2-10-2026 (శుక్రవారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కలుషితచిత్తులె కదా జగద్గురు లెల్లన్”
(లేదా...)
“కలుషితచిత్తులే కద జగద్గురువుల్ పరికించి చూచినన్”
(న.చ. సాహిత్ శతావధానంలో నేనిచ్చిన సమస్య)
కందంవెలయఁగ సర్వులకు శుభముఁబలికె జగద్గురుడు దివ్య భగవద్గీతన్ దలఁప గురుపరంపరను న కలుషితచిత్తులె కదా జగద్గురు లెల్లన్చంపకమాల తెలియని మూఢులన్ దెలివి తేటల దారికి తెచ్చి, వారిలోఁగలిగిన పాపవాసనల కల్మషమున్ దమయందు దాల్చుచున్,జెలువగు జ్ఞానదీపమును జేపడఁ జేసెడు నట్టివారలైకలుషితచిత్తులే కద జగద్గురువుల్ పరికించి చూచినన్!
అలవాటయినటుల దనకు తెలిసిన దంతయు నిజమను దీరుగ దానిన్ పలువురి కెటులైన తెలుపకలుషితచిత్తులె కదా జగద్గురు లెల్లన్
(1)తలతురు గొప్పవారమని ధర్మ విదూరులు కర్మ భ్రష్టులై;విలువలు లేనివాడొకడు వెర్రిగవాగుచు రెచ్చిపోగ నోఖలుడికవాణ్ణిజేరి కలికాల ప్రభావముగూడ నిట్లనెన్..కలుషిత చిత్తులే కద జగద్గురువుల్,పరికించి చూచినన్!(2)తలచుట సాధ్యమాయతుల ధర్మము, జ్ఞానము,స్వాత్మనిష్ఠలన్కలియుగ మందుభక్తులనుగావగదండముచేతబూని భూజనులనునుద్ధరించుటకు సర్వము త్యాగముజేయునట్టి నిష్కలుషిత చిత్తులే కద జగద్గురువుల్,పరికించి చూచినన్!
తలపులు మంగళకరమైకలనము పలువురి జనులకు కాపాడుటకైవిలువలనడరించెడి నిష్కలుషితచిత్తులె కదా జగద్గురు లెల్లన్పలువురు గావవత్తురిట వంచకులై గురువేషధారులైతలపులు దారితప్పి పెడదారిని బట్టిన పెద్దవారలాకలుషితచిత్తులే కద; జగద్గురువుల్ పరికించి చూచినన్విలువలు పెంపొనర్చుటకు విజ్ఞత చూపిన వారలందురే
కందం
రిప్లయితొలగించండివెలయఁగ సర్వులకు శుభముఁ
బలికె జగద్గురుడు దివ్య భగవద్గీతన్
దలఁప గురుపరంపరను న
కలుషితచిత్తులె కదా జగద్గురు లెల్లన్
చంపకమాల
తెలియని మూఢులన్ దెలివి తేటల దారికి తెచ్చి, వారిలోఁ
గలిగిన పాపవాసనల కల్మషమున్ దమయందు దాల్చుచున్,
జెలువగు జ్ఞానదీపమును జేపడఁ జేసెడు నట్టివారలై
కలుషితచిత్తులే కద జగద్గురువుల్ పరికించి చూచినన్!
అలవాటయినటుల దనకు
రిప్లయితొలగించండితెలిసిన దంతయు నిజమను దీరుగ దానిన్
పలువురి కెటులైన తెలుప
కలుషితచిత్తులె కదా జగద్గురు లెల్లన్
(1)తలతురు గొప్పవారమని ధర్మ విదూరులు కర్మ భ్రష్టులై;
రిప్లయితొలగించండివిలువలు లేనివాడొకడు వెర్రిగవాగుచు రెచ్చిపోగ నో
ఖలుడికవాణ్ణిజేరి కలికాల ప్రభావముగూడ నిట్లనెన్..
కలుషిత చిత్తులే కద జగద్గురువుల్,
పరికించి చూచినన్!
(2)
తలచుట సాధ్యమాయతుల ధర్మము, జ్ఞానము,స్వాత్మనిష్ఠలన్
కలియుగ మందుభక్తులనుగావగదండముచేతబూని భూ
జనులనునుద్ధరించుటకు సర్వము త్యాగముజేయునట్టి ని
ష్కలుషిత చిత్తులే కద జగద్గురువుల్,
పరికించి చూచినన్!
తలపులు మంగళకరమై
రిప్లయితొలగించండికలనము పలువురి జనులకు కాపాడుటకై
విలువలనడరించెడి ని
ష్కలుషితచిత్తులె కదా జగద్గురు లెల్లన్
పలువురు గావవత్తురిట వంచకులై గురువేషధారులై
తలపులు దారితప్పి పెడదారిని బట్టిన పెద్దవారలా
కలుషితచిత్తులే కద; జగద్గురువుల్ పరికించి చూచినన్
విలువలు పెంపొనర్చుటకు విజ్ఞత చూపిన వారలందురే