పోచిరాజు సుబ్బారావు గారూ, మీ ప్రయత్నం బాగున్నది. అభినందనలు. కాని భావం బోధపడడం లేదు. ‘ఒక్క + యెఱుగని’ అన్నప్పుడు యడాగమం వస్తుంది. ‘పద్యమ్కందములో’ అనడమూ దోషమే.‘వ్రాసె నొక్క యెఱుగని కవితన్| కందములో...’ అనండి. **** వసంత కిశోర్ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ఇటువంటి పొరపాటు మన కవిమిత్రులూ అప్పుడప్పుడు చేస్తుంటారు. **** జిగురు సత్యనారాయణ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. స్వవర్గజ ప్రాసలో ‘ద-ధ’లకు ప్రాసను లాక్షణికులు అంగీకరించినా సాధ్యమైనంత వరకు మనం వర్జించడమే మేలు! **** చంద్రమౌళి సూర్యనారాయణ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. **** బి.యస్.యస్. ప్రసాద్ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ‘ఎంచీ’ అని వ్యావహారికాన్ని వ్రాశారు. ‘మార్గమ్మున దా| నందముగా...’ అనండి. **** అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. **** శైలజ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. **** సంపత్ కుమార్ శాస్త్రి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. **** బొడ్డు శంకరయ్య గారూ, ‘ఛందం’ అన్న శబ్దానికి ‘అభిప్రాయ’మన్న అర్థంతో మీ పూరణ బాగున్నది. అభినందనలు. **** కెంబాయి తిమ్మాజీ రావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీరు ‘దధ’ప్రాసను వేశారు. వీలైనంతవరకు దానిని వాడకపోవడం మంచిది.
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు. **** గుండు మధుసూదన్ గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. రెండవ పూరణ మొదటి పాదంలో గణదోషం. ‘ఛందస్సుల నెఱుఁగకయే’ అందామా?
సుందర పద జా లముతో
రిప్లయితొలగించండినిందిర పతి వ్రాసె నొక్క నెఱు గని పద్య
మ్కం దములో నే వ్రాయగ
ఛంద మెఱు గ కుండ వ్రాసె శార్దూ లమ్మున్
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరింప నున్నవి !
పండితుడే గాని - కందంలో వర్ణించమంటే - శార్దూలంలో వ్రాస్తే :
01)
___________________________
ఛందపు పోటీ యందున
కందము లో వర్ణన నిడ - కళవళ పడి యా
సందర్భము లో నొక్కడు
ఛంద మెఱుఁగకుండ వ్రాసె - శార్దూలమ్మున్ !
___________________________
గ్రంధ పఠనము గతించెను
రిప్లయితొలగించండితొందర పడు చూచి వ్రాత త్రోసుకు వచ్చెన్
మందుఁడు వాచకము తెఱచి
ఛంద మెఱుఁగకుండ వ్రాసె శార్దూలమ్మున్!!
వందనమిడుదును వ్రాయకు
రిప్లయితొలగించండిఛంద మెఱుఁగకుండ, వ్రాసె శార్దూలమ్మున్
తొందరపడి, యావృత్తపు
టందము చెడిపోయెననుచునరచెను గురువే !
వందన మొనర్చి వాణికి
రిప్లయితొలగించండిమందమతి యొకడు వినూత్నమార్గము నెంచీ
అందము గానొక పద్యము
ఛంద మెఱుఁగకుండ వ్రాసె శార్దూలమ్మున్.
మందును సేవించి యొకడు
రిప్లయితొలగించండిఛందమెఱుగకుండ వ్రాసె శార్దూలమ్మున్
నిందలవర్షమ్ము కురిసి
కందగ నాతని ముఖమ్ము కలవరపడియెన్
మందరధరునిని దలచుచు
రిప్లయితొలగించండికందమ్మును వ్రాయబోయి కాంతా మణియే
సుందర సురుచిర గతితో
చందమెఱుఁగకుండ వ్రాసె శార్దూలమ్మున్
సుందర వధానమున తాఁ
రిప్లయితొలగించండిసందర్భోచితపదములచాతురిమించన్
కందమున వ్రాయుమనియెడి
చందమెఱుఁగకుండ వ్రాసె శార్దూలమ్మున్
అందరి యెదుటను ముద్దుగ
రిప్లయితొలగించండికందమ్ములు వ్రాయుచున్న కవివరుడొకడున్
ముందుగ వారెవరి మనో
ఛందమెరుగకుండ వ్రాసె శార్దూలమ్మున్!
పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
రిప్లయితొలగించండిమందమతి యైన గొల్లడు
పొందెను కాళికవరమును భూరియశస్సున్
బంధుర బిరుదు "మహాకవి"
ఛందమెరుగకుండ వ్రాసె శార్దూలమ్మున్
పోచిరాజు సుబ్బారావు గారూ,
రిప్లయితొలగించండిమీ ప్రయత్నం బాగున్నది. అభినందనలు.
కాని భావం బోధపడడం లేదు. ‘ఒక్క + యెఱుగని’ అన్నప్పుడు యడాగమం వస్తుంది. ‘పద్యమ్కందములో’ అనడమూ దోషమే.‘వ్రాసె నొక్క యెఱుగని కవితన్| కందములో...’ అనండి.
****
వసంత కిశోర్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఇటువంటి పొరపాటు మన కవిమిత్రులూ అప్పుడప్పుడు చేస్తుంటారు.
****
జిగురు సత్యనారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
స్వవర్గజ ప్రాసలో ‘ద-ధ’లకు ప్రాసను లాక్షణికులు అంగీకరించినా సాధ్యమైనంత వరకు మనం వర్జించడమే మేలు!
****
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
****
బి.యస్.యస్. ప్రసాద్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘ఎంచీ’ అని వ్యావహారికాన్ని వ్రాశారు. ‘మార్గమ్మున దా| నందముగా...’ అనండి.
****
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
****
శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
****
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
****
బొడ్డు శంకరయ్య గారూ,
‘ఛందం’ అన్న శబ్దానికి ‘అభిప్రాయ’మన్న అర్థంతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
****
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మీరు ‘దధ’ప్రాసను వేశారు. వీలైనంతవరకు దానిని వాడకపోవడం మంచిది.
మల్లెల వారి పూరణలు
రిప్లయితొలగించండిబంధుర భక్తిని నొకరుడు
అందముగా తాను పలుక నాశువు లోనన్
వి౦దగు పద్యమ్మమరెను
ఛందమెరుగకుండ వ్రాసె శార్దూలమ్మున్
2.వి౦దును చేసెడి చిత్రము
నందమ్ముగవ్రాసే పులిగనాతడుపటమున్
అందరుననిరట నయ్యెడ
ఛందమెరుగకుండ వ్రాసె శార్దూలమ్మున్
3.బ౦దుర రీతిని నాశువు
ఛందము నె౦చక పలుకగ చక్కగ నిలిచెన్
ఛందము శార్దూలముగను
ఛందమెరుగకుండ వ్రాసె శార్దూలమ్మున్
4.కొందరు కంఠస్థముగను
అందపు పద్యాలు చదువ అబ్బుర పడరే
విందుగ నొకరుడు నటులే
ఛందమెరుగకుండ వ్రాసె శార్దూలమ్మున్
కొందరు క౦
రిప్లయితొలగించండికె యెస్ గురుమూర్తి ఆచారి గారి పూరణ
ఛ౦దమనగ నభిమతమగు
ఛందమనగ గురు లఘువుల శాస్త్రమ్ము గదా
ఛందమనగ పద్ధతి యే
ఛంద మెరుగకుండ వ్రాసె శార్దూలమ్మున్?
ముందుగ నిజ గురువుల స
రిప్లయితొలగించండిచ్చంద మెఱుఁగకుండ వ్రాసె శార్దూలమ్మున్
పొందిక కుదరని పద్యము
నందరిలో చదివి నింద కర్హుండాయెన్ ( ఛ వత్తు రావడంలేదు )
సచ్చంద
మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మొదటి పూరణలో 'భక్తిని నొకరుం| డందముగా...'
నాల్గవ పూరణలో `కంఠస్థంబుగ | నందముగా..' అనండి.
****
కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
****
గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
శ్రీగురుభ్యోనమ:
రిప్లయితొలగించండిముందుగ వ్యాకరణమ్మును
తొందరపడి నేర్చినట్టి తొయ్యలి తానే
సుందర భావమ్ములతో
ఛంద మెఱుఁగకుండ వ్రాసె శార్దూలమ్మున్
శ్రీపతి శాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కృష్ణశాస్త్రి గారి ... తొందరపడి ఒక కోయిల ముందే కూసింది.. పాటను గుర్తుకు తెచ్చారు. ధన్యవాదాలు.
Laxminarayan Ganduri garu you may use "C" i.e capital letter for getting "ఛ"
రిప్లయితొలగించండిశ్రీగురుభ్యోనమ:
రిప్లయితొలగించండిసుందర మత్తేభమ్ముల
నందముగా జెప్ప నెంచి యాతుర తోడన్
పొందిక మరచుచు గణముల
ఛంద మెఱుఁగకుండ వ్రాసె శార్దూలమ్మున్
గురువుగారూ ధన్యవాదములు.
రిప్లయితొలగించండిగురువు గారికి వందనములు,తప్పులను సవరించ మనవి.
రిప్లయితొలగించండిసుందర రూపసిని గనగ
పొంద దలచి మెప్పు నొకడు పొగడుతు బొలతిన్
అందమయిన పదములతో
ఛందమెరుగకుండ వ్రాసె శార్దూలమ్మున్!
కె ఈశ్వరప్ప గారి పూరణలు
రిప్లయితొలగించండిసుందరి సుకుమారత్వము
అందమునకు నందినట్లు నాశువుగానే
పొందిక చేతను నొక్కడు
ఛంద మెఱుఁగకుండ వ్రాసె శార్దూలమ్మున్
2.కొందరు పుట్టుకచేతను
కొందరు సాధనల చేత కోరగ నబ్బే
బంధము బహువిధ ఛందము
ఛంద మెఱుఁగకుండ వ్రాసె శార్దూలమ్మున్
శ్రీపతి శాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
****
కుసుమ సుదర్శన్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘పొగడుచు’ అనండి.
****
కె. ఈశ్వరప్ప గారూ,
మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొందరలో నొక కవియే
రిప్లయితొలగించండిఛంద మెఱుఁగకుండ వ్రాసె శార్దూలమ్మున్!
పొందిక కరువాయెననుచు
కంది గురువు గారు రెచ్చి గాండ్రించిరహో!
(గురుదేవులు కరుణా హృదయలు. పూరణ సౌలభ్యమునకలా వ్రాశాను. మన్నించ మనవి.)
కవిమిత్రులందఱకు నమస్కారములు!
రిప్లయితొలగించండినిన్నటినుండి నా యంతర్జాలమందు సమస్య యేర్పడుటవలన పూరణమును ప్రచురించలేకపోయితిని. నేఁడు నిరంతర ప్రయత్నముచే సరియైనది.
నా పూరణము:
(చిత్రకారుఁ డొకఁడు తన నేర్పునుపయోగించి శార్దూల చిత్రమునుం జిత్తరువున వ్రాసిన సందర్భము)
అందముగనుఁ జిత్తరువున
సుందరుఁడగు చిత్రకార సుకరుం డొకఁడున్
డెందమున సంతసించుచు
ఛంద మెఱుఁగకుండ వ్రాసె శార్దూలమ్మున్!!
నా ద్వితీయ పూరణము:
రిప్లయితొలగించండిఛందస్సుల యెఱుక లేకయె
విందుగ నొక బాలకుండు వింత యెసంగన్
బొందిక పదముల లేఖన
ఛంద మెఱుఁగకుండ వ్రాసె శార్దూలమ్మున్!
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
రిప్లయితొలగించండిమీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
****
గుండు మధుసూదన్ గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
రెండవ పూరణ మొదటి పాదంలో గణదోషం. ‘ఛందస్సుల నెఱుఁగకయే’ అందామా?
చందపు లక్షణ మెఱు గని
రిప్లయితొలగించండిఇందిరపతి వ్రాసె నిపుడు నిమ్ము గ పద్యం
సుందర పద జా లముతో
ఛంద మెఱు గకుండ వ్రాసె శార్దూ లమ్మున్
సుబ్బారావు గారూ,
రిప్లయితొలగించండి‘పద్యం’ అని ముప్రత్యయం లేకుండా వ్రాయడం వ్యావహారికం. అందుకే అక్కడ ‘కవితన్’ అన్న సవరణను సూచించాను.
ధన్యవాదములు శంకరయ్యగారూ! మీ సవరణము బాగున్నది.
రిప్లయితొలగించండిమొదట టైపు చేసినపుడు "ఛందస్సు నెఱుఁగకుండియు" నని వ్రాసి, యెందులకో దానిని "ఛందస్సుల..."యని పైవిధముగ మార్చితిని. గణభంగమును గమనింపకయే ప్రచురించితిని. పునఃపరిశీలనముం జేయనందులకు మన్నింపుఁడు. చక్కని సవరణమును సూచించినందులకు ధన్యవాదములు.
వందే మాతర "మ"గణము
రిప్లయితొలగించండిసందేశము నందజేసే సహజాతముగా,
పొందిన దేవీ కృపతో
ఛంద మెరు c గ కుండ వ్రాసె శార్దూల మ్మున్
కొరుప్రోలు రాధా కృష్ణ రావు
సుందరతర పద్యమ్ముల
రిప్లయితొలగించండిగ్రంధములెన్నెన్నొ జదివి గానము వోలెన్
అందుచు ' మసజస తతగ ' లు
ఛంద మెఱుఁగకుండ వ్రాసె శార్దూలమ్మున్.
కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఛందస్సు సాఫ్టువేరును
రిప్లయితొలగించండిక్రిందను మీదను పఠించి కృతకర్ముండై
తొందరగానొక యువకుడు
ఛంద మెఱుఁగకుండ వ్రాసె శార్దూలమ్మున్
రిప్లయితొలగించండిఅందంబుగాను పదముల
డెందంబరయగ జిలేబి డెంకణమిడుచున్
బంధమ్ముల పదబంధము
ఛంద మెఱుఁగకుండ వ్రాసె శార్దూలమ్మున్
జిలేబి
బందరులో బాప డొకడు
రిప్లయితొలగించండిపందెము లోగెల్వ గోరి పది దినములలో
తొందర పడుచును కందపు
ఛంద మెఱుఁగకుండ వ్రాసె శార్దూలమ్మున్