18-9-2026 (శుక్రవారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“తార్క్ష్యునిపై శంకరుఁడు దిరిగె సురలు నుతింపన్”
(లేదా...)
“తార్క్ష్యునిపై నెక్కి చరించె శంకరుఁ డమర్త్యుల్ సూచి కొండాడం౦గన్”
(ఐతగోని వెంకటేశ్వర్లు గారి శతావధానంలో నేనిచ్చిన సమస్య)
కందంజననీ దాస్యము వాపినఘనుడనుచుఁ బదవినొసఁగఁ గమలాక్షుఁడుఁ, దాగొని 'హరి'ని నిల్పగన్ దార్క్ష్యునిపై శంకరుఁడు, 'దిరిగె సురలు నుతింపన్'మత్తేభవిక్రీడితమువినతా పుత్రుడు తల్లి దాస్యమునకున్ వీడ్కోలు పల్కెన్ ధృతిన్గనుచున్ శౌర్యము, మాతృభక్తిఁ, బదవిన్ గట్టంగ శ్రీవిష్ణువేవినయంబందున వాహనంబుగఁ దగన్ బేర్గాంచగన్, శౌరి తార్క్ష్యునిపై నెక్కి చరించె! శంకరుఁ డమర్త్యుల్ సూచి కొండాడం౦గన్!
చివరి పదము కొండాడఁగన్
జినుడెట్లు తిరుగు? వృషభ వ హనమెక్కి తిరుగున దెవరు హాహలమును కో కనదుండేల గొనెనొ? తా ర్క్ష్యునిపై, శంకరుఁడు దిరిగె, సురలు నుతింపన్.వినతా దాస్య విమోచనమ్ము కొరకై పీయూష మున్ గోరగా మొనలో వజ్రధరండనే గెలువగన్ పొంపెంత యో జూపగా గని తా మెచ్చి యనస్సు గా వరము ప్రాగ్వాంశుండు తానిచ్చి తా ర్క్ష్యునిపై నెక్కి చరించె , శంకరుఁ డమర్త్యుల్ సూచి కొండాడగన్.
కనవచ్చిన దృశ్యమట నవనీ ధరాగ్రమున నంది వహనము పైనన్,జినుడు దిరుగాడగా తార్క్ష్యునిపై, శంకరుఁడు దిరిగె సురలు నుతింపన్కనవచ్చుంగద వైజయంతుని పయిన్ గంభీరమౌ గెల్పుతోఘనుడా తార్క్ష్యుడు సేసినాడు జననీ కైంకర్యమే తొల్గగా వినతాసూనుని పై విహార మనుచున్ విశ్వాత్ము డానాడు తార్క్ష్యునిపై నెక్కి చరించె శంకరుఁ డమర్త్యుల్ సూచి కొండాఁడగన్
మ॥ కని భస్మాసురునట్టులన్ శివుని రక్షార్థమ్ము నేతెంచుచున్దనదౌ శైలినిఁ ద్రుంచ మాధవుఁడు సంత్రాణమ్ము సిద్ధించఁగన్జనగా నిద్దరు విష్ణు వాహనమునన్ సంతోష మేపార తార్క్ష్యునిపై నెక్కి చరించె శంకరుఁడమర్త్యుల్ సూచి కొండాడఁగన్(భస్మాసుర వధ తరువాత ఇద్దరూ కలసి అలా తిరిగినారని అండి)ఎదుటి వారు కారులో డ్రాప్ చేసిన విధంగా
కందం
రిప్లయితొలగించండిజననీ దాస్యము వాపిన
ఘనుడనుచుఁ బదవినొసఁగఁ గమలాక్షుఁడుఁ, దా
గొని 'హరి'ని నిల్పగన్ దా
ర్క్ష్యునిపై శంకరుఁడు, 'దిరిగె సురలు నుతింపన్'
మత్తేభవిక్రీడితము
వినతా పుత్రుడు తల్లి దాస్యమునకున్ వీడ్కోలు పల్కెన్ ధృతిన్
గనుచున్ శౌర్యము, మాతృభక్తిఁ, బదవిన్ గట్టంగ
శ్రీవిష్ణువే
వినయంబందున వాహనంబుగఁ దగన్ బేర్గాంచగన్, శౌరి తా
ర్క్ష్యునిపై నెక్కి చరించె! శంకరుఁ డమర్త్యుల్ సూచి కొండాడం౦గన్!
చివరి పదము కొండాడఁగన్
తొలగించండి
రిప్లయితొలగించండిజినుడెట్లు తిరుగు? వృషభ వ
హనమెక్కి తిరుగున దెవరు హాహలమును కో
కనదుండేల గొనెనొ? తా
ర్క్ష్యునిపై, శంకరుఁడు దిరిగె, సురలు నుతింపన్.
వినతా దాస్య విమోచనమ్ము కొరకై పీయూష మున్ గోరగా
మొనలో వజ్రధరండనే గెలువగన్ పొంపెంత యో జూపగా
గని తా మెచ్చి యనస్సు గా వరము ప్రాగ్వాంశుండు
తానిచ్చి తా
ర్క్ష్యునిపై నెక్కి చరించె , శంకరుఁ డమర్త్యుల్ సూచి కొండాడగన్.
కనవచ్చిన దృశ్యమట న
రిప్లయితొలగించండివనీ ధరాగ్రమున నంది వహనము పైనన్,
జినుడు దిరుగాడగా తా
ర్క్ష్యునిపై, శంకరుఁడు దిరిగె సురలు నుతింపన్
కనవచ్చుంగద వైజయంతుని పయిన్ గంభీరమౌ గెల్పుతో
ఘనుడా తార్క్ష్యుడు సేసినాడు జననీ కైంకర్యమే తొల్గగా
వినతాసూనుని పై విహార మనుచున్ విశ్వాత్ము డానాడు తా
ర్క్ష్యునిపై నెక్కి చరించె శంకరుఁ డమర్త్యుల్ సూచి కొండాఁడగన్
మ॥ కని భస్మాసురునట్టులన్ శివుని రక్షార్థమ్ము నేతెంచుచున్
రిప్లయితొలగించండిదనదౌ శైలినిఁ ద్రుంచ మాధవుఁడు సంత్రాణమ్ము సిద్ధించఁగన్
జనగా నిద్దరు విష్ణు వాహనమునన్ సంతోష మేపార తా
ర్క్ష్యునిపై నెక్కి చరించె శంకరుఁడమర్త్యుల్ సూచి కొండాడఁగన్
(భస్మాసుర వధ తరువాత ఇద్దరూ కలసి అలా తిరిగినారని అండి)
ఎదుటి వారు కారులో డ్రాప్ చేసిన విధంగా