28, సెప్టెంబర్ 2022, బుధవారం

సమస్య - 4204

29-9-2022 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“తొమ్మిదిలో నొకటి దొలఁగఁ తోరఁపుఁ బదియౌ”
(లేదా...)
“తొమ్మిదినుండి యొక్కటినిఁ ద్రోయఁగఁ దాఁ బది యౌను జక్కఁగన్”

19 కామెంట్‌లు:

  1. అమ్ములపొదిలోప్రశ్నను
    తమ్ముడు సంధించె నాకు తత్ఫలమిదియే
    నెమ్మిగ రోమను సంఖ్యలు
    తొమ్మిదిలో నొకటి దొలఁగఁ తోరఁపుఁ బదియౌ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    2. అమ్ముల బొత్తిలోనొదవు నద్భుత ప్రశ్ననొసంగినాడు నా
      తమ్ముడు నేజవాబునిడ తర్కము కూడిన సంవిధానమున్
      కిమ్మనకుండదెల్పితిని కీలక రోమను సంఖ్యలన్ గనన్
      తొమ్మిదినుండి యొక్కటినిఁ ద్రోయఁగఁ దాఁ బది యౌను జక్కఁగన్

      తొలగించండి
  2. కందం
    నెమ్మదిగా వినుమయ్యా!
    తిమ్మిని బమ్మిగను మార్చు తీరుండని సూ
    క్ష్మమ్ము, నెడమఁ గల రోమను
    తొమ్మిదిలో నొకటి దొలఁగఁ తోరఁపుఁ బదియౌ!

    ఉత్పలమాల
    నెమ్మది నేర్పెదన్ వినుము నేర్పరివై మన లోకమందునన్
    దిమ్మిని బమ్మిగన్ మలచు తీరది లేదన గొప్పకాదు సూ
    క్ష్మమ్మిది, సంఖ్యకయ్యెడమఁ గాంచఁగ నుండెను రోమనంకెయౌ
    తొమ్మిదినుండి యొక్కటినిఁ ద్రోయఁగఁ దాఁ బది యౌను జక్కఁగన్!

    రిప్లయితొలగించండి
  3. మిమ్ముల రోమను సంఖ్యల
    తొమ్మిది వ్రాయుచు నొకటిని తొలగిం చుమనన్
    నమ్మెదరో లేదో మరి
    తొమ్మిదిలో నొకటి దొలఁగఁ తోరఁపుఁ బదియౌ

    రిప్లయితొలగించండి

  4. ఇమ్ముగ రోమను సంఖ్యను
    దొమ్మిదిలో నొకటి దొలఁగఁ తోరపుఁ బదియౌ
    యమ్మలు! సూచితె? యీయది
    నెమ్మదిగాఁ దెలిసి కొనుము నేర్పున సంఖ్యల్

    రిప్లయితొలగించండి
  5. ఎమ్మెయి తొమ్మిది పది యగు
    నెమ్మదిగా చెప్పు మనగ నేరుపు మీరన్
    తమ్ముడుజెప్పెను రోమను
    తొమ్మిది లో నొకటి దొలగ దోరపు పదియౌ

    రిప్లయితొలగించండి
  6. నెమ్మది ముఖ్యమౌను గద నేర్వగ నేర్పుగ నంకశాస్త్రమున్
    పొమ్మని త్రోసి పుచ్చకుము బుద్ధిని వాడిగ వాడినంత నీ
    కిమ్ముగ దోచు వైనమటులెంచగ రోమను సంఖ్యలందునన్
    తొమ్మిదినుండి యొక్కటినిఁ ద్రోయఁగఁ దాఁ బది యౌను జక్కఁగన్

    రిప్లయితొలగించండి

  7. తమ్ముడు చెప్పెను రోమను
    తొమ్మిది చూపించి యొకటి దుడుకు తనముతోన్
    నెమ్మదిగను తొలగించుచు
    తొమ్మిదిలో నొకటి దొలఁగఁ తోరఁపుఁ బదియౌ.


    అమ్మను చేరబిల్చి పరిహాసము లాడుచు చిన్నవాడు నా
    తమ్ముడు చెప్పెనిట్టుల కదా గడియారపు రోమనంకెలో
    తొమ్మిది చూపి యందొకటి దూరము చేసి తమాష యంచు నా
    తొమ్మిదినుండి యొక్కటినిఁ ద్రోయఁగఁ దాఁ బది యౌను జక్కఁగన్.

    రిప్లయితొలగించండి
  8. అమ్మ యొసగెఁ నిమ్ముగ దా
    నిమ్మలు తమ్మునకు రెండు నియతిగ నాకున్
    తొమ్మిది, యొక్కటి కుళ్ళెన్,
    తొమ్మిదిలో నొకటి దొలఁగఁ తోరఁపుఁ బదియౌ

    రిప్లయితొలగించండి
  9. *O కు l చేర్చగా.......q*
    *q ని ....విడదీస్తే......l, O......కలిసి...lO......*

    ఉ.

    వెమ్ముచు సున్నఁ జుట్టువడ వెండియు నొక్కటపేక్షితంబగున్
    నెమ్మిక వ్రాయు పద్ధతిగ నేమము సంఖ్యనుఁ జిత్రితంబుగన్
    కొమ్ముగ సున్నకొక్కటిని గూర్చగఁ దొమ్మిది యౌను నిక్కమే
    *తొమ్మిదినుండి యొక్కటినిఁ ద్రోయఁగఁ దాఁ బది యౌను జక్కఁగన్*

    రిప్లయితొలగించండి
  10. అమ్మడు! కంటివే యిది యంకెల గారడి యద్భుతంబు సూ
    తొమ్మిదినుండి యొక్కటినిఁ ద్రోయఁగఁ దాఁ బది యౌను జక్కఁగన్
    నమ్ముము సంఖ్య లందరయ నచ్చిన సంఖ్యలు రోమనంకెలే
    యిమ్ముగ వేయ వీలగును నెంతటి వారల కైనఁ బృధ్విలో.

    రిప్లయితొలగించండి
  11. సమ్మతి సూర్యునిఁజంద్రుని
    యిమ్ముగ గలుపగ జగముననేర్పడెగతియై
    నమ్ముచు బలుకగ నిప్పుడు
    తొమ్మిదిలో నొకటి దొలఁగఁ తోరఁపుఁ బదియౌ
    కొరుప్రోలు రాధాకృష్ణ రావు
    ఈ మధ్య ఒక గ్రహము తీసివేశారు

    రిప్లయితొలగించండి
  12. కందము
    అమ్మో!చిక్కుసమస్యే
    యిమ్మెయి నో శంకరార్య!యివ్వందగునా!
    సమ్మతిఁజెప్పెద రోమను
    తొమ్మిదిలో నొకటి తొలఁగఁదోరపుఁబదియౌ.

    రిప్లయితొలగించండి
  13. తమ్మునకేమొ తొమ్మిదియు తక్కిన తొమ్మిది నాకొసంగె తా
    నిమ్ముగ వ్రాత పొత్తముల నీదినమమ్మ క్రయంబు జేసి, నా
    తమ్మునకన్ని యెక్కువని తద్దయు నాకిడనొక్క పొత్తమున్
    తొమ్మిదినుండి యొక్కటినిఁ ద్రోయఁగఁ దాఁ బది యౌను జక్కఁగన్

    రిప్లయితొలగించండి
  14. సమ్మతమైన లెక్కయిది సత్యమె
    యెన్మిది యౌనుగాంచగా
    తొమ్మిదినుండి యొక్కటిని ద్రోయగ,
    దా పదియౌను జక్కగన్
    గ్రమ్మర దానికిన్నొకటి కల్పిన,
    మిక్కలి తేలిక యైనలెక్క నే
    నమ్మికతోడ దెల్పితిని నచ్చనిచో
    వివరించి చెప్పరే.

    రిప్లయితొలగించండి
  15. అమ్మానవు గెలువంగఁ ద
    రమ్మే యిట్టు లన వలదుర వచనములు నీ
    యిమ్మాట లిట్టు లున్నవి
    తొమ్మిదిలో నొకటి దొలఁగఁ దోరఁపుఁ బదియౌ

    ఇమ్మహి లోనఁ జిత్రముల నెన్నియొ కాంతుము లెక్కలందు నో
    యమ్మరొ మచ్చు కొక్కటిని నారయు మిచ్చట నక్కజమ్ముగా
    నిమ్ముగఁ గాన వచ్చు నటు లిచ్చట వ్రాసిన నూరు నింకనుం
    దొమ్మిది నుండి యొక్కటినిఁ ద్రోయఁగఁ దాఁ బది యౌను జక్కఁగన్

    రిప్లయితొలగించండి
  16. ఇమ్ముగ చదువుల కొరకై
    సొమ్ములు చెల్లించినేర్వ చోద్యము గనరే
    అమ్మయడుగ కొడుకుతెలిపె
    తొమ్మిదిలో నొకటి దొలఁగఁ తోరఁపుఁ బదియౌ”

    రిప్లయితొలగించండి