30-9-2022 (శుక్రవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“కన్నీటికిఁ బద్యమొకటె కారణమయ్యెన్”(లేదా...)“కాటుక కంటి నీటికిని గారణమయ్యెను బద్యమే సుమా”
కందంసున్నిత పుష్ప విలాపముసన్నుత పాపయ్యశాస్త్రి జాలిగ నొలుకన్మన్నించిన జాతి హృదినిఁగన్నీటికిఁ బద్యమొకటె కారణమయ్యెన్ఉత్పలమాలతేట తెనుంగు రాగమున తృప్తిగ 'పాపయ' పద్యరత్నపున్మూటెగ పంచి సాహితి నపూర్వపు పుష్పవిలాప కావ్యమున్సూటిగ మీట జాతి హృది సున్నిత వీణియ పాప భావనన్కాటుక కంటి నీటికిని గారణమయ్యెను బద్యమే సుమా!
ఉ.వ్రేటులు సంధి సూత్రములు వీడిన ప్రాసలు శబ్దశాస్త్రమున్ చేటు, సమాసముల్, గురువు చేయు సమీక్షలు కైతలన్నిటన్దీటును నాశతో గనుచు దేవుని మ్రొక్కుచు వ్రాయుచుండగా*"కాటుక కంటి నీటికిని గారణమయ్యెను బద్యమే సుమా”*
సన్నయమున ననెఁ బోతన సున్నితమగు శారదమ్మ శోకముఁ దోడన్ మిన్నగఁ గన్నీరో డ్చగఁ గన్నీటికిఁ బద్యమొకటె కారణమయ్యెన్
అన్నెము బున్నెము నెరుగనిసున్నితు డగు వాని నొకని సోమరి యనుచున్మిన్నక విమర్శ జేయగకన్నీటికి బద్య మొకటె కారణ మయ్యెన్
కన్నుల ముందర కనబడుకన్నీటి కథలనుజూపు కావ్యరచనకున్మిన్నగ చలించిన జనులకన్నీటికిఁ బద్యమొకటె కారణమయ్యెన్
వెన్నుని కావ్యము గోరుచుమన్ననతో నీయజూప మాన్యములెన్నోతిన్నగ దృణీకరింపగకన్నీటికి పద్యమొకటె కారణమయ్యెన్ పాటిగ శంకరాభరణ ప్రాంగణమందు సమస్యలెన్నుచున్పోటిగ వ్రాయగాగడగి ప్రొద్దును గానక పద్యమల్లగానాటికి నాటికిన్ నిదుర నాకును దూరము నయ్యెజూడగాకాటుక కంటినీటికిని గారణమయ్యెను బద్యమేసుమా నిద్రలేక కన్నులు నొచ్చి కంటినీరు కారినదని భావన!
నిన్నటి దినమున నేనొకచిన్నదయిన పద్యమును రచించగ దప్పుల్యున్నవని యొజ్జ తెలుపగకన్నీటికిఁ బద్యమొకటె కారణమయ్యెన్
ఎన్నియొ నిడుమలను బడుచునున్న మగువ యోర్పును కవి యొక పద్యమునన్కన్నులగట్టగ చదువరికన్నీటికిఁ బద్యమొకటె కారణమయ్యెన్
ఎన్నగ నెన్నో బాధలుకన్నీటికి,బద్యమొకటె కారణమయ్యెన్వెన్నునిదయతోసభలోమన్నననందుగపదుగురిమధ్యననాకున్
మరొక పూరణడా బల్లూరి ఉమాదేవికన్నుల రక్తము గారగఎన్నకసాకుల నయనము నిమ్ముగనిడెనన్ తిన్ననికథచదవగనేకన్నీటికి,బద్యమొకటె కారణమయ్యెన్
తేటతెనుంగు పద్యములు దీయగ నుండు విధంబుఁ దోపఁగా సాటి కవీంద్రునింబలెను జట్టిగ నిచ్చను బాధ నొందుటన్ గాటుక కంటి నీటికిని గారణమయ్యెను బద్యమే సుమా వేటును వేయఁజాలనుచు వేడెను బోతన శారదాంబనున్
కందముఅన్నా!విన్నావా!పో తన్నకు కనిపించ వాణి తత దుఃఖితయై మిన్నగ నోదారిచె, నాకన్నీటికి పద్యమొకటి కారణమయ్యెన్. ఉత్పలమాల హాటక రత్నరాశులకు నాశయు వుట్టియు పోతనార్యుఁడే మేటిధరాధినాయకులు మెచ్చెడి రీతిగ నన్నునమ్మ, నాపాటులెటుండునో యనుచు భారతి బోరున నేడ్వ సాగె, నాకాటుక కంటినీటికిని గారణమయ్యెను పద్యమే సుమీ.
నిన్నటి పద్యము రాలేదన్న కోపముతోడ తండ్రి యంగజు పైనన్ గన్నెఱ్ఱ జేయగ బాలుని కన్నీటికిఁ బద్యమొకటె కారణమయ్యెన్.నాటక మందు రాఘవుడు నారియయోనిజ లక్ష్మణుండ్రతో కాటిక కేగు పాళమున కష్టమెఱుంగని రామపత్ని యాపాటలగంధి శోకమున పద్యము పాడగ గాంచు స్త్రీలకున్ గాటుక కంటి నీటికిని గారణమయ్యెను బద్యమే సుమా.
సూటిగ జెప్పినట్టి ఘనసూరి కవీశ్వరపాపయాఖ్యడున్కోటివరాలపద్యములు గూర్చెను పుష్పవిలాపమందునన్ వాటిని చద్వినన్ మనసు బాధ విచారము గల్గుచుండు నీకాటుక కంటి నీటికిని కారణమయ్యెను పద్యమేసుమీ
ధాటిగ పద్యమల్లుచును దాల్మిని కావ్యము లెన్నొ వ్రాయుచున్ మేటి కవీంద్రుడై సుతుడు మేదినిపై వెలుగొందు చుండగాచాటెను తల్లి సంతసము చారుతరమ్మగు బాష్ప ధారగా!కాటుక కంటి నీటికిని కారణ మయ్యెను పద్యమే సుమా!
మిన్నగ నెల్లెడ లందును మన్నన లందు కవి వ్రాయ మహనీయుండే యన్నా యానందపు టాకన్నీటికిఁ బద్యమొకటె కారణ మయ్యెన్మేటి స్వరంపు గాయకుఁడు మెచ్చఁగ నచ్చట నెల్ల వారలుంబాటవ మొప్ప రాగమునఁ బాడఁగఁ దా కరుణా రసం బహోదీటుగ నొల్క నత్తఱినిఁ దియ్యఁదనమ్మున విన్న వారికింగాటుక కంటి నీటికిని గారణమయ్యెను బద్యమే చుమా
కందంమిన్నగ పద్యపు నాటకవన్నెను చూడంగబోవ భావపు రాగాలన్ని వినగ వీక్షక తతికన్నీటికి బద్య మొకటె కారణ మయ్యెన్.ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రిఉండవల్లి సెంటరు.
నాటకమందు నాయకుడు నాయికతో నెడబాటు నొంది జంఝాటమునందు చిక్కుకొని జాలిగనామెను పల్వరించుచున్దీటుగ పద్యరూపమున దెల్పగ నార్ద్రతమీర, శ్రోతకున్కాటుక కంటి నీటికిని గారణమయ్యెను బద్యమే సుమా
కన్నా ! రమ్మని శిష్యుని,తిన్నగ పద్యముచదువుము తీరుగ నన్నన్చిన్నగ నేడ్చెను భయపడికన్నీటికి బద్య మొకటె కారణ మయ్యెన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
ఆటగమారెనీదినమునందరుపద్యము వ్రాయుచుండిరేకూటములేర్పడన్కవులు కూర్చునితీరుగవ్రాయసాగిరేధీటుగవ్రాయరేకవిత దీనిని జూడగ బాధగల్గునా"కాటుకకంటినీటికినిగారణమయ్యెనుబద్యమేసుమా" !(సరస్వతీ దేవి దీన స్థితి )
కందం
రిప్లయితొలగించండిసున్నిత పుష్ప విలాపము
సన్నుత పాపయ్యశాస్త్రి జాలిగ నొలుకన్
మన్నించిన జాతి హృదినిఁ
గన్నీటికిఁ బద్యమొకటె కారణమయ్యెన్
ఉత్పలమాల
తేట తెనుంగు రాగమున తృప్తిగ 'పాపయ' పద్యరత్నపు
న్మూటెగ పంచి సాహితి నపూర్వపు పుష్పవిలాప కావ్యమున్
సూటిగ మీట జాతి హృది సున్నిత వీణియ పాప భావనన్
కాటుక కంటి నీటికిని గారణమయ్యెను బద్యమే సుమా!
ఉ.
రిప్లయితొలగించండివ్రేటులు సంధి సూత్రములు వీడిన ప్రాసలు శబ్దశాస్త్రమున్
చేటు, సమాసముల్, గురువు చేయు సమీక్షలు కైతలన్నిటన్
దీటును నాశతో గనుచు దేవుని మ్రొక్కుచు వ్రాయుచుండగా
*"కాటుక కంటి నీటికిని గారణమయ్యెను బద్యమే సుమా”*
సన్నయమున ననెఁ బోతన
రిప్లయితొలగించండిసున్నితమగు శారదమ్మ శోకముఁ దోడన్
మిన్నగఁ గన్నీరో డ్చగఁ
గన్నీటికిఁ బద్యమొకటె కారణమయ్యెన్
అన్నెము బున్నెము నెరుగని
రిప్లయితొలగించండిసున్నితు డగు వాని నొకని సోమరి యనుచున్
మిన్నక విమర్శ జేయగ
కన్నీటికి బద్య మొకటె కారణ మయ్యెన్
కన్నుల ముందర కనబడు
రిప్లయితొలగించండికన్నీటి కథలనుజూపు కావ్యరచనకున్
మిన్నగ చలించిన జనుల
కన్నీటికిఁ బద్యమొకటె కారణమయ్యెన్
వెన్నుని కావ్యము గోరుచు
రిప్లయితొలగించండిమన్ననతో నీయజూప మాన్యములెన్నో
తిన్నగ దృణీకరింపగ
కన్నీటికి పద్యమొకటె కారణమయ్యెన్
పాటిగ శంకరాభరణ ప్రాంగణమందు సమస్యలెన్నుచున్
పోటిగ వ్రాయగాగడగి ప్రొద్దును గానక పద్యమల్లగా
నాటికి నాటికిన్ నిదుర నాకును దూరము నయ్యెజూడగా
కాటుక కంటినీటికిని గారణమయ్యెను బద్యమేసుమా
నిద్రలేక కన్నులు నొచ్చి కంటినీరు కారినదని భావన!
నిన్నటి దినమున నేనొక
రిప్లయితొలగించండిచిన్నదయిన పద్యమును రచించగ దప్పుల్
యున్నవని యొజ్జ తెలుపగ
కన్నీటికిఁ బద్యమొకటె కారణమయ్యెన్
ఎన్నియొ నిడుమలను బడుచు
రిప్లయితొలగించండినున్న మగువ యోర్పును కవి యొక పద్యమునన్
కన్నులగట్టగ చదువరి
కన్నీటికిఁ బద్యమొకటె కారణమయ్యెన్
ఎన్నగ నెన్నో బాధలు
రిప్లయితొలగించండికన్నీటికి,బద్యమొకటె కారణమయ్యెన్
వెన్నునిదయతోసభలో
మన్నననందుగపదుగురిమధ్యననాకున్
మరొక పూరణ
రిప్లయితొలగించండిడా బల్లూరి ఉమాదేవి
కన్నుల రక్తము గారగ
ఎన్నకసాకుల నయనము నిమ్ముగనిడెనన్
తిన్ననికథచదవగనే
కన్నీటికి,బద్యమొకటె కారణమయ్యెన్
తేటతెనుంగు పద్యములు దీయగ నుండు విధంబుఁ దోపఁగా
రిప్లయితొలగించండిసాటి కవీంద్రునింబలెను జట్టిగ నిచ్చను బాధ నొందుటన్
గాటుక కంటి నీటికిని గారణమయ్యెను బద్యమే సుమా
వేటును వేయఁజాలనుచు వేడెను బోతన శారదాంబనున్
కందము
రిప్లయితొలగించండిఅన్నా!విన్నావా!పో
తన్నకు కనిపించ వాణి తత దుఃఖితయై
మిన్నగ నోదారిచె, నా
కన్నీటికి పద్యమొకటి కారణమయ్యెన్.
ఉత్పలమాల
హాటక రత్నరాశులకు నాశయు వుట్టియు పోతనార్యుఁడే
మేటిధరాధినాయకులు మెచ్చెడి రీతిగ నన్నునమ్మ, నా
పాటులెటుండునో యనుచు భారతి బోరున నేడ్వ సాగె, నా
కాటుక కంటినీటికిని గారణమయ్యెను పద్యమే సుమీ.
రిప్లయితొలగించండినిన్నటి పద్యము రాలే
దన్న కోపముతోడ తండ్రి యంగజు పైనన్
గన్నెఱ్ఱ జేయగ బాలుని
కన్నీటికిఁ బద్యమొకటె కారణమయ్యెన్.
నాటక మందు రాఘవుడు నారియయోనిజ లక్ష్మణుండ్రతో
కాటిక కేగు పాళమున కష్టమెఱుంగని రామపత్ని యా
పాటలగంధి శోకమున పద్యము పాడగ గాంచు స్త్రీలకున్
గాటుక కంటి నీటికిని గారణమయ్యెను బద్యమే సుమా.
సూటిగ జెప్పినట్టి ఘనసూరి కవీశ్వర
రిప్లయితొలగించండిపాపయాఖ్యడున్
కోటివరాలపద్యములు గూర్చెను పుష్ప
విలాపమందునన్
వాటిని చద్వినన్ మనసు బాధ వి
చారము గల్గుచుండు నీ
కాటుక కంటి నీటికిని కారణమయ్యెను పద్యమేసుమీ
ధాటిగ పద్యమల్లుచును దాల్మిని కావ్యము లెన్నొ వ్రాయుచున్
రిప్లయితొలగించండిమేటి కవీంద్రుడై సుతుడు మేదినిపై వెలుగొందు చుండగా
చాటెను తల్లి సంతసము చారుతరమ్మగు బాష్ప ధారగా!
కాటుక కంటి నీటికిని కారణ మయ్యెను పద్యమే సుమా!
మిన్నగ నెల్లెడ లందును
రిప్లయితొలగించండిమన్నన లందు కవి వ్రాయ మహనీయుండే
యన్నా యానందపు టా
కన్నీటికిఁ బద్యమొకటె కారణ మయ్యెన్
మేటి స్వరంపు గాయకుఁడు మెచ్చఁగ నచ్చట నెల్ల వారలుం
బాటవ మొప్ప రాగమునఁ బాడఁగఁ దా కరుణా రసం బహో
దీటుగ నొల్క నత్తఱినిఁ దియ్యఁదనమ్మున విన్న వారికిం
గాటుక కంటి నీటికిని గారణమయ్యెను బద్యమే చుమా
కందం
రిప్లయితొలగించండిమిన్నగ పద్యపు నాటక
వన్నెను చూడంగబోవ భావపు రాగా
లన్ని వినగ వీక్షక తతి
కన్నీటికి బద్య మొకటె కారణ మయ్యెన్.
ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
ఉండవల్లి సెంటరు.
నాటకమందు నాయకుడు నాయికతో నెడబాటు నొంది జం
రిప్లయితొలగించండిఝాటమునందు చిక్కుకొని జాలిగనామెను పల్వరించుచున్
దీటుగ పద్యరూపమున దెల్పగ నార్ద్రతమీర, శ్రోతకున్
కాటుక కంటి నీటికిని గారణమయ్యెను బద్యమే సుమా
కన్నా ! రమ్మని శిష్యుని,
రిప్లయితొలగించండితిన్నగ పద్యముచదువుము తీరుగ నన్నన్
చిన్నగ నేడ్చెను భయపడి
కన్నీటికి బద్య మొకటె కారణ మయ్యెన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఆటగమారెనీదినమునందరుపద్యము వ్రాయుచుండిరే
రిప్లయితొలగించండికూటములేర్పడన్కవులు కూర్చునితీరుగవ్రాయసాగిరే
ధీటుగవ్రాయరేకవిత దీనిని జూడగ బాధగల్గునా
"కాటుకకంటినీటికినిగారణమయ్యెనుబద్యమేసుమా" !
(సరస్వతీ దేవి దీన స్థితి )