24, నవంబర్ 2013, ఆదివారం

సమస్యాపూరణం - 1244 (కడప మిరియముల్)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది......
కడప మిరియముల్ గుమ్మడికాయలంత.

26 కామెంట్‌లు:


  1. అడప మురిపెముల్ అమ్మడి సొగసంత
    గడప మురిపెముల్ వల్లి రంగులంత
    ఒడప మురిపెముల్ వాగు చెలు వంత
    కడప మిరియముల్ గుమ్మడికాయలంత!!


    శుభోదయం
    జిలేబి
    (పరార్!)

    రిప్లయితొలగించండి
  2. కాన వచ్చుచునుండు విజ్ఞాన శాస్త్ర
    వేత్తల ప్రయోగ శాలలో వింత గొలుపు
    నట్టి యాంత్రి కాదర్శక మందు గనిన
    కడప మిరియముల్ గుమ్మడి కాయలంత

    (యాంత్రికాదర్శకము = మైక్రోస్కోపు)

    రిప్లయితొలగించండి
  3. మిత్రులందరకు శుభాశీస్సులు.
    మరియొక సారి నా మనవి:

    మన బ్లాగులో వర్గ వైషమ్యములకు గాని ప్రాంతీయ భేదములకు గాని ఇతరములైన సున్నితములైన విషయములను గురించి గాని ఎట్టి ప్రస్తావనలును తేవద్దు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  4. గండు చీమల చిత్రమున్ గనుచు నుంటి
    చిత్రమైనట్టి పాట్లనే చీమ పడియె
    దూలమంతగ కనబడు మ్రోల నింటి
    కడప, మిరియముల్ గుమ్మడి కాయలంత

    రిప్లయితొలగించండి
  5. అతిశయోక్తుల యల్లుడు నాడె నిటుల
    కడప నా జన్మభూమని గర్వపడుదు
    బాంబు మోతల తెలవార పగలు మాకు
    పిల్లవాడైన తొడగొట్టి బెదర గొట్టు
    కడప మిరియముల్ గుమ్మడి కాయ లంత!

    రిప్లయితొలగించండి
  6. కడప మిరియముల్ గుమ్మడి కాయ లంత
    యగుపడును మఱి భూతద్ద మందు జూడ
    ఒక్క కడపయే కాకుండ యెక్క డైన
    నటులె గన్పడు నిజమిది యార్య ! యౌన ?

    రిప్లయితొలగించండి
  7. పండిత నేమాని గారికి పూజ్యగురుదేవులు
    శంకరయ్య గారికివందనములు

    పళ్ళెరమునందు బియ్యము పనసపండు
    కాయ గూరలు తములము కాంచనమ్ము
    కడప మిరియముల్ గుమ్మడి కాయలంత
    చెరకు బెల్లపు ముద్ద భూ సురులకిడిరి
    కార్తికమ్మున నింతులు కలుగ సంతు

    రిప్లయితొలగించండి
  8. ఆరు ఆడుగుల గెలవేసె అరటి చెట్టు
    కంది చేనుకి నువ్వులు కాపు కాసె
    కడప మిరియముల్ గుమ్మడి కాయ లంత
    కలవు వింతలు యెన్నియో కలి యుగాన

    రిప్లయితొలగించండి
  9. శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.....

    శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములతో...

    ఈ మధ్య క్రొత్త రకపు వంగడములు వచ్చు చున్నవి

    ఉ : పసుపు పచ్చ కాప్ ఛికమ్ , ఒక కేజీ వంకాయ మొ ...
    =======*===============
    కూర గాయలు (గాయాలు) గొన బోతి నూరి సంత
    కు, మురిపించెను ముందుగా క్రొత్త రకపు
    కడప మిరియముల్ గుమ్మడి కాయ లంత
    గలవు, మెరయు చుండెను ద్రాక్ష ఫలముల వలె!

    రిప్లయితొలగించండి
  10. టంగుటూరి మిర్యమ్ముల మ్రింగ లేము
    తాటి పండ్లంత నుంటచే, తాత చెప్పె
    కాని వినలేదు సామెత దీని నేను
    కడప మిరియముల్ గుమ్మడికాయలంత.

    రిప్లయితొలగించండి
  11. కడప ప్రాంతము నందున గడప గడప
    బాంబులు తయారు గావించు పనుల యందు
    చిన్నవారు పెద్ద పనుల జేయు విధము
    రోషమును గలిగించగా లోకులకును
    కడప మిరియముల్ గుమ్మడి కాయలంత

    రిప్లయితొలగించండి
  12. ఒక వస్తువుయొక్క పరిమాణము పెద్దదా చిన్నదా అనేది పోలికతో మాత్రమే చెప్పగలము కానీ ఇదమిద్ధంగా యిది అని చెప్పలేము కదా అనే భావన.

    ఈ పూరణ సమస్యను పరిష్కరిస్తుందో లేదో గురువుగారే శెలవియ్యాలి.

    సూక్ష్మజీవులు = చీమలు మొ!!

    పిల్లతనమున నిచ్చెన పెద్దదిగను
    పెరిగినప్పుడు చూడగ కురుచ యగును
    సూక్ష్మ జీవుల దృష్టితో చూచినపుడు
    కడప మిరియముల్ గుమాడికాయలంత

    రిప్లయితొలగించండి
  13. శాస్త్ర వేత్తలు శోధనశాల యందు
    సూక్ష్మ దర్శితో ఖాద్య వస్తువుల నరయు
    చుండ వారలకగుపడె జోద్యముగను
    కడప మిరియముల్ గుమ్మడి కాయలంత.

    రిప్లయితొలగించండి
  14. దొరుకు చున్నవి గగనంపు తోట లోన
    వెలుగు చున్నవి చుక్కల పూలు మెండు
    చంద మామను మించిన జాతి ఫలము
    కడప మిరియముల్ గుమ్మడి కాయ లంత

    రిప్లయితొలగించండి
  15. పండిత నేమాని గారికి పూజ్యగురుదేవులు
    శంకరయ్య గారికివందనములు

    శౌర్య సాహస విక్రమ ఛవినిపెంచు
    కడప మిరియముల్.గుమ్మడి కాయలంత
    వజ్ర వైడూర్యమణులతో వాసికెక్కి
    కడప రాయలసీమలో గ్రాలుచుండు

    రిప్లయితొలగించండి

  16. ఇరువు రొకచోఁ గలిసి తమ పురముల ప్ర
    శస్తి గొప్పగాఁ జెప్పఁగసాగినారు;
    “గన్నవరము జొన్నలు జామకాయలంత!”
    “కడప మిరియాలు గుమ్మడికాయలంత!”

    రిప్లయితొలగించండి
  17. గురువు గారు చాలా చమత్కార భరిత మైన పద్యము వ్రాసారు.

    రిప్లయితొలగించండి
  18. జిలేబీ గారూ,
    అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    సూక్ష్మదర్శిని విషయంగా మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    చీమకు మిరియం గుమ్మడికాయంతగా కనిపింస్తుంది. విరుపు కూడా బాగుంది. అభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    అల్లుని గొప్పలతో మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    భూతద్దాన్ని విషయంగా చేసికొన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    అయ్యవారిని సత్కరించిన మీ మొదటి పూరణ, రాయలసీమ పౌరుషాన్ని తెలిపిన రెండవ పూరణ బాగున్నవి. అభినందనలు.
    *
    శైలజ గారూ,
    కలియుగపు వింతలను గురించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘ఆరు+అడుగులు’ అని విసంధిగా వ్రాసారు. ఆపాదాన్ని ‘ఆ రడుగులుగ గెలవేసె నరటిచెట్టు’ అందాం.
    ‘వింతలు + ఎన్నియో" అన్నప్పుడు యడాగమం రాదు. ఆ పాదాన్ని ‘కలవు వింత లెన్నెన్నొ యీ కలియుగాన" అనండి.
    *
    వరప్రసాద్ గారూ,
    హైబ్రీడ్ కూరగాయలు, ధాన్యం మొదలైనవి అలాగే ఉంటున్నాయి. మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    సామెత చెప్పినట్లు.. మీ పూరణ చమత్కారజనకంగా ఉంది. అభినందనలు.
    *
    బొడ్డు శంకరయ్య గారూ,
    కడప బాంబుల ప్రస్తావనతో మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ సూక్ష్మదృష్టి పూరణ బాగుంది. అభినందనలు.
    *
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ సూక్ష్మదర్శిని పూరణ బాగుంది. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ ఊహాలోకపు పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  19. కడప కోట్ల లంచము లెక్కకట్ట లేము
    కడప హత్యలన్నియు ఘనకార్యములట
    కడపమిరియముల్ గుమ్మడి కాయలంత
    కడప యందన్నియు విచిత్ర కరణములవి
    తెలుసుకోర తెలివిలేని తెలుగువాడ!

    రిప్లయితొలగించండి
  20. శ్రీ కంది శంకరయ్య గారూ!
    శుభాశీస్సులు.
    గన్నవరము జామకాయలు మరియు కడప మిరియములు గురించిన అతిశయోక్తిగా మీరు జరిపించిన సంభాషణ పద్యము బాగున్నది. అభినందనలు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  21. చంద్రశేఖర్ గారూ,
    కడప వైచిత్ర్యాన్ని వివరిస్తూ చక్కని పూరణ చేసారు. అభినందనలు.
    *
    వరప్రసాద్ గారూ,
    పండిత నేమాని వారూ,
    ...................... ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  22. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    కడప మిరియములు గుమ్మడి కాయలనడం వంటిదే
    ఈ విభజిస్తే యేదో వస్తుందనడం కూడా :

    01)
    ___________________________________

    కళ్ళు తెరుతురు విభజన - ఘాతకులును
    కలసి యున్ననె సుఖములు - గలుగు నంచు !
    కడకు మిగులును విభజన - కావ్యమందు
    కడప మిరియముల్ గుమ్మడి - కాయలంత !!!
    ___________________________________

    రిప్లయితొలగించండి
  23. https://www.facebook.com/photo.php?fbid=326092097530947&set=a.137584453048380.27540.100003904789679&type=1&theater

    రిప్లయితొలగించండి
  24. రిప్లయిలు
    1. విట్ఠల్ గారూ,
      శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
      ఈ పేజీ చివర ఉన్న 'హోమ్' అన్న దానిని నొక్కండి.

      తొలగించండి
    2. విట్ఠల్ గారూ,
      శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
      ఈ పేజీ చివర ఉన్న 'హోమ్' అన్న దానిని నొక్కండి.

      తొలగించండి