30, మే 2015, శనివారం

పద్య రచన - 921

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

17 కామెంట్‌లు:

  1. పచ్చిమిరపకాయ బజ్జీలయందున
    యుల్లిపాయముక్కలెల్లకూరి
    నిమ్మరసముపిండి కమ్మగ వడ్డించె
    చురుకుమనెను నోరు కొరికి చూడ

    రిప్లయితొలగించండి
  2. అరచేతను స్వర్గ మదిగొ
    పొరబడి తినగోరి నంత పొరబోవు నటన్
    మరువకు మిర్చీలు బ్లా...గు...న
    మురియుచు గనినంత చాలు ముక్తి నొసంగున్

    రిప్లయితొలగించండి
  3. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *****
    అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘మానవ అసుర’అన్నప్పుడు సవర్ణీదీర్ఘసంధి. యడాగమం రాదు. ‘యక్షకిన్నరసురమానవాసురతతి’ అనండి.
    *****
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    మూడవపాదంలో గణదోషం. ‘మరువక యా మిర్చీలను’ అందామా?

    రిప్లయితొలగించండి
  4. మిరప కాయలు నుల్లియు మిళిత మొంది
    వేడి బజ్జీలు దర్జాగ వేడ్క మెరయ
    యక్ష కిన్నర మానవు లసుర సురులు,
    తినుచు నెవడైన మరిమరి దేబిరించు

    ఇలా మార్చాను, తప్పయితే
    మీ పాదాన్నాశ్రయిస్తాను

    రిప్లయితొలగించండి
  5. అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
    నేను ముందుగా మీరు సవరించిన దానినే సూచిద్దామనుకున్నాను. అయితే ఒకేసమాసంగా చూపాలను ఆ సవరణ ఇచ్చాను. మీ సవరణ బాగుంది. సంతోషం!

    రిప్లయితొలగించండి
  6. పచ్చిమిరపగాయ బజ్జీలఁగాంచిన
    నెట్టివారికైన నిచ్చగలుగు
    నుల్లిపాయతోడ చల్ల నిమ్మరసము
    తిన్నవారిమనసు దివికిఁజేరు

    రిప్లయితొలగించండి
  7. పచ్చిమిరపకాయ బజ్జీల చేయుచు
    ఉల్లి కూడ చేర్చి యువిద వండ
    వలదు చాలు యనెడి పతికి మురిపెముతో
    కొసరి కొసరి బెట్టె కోమలాంగ

    రిప్లయితొలగించండి
  8. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ......
    డా. బల్లూరి ఉమాదేవి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    'చాలు + అనెడి' అన్నప్పుడు యడాగమం రాదు. 'వలదు చాలనియెడి' అనండి.

    రిప్లయితొలగించండి
  9. పచ్చి మిరప కాయ బజ్జి జూడ మిగుల
    యూరు చుండె జూడు నోరు నాది
    యొక్క బజ్జి నోట జిక్కగా చుర్రు మ
    నియెను నబ్బ ! నీవు తినుము

    రిప్లయితొలగించండి
  10. నాగరాజు రవీందర్ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  11. కర్జములను తిన్న కృష్ణయ్య. ..

    నోరు తీపిఁ జేసి మారుమాటే లేక
    సంచరించెదరని సతుల నడుగ
    కృష్ణమూర్తి నోటి తృష్ణఁదీర్చగ వారు
    నుల్లి నొదిగి బజ్జిలుంచి నారు!

    రిప్లయితొలగించండి
  12. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  13. బుజ్జాయికి బహుయిష్టము
    బజ్జీలనగానె?పరుగు పందెము నందున్
    ఉజ్జీ లెవరును లేరని
    ఉజ్జాయింపుగ బలికిన యూహలు నిజమే|.
    2.ఎనిమిదిబజ్జీ లిందున్
    గనబడగా? నాల్క నోట గడగడ దిరుగున్
    అనువగు మసాల దినుసుల
    పనితనమగు మిరపకాయ బజ్జీలివియే|
    3.మిరప కాయలిచట మిడిసి పాటుగనుండ?
    శనగ పిండి,నీళ్లు శాంతమందు
    జేర్చుకొనగ?నూనె చిట పట లందున
    కాల్చి వేయ బజ్జి కమ్మదనమె|

    రిప్లయితొలగించండి
  14. మిర్చి బజ్జిచూడ మీద కమ్మగ నుండు
    కొరికి చూడ లోన చురుకు మనును
    ఉల్లి నిమ్మ రసము చల్లుకు తినినంత
    స్వర్గ సుఖము నకును సామ్యమగును

    రిప్లయితొలగించండి
  15. నువ్వులపొడి వేసి నూనెలో వేచిన
    ఉల్లిపాయ తురుము నుంచి నట్టి
    మిరపకాయ బజ్జి మిసమిసలాడుచు
    ముద్దుగుండ కొరక బుద్ధి పుట్టె!

    రిప్లయితొలగించండి
  16. ముజ్జగముల వేల్పులయిన
    బజ్జీలను దినగ మెచ్చి వహవా! యనరే!
    మజ్జారే! యుల్లి కలుప
    నజ్జంతయు వదలిపోవు నరులివి దినగా!!!

    రిప్లయితొలగించండి
  17. కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ****
    బొడ్డు శంకరయ్య గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    శైలజ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి