9, జూన్ 2015, మంగళవారం

పద్య రచన - 927

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

14 కామెంట్‌లు:

  1. ఆ.వె.వాస్తు వాస్తనియనవాచేనుశిరమహో
    వాస్త వంబునెరుగవాస్తవంబు
    ఆస్తిపాస్తిపోగనప్పులే మిగిలెరా
    పస్తులున్న మాట వాస్తవంబు

    రిప్లయితొలగించండి
  2. ఆ.వె. వాస్తు యనగనింక వాచేనుశిరమహో
    వాస్త వంబునెరుగవాస్తవంబు
    విస్తు పోయిచూడ వేసారుగృహమన్న
    యాస్తిపాస్తిపోయినాస్తియగును

    రిప్లయితొలగించండి
  3. వాస్తు యనుమాట కల్లని పలికి రపుడె
    గేస్తు పదిమంది నడిగిన గీము నందు
    మేస్త్రి కీయంగ చాలదు పస్తు లున్న
    భూమికే వాస్తు లేదంటు బుధుడు పలికె

    రిప్లయితొలగించండి
  4. అన్ని వైపుల దేవతలధిపులైన
    చిన్న చూపెట్లు జూతురు చితికి వేయ?
    జనులు జేసెడు కర్మలె జాడ్యమగుచు
    ననుభవింతురు లోకాన పెనుగులాడి!

    రిప్లయితొలగించండి
  5. కోర్కె మీర తాను కొత్త గృహము నందు
    వాస్తు పూజ చేసి వాసముండ
    చిన్న చింత యొకటి చీకాకు కల్గింప
    వాస్తు దోష మనగ బాధ హెచ్చెన్

    రిప్లయితొలగించండి
  6. నాటి చరిత్ర సంస్కృతులునాటిన శాస్త్రమె?వాస్తటంచు ము
    మ్మాటికిదెల్పుచున్ తగిన మార్గము లెన్నియొ బోధజేయుచున్
    “చేటును మాన్పగా వలయు చెక్కును నొక్కగ?చూపు చిత్ర మీ
    నాటియు మేటి వాస్తనెడి-నాటును వేతురు బుద్ది భూమిలో”|
    2.అష్ట దిక్కు లందు నలరారు చున్నట్టి
    ఇష్ట కష్టములకు పుష్టి నిడుచు
    భూమిఫైన దాగి భుక్తికి,శక్తికి
    దిక్కు లధిపతు లట దిక్కు వారె

    రిప్లయితొలగించండి
  7. వాస్తు దోషము లేకుండ వనజ ! నీవు
    కట్టుకొనినచో నింటిని గట్టి గాను
    నాయు రారోగ్య సంపద లన్ని గలిగి
    జీవనమ్మును గలుగున జేయ ముగను

    రిప్లయితొలగించండి
  8. పిరాట్ల వేంకట శివరామకృష్ణ ప్రసాద్ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    డా. బల్లూరి ఉమాదేవి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    చివరిపాదం చివర ‘హెచ్చె’ అనండి.
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  9. వాస్తు వ్యాపార మొనరించు వారి సంఖ్య
    పెరుగు చుండెను ప్రతివాడు పిలువకున్న
    క్రొత్త యిల్లుని గని యిచ్చు చెత్త సలహ
    గాలి వెలుగున్నయిల్లుయే మేలు మనకు

    రిప్లయితొలగించండి
  10. గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ‘వస్తువ్యాపార’మన్నప్పుడు ‘స్తు’ గురువై గణభంగం. ‘వస్తువుల బేర మొనరించువారి...’ అందామా? ‘ఇల్లు+ఏ’ అన్నప్పుడు యడాగమం రాదు. అక్కడ ‘గాలి వెలుగులు గల యిల్లె...’ అనండి.

    రిప్లయితొలగించండి
  11. వాస్తు శాస్త్రము వివరించు వారి సంఖ్య
    పెరుగు చుండెను ప్రతివాడు పిలువకున్న
    క్రొత్త యిల్లుని గని యిచ్చు చెత్త సలహ
    గాలి వెలుతురుగల గీము మేలు నిచ్చు

    రిప్లయితొలగించండి
  12. గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ సవరణ బాగుంది. సంతోషం!

    రిప్లయితొలగించండి
  13. నమ్మకములు తర్క నాణ్యతాపరములు
    సాంప్ర దాయముల నుసరణములకు
    నాలవాలములుగ నతిశయించుచునుండు
    వాస్తు రీతి గూడ వాటనొకటి

    నాణ్యత+అపరములు: తర్క విలువలకతీతములు
    అనుభవములు,అనుసరణలు ఆధారాలుగా

    రిప్లయితొలగించండి
  14. అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి