18, ఆగస్టు 2015, మంగళవారం

పద్య రచన - 983

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

16 కామెంట్‌లు:

  1. అదరక బెదరక రణమున
    చెదరని ధైర్యమ్ముజూపి చిచ్చరపిడుగై
    వదలక శత్రుల జీల్చుచు
    వదలెను ప్రాణమ్ము లక్ష్మి భాయికి జోహార్

    రిప్లయితొలగించండి

  2. శ్రీగురుభ్యోనమ:

    ఉల్లము నందు కృంగినను యోధుని భార్యగ దీక్ష బూనుచున్
    తెల్లనివారి పాలనను ధిక్కరణంబొనరించి పోరి, కో
    కొల్లల సైన్యమున్ దునిమె కొంగున బిడ్డను రాజు జేయుచున్
    తల్లిగ వీరపత్నిగను తాను తరించెను ఝాన్సి లక్ష్మిభాయ్

    రిప్లయితొలగించండి
  3. చిత్ర మయ్యది చూడగ జిత్ర మాయె
    ఝాన్సి లక్ష్మి బాయి యచట శత్రు మూక
    నువధి యించుట కొఱకు త నూజు వెంట
    బెట్టు కొనివచ్చె నోయమ్మ !బిట్టు గాను

    రిప్లయితొలగించండి
  4. కం . భయమన్నమాట యెరుగక
    జయమును పొందతలంచి జవమున నెక్కెన్
    హయమునుఝాన్సీ రాణట
    రయమున పోరున్ సలుపుచు రాజ్యము గెల్చెన్.

    రిప్లయితొలగించండి
  5. నడుముకు తనయుని గట్టుకు
    జడవక నాఝాన్సిలక్ష్మి సంగ్రామమునన్
    హడలెత్తించుచు రిపులను
    వడకించెను తెల్లదొరల బలగము నంతన్!!!

    రిప్లయితొలగించండి
  6. రాజవంశముఁబుట్టిన రత్నమామె
    ఝాన్సి సీమను పాలించి చక్కగాను
    వీర వనితగ జగతిన పేరుగాంచె
    పోరులోనను మరణించి ముక్తిఁబొందె

    రిప్లయితొలగించండి
  7. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    శ్రీపతి శాస్త్రి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    డా.బల్లూరి ఉమాదేవి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    రెండవపాదంలో గణదోషం. ‘జయమును పొందగ తలంచి...’ అనండి. అలాగే ‘రాణి+అట’ అన్నపుడు యడాగమం వస్తుంది. అక్కడ ‘రాణియె’ అనండి.
    *****
    శైలజ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  8. రిప్లయిలు
    1. ఆడ దనినచో నబల కా దాడపులియె
      ఝాన్సిరాణి లక్ష్మీబాయి సాక్ష్యమయ్యె
      కత్తి చేఁబట్టి దూకిన కదనమందు
      వైరి వీరుల శిరములు పడును నేల.

      తొలగించండి
  9. భరత దేశపు స్వాతంత్ర్య భవ్య చరిత
    బ్రిటిషు పాలన నెదిరించె పటుత రమ్ము
    వార ణాసిని జన్మించి వాసి గెక్కి
    ధైర్య సాహస ములయందు ధన్య జీవి
    జన్మ ధన్యత నొందెను ఝాన్సి లక్ష్మి

    రిప్లయితొలగించండి
  10. భారతి స్వతంత్ర్య మందగ
    వీర వనిత ఝాన్షి లక్ష్మి వేగిని నెక్కెన్
    వీరంగము సృష్టించుచు
    జారెను దా మాతృభూమి స్వర్గమటంచున్!

    రిప్లయితొలగించండి
  11. వల్లూరు మురళి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘అంటె’ అనడం వ్యావహారికం. ‘కాదు+ఆడపులి’ అన్నప్పుడు సంధి నిత్యం, విసంధిగా వ్రాయరాదు. ‘ఆడపులి+అని=ఆడపులి యని’ అవుతుంది. రెండవపాదంలో యతి తప్పింది. మూడవ పాదంలో గణదోషం. నాల్గవపాదంలో యతి తప్పింది. మీ పద్యానికి నా సవరణ....
    ఆడ దనినచో నబల కా దాడపులియె
    ఝాన్సిరాణి లక్ష్మీబాయి సాక్ష్యమయ్యె
    కత్తి చేఁబట్టి దూకిన కదనమందు
    వైరి వీరుల శిరములు పడును నేల.
    *****
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘స్వతంత్ర’ మనండి.
    అన్నట్టు మీకు రామముని రెడ్డి గారు పరిచయమేనా? క్రొత్తగా మన బ్లాగులో వ్రాస్తున్నారు.

    రిప్లయితొలగించండి
  12. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పద్యం :
    భారతి స్వతంత్ర మందగ
    వీర వనిత ఝాన్షి లక్ష్మి వేగిని నెక్కెన్
    వీరంగము సృష్టించుచు
    జారెను దా మాతృభూమి స్వర్గమటంచున్!

    రిప్లయితొలగించండి
  13. శ్రీ మూలె రామముని రెడ్డి గారితో నాకు పరిచయంలేదు.ఈ విషయం గురించి వివరాలు సమస్యాపూరణంలో తెలియజేశాను.

    రిప్లయితొలగించండి
  14. ఆడ దనినచో నబల కా దాడపులియె
    ఝాన్సిరాణి లక్ష్మీబాయి సాక్ష్యమయ్యె
    కత్తి చేఁబట్టి దూకిన కదనమందు
    వైరి వీరుల శిరములు పడును నేల.

    రిప్లయితొలగించండి