28-9-2022 (బుధవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“సారా త్రాగక రచనను సాగింతు నెటుల్”(లేదా...)“సారా త్రాగక పద్యలేఖన మెటుల్ సాగింతుఁ గావ్యంబునన్”
కందంవారిజ లోచన గనబడశారద నవరాత్రి వేళ చక్కదనంబున్కోరిక మీరగ, నామనసారా త్రాగక రచనను సాగింతు నెటుల్ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రిఉండవల్లి సెంటరు.
ఔరా రసామృతము మన సారా త్రాగక రచనను సాగింతు నెటుల్ శ్రీరామా నీవు చెపుమ దారా పుత్రాదు లిచట దగ్గర యుండన్
కందము ఔరా!భాగవతంబును భారత రామాయణాది బహుకావ్య రసాసారంబునెల్ల నేన్ మనసారా త్రాగక రచన సాగింతునెటుల్.
శార్దూలముఏరా!మిత్రమ!మూర్తి!పద్యమెటులన్ హేలన్ లిఖించందగున్ ఔరా!చెప్పుమటన్నఁజెప్పితిని కావ్యంబుల్ పఠింపంగ,తత్ సారంబెల్ల సుధారసంబుగను నాస్వాదించియున్ నేను, వ్రాసారా!త్రాగక పద్యలేఖనమెటుల్ సాగింతుఁగావ్యంబుగన్.
సారపు పురాణ కావ్యములారసి యు జదువుచు నందలమృత పు రసమున్కోరిక తో రుచి గా మనసారా త్రాగక రచనను సాగింతు నెటుల్?
చేరి పలుకు తొయ్యలి యాభారతి పదపంకజముల పై వ్రాలుచు పూత్కారి కరుణ రసమును మనసారా త్రాగక రచనను సాగింతు నెటుల్.
శా.శ్రీరామున్ దలపంగఁ జాలు రుచియే సీతమ్మ దాక్షిణ్యమున్మారేడాకులతోఁ బినాకి తనివిన్ మందస్మితమ్మున్ గనున్భీరుండన్ రచనామృతమ్ము వరమున్ బ్రీతిన్ మదీయంబు, హం*సా ! రా ! త్రాగక పద్య లేఖన మెటుల్ సాగింతుఁ గావ్యంబునన్.*
మీరడుగగ వెనువెంటనెగౌరవమొసగుచు తలచితి కవితలు వ్రాయన్నేరుగ తేనీరును మనసారా త్రాగక రచనను సాగింతు నెటుల్
ఔరా! కన్నుల విందగునా రాకాచంద్రు సౌరు నానందముగాకోరిక తీరగ నా మనసారా త్రాగక రచనను సాగింతు నెటుల్
ధారాళంబుగ సాహితీ కృతుల కాధారంబుగా నిల్చు సంధ్యారాముం బ్రియపత్ని శుక్లయగు విద్యాదేవినిన్ భక్తితో నారాధించిన తీర్థమియ్యదియె జ్ఞానార్థుండవైనట్టి వ త్సా! రా! త్రాగక పద్యలేఖన మెటుల్ సాగింతుఁ గావ్యంబునన్.
సారా త్రాగక పద్యలేఖన మెటుల్ సాగింతుఁ గావ్యంబునుం బౌరా! ద్రాగుఁడు పీక నిండుగ నికన్ హ్లాదంబునొందంగ గా శ్రీరామాయని దైవపు నతుల్ సాకార మొందంగ గావీరా వేశముఁ దోడ వ్రాయుడు దగున్ బేరాసఁ గావ్యంబుకున్
తీరిక లభించి నాదరిజేరిన నాహృదయరాజ్ఞి చేతనిడిన తేనీరే తృప్తినిడగ మనసారా త్రాగక రచనను సాగింతు నెటుల్
ఔరా పున్నమి చంద్రు కౌముది మనస్సానంద సంధాతగా నీరాత్రంబున నేత్రపర్వముగ నా కీవిన్ ప్రసాదించగా నేరీతిన్ గమకించి కావ్య రచనమ్మీ రేయి గావింతునా సారా త్రాగక, పద్యలేఖన మెటుల్ సాగింతుఁ గావ్యంబునన్?
కందంశ్రీరంజిల్లగ మ్రొక్కుచుధారాళమ్ముగఁ గవనము దరిజేరఁగ సాకారమగు భావసుధ మనసారా త్రాగక రచనను సాగింతు నెటుల్? శార్దూలవిక్రీడితముశ్రీరంజిల్లగ మ్రొక్కుచున్ హృదిఁ బ్రవేశింపంగ వాత్సల్యమైధారాళంపు కవిత్వమాధురుల సంధానింప మన్నించి సాకారమ్మొందగఁ జేయ బావసుధలన్ గాక్షింప, వైకుంఠ వాసా! రా! త్రాగక పద్యలేఖన మెటుల్ సాగింతుఁ గావ్యంబునన్
నీరజనాభుని చరితముతీరుగపోతన్న వ్రాసె తీయని తెలుగున్భూరమణుని నామసుధాసారాత్రాగకరచననుసాగింతునెటుల్
శ్రీరామనామసుధమన*సారాత్రాగకరచననుసాగింతునెటుల్*తారకమంత్రంబదియేనారసనాగ్రముననిల్చి ననునడిపించున్
సారాచార విచారముల్ దెలియగా సర్వోన్నతంబైన భాషారాణిన్ వినుతించనైతి మొదటన్ సత్యంబు నేనెర్గకన్నేరంబాయెను శారదా! భగవతీ! నీ నామపుందేనె మన్సారా త్రాగక పద్య లేఖన మొటుల్ సాగింతు కావ్యంబునన్
మారాము సేయ నేలయ నీరమ్మును, జూడ కుండ నిను మార నిభాకారా! మన్నగర నివాసా! రా, త్రాగక రచనను సాగింతు నెటుల్ పారంబుం గన నట్టి సంతసమునన్ వాక్యమ్ము లంచత్సు ధాగారమ్ముల్ వచియించు చుండి సరసం గర్పూర తాంబూలముల్ నారీరత్నము లీయఁ బేయములుఁ బ్రజ్ఞా పాండితీ గంధవత్సారా! త్రాగక పద్య లేఖన మెటుల్ సాగింతుఁ గావ్యంబునన్
వీరావేశము కలుగగనేరీతిగనైన కవిగ నిలువగ దేవీకోరితి పద్యరసము,మనసారా త్రాగక రచనను సాగింతు నెటుల్”
తీరౌ రీతిని విద్యఁ గ్రోలగను వాగ్దేవీ! కృపన్ గోరెదన్కారుణ్యమ్మును జూపి నీవు ధృతితో కంఠమ్మునన్ నిల్వుమాతోరమ్మౌగతి నీదు నామసుధ సంతోషమ్ముతోడన్ వచః సారా! త్రాగక పద్యలేఖన మెటుల్ సాగింతుఁ గావ్యంబునన్
కందం
రిప్లయితొలగించండివారిజ లోచన గనబడ
శారద నవరాత్రి వేళ చక్కదనంబున్
కోరిక మీరగ, నామన
సారా త్రాగక రచనను సాగింతు నెటుల్
ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
ఉండవల్లి సెంటరు.
ఔరా రసామృతము మన
రిప్లయితొలగించండిసారా త్రాగక రచనను సాగింతు నెటుల్
శ్రీరామా నీవు చెపుమ
దారా పుత్రాదు లిచట దగ్గర యుండన్
కందము
రిప్లయితొలగించండిఔరా!భాగవతంబును
భారత రామాయణాది బహుకావ్య రసా
సారంబునెల్ల నేన్ మన
సారా త్రాగక రచన సాగింతునెటుల్.
శార్దూలము
తొలగించండిఏరా!మిత్రమ!మూర్తి!పద్యమెటులన్ హేలన్ లిఖించందగున్
ఔరా!చెప్పుమటన్నఁజెప్పితిని కావ్యంబుల్ పఠింపంగ,తత్
సారంబెల్ల సుధారసంబుగను నాస్వాదించియున్ నేను, వ్రా
సారా!త్రాగక పద్యలేఖనమెటుల్ సాగింతుఁగావ్యంబుగన్.
సారపు పురాణ కావ్యము
రిప్లయితొలగించండిలారసి యు జదువుచు నందలమృత పు రసమున్
కోరిక తో రుచి గా మన
సారా త్రాగక రచనను సాగింతు నెటుల్?
రిప్లయితొలగించండిచేరి పలుకు తొయ్యలి యా
భారతి పదపంకజముల పై వ్రాలుచు పూ
త్కారి కరుణ రసమును మన
సారా త్రాగక రచనను సాగింతు నెటుల్.
శా.
రిప్లయితొలగించండిశ్రీరామున్ దలపంగఁ జాలు రుచియే సీతమ్మ దాక్షిణ్యమున్
మారేడాకులతోఁ బినాకి తనివిన్ మందస్మితమ్మున్ గనున్
భీరుండన్ రచనామృతమ్ము వరమున్ బ్రీతిన్ మదీయంబు, హం
*సా ! రా ! త్రాగక పద్య లేఖన మెటుల్ సాగింతుఁ గావ్యంబునన్.*
మీరడుగగ వెనువెంటనె
రిప్లయితొలగించండిగౌరవమొసగుచు తలచితి కవితలు వ్రాయన్
నేరుగ తేనీరును మన
సారా త్రాగక రచనను సాగింతు నెటుల్
ఔరా! కన్నుల విందగు
రిప్లయితొలగించండినా రాకాచంద్రు సౌరు నానందముగా
కోరిక తీరగ నా మన
సారా త్రాగక రచనను సాగింతు నెటుల్
రిప్లయితొలగించండిధారాళంబుగ సాహితీ కృతుల కాధారంబుగా నిల్చు సం
ధ్యారాముం బ్రియపత్ని శుక్లయగు విద్యాదేవినిన్ భక్తితో
నారాధించిన తీర్థమియ్యదియె జ్ఞానార్థుండవైనట్టి వ
త్సా! రా! త్రాగక పద్యలేఖన మెటుల్ సాగింతుఁ గావ్యంబునన్.
సారా త్రాగక పద్యలేఖన మెటుల్ సాగింతుఁ గావ్యంబునుం
రిప్లయితొలగించండిబౌరా! ద్రాగుఁడు పీక నిండుగ నికన్ హ్లాదంబునొందంగ గా
శ్రీరామాయని దైవపు నతుల్ సాకార మొందంగ గా
వీరా వేశముఁ దోడ వ్రాయుడు దగున్ బేరాసఁ గావ్యంబుకున్
తీరిక లభించి నాదరి
రిప్లయితొలగించండిజేరిన నాహృదయరాజ్ఞి చేతనిడిన తే
నీరే తృప్తినిడగ మన
సారా త్రాగక రచనను సాగింతు నెటుల్
ఔరా పున్నమి చంద్రు కౌముది మనస్సానంద సంధాతగా
రిప్లయితొలగించండినీరాత్రంబున నేత్రపర్వముగ నా కీవిన్ ప్రసాదించగా
నేరీతిన్ గమకించి కావ్య రచనమ్మీ రేయి గావింతునా
సారా త్రాగక, పద్యలేఖన మెటుల్ సాగింతుఁ గావ్యంబునన్?
కందం
రిప్లయితొలగించండిశ్రీరంజిల్లగ మ్రొక్కుచు
ధారాళమ్ముగఁ గవనము దరిజేరఁగ సా
కారమగు భావసుధ మన
సారా త్రాగక రచనను సాగింతు నెటుల్?
శార్దూలవిక్రీడితము
శ్రీరంజిల్లగ మ్రొక్కుచున్ హృదిఁ బ్రవేశింపంగ వాత్సల్యమై
ధారాళంపు కవిత్వమాధురుల సంధానింప మన్నించి సా
కారమ్మొందగఁ జేయ బావసుధలన్ గాక్షింప, వైకుంఠ వా
సా! రా! త్రాగక పద్యలేఖన మెటుల్ సాగింతుఁ గావ్యంబునన్
రిప్లయితొలగించండినీరజనాభుని చరితము
తీరుగపోతన్న వ్రాసె తీయని తెలుగున్
భూరమణుని నామసుధా
సారాత్రాగకరచననుసాగింతునెటుల్
శ్రీరామనామసుధమన
రిప్లయితొలగించండి*సారాత్రాగకరచననుసాగింతునెటుల్*
తారకమంత్రంబదియే
నారసనాగ్రముననిల్చి ననునడిపించున్
సారాచార విచారముల్ దెలియగా సర్వోన్నతంబైన భా
రిప్లయితొలగించండిషారాణిన్ వినుతించనైతి మొదటన్ సత్యంబు నేనెర్గకన్
నేరంబాయెను శారదా! భగవతీ! నీ నా
మపుందేనె మ
న్సారా త్రాగక పద్య లేఖన మొటుల్ సాగింతు కావ్యంబునన్
మారాము సేయ నేలయ
రిప్లయితొలగించండినీరమ్మును, జూడ కుండ నిను మార నిభా
కారా! మన్నగర నివా
సా! రా, త్రాగక రచనను సాగింతు నెటుల్
పారంబుం గన నట్టి సంతసమునన్ వాక్యమ్ము లంచత్సు ధా
గారమ్ముల్ వచియించు చుండి సరసం గర్పూర తాంబూలముల్
నారీరత్నము లీయఁ బేయములుఁ బ్రజ్ఞా పాండితీ గంధవ
త్సారా! త్రాగక పద్య లేఖన మెటుల్ సాగింతుఁ గావ్యంబునన్
వీరావేశము కలుగగ
రిప్లయితొలగించండినేరీతిగనైన కవిగ నిలువగ దేవీ
కోరితి పద్యరసము,మన
సారా త్రాగక రచనను సాగింతు నెటుల్”
తీరౌ రీతిని విద్యఁ గ్రోలగను వాగ్దేవీ! కృపన్ గోరెదన్
రిప్లయితొలగించండికారుణ్యమ్మును జూపి నీవు ధృతితో కంఠమ్మునన్ నిల్వుమా
తోరమ్మౌగతి నీదు నామసుధ సంతోషమ్ముతోడన్ వచః
సారా! త్రాగక పద్యలేఖన మెటుల్ సాగింతుఁ గావ్యంబునన్