4-5-2023 (గురువారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“పాండవులకుఁ బెద్ద భార్య కుంతి”(లేదా...)“అరయఁగఁ బంచపాండవుల కా సతి కుంతియె పెద్ద భార్యయౌ”(బులుసు అపర్ణ గారి ఒంగోలు శతావధాన సమస్య)
భారతమ్ము నందు బాండుడె జనకుడుపాండవులకుఁ ; బెద్ద భార్య కుంతిమొదట బడసె సుతులు ముగ్గురిని నెఱగమాద్రి చివరి వారి మాత యయ్యె
భారతమ్మునందు ప్రఖ్యాతినొందినపాండవులకుతండ్రి పాండురాజుకోరి పాండురాజుఁ గూరిచి తెలుపంగపాండవులకుఁ బెద్ద, భార్య కుంతి
క్రామాలంకారం లో --==పాండు రాజె వరికి వసుధలో పిత య య్యె?ధర్మ జునకు భీము తమ్ము డైనపార్థు కెవరు తల్లి వచింయింపు మన్న చోపాండవులకు :+ పెద్ద భార్య కుంతి
ఆటవెలదిసాగ చిన్న భార్య సహగమనమ్మునపెంచి పెద్దఁ జేయ పిల్లవాండ్రదిటవుఁ జేకొని మది దిక్కయ్యె బాలలౌపాండవులకుఁ, బెద్ద భార్య కుంతిచంపకమాలమరువక భర్తనే 'సతి' గ మాద్రియె వెంటను నిర్గమింపఁగన్గొరతయె లేని రీతిగను గూర్మిని బెంచెను సొంత తల్లిగానరయగఁ బంచపాండవుల కా సతి కుంతియె, పెద్ద భార్యయౌగురుకుల పాండురాజునకుఁ గూర్చెను మోదము నాత్మరూపికిన్
వరముగ మౌనిమంత్రమును పావని కుంతి శిరమ్ముఁ దాల్చు సంవరణమునన్ జనించితిరి పాండవులేవురు మాతృమూర్తియౌనరయఁగఁ బంచపాండవుల కా సతి కుంతియె, పెద్ద భార్యయౌనిరవుగ పాండురాజునకు నీయమ మాద్రి సపత్ని యయ్యెడిన్
తండ్రి పాండురాజుతల్లి కుంతీదేవిపాండవులకుఁ, బెద్దభార్య కుంతిమాద్రి చిన్న భార్య; మరణమొందగ పతిమాద్రి సహగమించెమగనితోడ
కరముగ కాననంబునను గష్టములెల్ల సహించి యోర్పుతోదిరముగ సర్వకాలమున దేకువవీడని ద్రౌపదే తగున్అరయగ పంచపాండవుల కాసతి,కుంతియె పెద్ద భార్యయౌనిరుపమ పాండు రాజునకు నిక్కము మాద్రియె చిన్న భార్యసూ.
పాండురాజు కుంతితో తాను మరణించిన తర్వాత ఇంటి పెద్ద కుంతియే అని చెబుతూ...ఆ.వె.బ్రహ్మచర్య నిష్ఠ పాడైన సమయానమృతిని పొందు నేను మేను విడచిమునుపె చెప్పుచుంటి వినుమమ్మ నీవేయౌపాండవులకుఁ బెద్ద, భార్యకుంతి!
ఆ॥ పాండు రాజు చనఁగ భారమంతయు వేసిభార్య పైన సుతులు పాండవులనుజేయ యోగ్యులుగను జేసె సపర్యలుపాండవులకుఁ, బెద్ద భార్య కుంతి
పాండురాజు తండ్రి పాండవులకుపెద్దభార్యకుంతిపెంచెవారిధర్మరాజుతలనుదాల్చెగబాధ్యతపిన్నవారిగనుచుప్రేమమీర
చం॥ మరువక బాధ్యతల్ గనుచు, మానిని మాద్రి చనంగ భర్తతో,నరియఁగఁ బంచపాండవుల కా సతి కుంతియె, పెద్ద భర్యయౌగరిమగఁ బాండురాజునకుఁ, గష్టము లన్నియు సైఁచి తల్లిగన్గరములఁ బట్టి తండ్రిగను గాంచఁగ మోదము తోడ నాయెగా!
వరమున బుట్టె ధర్మజుడు పార్థుడు బీముడు కుంతి దేవికిన్మరణము సంభవించె గద మాద్రికి నయ్యె డ పాండు రాజుకున్మురిపము గాగ జే కొనెను ముద్దుల సూనుల బెంచు బాధ్యతన్న రయగ పంచ పాండవుల కా సతి కుంతి పెద్ద భార్య యై
స్వామి పాండురాజు జనుకుడాయెనుపంచపాండవులకుఁ ;పెద్ద భార్య కుంతి.మాద్రి చిన్నభార్య మైథునంబునుచేయచావు కలిగె మునుల శాపమదియె
విద్యలెల్లనేర్పె వేగమాద్రోణుడు హస్తినాపురమ్మునందుతానుపాండురాజుకయ్యె పరిణయమునుసేయ*“పాండవులకుఁ బెద్ద భార్య కుంతి
తరుణి విశాలనేత్రి సఖి ద్రౌపది యెవ్వరి పత్నియంటి? భాసురుడగు పాండురాజుకు శోభన గొంతి సజాత్యమేమి? యుత్తరమిడు మంచు గోరగ బుధానుడు శిష్యుడు చెప్పె నిట్లుగానరయఁగఁ బంచపాండవుల కా, సతి కుంతియె పెద్ద భార్యయౌ. కృష్ణ యెవరికి సతి? కృశమధ్యమ పృథ యాపాండు రాజు కేమి వరుస? తెలుపు కన్న తల్లి యెవరు కర్ణున కన తెల్పె పాండవులకుఁ, బెద్దభార్య, కుంతి.
భారతమ్ము నందు బాండుడె జనకుడు
రిప్లయితొలగించండిపాండవులకుఁ ; బెద్ద భార్య కుంతి
మొదట బడసె సుతులు ముగ్గురిని నెఱగ
మాద్రి చివరి వారి మాత యయ్యె
భారతమ్మునందు ప్రఖ్యాతినొందిన
రిప్లయితొలగించండిపాండవులకుతండ్రి పాండురాజు
కోరి పాండురాజుఁ గూరిచి తెలుపంగ
పాండవులకుఁ బెద్ద, భార్య కుంతి
క్రామాలంకారం లో --==
రిప్లయితొలగించండిపాండు రాజె వరికి వసుధలో పిత య య్యె?
ధర్మ జునకు భీము తమ్ము డైన
పార్థు కెవరు తల్లి వచింయింపు మన్న చో
పాండవులకు :+ పెద్ద భార్య కుంతి
ఆటవెలది
రిప్లయితొలగించండిసాగ చిన్న భార్య సహగమనమ్మున
పెంచి పెద్దఁ జేయ పిల్లవాండ్ర
దిటవుఁ జేకొని మది దిక్కయ్యె బాలలౌ
పాండవులకుఁ, బెద్ద భార్య కుంతి
చంపకమాల
మరువక భర్తనే 'సతి' గ మాద్రియె వెంటను నిర్గమింపఁగన్
గొరతయె లేని రీతిగను గూర్మిని బెంచెను సొంత తల్లిగా
నరయగఁ బంచపాండవుల కా సతి కుంతియె, పెద్ద భార్యయౌ
గురుకుల పాండురాజునకుఁ గూర్చెను మోదము నాత్మరూపికిన్
వరముగ మౌనిమంత్రమును పావని కుంతి శిరమ్ముఁ దాల్చు సం
రిప్లయితొలగించండివరణమునన్ జనించితిరి పాండవులేవురు మాతృమూర్తియౌ
నరయఁగఁ బంచపాండవుల కా సతి కుంతియె, పెద్ద భార్యయౌ
నిరవుగ పాండురాజునకు నీయమ మాద్రి సపత్ని యయ్యెడిన్
తండ్రి పాండురాజుతల్లి కుంతీదేవి
రిప్లయితొలగించండిపాండవులకుఁ, బెద్దభార్య కుంతి
మాద్రి చిన్న భార్య; మరణమొందగ పతి
మాద్రి సహగమించెమగనితోడ
కరముగ కాననంబునను గష్టము
రిప్లయితొలగించండిలెల్ల సహించి యోర్పుతో
దిరముగ సర్వకాలమున దేకువ
వీడని ద్రౌపదే తగున్
అరయగ పంచపాండవుల కాసతి,
కుంతియె పెద్ద భార్యయౌ
నిరుపమ పాండు రాజునకు నిక్కము
మాద్రియె చిన్న భార్యసూ.
పాండురాజు కుంతితో తాను మరణించిన తర్వాత ఇంటి పెద్ద కుంతియే అని చెబుతూ...
రిప్లయితొలగించండిఆ.వె.
బ్రహ్మచర్య నిష్ఠ పాడైన సమయాన
మృతిని పొందు నేను మేను విడచి
మునుపె చెప్పుచుంటి వినుమమ్మ నీవేయౌ
పాండవులకుఁ బెద్ద, భార్యకుంతి!
ఆ॥ పాండు రాజు చనఁగ భారమంతయు వేసి
రిప్లయితొలగించండిభార్య పైన సుతులు పాండవులను
జేయ యోగ్యులుగను జేసె సపర్యలు
పాండవులకుఁ, బెద్ద భార్య కుంతి
పాండురాజు తండ్రి పాండవులకు
రిప్లయితొలగించండిపెద్దభార్యకుంతిపెంచెవారి
ధర్మరాజుతలనుదాల్చెగబాధ్యత
పిన్నవారిగనుచుప్రేమమీర
చం॥ మరువక బాధ్యతల్ గనుచు, మానిని మాద్రి చనంగ భర్తతో,
రిప్లయితొలగించండినరియఁగఁ బంచపాండవుల కా సతి కుంతియె, పెద్ద భర్యయౌ
గరిమగఁ బాండురాజునకుఁ, గష్టము లన్నియు సైఁచి తల్లిగన్
గరములఁ బట్టి తండ్రిగను గాంచఁగ మోదము తోడ నాయెగా!
వరమున బుట్టె ధర్మజుడు పార్థుడు బీముడు కుంతి దేవికిన్
రిప్లయితొలగించండిమరణము సంభవించె గద మాద్రికి నయ్యె డ పాండు రాజుకున్
మురిపము గాగ జే కొనెను ముద్దుల సూనుల బెంచు బాధ్యత
న్న రయగ పంచ పాండవుల కా సతి కుంతి పెద్ద భార్య యై
స్వామి పాండురాజు జనుకుడాయెనుపంచ
రిప్లయితొలగించండిపాండవులకుఁ ;పెద్ద భార్య కుంతి.
మాద్రి చిన్నభార్య మైథునంబునుచేయ
చావు కలిగె మునుల శాపమదియె
విద్యలెల్లనేర్పె వేగమాద్రోణుడు
రిప్లయితొలగించండిహస్తినాపురమ్మునందుతాను
పాండురాజుకయ్యె పరిణయమునుసేయ
*“పాండవులకుఁ బెద్ద భార్య కుంతి
తరుణి విశాలనేత్రి సఖి ద్రౌపది యెవ్వరి పత్నియంటి? భా
రిప్లయితొలగించండిసురుడగు పాండురాజుకు శోభన గొంతి సజాత్యమేమి? యు
త్తరమిడు మంచు గోరగ బుధానుడు శిష్యుడు చెప్పె నిట్లుగా
నరయఁగఁ బంచపాండవుల కా, సతి కుంతియె పెద్ద భార్యయౌ.
కృష్ణ యెవరికి సతి? కృశమధ్యమ పృథ యా
పాండు రాజు కేమి వరుస? తెలుపు
కన్న తల్లి యెవరు కర్ణున కన తెల్పె
పాండవులకుఁ, బెద్దభార్య, కుంతి.