని
స్వేచ్ఛాఛందంలో పద్యం వ్రాయండి.

24, జూన్ 2022, శుక్రవారం

సమస్య - 4117

25-6-2022 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కుక్కకుఁ జెమ్మటలు వొడమకుండునె సతమున్”
(లేదా...)
“కుక్కకుఁ జెమ్మటల్ వొడమకుండునె రేఁబవ లొక్కరీతిగన్”

23, జూన్ 2022, గురువారం

సమస్య - 4116

24-6-2022 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“శ్రీయే నా చెల్లెలనుచు శ్రీహరి పలికెన్”
(లేదా...)
“శ్రీయే సోదరి నాకటంచుఁ బలికెన్ శ్రీనాథుఁ డుత్సాహియై”

22, జూన్ 2022, బుధవారం

సమస్య - 4115

23-6-2022 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“విప్రులు మాంసమ్ముఁ గొనిరి వేడుకతోడన్”
(లేదా...)
“విప్రవరుల్ దమిం గొనిరి వేడ్కగ మాంసము శాస్త్రపద్ధతిన్”

21, జూన్ 2022, మంగళవారం

సమస్య - 4114

22-6-2022 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ఖర సముదాయమ్ము వచ్చెఁ గాంచఁగ నన్నున్”
(లేదా...)
“ఖర సముదాయ మిచ్చటకుఁ గాంచుటకై నను వచ్చెఁ జూడుమా”