14-11-2026 (శనివారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“లంకఁ గాల్చిన హనుమ కళంకితుండు”
(లేదా...)
“లంకనుఁ గాల్చి మారుతి కళంకితుఁ డయ్యెను సీత దృష్టిలో”
రావణుడు పరిపాలించు రాజధాని లంకఁ గాల్చిన హనుమ కళంకితుండుకాదు ; పరయింతు లందున కాముకుడయి చెరను బెట్టెడు జరితము జెంది యుండ
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తేటగీతిజన్మభూమిని మించిన స్వర్గమేది?నష్టమొనర నసురులకున్ కష్టమదియె!పరుడనన్వాలమంటించి తరుమనెంచలంకఁ గాల్చిన హనుమ కళంకితుండు!
సీత జాడను గనుగొన చేరె లంక వాలమును గాల్చి య సురులు వంత గూర్ప సాహసంబు న జూపించె శక్తి యె టుల లంక గాల్చిన హనుమ కళ o కి తుండు?
రామ పత్నిని కనుగొన లంకఁ జేరి మ్రోల నిలిచి సంభాషించె మోదమలర భూజ భద్రతను మఱచి మూర్ఖుడగుచులంకఁ గాల్చిన హనుమ కళంకితుండులంకను జేరి కన్గొనెను రాముని భార్యనశోకమందునన్జంకక హెచ్చరించెను నిశాచర భానువు రావణుండనేపంకజ నేత్రి జానకికిఁ భద్రత నెంచని బాలకుండుగాలంకనుఁ గాల్చి మారుతి కళంకితుఁ డయ్యెను సీత దృష్టిలో
కారణమ్మది లేకుండ కదన మాడి దనుజుల దునిమె నంచు నా దానవ కుల దృంభువైనట్టి రావణు దృష్టి లోన లంకఁ గాల్చిన హనుమ కళంకితుండు.జంకక వృక్ష వాటికను సాద మొనర్చె నకారణమ్మునన్ సంకర మాడె వీడనుచు సాల్వుడు రావణు మానసమ్మునన్ లంకనుఁ గాల్చి మారుతి కళంకితుఁ డయ్యెను, సీత దృష్టిలో వంకను తీర్చ గల్గు నిజ బంధువు గా మది నిల్చి పోయెనే.
రావణుడు పరిపాలించు రాజధాని
రిప్లయితొలగించండిలంకఁ గాల్చిన హనుమ కళంకితుండు
కాదు ; పరయింతు లందున కాముకుడయి
చెరను బెట్టెడు జరితము జెంది యుండ
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితేటగీతి
రిప్లయితొలగించండిజన్మభూమిని మించిన స్వర్గమేది?
నష్టమొనర నసురులకున్ కష్టమదియె!
పరుడనన్వాలమంటించి తరుమనెంచ
లంకఁ గాల్చిన హనుమ కళంకితుండు!
సీత జాడను గనుగొన చేరె లంక
రిప్లయితొలగించండివాలమును గాల్చి య సురులు వంత గూర్ప
సాహసంబు న జూపించె శక్తి యె టుల
లంక గాల్చిన హనుమ కళ o కి తుండు?
రామ పత్నిని కనుగొన లంకఁ జేరి
రిప్లయితొలగించండిమ్రోల నిలిచి సంభాషించె మోదమలర
భూజ భద్రతను మఱచి మూర్ఖుడగుచు
లంకఁ గాల్చిన హనుమ కళంకితుండు
లంకను జేరి కన్గొనెను రాముని భార్యనశోకమందునన్
జంకక హెచ్చరించెను నిశాచర భానువు రావణుండనే
పంకజ నేత్రి జానకికిఁ భద్రత నెంచని బాలకుండుగా
లంకనుఁ గాల్చి మారుతి కళంకితుఁ డయ్యెను సీత దృష్టిలో
రిప్లయితొలగించండికారణమ్మది లేకుండ కదన మాడి
దనుజుల దునిమె నంచు నా దానవ కుల
దృంభువైనట్టి రావణు దృష్టి లోన
లంకఁ గాల్చిన హనుమ కళంకితుండు.
జంకక వృక్ష వాటికను సాద మొనర్చె నకారణమ్మునన్
సంకర మాడె వీడనుచు సాల్వుడు రావణు మానసమ్మునన్
లంకనుఁ గాల్చి మారుతి కళంకితుఁ డయ్యెను, సీత దృష్టిలో
వంకను తీర్చ గల్గు నిజ బంధువు గా మది నిల్చి పోయెనే.