శుభోదయం చాలా రోజుల నుంచి నేను శంకరాభరణం blog ను, అనుసరిస్తున్నాను, నాకు తెలుగు భాష మీద అంత అవగాహన లేకపోయినా,, మీలాంటి కవులను చూసి, తెలుగు భాష అందాన్ని, అవసరాన్ని, గొప్పతనాన్ని తెలుసుకున్నావు ఈ వేదికను స్థాపించిన పెద్దలుకు నా హృదయపూర్వక నమస్కారములు 🙏🏻🙏🏻🙏🏻
నా ప్రస్తుత చదువు వైద్యరంగానిది( MBBS) అయినా, తెలుగు భాషపై కృషి చేయాలన్న, ఆలోచనను నాలో కలిగించిన మీ అందరికి ధన్యవాదములు 🙏🏻
చాలవు కోట్లెన్నైనను
రిప్లయితొలగించండికీలకమౌపదవినొంది కేనము తోడన్
పాలనముసేయవలెనన
కాలము లన్నింటను గలి కాలము మేలౌ
చాలదు సంపదెంతయిన చాటుగ మోసము సేయగావలెన్
తొలగించండిమేలుగ కన్నుగప్పియిక మీసము దిప్పుచు నుండగావలెన్
లీలగ నిత్తరిన్ ధనము లెక్కకు మిక్కుటమై తరింపగన్
కాలము లందు మేటి కలికాలమె యంచు వచింత్రు పండితుల్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలు గురూజీ🙏
తొలగించండివేళా కోళము గాదిది
రిప్లయితొలగించండికాలము లన్నింటను గలికాలము మేలౌ
సాలును సాలును గణపతి
నీరమునం గంగ యొడికి నేరుగ నరుగున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికందం
రిప్లయితొలగించండికాలుని సైతము మఱిపెడు
వాలకమున్ గలుగు వారి వంచనలెగయన్
లీలలు గోకొల్లలె! యే
కాలములన్నింటను గలికాలము మేలౌ?
ఉత్పలమాల
కాలుని సైతమున్ దెగువగా మఱిపించెడు దిట్టలౌచు న
వ్వాలకమున్ రచించు ప్రజ వంచనలందున జిక్కుచుండఁ బె
న్లీలలు గొల్లలై బ్రతుకు రీతులు నిత్యము మారు చుండ నే
కాలములందు మేటి కలికాలమె యంచు వచింత్రు పండితుల్?
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి🙏ధన్యోస్మి గురుదేవా!🙏
తొలగించండి
రిప్లయితొలగించండిమాలిన్యంబది హెచ్చగ
పాలసులకు, వివరిణులకు, స్వార్థపరులు, దు
శ్శీలురులకు నీచులకున్
గాలములన్నింటను గలికాలము మేలౌ.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికాలము లెన్నియుం డినను గాసుల నార్జన యక్ర మంబుగాఁ
రిప్లయితొలగించండిబాలన మూలముం బ్రభులు పాల్పడు చుండుట కారణంబు నౌ
కాలములందు మేటి కలికాలమె యంచు వచింత్రు పండితుల్
బాలనఁ జేయువా రకట పాలసు లాయన నుండ చోద్యమే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివీలును జూచి యు మోసము
రిప్లయితొలగించండిలీలగ నొనరింప బూని లేశము గరుణ న్
జాలిని జూపని వారికి
కాలము లన్నింటను గలి కాలము మేలౌ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికందము
రిప్లయితొలగించండి*కాలము లన్నింటను కలి
కాలము మేలౌ*నె?యొంటి కాలున ధర్మం
బాలంబన లేకుండును
హేలగఁదిరుగుదురు జనులు హింసారతులై.
ఉత్పలమాల
తొలగించండిమేలుఁదలంపకెవ్వరికి మిక్కిలి మోసముఁజేసి ద్రవ్యమున్
చాల గడించి, నిత్యము నసత్యములాడుచు,పెద్దవారలన్
హేళన జేయుచున్ పరమ హింసలొనర్చెడు దుర్జనాళికిన్
*కాలములందు మేటి కలికాలమెయంచు వచింత్రు పండితుల్.
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిచాలినయంత దోచుకొన జక్కని సందిది
రిప్లయితొలగించండినాయకాళికిన్
వీలు లభించు దుష్టులకు భీరువులంజెడ
గొట్ట మాయతో
కూలల పొట్టగొట్టి సిరి కుప్పలుబెంచగ
వచ్చునందుకే
కాలములందుమేటి కలికాలమె యంచు వచింత్రు పండితుల్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండినేలన జనులను రాక్షసు
రిప్లయితొలగించండిబోలునటుల కష్టబెట్ట పూనుచు సరియౌ
పాలన జేయట కొరకయి
కాలములన్నింటను గలికాలము మేలౌ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమేలును చేసెడి వారిని
రిప్లయితొలగించండికూలగచేయుచునుసొమ్ము కూర్చుఖలులకున్
శీలరహితులకు చూడగ
కాలములన్నింటనుకలికాలముమేలౌ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపాలకు లందునీతి యభిపాతము చెందగ మత్తుమందులో
రిప్లయితొలగించండితూలుచు మంది సొమ్ములను దొంగిలు చుండగ, నట్టివారి హే
రాళముగా స్తుతించుచును ద్రవ్యములన్ గొను ధూర్తులైనచో
కాలములందు మేటి కలికాలమె యంచు వచింత్రు పండితుల్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివేలకువేలవాక్యములు విజ్ఞుడు బ్రహ్మము తెల్పెనంచు నీ
రిప్లయితొలగించండివేళను జెప్పుచుండెదరు విస్తృతరీతిని కొంద రందులో
నోలలితాత్ములార! యిదియొక్కటియై వినిపించుచుండె "నీ
కాలములందు మేటి కలికాలమె యంచు వచింత్రు పండితుల్".
కందం
రిప్లయితొలగించండికాలాతీతుని దేవుని
వాలెము నామస్మరణము పాటించినచో
తేలిక విముక్తి దొరకెడి
కాలములన్నింటను కలికాలము మేలౌ.
ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
ఉండవల్లి సెంటరు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిశుభోదయం
చాలా రోజుల నుంచి నేను శంకరాభరణం blog ను, అనుసరిస్తున్నాను,
నాకు తెలుగు భాష మీద అంత అవగాహన లేకపోయినా,,
మీలాంటి కవులను చూసి,
తెలుగు భాష అందాన్ని, అవసరాన్ని, గొప్పతనాన్ని తెలుసుకున్నావు
ఈ వేదికను స్థాపించిన పెద్దలుకు నా హృదయపూర్వక నమస్కారములు 🙏🏻🙏🏻🙏🏻
నా ప్రస్తుత చదువు వైద్యరంగానిది( MBBS) అయినా,
తెలుగు భాషపై కృషి చేయాలన్న, ఆలోచనను
నాలో కలిగించిన మీ అందరికి ధన్యవాదములు 🙏🏻
ౘాలగ మోక్షము నందన్
రిప్లయితొలగించండిౙాలగ నా దేవదేవు స్మరణయె ౘాలున్
లీలగ నడిచెడి యుగముల
కాలము లన్నింటను గలి కాలము మేలౌ!
మేలాముదమ్ము పాదప
రిప్లయితొలగించండిజాలము లేని జగ మందుఁ జందం బొప్పం
జాలించుమ యీ సుద్దులు
కాలము లన్నింటను గలి కాలము మేలౌ
కాలము లందు మూటి నర కాయము గాంచిన జాడ లేదె యా
కాలముఁ జూచినట్టి ఘన కాయుఁ డొకండును నేఁడు లేఁడుగా
మేలుగఁ గాంచి చక్షువుల మేదిని నేఁడు విశంక నిక్కముం
గాలము లందు మేటి కలి కాలమె యంచు వచింత్రు పండితుల్
కాలము నందు గర్వమున కానక చేసిన సర్వపాపముల్!
రిప్లయితొలగించండికాలుని గర్వమున్ కడకు కంటి వెలుంగుల జేర్చినట్టి యా
కాలనియంత నుగ్రు ఘను కాశి నివాసుని గాంచ నేదుఁ నే
కాలము లందుమేటి కలికాలమె యంచు వచింత్రు పండితుల్!!
వీలగు దైవంబును కలి
రిప్లయితొలగించండికాలంబున దలచినంత గలుగగ మోక్షం
బీలీల మానవాళికి
కాలములన్నింటను గలికాలము మేలౌ
లీలగ
రిప్లయితొలగించండిమాయల బల్కుల
మేలొన రింపగ దలచని ముచ్చట లనగన్
పాలన జేయు మనుజులకు
కాలములన్నింటను గలికాలము మేలౌ!!
.
లీలగ మాయమాటలను లెక్కకు మించుడసత్యభాషణల్
హేలగ జేయుచున్ తిరిగి హీనపు జేష్టల నొప్పువారికిన్
పాలన జేతికందగను పాపము జేయుచు సంచరింపగా
కాలములందు మేటి కాలము కలికాలమె యంచు వచింత్రు పండితుల్!!
గాలము వైచి మీనమును గ్రన్నన బట్టెడు రీతి వాంఛలే
రిప్లయితొలగించండిగాలములై నిరంతరము గాసిలఁ జేయగ మానసంబునన్
లాలసలన్ త్యజించి మది రంజిల జేయగ నీ ధరిత్రిపై
కాలములందు మేటి కలికాలమె యంచు వచింత్రు పండితుల్