28, సెప్టెంబర్ 2014, ఆదివారం

న్యస్తాక్షరి - 7

అంశం- దుర్గాదేవీస్తుతి.
ఛందస్సు- తేటగీతి.
ప్రథమపాదం ద్వితీయగణాద్యక్షరం ‘దు’, 
ద్వితీయపాదం తృతీయగణాద్యక్షరం ‘ర్గ’,(కావాలనే హ్రస్వంగా ఇచ్చాను)
తృతీయపాదం చతుర్థగణాద్యక్షరం ‘దే’, 
చతుర్థపాదం పంచమగణాద్యక్షరం ‘వి’.

34 కామెంట్‌లు:

చంద్రమౌళి సూర్యనారాయణ చెప్పారు...

అంబ దుర్గాభవానీ జయంతి గిరిజ
చండి గౌరి భార్గవి కాళి శైలపుత్రి
త్రిపురసుందరి పార్వతీదేవి యనుచు
నేస్మరించుచు జేసెద నీకు వినతి

జిగురు సత్యనారాయణ చెప్పారు...

దనుజ దుష్టులఁ దునిమెడు తల్లివీవు
పడును దైవ వర్గము నీదు పదములందు
తీరుగ నిను గొలిచిన సందేహమడయు
లేదు జననమిక తెలియ నీదు విద్య!!

కంది శంకరయ్య చెప్పారు...

చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ స్తుతిపద్యం బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

జిగురు సత్యనారాయణ గారూ,
భవానీవిద్య జన్మరాహిత్య మిస్తుందన్న మీ పూరణ బాగున్నది. అభినందనలు.

జిగురు సత్యనారాయణ చెప్పారు...

సూర్యనారాయణ గారు!
భార్గవి అంటే లక్ష్మీదేవి అనిగదా!
దుర్గా దేవిని ముగురమ్మల మూలపుటమ్మగా భావిస్తే భార్గవి అన్నా సరిపోతుందేమో

subbarao చెప్పారు...

అమ్మ !దుర్గమ్మ !కాపాడు మమ్మ , నన్ను
న లమి యున్న దు ర్గములను దొలగ జేయ
దీ ను నై నట్టి యీ నేను దేవి ! నిన్ను
మఱువ కుండగ బూజింతు మాత ! వినుము

వసంత కిశోర్ చెప్పారు...

అందరికీ వందనములు !
అందరి పూరణలూ అలరింప నున్నవి !

దుర్గాదేవి స్తుతి :

01)
______________________________

అంబ ! దుగ్గమ్మ ! చండిక ! - అన్నపూర్ణ !
అగజ ! గౌరి ! దుర్గ ! హిమజ ! - ఆర్య ! చండి !
ధిషణ ! ఆనందభైరవి - దేవి ! సురస !
సావిత్రి ! సురసుందరి ! సౌమ్య - శాంతి ! విజయ !

పాదపూజల జేతుమో - పద్మనేత్రి !
భద్రముగ మమ్ము గరుణించు - భద్రకాళి !
స్తుతులు జేతుము వేనోళ్ళ - సుద్యుపాస్య !
విశ్వశాంతిని నెలకొల్పు - వీరమాత !
______________________________

కంది శంకరయ్య చెప్పారు...

సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘దుర్గము’ అంటే కోట అని అర్థం. ‘అలము పాపవర్గమ్మును దొలగజేయ’ అనండి.
*
వసంత కిశోర్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
నాల్గవ పాదంలో ‘సావిత్రి’ అన్నచోట గణభంగం. ‘సతి! త్రిపురసుందరీ! సౌమ్య! శాంతి! విజయ!’ అందామా?

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

చేరి దుష్టుల జంపగ గౌరి నీవు
మారి నావంట దుర్గగ, మాకు వరము
లీయ గొల్చెద దల్చెద దేవి నిన్ను
కనక దుర్గవు మమ్ముల గావ వినుము.
,

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

మిత్రులకు నమస్కారములు,

మిత్రులు జిగురు సత్యనారాయణగారికి ప్రత్యేక ధన్యవాదములు.

పనుల యొత్తిడిచే నేను నిన్న బ్లాగును చూచుట వీలుపడలేదు. జిగురు వారి కిటుకును మిత్రులందఱు నాచరించిచూచి యవగతముఁ జేసికొనుట నాకు సంతోషమునుం గూర్చినది. స్వస్తి.

భవదీయుఁడు
గుండు మధుసూదన్
madhurakavanam.blogspot.in


శ్రీపతిశాస్త్రి చెప్పారు...

శ్రీగురుభ్యోనమ:

కనకదుర్గమ్మవై నిల్చి కరుణ జూపి
నిగమ మోక్ష మార్గమ్ములు నీవొసంగి
దివ్యతేజమ్ముతో వెల్గు దేవి వమ్మ
హితము గూర్చగ గొల్చెద హృదయవిమల

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

మిత్రులకు నమస్సులు!

మాత! దుర్గ! దాక్షాయణి! మంగళ! శివ!
పార్వతి! సతి! భార్గవి! శక్తి! భద్రకాళి!
దేవసంస్తుత! ప్రవిచలదేణనేత్రి!
షష్ఠి! హిండి! నమోఽస్తుతే సమరవిజయ!

A.Satyanarayana Reddy చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
చంద్రమౌళి సూర్యనారాయణ చెప్పారు...

జిగురు సత్యనారాయణ గారూ! భార్గవి అంటే లక్ష్మి , పార్వతి , గఱిక అనే అర్ధాలు ఉన్నవి

A.Satyanarayana Reddy చెప్పారు...

ఏదైనా పదము ప్రస్ఫుటంగా కనుపించాలంటే లేఖినిలో నుండి గాని, బరాహా నుండి గాని "ఎమ్.ఎస్. వరల్డులో" కాపీ చేసి సెలక్టు చేసి బోల్డు చేయటం తేలిక.

Unknown చెప్పారు...

మల్లెలవారి పూరణలు
లోకదుర్నీతి యెంతయు లుప్త మవగ
మాత తాను దుర్గయునౌను మానితముగ
దివ్యమైనట్టి నవవిధ దేవి రూపు
యింద్ర కీలాద్రి వెలుగొందు నెల్ల విధుల
2.ఇలను దుర్గతి దీర్పగానింద్రకీల
పర్వతాన దుర్గగ జన పాలనమున
తివిరి మహిషుని గూల్చిన దేవి యగుచు
కలుష హారిణి చేయును కనుల విందు

Unknown చెప్పారు...

పూజ్య గురుదేవులు శకరయ్యగారికి వందనములు
"నీవె దుష్ట రాక్షసుల మ్రందించ గలవు,
యవతరించి దుర్గగ"నన యమరులెల్ల
దివ్య శస్త్రాస్త్ర ధారియై దేవి వెడలె
సింహ యానయై నాజిని సేయ విధిగ

Unknown చెప్పారు...

కె యెస్ గురుమూర్తి ఆచారి గారి పద్యము
ఈవె దుష్ట దైత్యతతి శిక్షించితివిగ
యఖిల దివ్యవర్గమును కాపాడు కొరకు
నింక షడ్రిపు వర్గమిదే నడంచి
ముదముతో బ్రోవు మమ్మ చేసెదను వినుతి

sailaja చెప్పారు...

గౌరి! దుగ్గమ్మ! కాలిక! గట్టుపట్టి!
చండి! ఛాయ! దుర్గ! భవాని! శక్తిశాక్రి!
త్రిపురసుందరి! సతి! మహాదేవి! సురస!
ప్రాంజలింతును భక్తితో బ్రహ్మ విద్య!

sailaja చెప్పారు...

మహిని దుష్టుల దునుమాడ మాత సతియె
నవతరించె దుర్గతి దీర్చి నవని గావ
దీరుకోర్కెలు గొలువంగదేవి నిన్ను
శరణు గోరెద సర్వదా జనని వినుమ!

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

పలుకుదును నీదు దయతోడ పార్వతమ్మ!
కనుల నిండ దుర్గ, మమత కంటినమ్మ!
తీయనైన మాటల గొల్వ దేవి వరము
నిమ్ము. వందనమ్ములఁ గొనుమిదియె వినతి.

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

నా రెండవ పూరణము:

చేరు దు ను నిన్ను మాయమ్మ! చిర యశమిడి,
నన్నిఁక నపవ ర్గ ము నొంద ననువుఁ జూపి,
నిత్యమును జ్ఞానసరణినిం దే లఁజేసి,
మనఁగ దీవించుమా దుర్గమ! మన వి యిదె!

A.Satyanarayana Reddy చెప్పారు...

చండి! దుర్వార తేజస్వి శర్వు, పత్ని!
దక్షపుత్రి! దుర్గ!శివ!రుద్రాణి! గౌరి!
ధేనుక! మృడాని! ఈశ్వరి! దేవి! కాళి!
పార్వతి! భవాని! అంబిక! భార్గవి! జయ!

శివుని ప్రియపత్ని నిను సదా చేరికొలుతు
ముగ్గురమ్మలకును నీవు మూలమమ్మ
నిన్ను నమ్మి మనుచునుంటి నియతితోడ
సర్వ కొర్కెలఁ దీర్చుము సత్వరముగ

sailaja చెప్పారు...

కవి మిత్రు లందరకూ వందనములు... తెలుగు లిపి కంప్యూటర్ లో సౌకర్యం గా రావాలంటే aponline నుండి ileap download చేసుకుని వాడుకోవడం చాలా సులభమని నా అనుభవం. .

Unknown చెప్పారు...

కె.ఈశ్వరప్ప గారిపూరణలు
1.అంబ దుష్టత్వమే మాన్ప నాది శక్తి
వాణి రచన వర్గమ్ము కే ప్రాణ శక్తి
దివ్య లౌక్యంబె నిల లక్ష్మి దేవి రక్తి
శక్తి యుక్తుల రక్తి ఆసక్తి నిలువ
2.కనకదుర్గమ్మ,శ్రీ,వాణి,కవనమందు
శక్తి భక్తి వర్గమ్ము లాసక్తిచేత
దివ్య నామమ్ము తలచ నాదేశములుగ
తేట గీతిని వ్రాయంగ తెలుపు విధిగ

శ్యామలీయం చెప్పారు...

Windows వాడకందార్లు తెలుగులో‌నేరుగా Type చేసేందుకు నా దృష్టిలో ఫ్రముఖ్ ఉత్తమమైనది. దానితో phonotic టైపింగ్ చెసి తెలుగులో వ్రాయవచ్చును. కావలసిన వారు http://www.vishalon.net/PramukhIME/Windows.aspx అనే సైట్ నుండి దిగిమతి చేసుకోవచ్చును. ఇది పూర్తిగా ఉచితం. తెలుగే కాదు మొత్తం 20 భాషలకు ఈ‌ సాధనం పనుకొస్తుంది.

శ్యామలీయం చెప్పారు...

గుండువారి పద్యభావం బాగుంది. మూడవపాదం:
నిత్యమును జ్ఞానసరణినిం దేలఁజేసి

దీనిలో యతిభగం కలిగింది. గమనించగలరు.

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

శ్యామలీయంవారూ, తమరి యభినందనలకు ధన్యవాదములు.

నా ద్వితీయపూరణమందలి తృతీయపాదమున యతిభంగము కలుగలేదు. "ని" కిని, "oదే = అనఁగా (న్దే)" కిని యతిమైత్రి కుదురునుకదా! బాగుగాఁ బరిశీలింపుఁడు. స్వస్తి.

కంది శంకరయ్య చెప్పారు...

కవిమిత్రులకు నమస్కృతులు.
మా పిన్ని ఈ ఉదయం మరణించడం వల్ల నేను నల్లబెల్లి అనే గ్రామానికి వెళ్ళి ఇప్పుడే తిరిగివచ్చాను. అందువల్ల మీ పూరణలపై వెంటవెంట స్పందించలేకపోయాను. మన్నించండి.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
శ్రీపతి శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
గుండు మధుసూదన్ గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
*
నాగరాజు రవీందర్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మీ మొదటి పూరణలో ‘దేవి రూప/ మింద్రకీలాద్రి...’ అనండి.
*
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
కె. యస్. గురుమూర్తి ఆచారి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘వర్గమిదే యడంచి’ అనండి.
*
శైలజ గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
‘సతియె యవతరించె.... దీర్చి యవని గావ’ అనండి.
*
లక్ష్మీదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
కె. ఈశ్వరప్ప గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
‘వర్గమునకే.... లౌక్యంబె యిల...’ అనండి.
*
శ్యామలీయం గారూ,
గుండు వారి పద్యంలో యతిదోషం లేదు.
బిందుయతి (అనుస్వారయతి) గురించి మీకు తెలియంది కాదు. బిందుపూర్వకాలైన వర్గాక్షరాలు ఆయా వర్గాల పంచమ (అనునాసిక) అక్షరాలతో యతి చెల్లుతుంది కదా!

మిస్సన్న చెప్పారు...

కనక దుర్గమ్మవై భూరి కరుణ తోడ
మహిషు పాలి దుర్గమ శక్తి భాతి చెలగి
నీ విభూతుల జంపిన దేవి నీకు
వినమిత శిరస్కమును దాల్చి వినుతి వినుతి.

సంపత్ కుమార్ శాస్త్రి చెప్పారు...

దైత్యదుష్టుల దునుమాడి తపసిజనుల
కెల్ల మోక్షమార్గమ్ములనెఱుకపరచి
దివ్యతేజోనిధానమై దేవతలకు
నభయమొసగిననీకిత్తునమ్మ వినుతి

krkr చెప్పారు...

కనక దుర్గను గనలేని కనులు యేల?
కదిలి శత్రు వర్గము నంత ప్రిదిలె నమ్మ ,
దినది నంబొక యవతార దేవి గాగ ,
త్రిగుణ ధాత్రి గ నిల్చిన దేవి "విజయ".
కొరుప్రోలు రాధా కృష్ణ రావు

వసంత కిశోర్ చెప్పారు...

శంకరార్యా !
ఈ పాదములలో యతి కుదిరెనా యని సందేహం !

లీయ గొల్చెద దల్చెద దేవి నిన్ను

****
నింక షడ్రిపు వర్గమిదే నడంచి

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

కనక దుర్గమ్మ కావుమా కరుణ జూపి
సజ్జనులకు దుర్గమ్ముగ! సన్నుతింప
తేజ మీయవే నిను దల్తు దేవి నీవు
మహిని రక్షింప వినవమ్మ మాదు వినతి